Fun Bucket Bhargav Case: రెండున్నరేళ్లు అవుతుంది, అవి డిలీట్‌ చేయండి : మౌనిక | Fun Bucket Bhargav Latest News - Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లు అవుతుంది, అవి డిలీట్‌ చేయండి : మౌనిక

Published Wed, Apr 21 2021 4:26 PM | Last Updated on Wed, Apr 21 2021 6:49 PM

Tik Tok Star Mounika Sensational Comments On Fun Bucket Bhargav Arrest - Sakshi

టిక్ టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మైనర్‌ బాలిక అత్యాచార కేసులో భార్గవ్‌ని దిశ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే అతన్ని రిమాండ్‌కు తరలించిన తర్వాత చాలా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో చాలా మంది యువతులను భార్గవ్‌ ఇలాగే అవకాశాల పేరుతో మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంతవరకు మాత్రం ఒక్క యువతి కూడా భార్గవ్ తమను మోసం చేసినట్లు ఫిర్యాదు ఇవ్వలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... భార్గవ్‌ అరెస్ట్‌ కాగానే.. అత్యాచారం పాల్పడింది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్‌ చానళ్లు భార్గవ్‌తో గతంలో వీడియోలు చేసిన యువతుల పేర్లు, ఫోటోలను వాడేస్తున్నారు. ఇప్పటికే భార్గవ్‌తో టిక్‌టాక్‌ వీడియోలు తీసిన OMG నిత్య అలియాస్‌ నిత్యశ్రీ లైవ్ లోకి వచ్చి తనకు భార్గవ్ కేసుకు సంబంధం లేదని క్లారిటీ ఇవ్వగా,  తాజాగా మౌనిక అనే మరో యువతి కూడా ఈ కేసుతో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పింది.ఈ మేరకు మౌనిక ఓ వీడియోని విడుదల చేసింది. తాము ఇద్దరం కలిసి రెండున్నరేళ్లు అవుతుంది అని తనకు ఈ కేసుకు సంబంధం లేదని తన ఫోటోలు వాడవద్దని కోరింది.

‘నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ అరెస్టయిన విషయం మీఅందరికి ఎలా తెలుసో.. నాకు కూడా ఈ సోషల్‌ మీడియా ద్వారాలే తెలిసింది. ‘అమ్మాయి-అబ్బాయి’ వీడియోలు ఆపేసి రెండున్నరేళ్లు అయింది. ఆ తర్వాత మాకు ఎటువంటి కమ్యునికేషన్‌ లేదు. కానీ అప్పుడు చేసిన వీడియోలను, ఫోటోలను స్క్రీన్‌షాట్‌ తీసి ఈ కేసు విషయంలో వాడేస్తున్నారు. నాకు, ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికైనా ఈ వీడియో చూసి అవన్ని డిలీట్‌ చేస్తారని కోరుకుంటున్నాను ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా. షూటింగ్‌తో బిజీగా ఉన్నాను’అని మౌనిక చెప్పుకొచ్చింది.గతంలో భార్గవ్ - మౌనికలు అమ్మాయి - అబ్బాయి పేరిట వీడియోలు రిలీజ్ చేసి టిక్ టాక్ వేదికగా విడుదల చేసేవారు. వాటికి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చేవి. 


చదవండి :
భార్గవ్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేదు : ఓమైగాడ్‌ నిత్య
చెల్లీ అని పిలుస్తూనే.. మైనర్‌ బాలికపై అత్యాచారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement