సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను బుధవారం సీజ్ చేశారు. నూజివీడు, అవనిగడ్డ, గుడివాడలో తనిఖీలు చేపట్టారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టిక్కెట్ల ధరలు, ఫుడ్ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.
కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కృష్ణాజిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేశామని తెలిపారు. లైసెన్సులు రెన్యూవల్ చేయని థియేటర్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. తనిఖీలు రెగ్యులర్‌గా కొనసాగుతాయన్నారు. బెనిఫిట్ షోలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేస్తారన్నారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లలో తిను బండరాలు, పార్కింగ్ విషయంలో దోపిడీ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జాయింట్ కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment