
PC: HCA
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) గత అపెక్స్ కౌన్సిల్ నిధుల గోల్‌మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్‌పై పలు అభియోగాలు నమోదయ్యాయి.
క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ పేరుతో హెచ్‌సీఏ చేపట్టిన సబ్ కాంట్రాక్టుల విషయంలో.. సురేందర్ అగర్వాల్‌కు క్విడ్ ప్రో కో కింద మూడు కంపెనీలు 90 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అగర్వాల్‌తో పాటు అతడి కుటుంబ సభ్యుల ఖాతాలకు ఈ మొత్తాన్ని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా అగర్వాల్ భార్య, కొడుకు , కోడలు అకౌంట్లకు నగదు బదిలీ జరిగిందని.. సురేందర్ అగర్వాల్ భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు ఈ మేర చెల్లింపులు జరిగాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ 90 లక్షల రూపాయలలో 51.29 లక్షల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment