ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో 2013-14 విద్యా సంవత్సరంలో పని చేసేందుకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కె.రామశేషు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. తెలుగు మీడియంలో 526 మంది, ఉర్దూ పాఠశాలల్లో ఆరుగురు మొత్తం 532 మంది ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తున్నారు. అసలు టీచర్లు లేని పాఠశాలలు, ఒక ఉపాధ్యాయుడు పని చేస్తున్న పాఠశాలల్లో, బడిబయట పిల్లలు అధిక సంఖ్యలో ఉన్న ఆవాస ప్రాంతాల్లోని పాఠశాలల్లో వీరిని నియమిస్తున్నట్లు రామశేషు తెలిపారు. ఈ పోస్టులకు టీటీసీ/ డీఈడీ/ బీఈడీ పూర్తిచేసినవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు మండల విద్యాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. మండలాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు, రోస్టర్ పాయింట్, ఇతర వివరాలకు అభ్యర్థులు ఠీఠీ.ఞట్చజ్చుట్చఝ.ఠ్ఛీఛౌఛ్ఛీ.ఛిౌఝ వెబ్‌సైట్ చూడవచ్చు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికలో రిజర్వేషన్లు పాటిస్తారు.
ఏ మండలానికి ఎన్ని పోస్టులు..
పాఠశాలల్లో ఖాళీల అవసరాన్ని బట్టి ఏ మండలానికి ఎన్ని అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు కేటాయించిందీ రామశేషు ప్రకటించారు. పుల్లలచెరువు మండలానికి అత్యధికంగా 49 పోస్టులు కేటాయించారు. అద్దంకి మండలానికి 12, అర్థవీడు 1, బేస్తవారిపేట 6, బల్లికురవ 1, సీఎస్‌పురం 29, చీమకుర్తి 4, చినగంజాం 3, చీరాల 2, కంభం 4, దర్శి 7, దొనకొండ 36, పెదదోర్నాల 12, గిద్దలూరు 10, గుడ్లూరు 5, హనుమంతునిపాడు 26, ఇంకొల్లు 2, జె.పంగులూరు 2, కందుకూరు 15, కనిగిరి 8, కారంచేడు 1, కొమరోలు 19, కొనకనమిట్ల 27, కొండపి 3, కొరిశపాడు 4, కొత్తపట్నం 4, కురిచేడు 15, లింగసముద్రం 1, మద్దిపాడు 2, మార్కాపురం 7, మర్రిపూడి 5, మార్టూరు 3, ముండ్లమూరు 10, నాగులుప్పలపాడు 5, ఒంగోలు 6, పెదచెర్లోపల్లి 28, పుల్లలచెరువు 49, పామూరు 11, పర్చూరు 9, పెద్దారవీడు 6, పొదిలి 9, పొన్నలూరు 10, రాచర్ల 6, సింగరాయకొండ 1, సంతనూతలపాడు 1, సంతమాగులూరు 2, తాళ్లూరు 3, టంగుటూరు 6, తర్లుపాడు 5, త్రిపురాంతకం 26, ఉలవపాడు 8, వెలిగండ్ల 10, వేటపాలెం 2, వలేటివారిపాలెం 4, యర్రగొండపాలెం 24, యద్దనపూడి 5, జరుగుమల్లి 4 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను కేటాయించారు. అద్దంకి, అర్థవీడు, దోర్నాల, కురిచేడు, పొదిలి, వెలిగండ్ల మండలాలకు ఒక్కొక్కటి చొప్పున ఉర్దూ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు కేటాయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామశేషు కోరారు.
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ
Published Thu, Nov 14 2013 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement