![Two Children Killed in Knife Attack in UK](/styles/webp/s3/article_images/2024/07/30/london-in.jpg.webp?itok=MYiH4jEa)
బ్రిటన్‌లోని నార్త్-వెస్ట్ ఇంగ్లండ్‌లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారుల కోసం నిర్వహిస్తున్న డ్యాన్స్ క్లాస్‌లో ఒక యువకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరో తొమ్మిదిమంది గాయపడ్డారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం దాడికి పాల్పడ్డ యువకుడిని టేలర్ స్విఫ్ట్(17)గా గుర్తించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని మెర్సీసైడ్ పోలీస్ చీఫ్ కానిస్టేబుల్ సెరెనా కెన్నెడీ తెలిపారు. దాడికి పాల్పడిన యువకుడు మారణాయుధంతో డాన్స్ క్లాస్ జరుగుతున్న ప్రాంగణంలోకి వచ్చాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న మెర్సీసైడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment