Tamil Nadu: అయోధ్య లైవ్‌ టెలికాస్ట్‌ అడ్డుకోవద్దు.. సుప్రీంకోర్టు ఆదేశాలు | SC Against Tamil Nadu govt Order To Ban Ayodhya Live Telecast | Sakshi
Sakshi News home page

Tamil Nadu: అయోధ్య లైవ్‌ టెలికాస్ట్‌ అడ్డుకోవద్దు.. సుప్రీంకోర్టు ఆదేశాలు

Published Mon, Jan 22 2024 12:13 PM | Last Updated on Mon, Jan 22 2024 12:59 PM

SC Against Tamil Nadu govt Order To Ban Ayodhya Live Telecast - Sakshi

సాక్షి, ఢిల్లీ: తమిళనాడులో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట లైవ్‌ టెలికాస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు రాముడికి సంబంధించిన వేడుకల ప్రసారాలను తిరస్కరించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, సుప్రీంకోర్టులో స్టాలిన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 

వివరాల ప్రకారం.. అయోధ్యలో రామ్‌లల్లా ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలనే అభ్యర్థనలను తిరస్కరించవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే తిరస్కరించిన వాటికి సంబంధించి.. పక్కా కారణాలను చూపాలని, డేటాను సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. సమాజంలో ఇతర వర్గాలు కూడా నివసిస్తున్నాయనే ఏకైక కారణంతో.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన లైవ్​ టెలికాస్ట్​ అనుమతిని తిరస్కరించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు, రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, భజనల నిర్వహణపై నిషేధం లేదని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ఇదిలా ఉండగా.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని లైవ్​ టెలికాస్ట్​ చేసేందుకు.. వివిధ రాష్ట్రాలు ఏర్పాట్లు చేశాయి. అయితే.. తమిళనాడు ప్రభుత్వం మాత్రం.. హిందువులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. లైవ్​ టెలికాస్ట్‌ను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ ఆరోపించారు. తమిళనాడులోని రామాలయాల్లో పూజలు, భజనలను కూడా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆదివారం రాజకీయ దుమారం రేగింది. దీంతో, ఈ విషయంపై బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పీ సెల్వం తరఫున న్యాయవాది జి.బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం, కోర్టు  కీలక ఆదేశాలను జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement