లింగ సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో స్కాట్లాండ్‌లోని ఓ పాఠశాల వినూత్న ఆలోచన చేసింది. పాఠశాలలోని బాలురు, బాలికలతోపాటు టీచర్లు కూడా స్కర్ట్స్ ధరించి క్లాస్‌లోకి రావాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4న ఎడిన్‌బర్గ్‌లోని కాసిల్‌వ్యూ ప్రైమరీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొదటిసారిగా ‘వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కర్ట్ ధరించి పాఠశాలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ టీచర్ తన ట్విటర్‌లో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
చదవండి: సమాజ్‌వాదీ అత్తర్‌పై మీమ్స్.. ‘వాహ్ భాయ్ వాహ్’ అంటున్న నెటిజన్‌లు
స్కూల్ పిల్లలందరికి సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చామని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు రాసిన లేఖలో తెలిపారు. స్కర్ట్ లోపల లెగ్గిన్, ప్యాంట్ లాంటివి ధరించవచ్చని పేర్కొన్నారు. అంతేగాక ఒకవేళ స్కర్ట్ కొనలేని వారికి స్కూల్ యాజమాన్యమే పిల్లలకు వాటిని ఆఫర్ చేసిందన్నారు. బట్టలకు లింగ బేధం లేదనే సందేశాన్ని తెలియజేయడానికే తాము ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు. మనం ఎంచుకున్న విధంగా మన భావాలను వ్యక్తీకరించడానికి మనందరికీ స్వేచ్ఛ ఉందనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఇలా చేశామని పేర్కొన్నారు.
చదవండి: తొలిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ.. ఆమె చిరునవ్వుకు నెటిజన్ల ఫిదా
కాగా ఇలా ధరించడం ఇష్టం లేని వారిని మేం ఏం బలవంతం చేయలేదని అంటున్నారు. ఇష్టం ఉన్న వారే ధరించాలని కోరినట్లు తెలిపారు. విద్యార్థులు తమ అభిప్రాయాన్ని స్వేచ్చగా చెప్పేందుకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే సదరు పాఠశాల తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తుంటే మరికొందరు తప్పబడుతున్నారు.లింగ సమానత్వం అంటే ఒకే విధమైన దుస్తులు ధరించడం లేదా పంచుకోవడం కాదని, అందరికి సమాన అవకాశాలు, బాధ్యతలు, హక్కులు కల్పించడమని చెబుతున్నారు.
P6 have been learning about the importance of breaking down gender stereotypes. We have organised a ‘Wear a Skirt to School Day’ to raise awareness of #LaRopaNoTieneGénero campaign. This will be on Thursday 4th November and we’d love everyone to get involved! 👗 @Castleview_PS pic.twitter.com/Bby6JKzUJz
— Miss White (@MissWhiteCV) October 27, 2021
Comments
Please login to add a commentAdd a comment