Fun Bucket
-
టిక్‌టాక్ భార్గవ్‌కు మళ్లీ రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: టిక్‌టాక్ (ఫన్ బకెట్) భార్గవ్‌కు మళ్లీ రిమాండ్ విధించారు. ఈ నెల 11 వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. ఆరు నెలల క్రితం పెందుర్తి వేపగుంట సింహపురికాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడని టిక్‌టాక్ భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్ విధించారు. అయితే ఆయన నిబంధనలతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే మళ్లీ సోషల్ మీడియాలో కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ పోస్టుల పెట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దిశ పోలీసులు నిందితుడ్ని తిరిగి అరెస్ట్‌చేసి న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరిచారు. నింధితుడికి ఈనెల 11వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కేజీహెచ్‌లో వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు దిశ పోలీస్‌స్టేషన్ ఏసీపీ ప్రేమ్‌కాజల్ వెల్లడించారు. చదవండి: (మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు..) -
యాంకర్ రవిపై ఫన్ బకెట్ జస్విక ఆసక్తికర వ్యాఖ్యలు
ఫన్ బకెట్ జూనియర్ ఫేం జస్విక, యంకర్ రవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. యూట్యూబ్, టిక్ టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న జస్విక మంగళవారం లైవ్ చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ యాంకర్ రవి గురించి చెప్పమని, ఆయనపై మీ అభిప్రాయం ఎంటని అడిగాడు. దీనిపై జస్విక స్పందిస్తూ.. ‘రవి అన్న యూనిక్‌గా ఉంటారు. సెట్లో ప్రతీ ఒక్క విషయాన్ని ఆయన ఎంతో బాగా హ్యాండిల్ చేస్తారు. అందరితో ఫన్నీగా మాట్లాడుతూ సెట్ వాతావరణాన్ని సరదాగా మారుస్తారు. ఆయన ఒక గొప్ప మెంటర్. ఆయనతో కలిసి పని చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రవి అన్న నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయనకు ఉన్న నాలెడ్జ్ అనంతమైంది. ఎంతో స్ఫూర్తివంతమైన వ్యక్తి’ అంటూ జస్విక చెప్పుకొచ్చింది. అంతేగాక రవి అన్నను ఓ షోలో మొదటి సారి చూసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి షాక్ అయ్యానని, ఆ షో అంతా కళ్లు తిప్పుకోకుండా అన్ననే చూస్తూ ఉండిపోయాను అని చెప్పింది. ఇక ఆయన ప్రతీ ఒక్కరినీ పలకరించే విధానం, తోటి ఆర్టిస్టుల పట్ల ఆయన చూపించే అభిమానం నన్ను ఎంతో ఆకట్టుకుందని తెలిపింది. ఇక తన గురించి జస్విక చెప్పిన మాటలకు రవి ఫిదా అయిపోయాడు. ‘నా గురించి ఇంత బాగా చెప్పినందుకు థ్యాంక్యూ జస్విక, నువ్వు ఎంతో స్వీట్.. మళ్లీ మనం సెట్ మీద కలిసి పనిచేసే సమయం కోసం ఎదురుచూస్తుంటాను’ అంటు రవి ఎమోషనల్ అయ్యాడు. -
ఫన్ బకెట్ భార్గవ్ కేసు : అక్కాచెల్లెళ్ల వీడియో వైరల్
టీవీ చానల్స్ లో అవకాశం ఇస్తానంటూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. భార్గవ్‌ని రిమాండ్‌కు తరలించిన తర్వాత అతని బాగోతాలన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతను కెమెరా ముందు ఒకలా.. తర్వాత మరోలా ఉంటాడని చాలామంది అమ్మాయిలు చెబుతున్నారు. గతంలో కూడా చాలా మంది అమ్మాయిలను అవకాశాల పేరుతో మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. భార్గవ్ అత్యాచారానికి పాల్పడిన 14 ఏళ్ల బాలిక స్థానంలో ఎందరో పేర్లు బయటకు వస్తున్నాయి. గతంలో భార్గవ్‌తో కలిసి వీడియోలు చేసిన OMG నిత్య, ‘అమ్మాయి-అబ్బాయి’ఫేమ్ మౌనిక పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో చేసేదేమీలేక సదరు యువతులు ఓ వీడియో సందేశం ద్వారా ఆ బాధితురాలిని మేము కాదని చెప్పుకున్నారు. తాజాగా భార్గవ్ అత్యాచారం పాల్పడింది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు భార్గవ్‌తో గతంలో వీడియోలు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు పేర్లను, ఫోటోలనే వాడేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి మేము కాదంటూ జస్విక, మేఘన అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తండ్రితో కలిసి ఓ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ వుతుంది. ఆ వీడియోలో జస్విక మాట్లాడూ.. ‘బార్గవ్ అన్నయ్య కేసు గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. అందులో ఫీమెల్‌గా ఫస్ట్ మా అక్కను, తర్వాత నన్ను అనుకుంటున్నారు. దాని వల్ల చాలా కామెంట్స్ వస్తున్నాయి. క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. భార్గవ్ కేసులో మైనర్ వయసు 14 ఏళ్లు. కానీ మా అక్క వయసు 20 ఏళ్లు, నాకు 16 ఏళ్లు. ఈ జూన్ వస్తే 17 ఏళ్లు వస్తాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగా చాలా మంది మీరు సేఫా? అని మెసేజ్‌లు పెడుతున్నారు. మాకేమి ప్రాబ్లమ్ లేదు. మా వీడియోస్ అన్నీ మా డాడీయే చూసుకుంటారు’ అని జస్విక వెల్లడించింది. ఇక జస్విక తండ్రి మాట్లాడుతూ.. ‘మా పిల్లల వీడియోస్‌ని అన్ని నేనే చూసుకుంటా. రెండు నెలల నుంచి భార్గవ్ కోసం వర్క్ చేస్తున్నా.ఇన్ని రోజులు మా ఛానల్లో వీడియో పెట్టడం కుదరడం లేదు. మా పిల్లలిద్దరికీ నటనంటే ఇష్టం. నేను 20 ఏళ్లుగా సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. నా వీడియోపై బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టకండి. నేను అన్నీ స్క్రీన్ షాట్ తీస్తున్నా. అవన్నీ సైబర్‌క్రైమ్‌కు వెళ్తాయి. బెదిరించడంలేదు. దయచేసి అర్థం చేసుకోండి’అని విజ్ఞప్తి చేశారు. చదవండి: భార్గవ్.. మమ్మల్ని రూమ్ నుంచి వెళ్లగొట్టాడు, ఎందుకంటే టిక్‌టాక్ భార్గవ్ నిజరూపం బయటపెట్టిన పోలీసులు -
అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదు : చిన్మయి
ఎలాంటి విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడే డేరింగ్ పర్సనాలిటీ గాయని చిన్మయిది. లైంగిక వేధింపులపై ప్రజలను చైతన్య పరుస్తూరామె. తాజాగా టిక్‌టాక్ స్టార్ ఫన్ భార్గవ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఫన్ టిక్‌టాక్ వీడియోల పేరుతో 14 ఏళ్ల మైనర్ బాలికను లోబర్చుకొని, భార్గవ్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్లోఅతడిపై కేసు నమోదైంది. భార్గవ్ ఉదంతంపై చిన్మయి స్పందిస్తూ.. ఇలాంటివి జరిగినప్పుడు కూడా.. అమ్మాయిదే తప్పు అని లేవనెత్తే సొసైటీలో మనం ఉన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. భార్గవ్ కేసుకు సంబంధించి ఓ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్‌ను వివరిస్తూ.. 'తల్లి అతి గారాభం చేయడం,ఎక్కడికి వెళతుందో గమనించకపోడం, అమ్మాయికి పూర్తి స్వేచ్చ ఇవ్వడంతో టిక్ టాక్ భార్గవ్‌తో ఆమె మరింత చనువుగా ఉండటం చేసేది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఓ మైనర్ బాలిక కామాంధడి చేతిలో బలికావాల్సి వచ్చింది. దీనికి తోడు బాలిక తండ్రి దూరంగా ఉండటం వల్ల మంచి చెప్పేవారు ఎవరూ లేకుండా పోయారు' అంటూ రాసిన వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదని, దానికి అమ్మాయిని బాధ్యురాల్ని చేయడం కరెక్ట్ కాదని ఘాటుగా బదులిచ్చింది. టిక్‌టాక్, రీల్స్చేయడంతో తప్పు లేదు : చిన్మయి ఇక భార్గవ్ లాంటి మనుషులు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారని, అయితే అతడు సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఈ ఉదంతం బయటకు వచ్చిందని తెలిపింది. భార్గవ్‌ను ఉద్దేశిస్తూ..భార్గవ్ స్త్రీ లోలుడు అని అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన క్లిప్పింగ్‌ను తాను కూడా చూశానని, ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వాళ్లు చాలా స్మార్ట్‌గా, కన్నింగ్‌గా అమ్మాయిని లోబర్చుకుంటారని, ఇందుకు వాళ్ల పేరెంట్స్‌తోనూ మంచిగా మాటలు కలుపుతారని తెలిపింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అమ్మాయిలకు అకౌంట్ ఉండటం, వేరే వాళ్లతో రీల్స్, టిక్‌టాక్ చేయడంలో తప్పు లేదని, అయితే మనం ఎవరితో ఫ్రెండిప్ చేస్తున్నాం అనే అంశంపై చాలా ఆచితూచి వ్యవహరించాలని, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అన్న వివరాలను తల్లిదండడ్రులకు చెప్పడం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి : భార్గవ్ స్త్రీ లోలుడు, బ్లాక్మెయిల్ చేసేవాడు.. అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ -
భార్గవ్ కేసు: చేతులెత్తి దండం పెట్టిన సురేఖావాణి కూతురు
టిక్‌టాక్ స్టార్ భార్గవ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఫన్ వీడియోలతో ఫేమస్ అయిన భార్గవ్ అవకాశాలిప్పిస్తానంటూ మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో అతడిని కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ఈ ఘటనపై సురేఖావాణి కూతురు సుప్రిత స్పందించింది. అతడికి సంబంధించిన వార్తను షేర్ చేసింది. "భార్గవ్.. టిక్‌టాక్ వీడియోలో చూసిన 14 ఏళ్ల బాలికను ఇతర చానళ్లలో అవకాశం ఇప్పిస్తానని నమ్మించాడు. ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు. అమ్మాయి నో చెప్పినా కూడా వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. డ్రెస్ చేంజ్ చేసుకున్న వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ ఆమెను లోబర్చుకున్నాడు" అని పోలీస్ అధికారి చెప్పిన మాటలు విని ఆమె షాకైంది. దీని గురించి స్పందించేందుకు మాటలు రావడం లేదు అంది. అతడు చేసిన అకృత్యం గురించి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని, చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజీలను షేర్ చేసింది సుప్రిత. కాగా భార్గవ్ మాజీ ప్రేయసి, స్నేహితులు సైతం అతడు మంచివాడు కాదంటూ ఆరోపణలు చేస్తున్నారు. అతడు పెద్ద స్త్రీ లోలుడు అని, అమ్మాయిలను వీడియోల కోసం వాడుకునేవాడని పేర్కొన్నారు. కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడు ఒకలా, ఆఫ్‌లో ఉన్నప్పుడు మరోలా ఉంటాడని విమర్శలు గుప్పించారు. చదవండి: భార్గవ్ బాధితుల్లో ఒకరికి భర్త కూడా ఉన్నాడు ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్.. భార్గవ్ నిజస్వరూపం బట్టబయలు -
ఫన్ బకెట్ భార్గవ్ కేసులో ట్విస్ట్.. లైవ్‌లోకి మరో యువతి
టిక్ టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మైనర్ బాలిక అత్యాచార కేసులో భార్గవ్‌ని దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అతన్ని రిమాండ్‌కు తరలించిన తర్వాత చాలా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో చాలా మంది యువతులను భార్గవ్ ఇలాగే అవకాశాల పేరుతో మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంతవరకు మాత్రం ఒక్క యువతి కూడా భార్గవ్ తమను మోసం చేసినట్లు ఫిర్యాదు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... భార్గవ్ అరెస్ట్ కాగానే.. అత్యాచారం పాల్పడింది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు భార్గవ్‌తో గతంలో వీడియోలు చేసిన యువతుల పేర్లు, ఫోటోలను వాడేస్తున్నారు. ఇప్పటికే భార్గవ్‌తో టిక్‌టాక్ వీడియోలు తీసిన OMG నిత్య అలియాస్ నిత్యశ్రీ లైవ్ లోకి వచ్చి తనకు భార్గవ్ కేసుకు సంబంధం లేదని క్లారిటీ ఇవ్వగా, తాజాగా మౌనిక అనే మరో యువతి కూడా ఈ కేసుతో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పింది.ఈ మేరకు మౌనిక ఓ వీడియోని విడుదల చేసింది. తాము ఇద్దరం కలిసి రెండున్నరేళ్లు అవుతుంది అని తనకు ఈ కేసుకు సంబంధం లేదని తన ఫోటోలు వాడవద్దని కోరింది. ‘నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఫన్ బకెట్ భార్గవ్ అరెస్టయిన విషయం మీఅందరికి ఎలా తెలుసో.. నాకు కూడా ఈ సోషల్ మీడియా ద్వారాలే తెలిసింది. ‘అమ్మాయి-అబ్బాయి’ వీడియోలు ఆపేసి రెండున్నరేళ్లు అయింది. ఆ తర్వాత మాకు ఎటువంటి కమ్యునికేషన్ లేదు. కానీ అప్పుడు చేసిన వీడియోలను, ఫోటోలను స్క్రీన్‌షాట్ తీసి ఈ కేసు విషయంలో వాడేస్తున్నారు. నాకు, ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికైనా ఈ వీడియో చూసి అవన్ని డిలీట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా. షూటింగ్‌తో బిజీగా ఉన్నాను’అని మౌనిక చెప్పుకొచ్చింది.గతంలో భార్గవ్ - మౌనికలు అమ్మాయి - అబ్బాయి పేరిట వీడియోలు రిలీజ్ చేసి టిక్ టాక్ వేదికగా విడుదల చేసేవారు. వాటికి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చేవి. చదవండి : భార్గవ్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు : ఓమైగాడ్ నిత్య చెల్లీ అని పిలుస్తూనే.. మైనర్ బాలికపై అత్యాచారం -
ఆ వీడియోలు డిలీట్ చేయండి: OMG నిత్య
-
భార్గవ్‌తో సంబంధం లేదు..ఆ వీడియోలు డిలీట్ చేయండి: OMG నిత్య
మైనర్ బాలిక అత్యాచార కేసులో టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ని దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక భార్గవ్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారనగానే. చాలామంది ‘ఓమైగాడ్ నిత్య’పేరును తెరపైకి తీసుకొచ్చారు. భార్గవ్ అత్యాచారానికి పాల్పడ్డది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు నిత్య ఫోటోలను వాడేస్తున్నారు. అయితే తాజాగా ఈ వార్తపై నిత్య స్పందించింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది. ‘నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసు విషయంలో అరెస్ట్ అయిన మాట నిజమే. కానీ నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మీకు ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా తెలిసిందో నాక్కూడా అలాగే తెలిసింది. నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేయడం వల్ల నేను ఆ న్యూస్ చూడటం జరిగింది. చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. ఏం జరిగింది అని.. నాకైతే ఏ విషయం తెలియదు.. అసలు నాకు ఆ మ్యాటర్‌కి సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు.. భార్గవ్‌ని కలిసి సంవత్సరం పైనే అయ్యింది.. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడు. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం. అయితే ఈ ఇష్యూలో చాలామంది మీమ్స్ చేసేవాళ్లు.. ట్రోలర్స్.. యూట్యూబ్ వాళ్లు నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. మీరంతా తెలియక చేస్తున్నారని నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చా. మీరు నా ఫొటోలు వాడటం లాంటివి కావాలని చేస్తున్నారని అనుకోవడం లేదు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నా. మీకు రెండు రోజుల్లో అసలు నిజాలు తెలుస్తాయి. అప్పుడైనా డిలీట్ చేయండి. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా. షూటింగ్లో ఉన్నా’ అంటూ తన తల్లితో కలిసి వీడియో విడుదల చేసింది చదవండి: అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్.. భార్గవ్ నిజస్వరూపం బట్టబయలు -
ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్.. భార్గవ్ నిజస్వరూపం బట్టబయలు
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన ఫన్ బకెట్ ఫేం భార్గవ్ ను అరెస్ట్ చేసినట్టు విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు. చెల్లి అంటూ దగ్గరై టీవీ చానల్స్ లో అవకాశం ఇస్తానంటూ మైనర్‌తో అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితు నిపై అత్యాచారం తోపాటు ఫోక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. టిక్ టాక్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న భార్గవ్.. టిక్ టాక్ లో స్టార్ చేస్తానని, ఇతర మీడియా చానెల్స్ లో చాన్సులు ఇప్పిస్తానని బాలికకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అయితే ఆ బాలిక నో చెప్పింది. అయినా భార్గవ్ బాలికను వదల్లేదు. వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బాలికను బ్లాక్ మెయిల్ చేసిన భార్గవ్, శారీరకంగా అనుభవించాడని పోలీసులు తెలిపారు. టిక్ టాక్ భార్గవ్ ను హైదరాబాదులో అరెస్ట్ చేసి విశాఖపట్నం తీసుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిందితుడిపై ఇతర ఫిర్యాదులు ఉంటే బాధితులు పోలీసులను ఆశ్రయించారని ఏసీపీ కాజల్ సూచించారు. చదవండి: చెల్లీ అని పిలుస్తూనే.. మైనర్ బాలికపై అత్యాచారం -
అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్
-
అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్
టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. టిక్‌టాక్ వీడియోల పేరుతో మైనర్ బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్‌లో భార్గవ్‌పై కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్‌టాక్ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ... భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ పరిచయంతో మైనర్ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్ చేయడం, కలుసుకుంటుండంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్ వీడియోల పేరుతో భార్గవ్ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సంప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్ బకెట్ భార్గవ్ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఈ నెల 16న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. బాలికను చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు భార్గవ్ సైతం అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం భార్గవ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ విషయాన్ని ప్రముఖ యాంకర్ శివ సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం భార్గవ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా 2 లక్షలు ఇస్తాం..కేసు వాపసు తీసుకోండి అని భార్గవ్ పోలీసులను ప్రాధేయపడినట్లు శివ తన స్టోరీలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భార్గవ్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు సీజ్ చేశారని వివరించాడు. అయితే ఈ సందర్భంగా అసలు ఈ వార్త నిజమేనా? లేక యాంకర్ శివ తన పాపులారిటీ పెంచుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడా అన్న ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తారు. దీంతో ఇది వ్యూస్ కోసం చేయడం లేదని, ఈ వార్తను బయటకు రానివ్వకుండా ఎక్కడ ఆపేస్తారో అని తాను పోస్ట్ చేస్తున్నట్లు యాంకర్ శివ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇది ప్రాంక్ కాదని, నిజమైన వార్తేనని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం యాంకర్ శివ చేసిన వరుస పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : పోలీస్‌స్టేషన్‌లో షణ్ముఖ్ రచ్చరచ్చ హీరోయిన్ అంజలా జవేరీ భర్త 'విలన్' అని మీకు తెలుసా? -
ఓ మై గాడ్..ఓ మై గాడ్
-
స్టోరీ.. స్క్రీన్‌ప్లే.. డైరెక్షన్.. అన్నీ వారే..
సుజిత్.. ఒకప్పుడు షార్ట్ ఫిలిం మేకర్.. సినీ ప్రపంచంలో అడుగుపెట్టాలనుకున్న అతనిలో ఓ షార్ట్ ఫిలిం ఆత్మవిశ్వాసాన్ని నింపింది.. ప్రస్తుతం రూ.300 కోట్లతో ప్రభాస్ హీరోగా నిర్మి స్తున్న ‘సాహో’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను చేసేలా చేసింది. సుజిత్ ఎక్కడ అవకాశాల కోసం వెదకలేదు. తనకు తాను అవకాశాలను సృష్టించుకున్నాడు.. అవకా«శాన్ని అందిపుచ్చుకున్నాడు.. తన సినీ ప్రస్థానాన్ని సిల్వర్‌స్క్రీన్ వైపు నడిపించాడు.. ఫన్ బకెట్.. యూట్యూబ్‌లో అత్యంత హిట్ కొట్టిన నవ్వుల షార్ట్ ఫిలిం.. ఇందులో కనిపించే యువకులంతా ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు.. వారు అవకాశాల కోసం ఎదురుచూడలేదు.. కాళ్లు అరిగేలా తిరగలేదు.. కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీల్లోనే తమ ఆశయానికి నారు పోశారు. అదే ఫన్ బకెట్‌గా నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో నటించిన మిల్క్ మహేష్ తదితర నటులకు సినీ అవకాశాలను కల్పించింది. అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రామ్ కట్రూకు సినిమాలంటే ప్యాషన్. ఇక్కడికొచ్చిన అతనికి సినిమా తీయడానికి కొంత ఇబ్బంది ఎదురైంది. తన ప్రతిభను చూపడానికి సినిమా ఒకటే అవకా«శం కాదు.. అందుకే.. తనలాంటి ఆలోచనలు ఉన్న ఒక టీంతో ఆయన కలిశాడు. అంతే.. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం తనకు తాను రాసుకున్నారు.. కృష్ణానగర్, గచ్చిబౌలి, మసీదు బండ ప్రాంతాల్లో ‘ప్రక్షాళన’ పేరుతో ఒక షార్ట్ ఫిలింను తెరకెక్కించాడు.. ఇది 16 ఫిలిం ఫెస్టివల్స్‌లో నామినేట్ అయ్యింది. ప్రతిభ ఒకరి సొత్తు కాదని కృష్ణానగర్ అడ్డాగా నిరూపితమైంది. బంజారాహిల్స్: సినిమాల్లో అవకాశాలు నేరుగా ఎవరికీ రావు. అదృష్టం ఉంటే తప్ప. ఇప్పుడు అదృష్టం ఉండాల్సిన పనిలేదు. ప్రతిభ ఉండి, పట్టుదల ఉంటే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అందుకే.. కృష్ణానగర్, ఇందిరానగర్, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లో ప్రతి రోజు ఔత్సాహిక యువకులు షార్ట్ ఫిలింల రూపకల్పనతో బిజీగా ఉంటున్నారు. కృష్ణనగర్‌లో ఉండేటువంటి పార్కులు, బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు ఇలా అన్ని ప్రాంతాలు వీరికి లోకేషన్లుగా మారుతున్నాయి. అగ్గిపెట్టెలాంటి ఇళ్లలో నివసించే చాలా మంది ఔత్సాహిక కళాకారులు తమను తాము నిరూపించుకొంనేందుకు ఈ లఘుచిత్రాల బాట పడుతున్నారు. ఇందుకు కృష్ణానగర్ ప్రాంతమే అడ్డాగా నిలుస్తోంది. ముడి సరుకులు అవే.. సమాజంలోని చిన్నచిన్న సంఘటనలే కథకు ముడి సరుకులుగా మారుతున్నాయి. ఇక ప్రతిభ ఉన్నవారు, ఉత్సాహం ఉన్నవారు వారికి వారే కథను రాసుకుంటున్నారు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చేస్తున్నారు. యాక్షన్ దగ్గరి నుంచి మొదలుకొని ప్యాకప్ వరకు అంతా వారే చూసుకుంటున్నారు. మరికొందరు ఏకంగా ముందడుగు వేసి హీరోలుగా తమను తాము నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 10 నిమిషాల నుంచి అరగంట నిడివి ఉండేటువంటి షార్ట్ ఫిలింలు ఇప్పుడు యూట్యూబ్‌లో హిట్ కొడుతున్నాయి. మహాతల్లి, ఫ్రస్టేషన్ ఉమెన్లాంటి స్వీయ కార్యక్రమాలతోపాటు ఫన్‌బకెట్, మై విలేజ్ షో, దేత్తడి, పక్కింటి కుర్రాడు ఇలాంటి షోలన్నీ ఇప్పుడు పెద్ద పాపులర్‌గా మారాయి. ఇంతెందుకు నిన్నామొన్నటి వరకు కృష్ణానగర్ వీధుల్లో తిరిగి జబర్దస్త్ టీంలో చేసి మహేష్ ఏకంగా ‘రంగస్థలం’ సినిమాలో రాంచరణ్ తేజ పక్కన చాన్స్ కొట్టాడు. కృష్ణానగర్ వీధుల్లో లఘు చిత్రాల చిత్రీకరణ అన్నీ ఇక్కడే.. లఘుచిత్రాలు చేయడమంటే కేవలం నటించడమే కాదు.. పాత్రకు తగిన విధంగా గెటప్ వేస్తున్నారు. భాష, యాస, మేకప్, దుస్తులు ఇలా అన్నింటిని సమకూర్చుకుంటున్నారు. ఇక వీటన్నింటికీ కృష్ణానగర్ ప్రాంతమే అడ్డా. కెమెరాలు ఇక్కడే అద్దెకు లభిస్తాయి. చిన్న కెమెరాల నుంచి మొదలుకొని పెద్ద కెమెరాల వరకు ఇక్కడ అద్దెకు ఇస్తారు. దుస్తులు, విగ్గులు, వివిధ వేషధారణలకు తగిన ఉత్పత్తులు ఇలా అన్నీ కృష్ణానగర్ అడ్డాలోనే లభిస్తాయి. అందుకే.. ఒకప్పుడు కేవలం అవకాశాల కోసం ఏర్పడిన కృష్ణానగర్ నేడు అవకాశాలు సృష్టించుకొనే డిజిటల్ స్థాయి వైపు తీసుకెళ్తోంది. ఆలోచనలే కాదు.. కృష్ణానగరూ మారుతోంది. షార్ట్ ఫిలిం నుంచిఫీచర్ ఫిలింకు.. సినిమాల్లో అవకాశం కోసం చాలా రోజులు కష్టపడ్డాం. కృష్ణానగర్ వీధులన్నింటినీ పరిచయం చేసుకున్నాం. అవకాశాలు అంత సులువుగా రాలేదు. చివరికి ప్రక్షాళన పేరుతో చేసిన షార్ట్ ఫిలిం చేశాం. అది ప్రపంచ స్థాయిలో ఆకర్షించింది. అంతే.. చాలా మంది పెద్ద డైరెక్టర్లు భుజం తట్టారు. కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించారు. – భరత్‌రాజు, నటుడు షార్ట్‌ఫిలింలో పాత్ర కోసం క్యాస్టూమ్స్ అద్దెకు తీసుకుంటూ.. అవకాశాలను సృష్టించుకొన్నాం.. ఫన్బకెట్లో దాదాపు 90 ఎపిసోడ్లు చేశాను. అదంతా కృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకొనే వాళ్లం. అలా నా వీడియో చూసి మొదటిసారి దర్శకులు తేజ అవకాశం నేనే రాజు నేనే మంత్రి సినిమాలో అవకాశం కల్పించారు. ఇప్పటికీ 16 సినిమాల్లో అవకాశం వచ్చింది. పట్టుదల ఉంటే మనమే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చేసుకోవడమే కాదు.. నటించి మనల్ని మనం నిరూపించుకోవచ్చు. – మహేష్ విట్టా, నటుడు, ఫన్ బకెట్ ఫేం -
సీమ కుర్రాడు.. దూసుకుపోతున్నాడు
‘ఏయ్.. ఏందమ్మీ...’ ‘ఓరినీ పాసుగుల్లా...’ ‘ఓరి తపేలా మొహమోడా...’ ‘నాలెడ్జ్ నేర్చుకుంటే వస్తుందేమో.. యాటీట్యూడ్ పుట్టుకతోనే వస్తుంది’ ఈ డైలాగ్‌లు వింటే నవ్వులే నవ్వులు. డైలాగ్ డెలివరీ, పంచ్‌పవర్, యాస(స్లాంగ్) తీరుతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ కామెడీ స్టార్ మహేష్ విట్టా. సోషల్ మీడియా వేదికగా ప్రస్థానం ప్రారంభించి... ‘ఫన్ బకెట్’ వెబ్ సీరిస్తో ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతున్నాడీ రాయలసీమ కుర్రాడు. అవకాశలను అందిపుచ్చుకొని తెలుగు తెరపై నవ్వులు పూయిస్తున్నాడు. డైరెక్షన్‌పై ఆసక్తి, దర్శకుడు తేజ స్ఫూర్తితో సినీ ఇండస్ట్రీలోకి వచ్చానంటున్న మహేష్... ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... హిమాయత్‌నగర్: మాది ప్రొద్దుటూరు. చిన్నప్పటి నుంచి డైరెక్షన్‌పై ఆసక్తి. ఏమవుతావని స్కూల్లో టీచర్స్ అడిగితే.. సినిమాలకు డైరెక్షన్ చేస్తానని చెప్పేవాడిని. డిగ్రీ తర్వాత ఎంసీఏ చేసేందుకు సిటీకి వచ్చాను. ఈ క్రమంలో 2014లో ‘నేను ఫలానా’ పేరుతో ఓ షార్ట్‌ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. ఈ లఘుచిత్రం ఇండస్ట్రీలోని కొంతమందిని ఆకట్టుకున్నప్పటికీ... అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. యాస ప్లస్.. కామెడీ క్లిక్ ఓసారి షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ హర్ష అన్నవరపు దగ్గరికెళ్లి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశమివ్వాలని అడిగాను. నా దగ్గర ఉన్న స్క్రిప్టులు వినిపించాను. నేను కథ చెప్పిన విధానం, హావభావాలకు ఆకర్షితులైన ఆయన యాక్టర్‌గా చేస్తే బాగుంటుందని సూచించారు. నా స్లాంగ్ (యాస) ఆకట్టుకుంటుందని, కామెడీ చేస్తే క్లిక్ అవుతుందని ప్రోత్సహించారు. అప్పుడే ఆయన ప్రారంభించిన వెబ్ సీరిస్ ‘ఫన్ బకెట్’లో అవకాశమిచ్చారు. అలా సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన నా ప్రస్థానం.. వెండితెరకు చేరింది. సూపర్ హిట్.. లక్షల్లో వ్యూస్ నేను నటించిన ‘ఎర్రి నా ఎంకటేశ, హెచ్‌టూఓ, బాబు బీటెక్, బాబు బంగారం, ఖేల్‌ఖతం.. దుకాణ్‌బంద్’ తదితర షార్ట్‌ఫిల్మ్‌లు, కామెడీ సీరిస్‌లు సూపర్ హిట్ అయ్యాయి. వీటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వీటిలో నేను చెప్పిన ‘ఏయ్.. ఏందమ్మీ, ఓరినీ పాసుగుల్లా, మో.. మేడమో...’ తదితర డైలాగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తేజ స్ఫూర్తితో.. నా షార్ట్‌ఫిల్మ్ చూసిన డైరెక్టర్ తేజ గారు ఓ రోజు ఆఫీస్‌కు రమ్మన్నారు. ఇండస్ట్రీలో కమెడియన్స్ చాలా తక్కువగా ఉన్నారు.. ఆవైపు ఆలోచించు భవిష్యత్ బాగుంటుందని సూచించారు. ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాను. తేజ గారు డైరెక్ట్ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో అవకాశమిచ్చారు. శమంతకమణిలోనూ నటించాను. నేలపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరో నానికి స్నేహితుడిగా చేస్తున్నాను. డైరెక్టర్లు సంపత్ నంది, పూర్ణ ఆనంద్ సినిమాల్లోనూ నటించబోతున్నాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదగాలి... కమెడీయన్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో బాగా రాణించాలనే లక్ష్యంతో ఉన్నాను. రావు రమేష్ గారిలా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదగాలనే కోరిక బలంగా ఉంది. అందులోనూ నెగెటివ్ రోల్స్ చేయాలనే ఆసక్తి బాగా ఉంది.