విద్యా వ్యవస్థలో మరో విప్లవం | Computer science lessons from elementary level in government schools: AP | Sakshi
Sakshi News home page

విద్యా వ్యవస్థలో మరో విప్లవం

Published Mon, Feb 12 2024 5:20 AM | Last Updated on Mon, Feb 12 2024 4:24 PM

Computer science lessons from elementary level in government schools: AP - Sakshi

రాష్ట్రంలో  ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్‌  విభిన్న ప్రాజెక్టులతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సుకొస్తున్నారు.  ప్రభుత్వ బడుల్లో  పునాది స్థాయిలోనే కంప్యూటర్‌ విద్యను అందిస్తే.. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే యువతగా  విద్యార్థులు తలెత్తుకొని జీవించగలరనే నమ్మకంతో మరో కీలక ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమెజాన్‌ ఇండియాతో జతకడుతూ ‘అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజినీర్‌ ప్రోగ్రాం’ కింద వరుసగా రెండో ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. 

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల విద్యా­ర్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ పాఠాలు పాఠశాల స్థాయిలో 6వ తరగతి నుంచి బోధించేందుకు అడుగులు పడనున్నాయి. వెనక బాటు జిల్లాలుగా ఉన్న ఈ ప్రాంత భవిష్యత్తు సార థులైన విద్యార్థులకు ప్రభుత్వం ఈ గొప్ప అవకాశం కల్పిస్తోంది. 2024–25 విద్యా సంవత్స­రం నాటికి 10 వేల మంది ఏపీ విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌ విద్యతో సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్‌ ఇండియాతో  కీలక ఒప్పందం కుదుర్చు­కుంది.

2026–27 నాటికి సంపూర్ణంగా ఈ ప్రయోజ­నాలను లక్ష మందికి అందించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా విజయవాడలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, సమగ్రశిక్ష ఎస్‌పీ­డీ బి.శ్రీనివాసరావు సమక్షంలో ఒప్పంద సంత­కాలు జరిగాయి. రాబో­యే విద్యా సంవత్సరం నుంచి  ఉమ్మడి శ్రీకాకుళం, విజయన­గరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో.. 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి అనేక సంస్థలు మందుకువచ్చాయి. అమెజాన్‌ ఇండియా ఫండ్స్, సమగ్ర శిక్షతో పాటు ప్రపంచబ్యాంక్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ సిస్టమ్, లీడర్‌షిప్‌ ఫర్‌ ఈక్విటీ, క్వెస్ట్‌ అలయన్స్‌ అనే ఎన్‌జీవో ఇందులో ఉన్నాయి. వీరందరి భాగస్వామ్యంతో ఉత్తరాంధ్ర విద్యార్థుల భవితను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది.  ‘కంప్యూటేషనల్‌ థింకింగ్‌ అండ్‌ 21 సెంచరీ స్కిల్స్‌’పై శిక్షణా కార్యక్రమం ద్వారా తరగతి గదుల్లో కంప్యూటర్‌ సైన్స్‌ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేవలం విద్యార్థులకే కాకుండా  ఉపాధ్యాయులకు కూడా బోధన, సాంకేతిక, నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు.

10 వేల మంది నుంచి లక్ష వరకూ..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కంప్యూ టర్‌ సైన్స్‌ పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా ఈ ప్రోగ్రామ్‌ డిజైన్‌ చేశారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ఉత్తరాంధ్రలో 10 వేల మంది విద్యా­ర్థులకు ఈ తరగతులు అందుబాటులోకి రానున్నా­యి. ఏపీలో లక్ష మందికి ఈ విద్యను చేరువ చేయా­లన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎస్‌సీ­ఈఆర్‌టీతో కలిసి పాఠశాలల్లో కంప్యూటేషనల్‌ థింకింగ్‌ క్లబ్‌లు ఏర్పాటు చేయనుంది. విద్యార్థులకు కంప్యూటర్‌ సై న్స్‌ పాఠాల బోధన, ప్రాక్టికల్‌గా శిక్షణ ఇలా విభిన్న అంశాల్లో తరగతులు నిర్వహించి పిల్లల్ని నిష్ణాతుల్ని చేయనుంది.

ఎక్సలెన్స్‌ కోర్సుల అనుసంధానం
కంప్యూటర్‌ సైన్స్‌ టీచింగ్‌ ఎక్సలెన్స్‌ కోర్సులను అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్‌ యుగానికి అవసరమైన నైపుణ్యా­లను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్టనర్‌­షిప్‌ (పీపీపీ) విధానంలో ప్రభుత్వ పాఠ­శాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థుల ఉన్నత చదువులకు ఈ ప్రోగ్రాం ఒక పునాదిలా మారుతుంది.  – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌

ప్రతి విద్యార్థికి అవకాశం  
అమేజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విద్యార్థులందరినీ సాంకేతిక విద్యను చేరువ చేయాలన్నదే అమేజాన్‌ ఇండియా లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో అడుగులు వేస్తున్నాం. విద్యార్థులకు వారి కెరీర్‌లకు అవ సరమైన నైపుణ్యాల్ని అందిస్తాం. బెస్ట్‌ కెరీర్‌కు కంప్యూటర్‌ సైన్స్‌ విద్య ఎంతో దోహద పడు తుంది.   రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 1.5 మిలి యన్‌ మంది విద్యా­ర్థులకు, 8 వేల మంది టీచర్లకు కంప్యూటర్‌ సైన్స్‌ విద్య అందించాం.    – అక్షయ్‌ కశ్యప్, అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజినీర్‌ ఇండియా లీడర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement