ఎలాంటి విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడే డేరింగ్ పర్సనాలిటీ గాయని చిన్మయిది. లైంగిక వేధింపులపై ప్రజలను చైతన్య పరుస్తూరామె. తాజాగా టిక్‌టాక్ స్టార్ ఫన్ భార్గవ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఫన్ టిక్‌టాక్ వీడియోల పేరుతో 14 ఏళ్ల మైనర్ బాలికను లోబర్చుకొని, భార్గవ్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్‌లోఅతడిపై కేసు నమోదైంది. భార్గవ్ ఉదంతంపై చిన్మయి స్పందిస్తూ.. ఇలాంటివి జరిగినప్పుడు కూడా.. అమ్మాయిదే తప్పు అని లేవనెత్తే సొసైటీలో మనం ఉన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
భార్గవ్ కేసుకు సంబంధించి ఓ న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్‌ను వివరిస్తూ.. 'తల్లి అతి గారాభం చేయడం,ఎక్కడికి వెళతుందో గమనించకపోడం, అమ్మాయికి పూర్తి స్వేచ్చ ఇవ్వడంతో టిక్ టాక్ భార్గవ్‌తో ఆమె మరింత చనువుగా ఉండటం చేసేది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఓ మైనర్ బాలిక కామాంధడి చేతిలో బలికావాల్సి వచ్చింది. దీనికి తోడు బాలిక తండ్రి దూరంగా ఉండటం వల్ల మంచి చెప్పేవారు ఎవరూ లేకుండా పోయారు' అంటూ రాసిన వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదని, దానికి అమ్మాయిని బాధ్యురాల్ని చేయడం కరెక్ట్ కాదని ఘాటుగా బదులిచ్చింది.
టిక్‌టాక్, రీల్స్‌చేయడంతో తప్పు లేదు : చిన్మయి
ఇక భార్గవ్ లాంటి మనుషులు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారని, అయితే అతడు సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఈ ఉదంతం బయటకు వచ్చిందని తెలిపింది. భార్గవ్‌ను ఉద్దేశిస్తూ..భార్గవ్ స్త్రీ లోలుడు అని అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన క్లిప్పింగ్‌ను తాను కూడా చూశానని, ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వాళ్లు చాలా స్మార్ట్‌గా, కన్నింగ్‌గా అమ్మాయిని లోబర్చుకుంటారని, ఇందుకు వాళ్ల పేరెంట్స్‌తోనూ మంచిగా మాటలు కలుపుతారని తెలిపింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అమ్మాయిలకు అకౌంట్ ఉండటం, వేరే వాళ్లతో రీల్స్, టిక్‌టాక్ చేయడంలో తప్పు లేదని, అయితే మనం ఎవరితో ఫ్రెండిప్ చేస్తున్నాం అనే అంశంపై చాలా ఆచితూచి వ్యవహరించాలని, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అన్న వివరాలను తల్లిదండడ్రులకు చెప్పడం చాలా అవసరమని చెప్పుకొచ్చారు.
చదవండి : భార్గవ్ స్త్రీ లోలుడు, బ్లాక్‌మెయిల్ చేసేవాడు..
అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment