
సాక్షి, నెల్లూరు: బాలకృష్ణ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎస్. గోపాల్‌రెడ్డి తనయుడు భార‍్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నెల్లూరి జిల్లా వాకాడు మండలం పంబలి వద్ద సముద్రంలో భార్గవ్ మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. భార‍్గవ్ రెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు ఎలా చనిపోయాడనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయాడా, మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
కొడుకు భార‍్గవ్ పేరు మీదే భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించిన గోపాల్ రెడ్డి.. బాలకృష్ణ, కోడి రామకృష్ణలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 2008లో గోపాల్‌రెడ్డి మరణం తరువాత ఆయన కుటుంబసభ్యులెవరు ఇండస్ట్రీలో కొనసాగలేదు.