ప్రియుడితో కలిసి అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి.. | Madhapur Police On Software Employee Surender Kidnap Case | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి..

Published Mon, Jan 8 2024 7:09 AM | Last Updated on Mon, Jan 8 2024 7:54 AM

Madhapur Police On Software Employee Surender Kidnap Case - Sakshi

హైదరాబాద్: గతంలో వచ్చన ‘మనీ’ సినిమాను తలదన్నేలా.. గుర్రం సురేందర్‌ కిడ్నాప్‌ ఉదంతం సంచలనం సృష్టించింది. డబ్బు కోసం ఆ చిత్రంలో భార్యను భర్త కిడ్నాప్‌ చేయగా.. వాస్తవ జీవన చిత్రంలో మాత్రం ప్రేమికుడితో కలిసి ఓ చెల్లెలు తన సోదరుడిని అపహరించిన కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. డబ్బుల కోసం చిన్నాన్న కూతురే తన ప్రియుడితో కలిసి అపహరణకు తెర లేపడం దిగజారిపోతున్న మానవతా విలువలకు అద్దం పట్టింది.  ఎంతో ప్రేమగా.. సొంత సోదరిలా చూసుకునే అన్ననే అపహరించి.. ఆపై పోలీసులకు చిక్కిన వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. ఆదివారం గచ్చి»ౌలిలోని మాదాపూర్‌ డీసీసీ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్‌చార్జి డీసీపీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు.      

నల్లగొండ పట్టణానికి చెందిన గుర్రం సురేందర్, భార్య నాగమణితో కలిసి గోకుల్‌ ప్లాట్స్‌లో ఉంటూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో టెక్నికల్‌ సపోర్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయన చిన్నాన్న కూతురు గుర్రం నిఖిత (22) నగరంలోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 4న సాయంత్రం తన సోదరుడు సురేందర్‌కు ఫోన్‌ చేసిన నిఖిత.. ఆఫీస్‌లో కొందరు తనను వేధిస్తున్నారని, ఖాజాగూడ చెరువు వద్దకు వచ్చి మాట్లాడాలని కోరగా వచ్చాడు. నిఖితతో అతడు మాట్లాడుతుండగా.. అక్కడికి వచి్చన ఐదుగురు ఆగంతకులు సురేందర్‌ను కారులోకి లాక్కువెళ్లి కిడ్నాప్‌ చేశారు. ఈ సమయంలో సమీపంలోనే ఇద్దరు వ్యక్తులు అనుమానంతో  డయల్‌ 100కు కాల్‌ చేశారు. రాయదుర్గం పెట్రోల్‌ మొబైల్‌ పోలీసులు అక్కడికి చేరుకొని నిఖితను పీఎస్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. తన సోదరుడిని ఎవరో కిడ్నాప్‌ చేశారని ఫిర్యాదు ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయింది. 

 ఈ క్రమంలో సురేందర్‌ను తీసుకువెళ్తున్న కిడ్నాపర్ల కారు కడ్తాల్‌ వరకు వెళ్లగానే బ్రేక్‌ డౌన్‌ అయింది. దీంతో కిడ్నాపర్లు నిఖితకు ఫోన్‌ చేయడంతో సురేందర్‌కు చెందిన కారులో ఆమె ప్రియుడు కృష్ణా జిల్లా పెనమలూరు పెద్దపులిపాకకు చెందిన బల్లిపర వెంకట కృష్ణ (28)తో కలిసి వచ్చి సదరు కారును వారికి ఇచి్చంది. పోలీసులు సెల్‌ఫోన్‌ మెసేజ్‌ల ఆధారంగా వెంబడించడంతో కిడ్నాపర్లు కడ్తాల్‌ నుంచి కర్నూలు వైపు వెళ్లారు. సురేందర్‌ భార్య నాగమణికి వాట్సాప్‌ కాల్స్‌ చేస్తూ రూ.2 కోట్ల డబ్బు సమకూర్చాలని, కిడ్నాప్‌ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఖమ్మంలో తల్లిగారింట్లో ఆమె హుటాహుటిన నగరంలోని గోకుల్‌ ప్లాట్స్‌కు వచి్చంది. 

ప్రత్యేక బృందాలతో గాలించి.. 
పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెక్‌ పోస్టులను అలర్ట్‌ చేశారు. సీఐ మహేష్‌ బృందం కిడ్నాపర్లను వెంబడించారు. కర్నూలు దగ్గర్లోకి వెళ్లగానే ఆత్మకూరు వైపు కారు వెళుతున్నట్లుగా గుర్తించి అక్కడి పోలీసులు, చెక్‌పోస్ట్‌ను అప్రమత్తం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆత్మకూరు ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ వద్దకు వెళ్లగానే అక్కడి సిబ్బంది కారును ఆపారు. గమనించిన దుండగులు కారును రివర్స్‌ తీసుకొని పారిపోయేందుకు ప్రయతి్నంచి వెనక వాహనాలను ఢీకొట్టారు. 

అంతలోనే సిబ్బంది రావడంతో ముగ్గురు నిందితులు పారిపోగా భోజగుట్ట చెందిన షిండే రోహిత్‌ (19)ను పట్టుకున్నారు. తనను కిడ్నాప్‌ చేశారని, రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైందని సురేందర్‌ వారికి చెప్పారు. కొద్ది సేపటికే రాయదుర్గం సీఐ మహేష్‌ బృందం అక్కడికి చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ముగ్గురు ఫారెస్ట్‌లోకి పారిపోయారు.

శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆత్మకూరు ఫారెస్ట్‌ ఏరియాలో అత్తాపూర్‌కు చెందిన గుంజపోగు సురేష్‌ అలియాస్‌ సూర్య (31), మెహిదీపటా్ననికి చెందిన రామగల్ల రాజు అలియాస్‌ లడ్డూ (20)లను అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు కడ్తాల్‌కు చెందిని చందు పరారీలో ఉన్నాడు. కారు బ్రేక్‌ డౌన్‌ అయిన సమయంలో కిడ్నాపర్లలో ఒకరైన అత్తాపూర్‌కు చెందిన వెంకట్‌ పరారయ్యాడు. 

సురేపై 22 కేసులు  
కిడ్నాప్‌లు, ఇంటి తాళాలు పగులగొట్టిన పలు కేసుల్లో గుంజపోగు సురేష్‌ నిందితుడు. హబీబ్‌నగర్, గాంధీనగర్, ఆసిఫ్‌నగర్, హయత్‌నగర్, సదాశివపేట్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, జీడిమెట్ల, అంగర్‌హౌస్, పటాన్‌చెరు, మియాపూర్, తెనాలీ రూరల్‌ పీఎస్‌లలో 22 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. నిఖిత ప్రియుడు బల్లిపర వెంకటకృష్ణపై జీడిమెట్ల పీఎస్‌లో ఎన్‌డీపీఎస్, కూకట్‌పల్లి పీఎస్‌లో కిడ్నాప్‌ కేసులు నమోదై ఉన్నాయి. గతంలోనే వెంకటకృష్ణకు జైలులో సురేష్‌ పరిచయమయ్యాడు. 

గత అక్టోబర్‌లోనే ఓ కిడ్నాప్‌.. 
ప్రధాన నిందితుడైన సురేష్‌ ముఠా గత అక్టోబర్‌ 10న కన్సల్టెన్సీ నిర్వాహకుడు శివశంకర్‌ను కిడ్నాప్‌ చేసి కోటి రూపాయలు డిమాండ్‌ చేసింది. శివశంకర్‌ భార్య నుంచి రూ.2 లక్షలు తీసుకొని విప్రో సర్కిల్‌లో వదిలిపెట్టారు. గచి్చ»ౌలి పీఎస్‌లో నమోదైన ఆ కేసులో నిందితులుగా ఉన్నారు. నిందితుల నుంచి పోలీసులు రెండు స్విఫ్ట్‌ డిజైర్‌ కార్లు, రెండు హోండా యాక్టివాలు, ఏడు సెల్‌ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. 48 గంటల్లో కేసును ఛేదించిన సీఐ మహే‹Ùను, సిబ్బందిని, ఏడీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌ను డీసీపీ శ్రీనివాస్‌ రావు అభినందించారు.  

కిడ్నాప్‌నకు స్కెచ్‌ ఇలా.. 
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరైన గుర్రం నిఖితకు నేర ప్రవృత్తి కలిగిన తోటి ఉద్యోగి బల్లిపర వెంకటకృష్ణను ఇష్టపడింది. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే సురేందర్‌ను కిడ్నాప్‌ చేయాలని పథకం పన్నారు. అప్పటికే తమకు పరిచయం ఉన్న సురేష్‌ను సంప్రదించారు. సురేందర్‌ను కిడ్నాప్‌ చేస్తే వచ్చే డబ్బుల్లో వాటా ఇస్తామని ప్లాన్‌ వేశారు. డయల్‌ 100కు కాల్‌ వెళ్లకపోతే పోలీసులకు నిఖిత ఫిర్యాదు ఇచ్చేది కాదని పోలీసులు తెలిపారు. సురేందర్‌ భార్యతో ఇంట్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు కిడ్నాపర్లకు సమాచారం అందించి దొరికిపోయింది. ఏ1 గుంజపోగు సురే‹Ù, ఏ2 బల్లిపర వెంకట కృష్ణ, ఏ3 గుర్రం నిఖిత, ఏ4 రామగల్ల రాజు, ఏ5 షిండే రోహిత్‌లను అరెస్ట్‌ రిమాండ్‌కు తరలించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement