
సాక్షి, కామారెడ్డి: తాను రూ. 3వేల జీతంతో అంగన్‌వాడీ ఆయాగా పనిచేసి ఐదేళ్ల క్రితం రిటైర్ అయితే రూ. 30వేలు ఇచ్చారని, ఇప్పుడు ఆయా పని లేక, వృద్ధాప్య పింఛన్ రాక ఎలా బతకాలని రామారెడ్డికి చెందిన 75ఏళ్ల వృద్ధురాలు దుడుక సత్తవ్వ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ను ప్రశ్నిచింది. ఆదివారం రామారెడ్డి పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన సత్తవ్వ తనకు పింఛన్ ఇవ్వాలని కోరింది.
తనతో పాటు మరో 8 మంది వృద్ధులు ఆయాలుగా పనిచేసి రిటైర్ అయినా పింఛన్ల రావడం లేదని చెప్పింది. తమకు అంగన్‌వాడీ నుంచి ఎలాంటి పింఛన్లు ఇవ్వనప్పుడు ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment