మర్కుక్: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి ప్రాథమిక పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ అయింది. స్కూల్ వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చుట్టుపక్కల మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.