ప్రిన్స్‌ మీ వయసెంత...చార్లెస్‌ని ‍ప్రశ్నించిన చిన్నారి: వీడియో వైరల్‌ | Video Viral: Child Asked King Charles How Old Are You At East London | Sakshi
Sakshi News home page

కింగ్‌ చార్లెస్‌ని వయసు గురించి ప్రశ్నించిన చిన్నారి...: వీడియో వైరల్‌

Published Wed, Oct 19 2022 12:11 PM | Last Updated on Wed, Oct 19 2022 1:54 PM

Video Viral: Child Asked King Charles How Old Are You At East London - Sakshi

సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన జీరో వాల్తామ్‌స్టోవ్‌ను సందర్శించడానికి చార్లెస్‌ 3 తూర్పు లండన్‌కి వెళ్లారు. అక్కడ ఆయన బార్న్‌ క్రాఫ్ట్‌ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులను కలిశారు. వారితో రాజు కాసేపు ఆనందంగా ముచ్చటించాడు. చార్లెస్‌ ఆ విద్యార్థులతో సెలవులు గురించి, లంచ్‌ సమయం గురించి కొన్ని కుశల ప్రశ్నలు వేశారు.

ఆ చిన్నారుల్లో ఒకరు ప్రిన్స్‌ అంటూ జెండా ఊపుతూ చార్లెస్‌ని ఉత్సహాపరిచాడు. మరో చిన్నారి చార్లెస్‌ని మీ వయసు అంతా అని ముద్దుగా అడిగింది. ఆ చిన్నారి చిలిపి ప్రశ్నతో అక్కడ ఉన్న టీచర్లు, చార్లెస్‌ ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. దీనికి చార్లెస్‌ తనదైనా శైలిలో గెస్‌ చేయండి అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

ఇలాంటి చమత్కర ప్రశ్నలకు తనదైన హాస్యాని​ చార్లెస్‌ పండించడం మొదటిసారి కాదు. ఇంతకుముందు కామెన్‌వెల్త్‌ గేమ్‌ 2022 ప్రారంభోత్సవ వేడుకల్లో ఒక వ్యక్తి మనం బీర్‌ వద్దకు వెళ్లగలమా అని ప్రశ్నిస్తే ఇలానే హాస్యాన్ని పండించాడు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: చికెన్‌ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్‌ని తగలెట్టేశాడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement