
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులలకు పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఆయన హైదరాబద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల సురేందర్ కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇప్పటివరకూ సురేందర్ సహా నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ తెలింది. కాగా, ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్ బారి నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. (తెలంగాణ కరోనా రికవరీ రేటు 77.31శాతం)
Comments
Please login to add a commentAdd a comment