Junior NTR Son Bhargav Ram Looking Like Senior NTR, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Jr NTR Son Bhargav Ram: అచ్చు ఆయనలానే.. జూ.ఎన్టీఆర్ తనయుడి ఫొటోలు వైరల్‌!

Published Wed, Mar 16 2022 12:00 AM | Last Updated on Wed, Mar 16 2022 9:17 AM

JR NTR Son Bhargav Ram Halchal in Social Media - Sakshi

చూస్తుంటే నందమూరి అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి మెదటి కారణం 'ఆర్ఆర్ఆర్' మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరో కారణం ఏంటంటే.. తమ అభిమాన హీరో కుమారులు చాలా కాలం తర్వాత బయటి ప్రపంచానికి కనిపించడం. అంతేకాదు వారిలో ఒకరు అచ్చం సీనియర్‌ ఎన్టీఆర్‌లాగే ఉండడంతో.. నందమూరి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. తాజాగా తారక్‌ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తారక్‌ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో పాటు మరికొంతమంది బంధువులు కూడా వీరితో పాటు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దీంతో అక్కడి మీడియా కన్ను ఎన్టీఆర్‌ ఫ్యామిలీపై పడింది. తారక్‌ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే భార్గవ్ రామ్‌ పై మాత్రం నెటిజనులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
జూ.ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌ను చూస్తుంటే తమకు సీనియర్‌ ఎన్టీఆర్‌ను చూసినట్టే ఉందంటున్నారు నందమూరి అభిమానులు. భార్గవ్ రామ్‌ సాంప్రదాయ దుస్తులతో పాటు నుదుట విష్ణు నామంతో కనిపించాడు. భార్గవ్‌కి అన్నీ సీనియర్‌ ఎన్టీఆర్ పోలికలే అంటూ తమ ఆనందాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. పెద్ద ఎన్టీఆర్ ముఖాకృతి తనలో కనిపిస్తోందని, అచ్చు గుద్దినట్టు ఎన్టీఆరే నంటూ అభిమానులు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement