
వాకాడు : సినీ నిర్మాత, దివంగత ఎస్.గోపాల్‌రెడ్డి తనయుడు ఎస్.భార్గవ్‌రెడ్డి అంత్యక్రియలు గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలిలో నిర్వహించారు. భార్గవ్‌రెడ్డి సముద్రంలో మునిగి మంగళవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. పంబలిలోని తల్లిదండ్రులు గోపాల్‌రెడ్డి, రాజేశ్వరమ్మ సమాధుల వద్దనే భార్గవ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. భార్గవ్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సోదరి పావని తప్ప కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆమే అంత్యక్రియలు నిర్వహించారు. తన చేతులతో అన్నకు తల కొరివి పెట్టాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. హీరో విశాల్ తల్లిదండ్రులు జీకే రెడ్డి, జానకీ దేవి, సోదరి ఐశ్వర్యరెడ్డి, సినీ నటుడు చిన్నాతోపాటు పలువురు సినీ నటులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment