govt officials
-
మీ ఆస్తులు జప్తు చేస్తే తెలిసొస్తుంది
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి, ఆ తర్వాత కొన్నేళ్లకు కూల్చివేత నోటీసులిచ్చే అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తే గానీ సరిగా విధులు నిర్వహించరని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. నష్టపరిహారం కూడా సదరు అధికారుల నుంచే వసూలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన స్థితి వస్తుందని హెచ్చరించింది. అధికారుల ఆస్తులు జప్తు చేస్తే అప్పుడు తెలిసొస్తుందని పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో సర్కార్ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అధికారుల తప్పులకు ప్రజాధనం వెచ్చిoచడం సరికాదని అభిప్రాయపడింది. నిర్మాణం అక్రమమైనప్పుడు ఆ నిర్మాణం చేపట్టడానికి ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించింది. అవకతవకలకు పాల్పడి అనుమతులిచ్చి.. నిర్మాణం పూర్తయిన తర్వాత చెరువులు, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ అంటూ కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడింది.అయితే, నీటివనరుల సంరక్షణకు తాము వ్యతిరేకం కాదని, అధికారుల తీరునే తప్పుబడుతున్నామని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని నర్కూడ గ్రామం మంగరాశి కుంట ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఇళ్లను నిర్మించారంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. 15 రోజులు సమయమివ్వండి.. అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను కూడా కూలుస్తామని అధికారులు ఈ నెల 4న నోటీసులు అతికించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏడు రోజుల్లో నిర్మాణాలను తొలగించాలని అందులో హెచ్చరించారన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. పిటిషనర్ల వాదన వినకుండా.. కూల్చివేతపై ముందుకెళ్లడం చట్టవిరుద్ధమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ముందుగా చెరువులు, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం అక్రమమని తేలితే.. చట్ట ప్రకారం ముందస్తు నోటీసులు జారీ చేయాలని, 15 రోజుల సమయం ఇచ్చి పిటిషనర్ల వాదన కూడా వినాలన్నారు. పిటిషనర్లు వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు, రసీదులను జతచేస్తూ వివరాలు అందజేయాలంటూ జడ్జి విచారణ ముగించారు. -
ఆలయంలోనికి చెప్పులతో వచ్చిన అధికారి సస్పెండ్
మీర్జాపూర్: యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక్కడి వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (వ్యవసాయం)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.ఆలయంలో పాదరక్షలు ధరించిన ఏడీఓను చూసిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఆలయంలో ఏడీఓ బూట్లు ధరించి ఉండడం చూసిన ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా మెజిస్ట్రేట్ సదరు ఏడీఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సమాచార శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలోని వివరాల ప్రకారం విద్యవాసిని ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.ఆలయంలో అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన ఏడీఏ ప్రతీక్ కుమార్ సింగ్ షూష్‌తో సహా ఆలయంలోనికి ప్రవేశించారు. ఇది కలకలం సృష్టించింది. జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ ఆదేశాల మేరకు ప్రతీక్ కుమార్ సింగ్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా మాట్లాడుతూ చెప్పులు ధరించి, గుడి మెట్లు ఎక్కుతున్న అధికారిని చూసి, తాను ఆలయంలో నుంచి బయటకు పంపించివేశానని తెలిపారు. ఇది కూడా చదవండి: దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు -
కర్ణాటకలో కలకలం.. మహిళా అధికారి దారుణ హత్య
బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో గనులు, భూవిజ్ఞాన శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న కేఎస్ ప్రతిమ(43) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణ హత్య జరిగినట్టు తెలుస్తోంది. ఇక, రామనగర జిల్లాలో పని చేస్తున్న ఆమె బదిలీపై ఇటీవలే బెంగళూరుకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఆమె హత్య అధికార, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ప్లాట్‌లో ఒంటరిగా.. వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా తుడ్కికి చెందిన ప్రతిమకు 18 ఏళ్ల క్రితం సత్యనారాయణ అనే వ్యక్తితో పెళ్లయింది. 2017లో ఆమెకు గనులు భూగర్భ శాఖలో జియాలజిస్టుగా ఉద్యోగం లభించింది. ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలలో పనిచేశారు. రామనగర జిల్లాలో విధుల్లో చేరిన ప్రతిమ తరువాత బెంగళూరుకు బదిలీ అయింది. కొంతకాలంగా దొడ్డకల్లసంద్రలోని గోకుల అపార్టుమెంట్లో అద్దె ఫ్లాటులో ఒంటరిగా నివాసం ఉంటుంది. భర్త సత్యనారాయణ, ఎస్ఎస్సీ చదువుతున్న కుమారుడు చిరాత్ తీర్థహళ్లిలోనే ఉండేవారు. శనివారం రాత్రి ఎనిమిది గంటలకు కార్యాలయం నుంచి ఇంటికి ప్రతిమను కారులో డ్రైవరు డ్రాప్ చేసి వెళ్లాడు. కాగా, కాసేపటికే ప్రతిమపై దాడి చేసిన కొందరు వ్యక్తులు.. ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. An employee working under the Karnataka government was stabbed to death at her residence in Bengaluru’s Doddakallasandra on Saturday. The 43-year-old geologist — identified as KS Pratima — was a Deputy Director in the Mines and Geology Department of Karnataka. The accused broke… pic.twitter.com/C6cXcXWjOS — Madhuri Adnal (@madhuriadnal) November 5, 2023 అయితే, ప్రతిమకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన సోదరి స్పందించకపోవడంతో ఆమె సోదరుడు ప్రతీక్, అక్కడున్న వారికి ఫోన్ చేశారు. వారు వచ్చి చూసేసరికి ప్రతిమ హత్యకు గురైందని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రతిమ సొంతూరు తుడ్కిలో ఇటీవల కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కూడా చేశారు. రెండెకరాలు వక్కతోట ఉండటంతో వక్క పంట కోయడానికి భర్త , కుమారుడు అక్కడే ఉంటున్నారు. ఆమె దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంది. కుటుంబసభ్యులు ఆక్రందనలు మిన్నంటాయి. దాడులే కారణం.. మరోవైపు.. ప్రతిమ హత్యపై కర్ణాటక పర్యావరణ శాఖ సీనియర్ అధికారి ఒకరు విలేకరులతో మాట్లాడుతూ.. ఆమె చాలా డైనమిక్ లేడీ. ఎంతో ధైర్యవంతురాలు. ఎంతో కష్టపడి డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతిమ ఇటీవల కొన్ని ప్రదేశాల్లో దాడులు చేశారు. ఈ దాడుల కారణంగానే ఆమెపై అటాక్ జరిగి ఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేశారు. ఇక, ప్రతిమ 2017 నుంచి ఈ ఏడాది ప్రారంభం వరకు రామనగరలో పని చేశారని జిల్లాధికారి కేఏ దయానంద తెలిపారు. అన్ని సమావేశాలకు దస్త్రాలతో హాజరయ్యేవారని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు నుంచి అక్రమంగా కంకర, ఇసుక రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమెకు సూచించానని చెప్పారు. ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదులు తమకు అందలేదని ఆమె స్పష్టం చేశారని తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..
దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) బంపరాఫర్ ప్రకటించింది. 1,000 మంది ప్రభుత్వ అధికారులకు సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ సెర్ట్ఇన్ (CERT-In)తో గూగుల్ క్లౌడ్ (Google Cloud) తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సెర్ట్ఇన్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)లో భాగం. ఇది సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, హ్యాకింగ్, ఇతర సైబర్ సంబంధిత సమస్యలను చూసుకుంటుంది. (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!) రూ.లక్ష స్కాలర్షిప్ కూడా.. 'సైబర్ ఫోర్స్' పేరుతో కొంతమంది ప్రభుత్వ అధికారులకు సైబర్ డిఫెన్స్ బెస్ట్ ప్రాక్టీస్‌లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా వీరికి జనరేటివ్ ఏఐ వినియోగం, సైబర్ సెక్యూరిటీ ఏఐ హ్యాకథాన్ల నిర్వహణ వంటివి గూగుల్ క్లౌడ్, మాండియంట్ నిపుణులచే నిర్వహించన్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు రూ.లక్ష స్కాలర్షిప్ కూడా ఇవ్వననున్నట్లు పేర్కొంది. ‘సైబర్ భద్రత మన డిజిటల్ భవిష్యత్తుకు మూలస్తంభం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మరింత ముందుకు సాగాలంటే జనరేటివ్ ఏఐ శక్తిని వినియోగించుకోవడం చాలా అవసరం’ అని సెర్ట్ఇన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహ్ల్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా భారతీయులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని సులభతరం చేస్తున్నామని, కొత్త సురక్షితమైన భద్రత సేవలను అందించడానికి సహకారం అందిస్తున్నామని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ అన్నారు. -
Civil Services Day: దేశ ప్రయోజనాలే పరమావధిగా..
న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులు తీసుకొనే ప్రతి నిర్ణయానికీ దేశ ప్రయోజనాలే పరమావధి కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. మీపై దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి అని అధికారులకు సూచించారు. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘వికసిత్ భారత్’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహించారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును అధికారంలో ఉన్న పార్టీ సొంత ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తోందా? లేక దేశ అభివృద్ధి కోసం వెచ్చిస్తోందా? అన్నది విశ్లేషించాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులపై ఉందని మోదీ చెప్పారు. జాతి నిర్మాణంలో ఉన్నత స్థాయి అధికారుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. వారి క్రియాశీల భాగస్వామ్యం లేకపోతే దేశంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ అధికారి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని వెల్లడించారు. మీరు తీసుకొనే ప్రతి నిరం్ణయానికి దేశ ప్రగతే ఆధారం కావాలన్నారు. ప్రపంచంలో భారత్ ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోందని, అధికార యంత్రాంగం సమయం వృథా చేయకుండా దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ‘దేశం ప్రథమం, పౌరులు ప్రథమం’ ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వ పాలనా వ్యవస్థ అండగా నిలవాలని, వారి కలలు సాకారం అయ్యేందుకు ప్రభుత్వ అధికారులు సాయం అందించాలని ప్రధాని మోదీ సూచించారు. వికసిత భారతదేశానికి ఇది అత్యంత కీలకమని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ యంత్రాంగం చుట్టూ ప్రతికూలత ఆవరించి ఉండేదని, అది ఇప్పుడు సానుకూలతగా మారిందని వివరించారు. ‘దేశం ప్రథమం, పౌరులు ప్రథమం’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని, దేశంలో బలహీనవర్గాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మీ కోసం మీరు ఏం చేసుకున్నారు అనే దాన్నిబట్టి కాకుండా ప్రజల కోసం ఏం చేశారన్న దాన్నిబట్టే మీ పనితీరు, ప్రతిభను గుర్తించవచ్చని సివిల్ సర్వీస్ అధికారులకు సూచించారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న గాఢమైన ఆకాంక్షతో పనిచేస్తే చిరస్మరణీయమైన వారసత్వాన్ని మిగిల్చిన వారవుతారని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నమైన సిద్ధాంతాలు, భావజాలాలున్న పార్టీలు ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. యువత కలలు ఛిద్రం కావడానికి వీల్లేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కొనసాగిన విచ్చలవిడి అవినీతికి అడ్డుకట్ట వేశామని రూ.3 లక్షల కోట్లు అవినీతిపరుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నామన్నారు. సివిల్ సర్వెంట్ల సేవలు ప్రశంసనీయం: రాష్ట్రపతి ‘సివిల్ సర్వీసెస్ డే’ సందర్భంగా సంబంధిత అధికారులందరికీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారి సేవలు ప్రశంసనీయ మంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. దేశ ప్రగతిలో వారి కృషి, అంకితభావం, సేవలను ప్రశంసించాలంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఏటా ఏప్రిల్ 21న కేంద్రం సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. -
అవినీతిపరుల గుండెల్లో 14400
సాక్షి, అమరావతి: గతంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకాడేవారు. ఎవరైనా ధైర్యం చేసి ఫిర్యాదు చేద్దామన్నా పెద్ద తతంగమే ఉండేది. కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలన్నా సమయం పడుతుంది. దీనికి పరిష్కారంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొబైల్ యాప్‌ను రూపొందించమని ఏసీబీని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏసీబీ 14400 యాప్‌ను రూపొందించింది. లిఖితపూర్వక ఫిర్యాదు, డాక్యుమెంట్లే కాదు... తక్షణం ఆడియో, వీడియో క్లిప్లతోసహా ఫిర్యాదు చేసే అవకాశం ఇందులో కల్పించింది. ఆ ఫిర్యాదులపై తక్షణం స్పందించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, కాల్‌సెంటర్‌ను పటిష్టపరిచింది. దాంతో అవినీతిపై బాధితులు తక్షణమే ఫిర్యాదు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు కూడా వెంటనే స్పందిస్తూ వివిధ రీతుల్లో పరిష్కరిస్తున్నారు. చాలావరకు ఫిర్యాదుదారులు కేసులు పెట్టకుండా సమస్య పరిష్కారాన్ని కోరుతున్నారు. దాంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నారు. ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేసిన తరువాత వెనక్కి తగ్గడం, తప్పుడు ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించి ఏసీబీ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి అధికారులను ట్రాప్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం, ఆకస్మిక తనిఖీలు, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులు మొదలైనవి నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభించిన ఈ మొబైల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 2,402 ఫిర్యాదులు అందాయి. వాటిలో 2,127.. అంటే 88 శాతం ఫిర్యాదులను ఏసీబీ పరిష్కరించింది. మరో 275 ఫిర్యాదులపై చర్యలు పరిశీలనలో ఉన్నాయి. యాప్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ ముగ్గురు అధికారులను అరెస్టు చేసింది. 8 సాధారణ తనిఖీలు, రెండు ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. 14400 కాల్‌సెంటర్‌కు ఈ ఏడాది మార్చి 1 నుంచి ఇప్పటివరకు 4,363 ఫిర్యాదులు రాగా వాటిలో 4,132 సమస్యలను పరిష్కరించడం విశేషం. మరో 231 ఫిర్యాదులపై చర్యలు పరిశీలనలో ఉన్నాయి. అంటే ఏకంగా 94 శాతం సమస్యలను పరిష్కరించింది. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ 13 మంది అధికారులను ట్రాప్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఒకటి నమోదు చేసింది. 14 సాధారణ విచారణలు చేపట్టగా 20 ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అవినీతి అంతమే లక్ష్యం: డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అవినీతిపై సులభంగా ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన 14400 మొబైల్ యాప్ విజయవంతమైంది. మొబైల్ యాప్, కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నాం. 100 శాతం కేసులు పరిష్కరించి బాధితులకు అండగా నిలవడమే ధ్యేయంగా ఏసీబీ పనిచేస్తోంది. ► తిరుపతిలో ఓ మందుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా డ్రగ్ కంట్రోల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డి.బాలమురళీ కల్యాణ్ చక్రవర్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నివాసాల్లో తనిఖీలు చేసి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులు కూడా నమోదు చేశారు. ► కాకినాడలో ఓ డెయిరీ ఫాం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న తూర్పు డిస్కం ఏఈ మడికి చంటి బాబు, లైన్‌మేన్ ఎం.సిద్ధార్థ కుమార్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ► కర్నూలు జిల్లాలో లంచం తీసుకుంటున్న ఏఎస్సై షేక్ ఖాదర్ వలీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ► ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్ఆర్ పురం తహశీల్దార్ కె.సతీశ్ ఓ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యాపార సంస్థకు విద్యుత్ సర్వీస్ లైన్ వేసి మీటర్ పెట్టేందుకు అనకాపల్లి జిల్లాలో తూర్పు డిస్కం ఏఈ ఎం.వెంకటరమణ రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న 14400 యాప్ ద్వారా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏసీబీ అధికారులు బాధితునితో మాట్లాడి రంగంలోకి దిగారు. ఆ ఏఈ ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక్క రోజులోనే అవినీతి అధికారి ఆటకట్టించడంలో ఏసీబీ మొబైల్ యాప్ కీలక పాత్ర పోషించింది. 14400.. ఈ నంబర్ వింటేనే రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలవుతుంది. ఈ యాప్‌లో ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి, అవినీతి అధికారుల ఆట కట్టిస్టున్నారు. ఇందుకు పై సంఘటనే తాజా ఉదాహరణ. -
అధి‘కార్ల’ బాగోతం.. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా కక్కుర్తి పోలేదు!
ఇక్కడ కనిపిస్తున్న వాహనాన్ని ఓ ఐసీడీఎస్ అధికారి వినియోగిస్తున్నారు. కారుపైన ‘ఆన్ గౌట్ డ్యూటీ’ అని రాసి ఉంది. నిబంధనల ప్రకారం ఎల్లో ప్లేట్ వాహనం వినియోగించాలి. కానీ ఇందులోనే సదరు అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. ఈయనొక్కరే కాదు.. ఆర్అండ్బీ, ఐటీడీఏ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, వైద్యారోగ్యశాఖ, వయోజన విద్య, బీసీ వెల్ఫేర్, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ, ఆర్డబ్ల్యూఎస్, డీపీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు చాలా వరకు వైట్‌ప్లేట్ వాహనాల్లోనే తిరుగుతూ ఎల్లో ప్లేట్ పేరిట బిల్లులు డ్రా చేసుకుంటుండడం గమనార్హం. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో కొంతమంది అధికారులు వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా ఇంకా కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా స్థాయితో పాటు కొంతమంది క్షేత్రస్థాయి పరిశీలన కోసం వెళ్లే అధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. ప్రభుత్వ వాహనాలు అందుబాటులో లేని చోట అద్దె వాహనాల వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తమ సొంత వాహనాల్లోనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ‘అద్దె’ను సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో చాలా మంది వైట్ ప్లేట్ వాహనాల్లో వెళ్తూ ఇతరుల పేరిట బిల్లులు తీసుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయా శాఖల్లో ప్రభుత్వ వాహనాలు లేని అధికారులకు ట్యాక్స్ ప్లేట్ వాహనాలు అద్దెకు తీసుకునే అవకాశం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర శాఖల నుంచి నిరుద్యోగులకు ఓనర్ కమ్ డ్రైవర్ వంటి స్కీమ్‌లను ప్రవేశపెట్టి వాహనాలను సబ్సిడీ రూపంలో అందించింది. ఆయా శాఖల్లో వాహనాలు అద్దెకు పెట్టేందుకు అనుమతినిచ్చింది. అయితే కొంతమంది అధికారులు ఎల్లో ప్లేట్‌కు బదులు వైట్ ప్లేట్ వాహనాలనే వినియోగిస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు. బిల్లులు తీసుకునే సమయంలో ఇతరుల వాహనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు విషయం తెలిసినప్పటికీ ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలకు 2,500 కిలో మీటర్లు వాహనం తిరగాల్సి ఉంటుంది. ఇందుకు గాను రూ.33వేలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే కొంతమంది అధికారులు తమ వాహనాల్లో తక్కువ కిలో మీటర్లు తిరుగుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వాహనాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లకపోయినా టూర్ డైరీలో మాత్రం వెళ్లినట్లు చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. చదవండి: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం.. అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్ చేసి సర్కారు ఆదాయానికి గండి.. ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత వాహనాలను వినియోగించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. వైట్ ప్లేట్ వాహనాలను సొంత పనులకు మాత్రమే వినియోగించాలి. వీటికి పన్ను చెల్లింపు ఉండదు. ఎల్లో ప్లేట్ ట్యాక్స్ వాహనాలను ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అద్దె కోసం వినియోగించాల్సి ఉంటుంది. వీటికి మాత్రం ఫిట్నెస్, ఏడాదికి ఇన్సూరెన్స్ రూ.20వేల నుంచి రూ.25వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రం దాటితే టీపీ తీయాలి. అయితే ఇలాంటివి పన్నులు లేకుండా కొందరు అధికారులు తమ సొంత వాహనాలనే వినియోగిస్తూ బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ఇతర వ్యక్తులకు సంబంధించిన వాహనాలుగా చూపుతూ వారికి నెలకు రూ.1500 నుంచి రూ.2వేలు వరకు చెల్లిస్తున్నారు. అదే బాటలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు.. జిల్లాలో 18 మండలాలున్నాయి. క్షేత్రస్థాయిలో ప ర్యటించే తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ప్రభుత్వం అద్దె వాహన సౌకర్యం కల్పించింది. కొంతమంది మాత్రం దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. అద్దె వాహనాలు వినియోగించాల్సి ఉన్నా కాసులకోసం కక్కుర్తి పడుతూ తమ సొంత వాహనాలనే విని యోగిస్తూ బిల్లులు కాజేస్తున్నారు. రోజు కార్యాలయానికి వచ్చేది వైట్ ప్లేట్ వాహనంలోనే అయినా.. బిల్లులు మాత్రం ఎల్లో ప్లేట్‌కు సంబంధించి తీసుకుంటున్నారు. ఈ విషయమై అదనపు కలెక్టర్ నటరాజ్, డీఆర్డీవో కిషన్‌ను ఫోన్లో సంప్రదించగా వారు సమావేశంలో ఉన్నామని తెలిపారు. వివరాలు తెలిపేందుకు అందుబాటులోకి రాలేదు. -
ఆగ్రహంతో ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేసిన రైతులు: వీడియో వైరల్
న్యూఢిల్లీ: బిహార్‌లోని మోతిహారిలో ఎరువులు నిల్వ ఉంచడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం పై ఆగ్రహం చెందిన రైతులు ఒక ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేశారు. రైతుల ఆవేదన అర్థం చేసుకోకుండా ఎరువుల ధరలు తమ ఇష్టరాజ్యంగా పెంచేందుకు యత్నిస్తున్న ఒక అధికారికి బుద్ధి చెప్పేందుకే ఇలా చేసినట్లు సమాచారం. వివరాల్లోకెళ్లే...బిహార్‌లో వ్యవసాయ శాఖ నియమించిన కిసాన్ సలహదారుడు నితిన్ కుమార్‌ని రైతులు స్థంభానికి కట్టేశారు. సదరు సలహదారు ఎరువుల విక్రయదారులతో చేతులు కలిపి ధర పెంచే పనిలో పడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు. అదీగాక యూరియా బస్తాను ప్రభుత్వం రూ. 265కి విక్రయిస్తుంటే స్థానిక దుకాణాదారులు అదే యూరియాని తమకు రూ.500 నుంచి రూ. 600 విక్రయిస్తున్నారని వాపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్థానిక యంత్రాంగం వెంటనే స్పందించి సదరు ప్రభుత్వాధికారిని విడిపించే ప్రయత్నంలో పడింది. చివరకు అధికారులు రైతులకు వ్యవసాయానికి అవసరమైన అన్ని వస్తువులు ప్రభుత్వ ధరకు లభిస్తాయని హామీ ఇవ్వడమే గాక సదరు అధికారిని విడిపించేందుకు వారిని ఒప్పించారు. खाद की कालाबाज़ारी से तंग आकर मोतिहारी में कृषि सलाहकार को किसानों ने खंभे से बांध दिया @ndtvindia pic.twitter.com/UMfOKrug79 — manish (@manishndtv) August 29, 2022 (చదవండి: క్లాస్‌రూమ్‌లో హఠాత్తుగా ఫ్యాన్ పడటంతో విద్యార్థినికి గాయాలు) -
అధికారులు ‘ఛాన్స్’ తీసుకోవడం లేదు!
ఇటీవలి క్రిస్మస్ తర్వాత ఎదురైన అనుభవం ఇది. ఒంగోలు కలెక్టరేట్లో సీనియర్ అధికారిగా పని చేస్తున్న– ‘కజిన్’కు ఫోన్ చేసి ఎక్కడ? అని అడిగితే, మార్కాపురంలో రోడ్డు మీద ఉన్నట్టుగా చెప్పారు. రాత్రి ఎనిమిది అవుతుంటే, ఇప్పుడు అక్కడ ఏమి చేస్తున్నట్టు అనిపించి, అదే అడిగితే, ‘సీఎం ఆఫీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ వస్తున్నారు, ఇక్కడ ‘వెయిట్’ చేస్తున్నాం’ అని అటునుంచి జవాబు. ఆయన ఏదైనా– ‘రివ్యూ మీటింగ్’ పెడితే, అది ఒంగోలు కలెక్టర్ ఆఫీస్‌లో ఉండాలి. కానీ రాత్రి ఎనిమిదప్పుడు, జిల్లా కేంద్రం ఒంగోలుకు 70 కి.మీ. దూరంలోని మార్కాపురంలో– సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడ ఏమి చేస్తున్నట్టు? అదే అడిగాను. ‘సార్ గ్రామ సచివాలయాలను తనిఖీ చేస్తున్నారు’ అని అటునుంచి జవాబు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో భిన్నంగా ప్రభుత్వ పాలన సాగుతున్నది అనిపించింది! సీఎం సమీక్షా సమావేశాల్లో, అధికారులు– ‘ఫీల్డ్’లో చూసి వచ్చి చెబుతున్నారా లేదా అనేది జగన్ పోల్చుకుంటున్నారు... అనేది 2022 నాటికి ఏపీలో కార్యదర్శులు, శాఖాధికారుల మనోగతం. దాంతో కలెక్టర్లు కూడా జిల్లా అధికా రుల నివేదికలను క్షేత్రస్థాయిలోని వాస్తవాలతో తాము స్వయంగా చూసి మరీ– ‘క్రాస్ చెక్’ చేసుకుంటున్నారు. ఉగాది నాడు కొత్త జిల్లాల ఆవిర్భావం సందర్భంగా– మంత్రులు, ప్రభుత్వ శాఖాధికారులు, కలెక్టర్లు పాల్గొన్న వీడియో కాన్ఫ రెన్స్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ– ‘సస్టెయిన్‌బుల్ డెవలప్మెంట్ గోల్స్’ (ఎస్డీజీ) సాధించే దిశలో– ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (ఎస్ఓపీ) పాటించి తీరాల్సిందే అని కొత్తగా జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకున్న అధికారులకు స్పష్టం చేశారు. కేంద్రంలో– ‘నీతి ఆయోగ్’ దీన్ని మదింపు చేస్తుంది. ఇలా బహిరంగంగా– ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ పాటించి తీరాలని ఒక సీఎం చెప్పడం చిన్న విషయం కాదు. అంత తేలిక అంతకంటే కాదు. పైగా– ‘కలెక్టర్లను జాగ్రత్తగా చూసుకోండి’ అని మంత్రులతో సీఎం చెప్పడం ఆసక్తికరమైన అంశం. అధికారులతో నిబంధనలకు లోబడి పని చేయండి అని చెబుతూ, మంత్రులతో అధికారులను జాగ్రత్తగా చూడండి, అంటే విషయం స్పష్టమే! వాళ్ళ మీద– ‘అవుటాఫ్ ది వే’ చేయమని మీరు ఒత్తిడి పెట్టొద్దు. వాళ్ళు నిబంధనలకు లోబడి పనిచేస్తే, రేపు రాజకీయంగా ప్రయోజనం పొందేది మనమే అనేది జగన్ స్పష్టం చేసేశారు. పరిపాలన ఎంత– ‘ఆన్లైన్’ అంటున్నప్పటికీ, ‘టెక్నాలజీ’ అన్నిసార్లూ నిజమే చెప్పాలని లేదని, ఏపీ సీఎం జగన్‌కు మరీ ఇంత త్వరగా తెలియడం అధికారులకు కాస్త ఇబ్బందిగానే ఉంది. ముందు ఒక మాట, వెనుక మరొకటి లేని– ‘కటింగ్ ఎడ్జ్’ ధోరణి అంటున్నది దీన్నే. సీఎం ధోరణి, ఎంత సున్నితంగా ఉంది అనేది స్పష్టం అయ్యాక, సీనియర్ అధికారులు ఎవ్వరూ తమ స్థాయిలో– ‘ఛాన్స్’ తీసుకోవడం లేదు. ‘అన్నా’ అంటూనే, పనిలో అలసత్వం కనిపిస్తే మాత్రం మందలించే విషయంలో సీఎం వెనకాడడం లేదు. (క్లిక్: ప్రభుత్వ పనితీరుకు జన నీరాజనం!) కాకినాడ జిల్లాలో ఒక ఎస్సై సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోతే, అదే వారంలో పోలీస్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులకు– ‘స్ట్రెస్ మేనేజ్మెంట్’పై మానసిక నిపుణులచే శిక్షణ తరగతులు ప్రారంభించినట్టు ప్రకటించారు. తిరుపతిలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ ఆపరేటర్ల దందా వార్త వెలువడ్డాక, స్థానిక పోలీసులు అప్రమత్తం అయ్యారు. కుప్పం వద్ద– ఏపీ, కర్ణాటక, తమిళనాడు ‘ట్రై జంక్షన్’ సమీపంలో 20 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, మరణాల సమయంలో అంబులెన్స్ సర్వీసుల ఛార్జీలు అందుబాటులో ఉండేటట్టుగా కుప్పం పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ టి. శ్రీధర్ ఇప్పటికే, అంబులెన్స్ ఆపరేటర్లతో– ‘కౌన్సిలింగ్ సెషన్లు’ నిర్వహిస్తున్నారు. గతంలో ఇటువంటి చొరవ సీఎం లేదా మంత్రుల ప్రకటనలతో ‘మీడియా’లో వార్తలుగా మొదలై, ఆ తర్వాత ఎప్పటికో వాటి ప్రారంభాల ఫొటోలు, వీడియో వార్తల తర్వాత గానీ అవి ఆచరణలోకి వచ్చేవి కావు. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అధికారులే పెళ్లి పెద్దలుగా... సింధు కళ్యాణం
సాక్షి, హైదరాబాద్: యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం అనాథ యువతికి అధికారులు వివాహం జరిపించారు. 28 ఏళ్ల క్రితం కొందరు ఒక శిశువును యూసుఫ్‌గూడ స్టేట్‌హోంలో అప్పగించారు. అధికారులు ఆ పాపను శిశువిహార్‌లో ఉంచి సింధుగా నామకరణం చేసి కొంతకాలం పెంచారు. అనంతరం అదే ప్రాంగణంలో ఉన్న బాలసదన్‌లో ఆశ్రయం పొంది విద్యనభ్యసించింది. ఇంటర్ పూర్తి కాగానే అక్కడ నుంచి బయటకు వచ్చి మోతీనగర్‌లో నివాసం ఉంటూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో సింధు షాబాద్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఉపేందర్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా.. సింధు విషయాన్ని జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావుకు తెలియజేసింది. ఈ మేరకు బుధవారం ఇరువురికి అధికారుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించారు. బాల సదన్‌లో పెరిగి వివాహం చేసుకున్న సరోజ దంపతులు సింధుకు కన్యాదానం చేశారు. ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ శర్మన్‌తో పాటుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, బాలల హక్కుల కమిషనర్ చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. (క్లిక్: పుల్లారెడ్డి స్వీట్స్: పుల్లారెడ్డి కొడుకు, మనవడికి కోర్టు నోటీసులు) -
చెత్తబుట్టలో నోట్ల కట్టలు, నగలు.. అధికారి ఇంట్లో బాగోతం
సాక్షి, బెంగళూరు: అవినీతి అక్రమాలు, ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై బుధవారం ఏసీబీ పంజా విసిరింది. రాష్ట్ర వ్యాప్తంగా 75కు పైగా చోట్ల సోదాలు జరిగాయి. సుమారు 18 మంది అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు చేశారు. కోట్లాది రూపాయల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. బెంగళూరులో ముగ్గురు అధికారుల ఇళ్లపై ఏసీబీ తనిఖీలు జరిపింది. రాయచూరు ఏఈఈ అశోక్ రెడ్డి పాటిల్ ఇంటి చెత్త బుట్టలో రూ. 7 లక్షల నగదు, 600 గ్రాముల వెండి, 418 గ్రాముల బంగారు ఆభరణాలు దొరకడం గమనార్హం. దొంగలు, ఏసీబీ చూపు పడకుండా ఏఈఈ ఇలా చెత్తబుట్టలో దాచుకున్నట్లు తెలిపింది. బాగలకోటె రేంజ్ ఫారెస్ట్ అధికారి ఇంట్లో 3 కేజీల శ్రీగంధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొందరి ఇళ్లలో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు, వెండి పట్టుబడ్డాయి. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. చదవండి: మూడు పాములతో యువకుడి స్టంట్.. చివరకు ఏమైందో చూడండి.. -
ఏపీలో పలు థియేటర్లు సీజ్.. కొనసాగుతున్న తనిఖీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను బుధవారం సీజ్ చేశారు. నూజివీడు, అవనిగడ్డ, గుడివాడలో తనిఖీలు చేపట్టారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ టిక్కెట్ల ధరలు, ఫుడ్ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కృష్ణాజిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేశామని తెలిపారు. లైసెన్సులు రెన్యూవల్ చేయని థియేటర్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. తనిఖీలు రెగ్యులర్‌గా కొనసాగుతాయన్నారు. బెనిఫిట్ షోలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేస్తారన్నారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లలో తిను బండరాలు, పార్కింగ్ విషయంలో దోపిడీ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జాయింట్ కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. -
ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం!
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ అధికారులను బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గియ బెదిరిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. బీజేపీ శుక్రవారం నిర్వహిస్తున ర్యాలీ సందర్భంగా కైలాశ్ అధికారులను ఉద్దేశించి.. ‘మా సంఘ్(ఆరెస్సెస్) నేతలు ఉన్నారు కాబట్టి ఊరుకున్నాం. లేదంటే ఈ రోజు ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం’ అని బెదిరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. సంస్థ అంతర్గత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఇతర నేతలు ఇండోర్‌కు వచ్చారు. పార్టీ కార్యకర్తలపై అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి సీనియర్ ప్రభుత్వ అధికారులను ఆహ్వానిస్తే.. జూనియర్ అధికారు లు రావడంపై కైలాశ్ ఆగ్రహం చెందారు. -
పోంజి స్కామ్.. కర్ణాటకలో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లోని పలువు రు సీనియర్ అధికారుల నివాసాలు, కార్యాల యాలపై సీబీఐ శుక్రవారం దాడులు నిర్వహించింది. ఐఎమ్ఏ (ఐ–మానిటరీ అడ్వైజరీ) పోంజి స్కామ్‌తో సంబంధం ఉన్న అధికారుల ఇళ్లపై సోదాలు జరిపింది. బెంగళూరులోని 11 ప్రాంతాలు, మాండ్య, రామనగరా, బెల్గాంలలో ఒక్కో ప్రాంతంతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సోదాలు నిర్వహించింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్లో ఎకనామిక్స్ అఫెన్సెస్ విభాగం ఐజీ హేమంత్ నింబాల్కర్, డీఎస్పీ ఈబీ శ్రీధర, ఈస్ట్ బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ హిలోరీ సహా పలువురు అధికారుల నివాసాలపై సీబీఐ శుక్రవారం సోదాలు జరిపింది. -
బంగారం వెల్లడికి ఎటువంటి పథకం లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వం బంగారానికి సంబంధించి ఎటువంటి క్షమాభిక్ష పథకాన్ని పరిశీలించడం లేదని కేంద్ర అధికార వర్గాలు స్పష్టం చేశాయి. లెక్కలు చూపని బంగారాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఓ స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని త్వరలో కేంద్రం తీసుకురానుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఈ తరహా పథకం ఆదాయపన్ను శాఖ పరిశీలనలో లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్ ప్రక్రియ ఆరంభమైందని, ఈ ప్రక్రియకు ముందు ఈ తరహా వదంతులు రావడం సహజమేనని పేర్కొన్నాయి. ఓ పరిమితికి మించి లెక్కలు చూపని బంగారం కలిగి ఉన్న వారు స్వచ్ఛందంగా వెల్లడించి ప్రభుత్వం నిర్దేశించిన పన్ను చెల్లించేలా ఒక పథకం ప్రవేశపెట్టనున్నారని మీడియాలో కథనాలు రావడం గమనార్హం. -
వైఎస్ జగన్‌కు అభినందనల వెల్లువ
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండో రోజు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులతో నిండిపోయింది. ఉదయం నుంచీ రోజంతా జగన్ సందర్శకులను కలుసుకుంటూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు జగన్‌ను కలవడానికి క్యూ కట్టారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని, తమను తాము పరిచయం చేసుకుని అభినందనలు తెలియజేశారు. జగన్ వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పాలనాపరమైన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్‌ను కలిసిన ఐఏఎస్‌లలో సతీష్‌చంద్ర, కరికాళ వలవన్, ఎంటీ కృష్ణబాబు, ఆదిత్యనాథ్ దాస్, ధనుంజయ్‌రెడ్డి, పీవీ రమేష్‌కుమార్, కె.సునీత, మన్మోహన్సింగ్, జేఎస్వీ ప్రసాద్, లక్ష్మీపార్థసారథి, ఎస్ఎస్ రావత్, అహ్మద్ బాబు, సాయిప్రసాద్, సీహెచ్ శ్రీధర్, విజయానంద్, అజయ్ జైన్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఇతర అధికారులున్నారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రబాబు, ఐపీఎస్‌లలో గౌతమ్ సవాంగ్, అనూరాధ, బాలసుబ్రహ్మణ్యం, మీనా, విజయవాడ నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావుతో పాటుగా పలువురు అధికారులు జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. జగన్‌తో కొడాలి నాని, దాడిశెట్టి రాజా, బాలశౌరి, బొత్స సత్యనారాయణ భేటీ కిటకిటలాడిన రహదారులు ఎన్నికల్లో గెలుపొందిన పలువురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు కూడా జగన్‌ను కలుసుకున్నారు. ఎంపీలుగా గెలుపొందిన కనుమూరు రఘురామకృష్ణం రాజు, మార్గాని భరత్, మిథున్‌రెడ్డి, నందిగం సురేష్, వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసులు, మహ్మద్ ముస్తాఫా, కె.పార్థసారథి, అంబటి రాంబాబు, ఉండవల్లి శ్రీదేవి, మేరుగ నాగార్జున, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, సామినేని ఉదయభాను, తెల్లం బాలరాజు, ఎం.ప్రసాదరాజు, విజయవాడలో ఓటమి పాలైన పొట్లూరి వీరప్రసాద్, పార్టీ నేతలు ఇక్బాల్ అహ్మద్, బీసీ గరటయ్యతో పాటుగా పెద్ద సంఖ్యలో నేతలు వచ్చారు. తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద రహదారులన్నీ వాహనాల రాకపోకలతో కిటకిటలాడాయి. జగన్‌ను కలిసిన పీసీసీఎఫ్ మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ ప్రధాన అటవీ సంరక్షణాధికారి(పీసీసీఎఫ్), రాష్ట్ర అటవీ దళాల అధిపతి మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ శుక్రవారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మర్యాదపూర్వకంగా జగన్మోహన్రెడ్డిని కలిశారు. వైఎస్ జగన్‌తో సమావేశమైన కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు జగన్ నివాసం వద్ద విజయోత్సవాలు వైఎస్సార్సీపీ ఎంపీగా విజయం సాధించిన నందిగం సురేష్ 302 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్ద మీడియా పాయింట్లో కార్యకర్తలతో కలిసి విజయోత్సాలు నిర్వహించారు. వైఎస్ జగన్‌తోనే సువర్ణ పాలన సాధ్యమని ప్రజలు నమ్మారని, అందుకే ఓట్ల వర్షం కురిపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
పడవ బోల్తా: అధికారులు సేఫ్, ఒకరు మృతి
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ పడవ ప్రమాదానికి గురయింది. ముంబై నారీమన్ పాయింట్ నుంచి 2.6 కిలోమీటర్ల దూరంలో శివాజీ స్మారక్ వద్ద సముద్రంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పడవలో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ జైన్‌తోపాటు ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారన్న సమాచారం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు చనియారు. మిగిలిన వారిని రక్షించామనీ కోస్ట్ గార్డ్ పీఆర్వో వెల్లడించారు. పడవలో మొత్తం 25 మంది ఉన్నారని పోలీసులు ధృవీకరించారు. అయితే చనిపోయిన వారి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. శివాజీ స్మారక నిర్మాణ పనులను పరిశీలించేందుకు రెండు స్పీడ్ బోట్లలో వెళ్తుండగా సీఎస్, ఎమ్మెల్సీ ఉన్న బోటు ప్రమాదానికి గురైంది. మరో బోటులో 40 మంది పాత్రికేయులు ఉన్నారు. శివాజీ స్మారకానికి 2.6 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాళ్లను పడవ ఢీకొట్టడంతో బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం కారణంగా శివాజీ స్మారకం పనులను నిలిపివేశారు. #UPDATE: Police confirmed that there were 25 people on board the capsized boat. 24 were evacuated safely earlier; one body recovered by State Control Room: Indian Coast Guard PRO — ANI (@ANI) October 24, 2018 -
బాబు తీరుతో అధికారుల ఉక్కిరి బిక్కిరి
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల వరుసగా ధర్మ పోరాట దీక్ష, ఆడపిల్లకు అండగా నిలుద్దాం, వక్ఫ్ బోర్డు కార్యాలయం శంకుస్థాపన, మహానాడు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మూడురోజుల పాటు జరిగిన మహానాడు ముగిసిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో శనివారం విజయవాడలో నవ నిర్మాణదీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రే స్వయంగా హాజరవుతుండటంతో తగిన ఏర్పాట్లు చేయడం, జనాన్ని తరలించలేక అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేకపోవటంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకపక్కన ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జిల్లా కలెక్టర్ సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఉదయం 10 దాటిన తర్వాత బయటకు వెళ్లవద్దని ఆదేశించారు. ఈ సమయంలో బందరు రోడ్డులో ఆరుబయట నవ నిర్మాణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించటంపై నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బందరు రోడ్డులో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్‌ను నిలిపివేయటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు. ఎండల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూర్చునే వేదిక వద్ద మాత్రం ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. సమావేశానికి వచ్చే అధికారులు, దీక్షకు తరలించే ప్రజలు, స్కూల్ వివిద్యార్థులు మాత్రం ఎండలో మాడిపోక తప్పదనే విమర్శలు విన్పిస్తున్నాయి. నవ నిర్మాణ దీక్షకు జనాన్ని తరలించటంపై అధికారులకు ఇప్పటికే టార్గెట్లు విధించారు. జిల్లాల్లో కూడా వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు, పింఛనుదారులను తరలించి రుణాలు, పట్టాదారు పాసు పుస్తకాల మంజూరు లాంటివి ఈ సందర్భంగా నిర్వహించాలని పేర్కొంది. నేడు వాహనాల మళ్లింపు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జూన్ 2వతేదీన æసనిర్వహిస్తున్న నవనిర్మాణదీక్ష సందర్భంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామని చెప్పారు. భారీ వాహనాలు, లారీల మళ్లింపు ఇలా... విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను దేవరపల్లి–తల్లాడ–ఖమ్మం–సూర్యాపేట మీదుగా మళ్లించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నంకు వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం–మైలవరం–నూజివీడు–హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నంకు మళ్లించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్‌జంక్షన్ నుంచిగుడివాడ– పామర్రు–చల్లపల్లి–అవనిగడ్డ–బాపట్ల–ఒంగోలు మీదుగా చెన్నైకు మళ్లిస్తారు. చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖకు వెళ్లే వాహనాలను ఒంగోలు–బాపట్ల–అవనిగడ్డ–చల్లపల్లి–పామర్రు–గుడివాడ–హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖకు మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి–నల్గొండ, మిర్యాలగూడ–పిడుగురాళ్ల–అద్దంకి–మేదరమెట్ల ఒంగోలు మీదుగా చెన్నైకు మళ్లిస్తారు. చెన్నై నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను ఒంగోలు–మేదరమెట్ల–పిడుగురాళ్ల–మిర్యాలగూడ–నల్గొండ–నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి–మిర్యాలగూడ–పిడుగురాళ్ల–సత్తెనపల్లి మీదుగా గుంటూరుకు మళ్లిస్తారు. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను గుంటూరు–పిడుగురాళ్ల–మిర్యాలగూడ–నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తారు. మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను మచిలీపట్నం–పామర్రు–హనుమాన్‌జంక్షన్ నుంచి మైలవరం–ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వెళ్లే వాహనాలను హైదరాబాద్–ఇబ్రహీంపట్నం–మైలవరం–నూజివీడు–హనుమాన్‌జంక్షన్–మచిలీపట్నం మీదుగా మళ్లిస్తారు. -
తిన్నోళ్లకు..తిన్నంత...!
-
వరదల్లో 55 మంది మృతి
కొలంబో: శ్రీలంకలో భారీ వర్షాలు, వరదల కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది జాడ తెలియకుండా పోయారు. సబరగమువతోపాటు పశ్చిమ, దక్షిణ ప్రావిన్సుల్లో గురువారం నుంచి కురుస్తున్న వర్షాలకు 2,811 కుటుంబాలు సర్వస్వం కోల్పోయారని ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. ఒక్క కలుతర జిల్లాలోనే 38 మంది, రత్నపుర జిల్లాలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. గాలే జిల్లాలో అత్యధికంగా ఏడు వేల మందికిపై నిరాశ్రయులయ్యారని వివరించింది. వరద ఉధృతి పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో కేగల్లె, గాలే, కలుతర, మాతర, హంబన్‌తోట ప్రాంతాల్లో కొండచెరియలు విరిగి పడే ప్రమాదముందని తెలిపింది. ఈ దృష్ట్యా అధికారులను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. -
గాలేరు–నగరి..నిర్లక్ష్యంతో సరి
► బడ్జెట్ కాగితాల్లోనే కనిపిస్తున్న నిధులు ► ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ముందుకు సాగని పనులు ► అధికారులే కారణమంటున్న పాలకులు ► ఎప్పుటికి పూర్తవుతుందో? పాలకులు మారుతున్నారు.. అధికారులు మారిపోతున్నారు.. ఏళ్లు గడిచిపోతున్నాయి.. కృష్ణా జలాలు నగరికి చేరనే లేదు.. రైతుల జీవితాల్లో మార్పు కొంచెమైనా లేదు. అవే అవస్థలు.. కన్నీటి తడులు.. ఎడారిని తలపించే పొలాలు.. ఆశల మోములు.. ఆవేదన సుడిగుండాలు.. అవస్థల బతుకులు.. ఇదీ జిల్లా రైతుల దీన పరిస్థితి. ప్రభుత్వం అధికారుల అలసత్వం వల్ల పనులు ఆలస్యమవు తున్నాయంటోంది. నిధులు విడుదల చేయకుండా పనులు ఎలా చేయాలని అధికారులు తలపట్టుకుంటు న్నారు. ఇదీ పాలకుల తీరు. నగరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణం గాలేరు–నగరికి శాపంగా మారింది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రాజెక్టును ప్రారంభించారు. 2009 వరకు పనుల్లో వేగం పుంజుకుంది. తర్వాత ఆయన మరణించారు. ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. కాలువల ఏర్పాటుకు భూములు స్వాధీనం చేసుకున్న పనులే అడపాదడపా చేస్తున్నారు. కాగితాల్లోనే నిధులు 2015–16 వరకు 4,789.96 కోట్లు వెచ్చించారు. 2016–17 బడ్జెట్లో 358.12 కోట్లు, 2017–18లో 363.12 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. జూలై 2017 నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఇదివరలో చెప్పుకొచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం మాటమార్చింది. ఆడలేనమ్మ మద్దెలపై పడ్డట్టుంది జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రకటించారు. ఆపై మాట మార్చేశారు. అధికారుల అలసత్వం వల్లే పనులు మందకొడిగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. నిధులు విడుదల చేయకుండా తాము ఏపనులు చేస్తామంటూ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఓవైపు కాంట్రాక్టర్లు తెలుపుతున్నారు. ఇంకా ఎర్త్ వర్క్, రివిట్మెంట్, కాలువల పనులు చేయాల్సి ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ప్రాంతంలో ముళ్లకంపలు పేరుకుపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో పగుళ్లు వదలి ఉండటంతో ఇదివరలో చేపట్టిన పనులు కొంతమేరకు మళ్లీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనే అంశంలో స్పష్టత రాలేదు. ఏదో ఒకటి చెబుతూ ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో తమను మభ్యపెడుతోందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే.. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని 1.03 లక్షల ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని 1.55 లక్షల ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 0.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుంటుంది. 3.03 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్పి అవుతాయి. 20 లక్షల మందికి తాగునీరు అందించవచ్చు. -
అక్రమ కోటీశ్వరులు
► నలుగురు ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు ► భారీఎత్తున స్థిరాస్తులు, నగదు, బంగారం బట్టబయలు ► కొనసాగుతున్న సోదాలు సాక్షి, బెంగళూరు: తమకున్న అధికారంతో ప్రజాసేవ చేయాల్సిన అధికారులు అయినకాడికి దండుకోవడంలో మునిగితేలారు. అక్రమ మార్గంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై నలుగురు ప్రభుత్వ అధికారులపై అవినీతి నిరోధక దళం (యాంటీ కరప్షన్ బ్యూరో) పంజా విసిరింది. నిందితుల్లో ముగ్గురు బెంగళూరులోనివారే. వీరి వద్ద వందల కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులను గుర్తించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే తూర్పు వలయం జాయింట్ కమిషనర్ డాక్టర్ యతీష్‌కుమార్, రామనగర తహశీల్దార్ ఎన్.రఘుపతి, కేపీటీసీఎల్ డైరెక్టర్ హెచ్.నాగేశ్, సాంకేతిక విద్యా డైరెక్టరేట్‌లో సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డిలకు చెందిన కార్యాలయాలు, ఇళ్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లు తదితర చోట్ల జరిగిన సోదాల్లో వందల కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. బుధవారం ఉదయం నుంచి పొద్దుపోయేంతవరకూ సోదాలు కొనసాగాయి. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో బయటపడిన సొత్తు వివరాలు ఎన్.రఘుపతి (తహశీల్దార్) – బెంగళూరులో సుమారు 2.5 కోట్ల విలువైన భవనం. 185 గ్రాముల బంగారు, 4 కిలోల వెండి, 36 లక్షల గృహోపయోగ వస్తువులు భార్య, కుమారులు, తల్లి తండ్రి పేర్ల పై ఉన్న బ్యాంకు ఖాతాల్లో రూ.2.17 కోట్ల నగదు. కారు, ద్విచక్ర వాహనాలు. హెచ్. నగేష్ (కేపీటీసీఎల్ డైరెక్టర్ ) – 2.4 కిలోల బంగారు. 95 లోల విలువ చేసే వజ్రాభరణాలు, 17.8 కిలోల వెండి, రూ.3 లక్షల విలువ చేసే 33.28 లీటర్ల విదేశీ మద్యం, 1559 యూ.ఎస్ డాలర్లు, 15 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, రూ.20 లక్షల విలువ చేసే 60 చేతిగడియారాలు. రద్దైన రూ.1000 నోట్లు (మొత్తం విలువ రూ.45వేలు) రాష్ట్రంలో వివిధ చోట్ల దాదాపు నాలుగుకోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో 11 ఖాతాలు ఉన్నాయి. యతీష్‌కుమార్ (పాలికే తూర్పు వలయం జాయింట్ కమిషనర్): రూ.1.25 కోట్ల విలువైన భవనం. 1.07 కిలోల బంగారు ఆభరణాలు, 1.6 కిలోల వెండి, రూ.4.16 లక్షల నగదు.ఇవి కాక రాష్ట్రంలో వివిధ చోట్ల తన, తన బంధువుల పేర్లతో దాదాపు రూ.3 కోట్ల విలువైన భవంతులు ఉన్నాయి. రామకృష్ణారెడ్డి (సాంకేతిక విద్యాశాఖ): దాదాపు రూ.1.50 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు, ఐదు హై ఎండెడ్ కార్లు ఉండగా ఒక కారులో రూ.20 లక్షల నగదు లభించింది. -
అక్రమంగా దోచేస్తున్నారు!
► లేఅవుట్‌కు ఏలాంటి అనుమతులు లేకుండానే అమ్మకాలు ► పాలకులతో కలిసి అధికారుల చేతివాటం? 15ఏటీపీసీ01ఏ– రాచానపల్లి వద్ద అనుమతి లేకుండా వెలసిన వెంచర్ 15ఏటీపీసీ01బీ– ఏలాంటి పంచాయతీ అనుమతి లేకుండానే రాచానపల్లి గ్రామం వద్ద ప్లాట్లు అమ్మకానికి కలవు అని బోర్డు పెట్టిన దృశ్యం అనంతపురం రూరల్: అనంతపురంలో అక్రమ లేఅవుట్ల అడ్డులేకుండా పోతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ పక్క చిత్రంలో కనిపిస్తున్న లేఅవుట్ అనంతపురం రూరల్ మండల పరిధి రాచానపల్లి పొలంలో బళ్లారి ప్రధాన రహదారి పక్కనే వున్న సర్వే నెంబర్ 5లో వెలిసింది. ఈ లేఅవుట్‌కు ఏలాంటి పంచాయతీ అనుమతి లేదు. అయితే ఏం? యాథేచ్చగా స్థలానికి పేరు పెట్టేసి స్థలాన్ని అమ్మకానికి శ్రీకారం చుట్టారు. దీనిపై రాచానపల్లి పంచాయతీ కార్యదర్శి నాగక్రిష్ణయ్య వివరణ కోరగా ‘ల్యాండ్ స్కేప్ లేఅవట్’కు పంచాయతీ నుంచి ఏలాంటి అనుమతి తీసుకోలేదు.. క్రయ విక్రయాలు జరపకుండా నోటీసు బోర్డును వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. పాలకులతో కలిసి అధికారుల చేతివాటం?: పంచాయతీ అనుమతి ఖచ్చితంగా తీసుకుంటే లేఅవుట్ మొత్తం స్థలంలో 10శాతం స్థలాన్ని పంచాయతీ పేరిట ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించడంతోపాటు 10శాతం స్థలాన్ని ప్రజాప్రయోజనాల దృష్ట్య ప్రజల అవసరాల కోసం ఖాళీ స్థలాన్ని వదిలేయాల్సి ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని కొందరు పంచాయతీ అధికారులు స్థానిక సర్పంచ్‌లతో కలిసి లేఅవుట్ల యజమానుల నుంచి బహిరంగంగా అందిన కాటికి దోచుకుంటున్నట్లు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే బాగుందంటూ లేఅవుట్ యజమానులు సైతం వారి బాటలోనే పయనిస్తూ... పంచాయతీ అనుమతి ఉందంటూ బోర్డులను సైతం ఏర్పాటు చేసుకొని స్థలాలను అమ్మేసుకుంటూ సోమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి లేఅవుట్ల అనంతపురం రూరల్ మండల వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. పట్టించుకోని అధికారులు: అనంతపురం రూరల్ మండల వ్యాప్తంగా గతంలో 42లేఅవుట్లు అక్రమ లేవుట్లు ఉన్నట్లు ఉన్నతాధికారులు లెక్కలు తేల్చారు. వాటిలో నోటీసు బోర్డులను ఏర్పాటు చేసి పంచాయతీకి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టే పనులను చేయాలని స్పష్టమైన ఆదేశాలను సైతం జారీ చేశారు. అయితే గతంలో లేఅవుట్ల యజమానులతో అధికారులు లాలూచి పడడంతో తూతూ మంత్రంగా వారికి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. తప్ప పంచాయతీ అదాయం రాబట్టడంతో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో లేఅవుట్ల యజమానులు యధేచ్చగా స్థలాలను అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటు వెళ్లిపోతున్నారు. పంచాయతీ అనుమతి ఉందని గుడ్డిగా నమ్మి స్థలాలను కొనుగోలు చేసిన కొనుగోలు దారులు అనుమతి కోసం పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి స్థలం విలువలో 14శాతం అదనంగా చెల్లించి అనుమతి తీసుకుంటూ పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. అక్రమ లేఅవుట్లలో నోటీసులు బోర్డులను ఏర్పాటు చేసి అనుమతి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని ఈఓఆర్డీ లక్ష్మినరసింహా అన్నారు. -
జాతి విద్రోహ చర్య: డజను మంది అధికారులపై వేటు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో కొనసాగుతున్న ఆందోళనలకు మరింత ఆజ్యం పోస్తూ జాతివిద్రోహ చర్యలకు పాల్పడుతున్న 12మంది అధికారులపై మెహబూబా ముఫ్తి ప్రభుత్వం వేటు వేసింది. కశ్మీర్లో అశాంతి రేపుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపిన ప్రభుత్వ సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది. విద్య, నీటిపారుదల, రెవెన్యూ, ఆహార, అటవీశాఖలకు చెందిన 12మంది అధికారులపై వేటు పడింది. కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా లోయలో అశాంతిని ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఎన్కౌంటర్ అనతరం కశ్మీర్ లోయలో తలెత్తిన హింసాత్మక ఆందోళనలు ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 100 రోజులైనా కశ్మీర్లో ఇంకా పూర్థిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. పాకిస్థాన్ ప్రభుత్వం, పాక్ ఉగ్రవాదులు అందించిన సహకారంతోనే కశ్మీర్లో అశాంతి, ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కశ్మీర్ అశాంతికి పరోక్ష సహకారం అందిస్తూ ఆందోళనలకు మద్దతుగా నిలిచిన ప్రభుత్వ అధికారులపై మెహబూబా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. -
సంగతి చూస్తాం!
అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరిట ప్రభుత్వం హడావుడి ...! స్టాల్స్ పెడతారా...లేదా అని హెచ్చరికలు విముఖత చూపుతున్న వ్యాపార ఏజెన్సీలు ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందంటే ఇదేనేమో!...అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరిట ప్రభుత్వ ప్రచార ఆర్భాటం వ్యాపారులకు సంకట ప్రాయంగా మారింది. వ్యాపారాలు లేక అల్లాడుతుంటే ప్రభుత్వ ప్రచారం కోసం తాము స్టాల్స్ ఏర్పాటు చేయలేమని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం తనదైన శైలిలో కొరడా ఝుళిపిస్తోంది. ‘స్టాల్స్ ఏర్పాటు చేయకపోతే మీ వ్యాపారాల సంగతి తేలుస్తాం’ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ, గుంటూరులలో వ్యాపార ఏజెన్సీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న షాపింగ్ ఫెస్టివల్ మాయాజాలం ఇది.. రెండేళ్లుగా వ్యాపారం డల్‌గా ఉందని వాపోతున్న వ్యాపారులు దసరా నుంచి సంక్రాంతి సీజన్ వరకు కొంతవరకైనా పెరగకపోతుందా అని ఆశిస్తున్నారు. ఇంతలో ప్రభుత్వం ఏకపక్షంగా అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. ఇందులో అన్ని వ్యాపార సంస్థలు తప్పనిసరిగా తమ స్టాల్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రధానంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్- గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్ సంస్థలపై దృష్టి సారించింది. ఆ సంస్థల స్టాల్స్ 100కుపైగా ఉండాలని నిర్దేశించింది. వాటిని సందర్శించేందుకే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఒక్కో స్టాల్‌కు రూ.40వేల చొప్పున డీడీ చెల్లించి మరీ ఏర్పాటు చేయాలని చెప్పింది. దాంతోపాటు ఇతర నిర్వహణ ఖర్చులు ఉండనే ఉంటాయి. కానీ ఆ ఫెస్టివల్లో ప్రభుత్వ షో తప్ప అసలు వ్యాపారం ఉండదని ఏజెన్సీలు గ్రహించి ఆసక్తి చూపించలేదు. పీక్ సీజన్లో తమ షోరూంలలో వ్యాపారాలపై దృష్టి పెట్టాలిగానీ షాపింగ్ ఫెస్టివల్లో స్టాల్స్ పెట్టలేమని భావించారు. స్టాల్స్ పెడితే సిబ్బందిని అక్కడ వినియోగించాల్సి వస్తుందని... దీంతో తమ షోరూంలలో వ్యాపారం దెబ్బతింటుందన్నది వారి ఆందోళన. రియల్ ఎస్టేట్ సంస్థలు రాష్ట్ర విభజన తరువాత కూడా ఆశించినంత బూమ్ లేదని నిరాశతో ఉన్నాయి. ఇటీవల విజయవాడ శివారు ప్రాంతాల్లో నిర్మాణాలను కేవలం రాజకీయ కారణాలతో కూల్చివేస్తుండడం కూడా వారిని ఆవేదనకు గురి చేస్తోంది. దాంతో షాపింగ్ ఫెస్టివల్ ప్రకటించి 15రోజులు అవుతున్నా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ -గృహోపకరణాల ఏజన్సీలు సానుకూలంగా స్పందించలేదు. షాపింగ్ ఫెస్టివల్‌ను గురువారం ప్రారంభించాల్సి ఉందని తెలిసినా బుధవారం రాత్రి వరకు ఏ ఏజెన్సీలు స్టాల్స్ ఏర్పాటుకు సుముఖత చూపించలేదు. ‘స్టాల్స్ పెట్టకపోతే మీ సంగతి చూస్తాం’ నిర్దేశించిన మేరకు స్టాల్స్ లేకపోతే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తారని అధికారులు ఆందోళన చెందారు. జిల్లా ఉన్నతాధికారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో బుధవారం రాత్రి మాట్లాడి ఎలాగైనా సరే స్టాల్స్ ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. అందుకు సామ దాన దందోపాయాలు ప్రయోగించాలని కూడా స్పష్టం చేశారు. రవాణా శాఖ అధికారి ఒకరు ఆటోమొబైల్ డీలర్లతో మాట్లాడి ఒక్కొక్కరు రెండేసి స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. లేకపోతే షోరూంలలో విక్రయించే వాహనాలకు కల్పిస్తున్న టెంపరరీ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో డీలర్లు బెంబేలెత్తారు. అయిష్టంగానే ఒక్కొక్క స్టాల్ ఏర్పాటుకు సమ్మతించాల్సి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ - గృహోపకరణాల ఏజెన్సీలను కూడా సేల్స్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ‘తమదైన శైలి’లో హెచ్చరించారు. ఇక స్టాల్స్ ఏర్పాటు చేయని రియల్ ఎస్టేట్ సంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టి ఇకముందు లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమని కూడా రెవెన్యూ, సీఆర్డీఏ అధికారులు తేల్చిచెప్పారు. ఈ పరిణామాలతో వ్యాపార వర్గాలు బెంబేలెత్తాయి. అమరావతి షాపింగ్ ఫెస్టివల్లో స్టాల్స్ ఏర్పాటుకు సమ్మతించాల్సి వచ్చింది. అదండీ సంగతి... రాజు తలచుకుంటే అన్న రీతిలో వ్యాపారుల మెడలు వచ్చి మరీ ఒప్పించారు. -
ఇక భూ వివాదాలపై దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: భూవివాదాలపై జిల్లా అధికారయంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కోర్టుల్లో ఏళ్లతరబడి భూవివాదాలు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజాప్రయోజనాలకు ఉపయోగించటానికి వీలులేని పరిస్థితి నెలకొంది. కోర్టు కేసుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ భూముల వివాదాలను పరిష్కరించటానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సిటీ సివిల్ కోర్టు జీపీలు, ఏజీపీలు, సీనియర్ న్యాయవాదులు, ప్రభుత్వ లాయర్లు, రెవెన్యూ యంత్రాంగంతో తరచుగా కలెక్టర్ చర్చిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ పదిహేను రోజులకోకసారి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇప్పటికి కొన్ని భూవివాద కోర్టు కేసులు పరిష్కారానికి నోచుకోగా, మిగతా వాటిపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. అత్యధికంగా షేక్‌పేట్‌లో హైదరాబాద్ జిల్లాలో మొత్తంగా 831.62 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన వివాదాలు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భూముల విలువ రూ. 9489.16 కోట్లు ఉంటుందని అధికారయంత్రాంగం అంచనా వేస్తున్నది. నగరంలో సంపన్న వర్గాలు నివసించే షేక్‌పేట్ మండలంలో రూ.2078 కోట్ల విలువ చేసే 107 ఎకరాల భూమి కోర్టు కేసుల్లో ఉండగా, మారేడుపల్లి మండలంలో రూ. 4,206 కోట్ల విలువ చేసే 257 ఎకరాల భూములున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఆసీఫ్‌నగర్ మండలంలో రూ.850 కోట్లు విలువ చేసే 172 ఎకరాలు, ముషీరాబాద్ మండలంలో రూ. 861 కోట్లు విలువ చేసే 26 ఎకరాలు, బండ్లగూడ మండలంలో రూ. 311 కోట్లు విలువ చేసే 145 ఎకరాలు, తిరుమలగిరి మండలంలో రూ. 340 కోట్లు విలువ చేసే 66 ఎకరాలు, సికింద్రాబాద్‌లో రూ.100 కోట్లు విలువ చేసే 19 ఎకరాల భూమి కోర్టు కేసుల్లో ఉన్నాయి. జిల్లాలోని 831 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన కోర్టు కేసులు 81కి పైగా ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టులో నాలుగు కేసులు కూడా ఉన్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
బ్లడీఫెలోస్..
గిరిజన సంక్షేమ శాఖాధికారులపై మంత్రి రావెల ఆగ్రహం గుంటూరులో 13 జిల్లాల అధికారులతో సమీక్ష గుంటూరు వెస్ట్ : ‘రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖలో పరిస్థితులు అధ్వానంగా ఉంటున్నాయి. అధికారులు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. మీపైన మంత్రి, మేనేజింగ్ డెరైక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అంటూ అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ వారిచ్చే నిబంధనలను పాటించడం లేదు ’ అంటూ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరేమైనా లార్డ్స్... లేక కింగ్స్ అనుకుంటున్నారాఅంటూ మండిపడ్డారు. విశాఖ జిల్లా పాడేరు డివిజన్ గిరిజన శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మోహన్‌రావు పనితీరుపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉన్నతాధికారులు ఇచ్చే సూచనలు పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఆయనపై బ్లడీఫెలోస్.. అంటూ విరుచుకుపడ్డారు. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో సోమవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13 జిల్లాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులు తాము చేపట్టిన పనులను వివరించారు. శ్రీశైలం ఐటీడీఏ అధికారి వెంకటేశ్వర్లు చెంచుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తుండగా మంత్రి జోక్యం చేసుకుని చెంచుల్లో అక్షరాస్యత శాతం పెంచాలని, నిరుద్యోగ యువత వివరాలు సేకరించాలని సూచించారు. నిరుద్యోగులకు అవసరమైన స్కిల్ డెవెలప్మెంట్లో శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటీడీఏ పరిధిలోని ప్రాజెక్టు డెరైక్టర్లు యాక్షన్‌ప్లాన్ తయారుచేసుకుని, వాటిని అమలుచేయాలని సూచించారు. రూ.1900 కోట్లతో గిరిజనుల అభ్యున్నతి అనంతరం మంత్రి రావెల విలేకరులతో మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఉప ప్రణాళిక కింద రాష్ట్రంలో షెడ్యూల్డు తెగల అభ్యున్నతికి, సంక్షేమానికి రూ.1900 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేంచిన లక్ష్యాల సాధనకు గిరిజన సంక్షేమాధికారులు కృషి చేయాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నామని వెల్లడించారు. గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ (జీసీసీ) టర్నోవర్‌ను రూ.1000 కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించిందని, ఈ నిధులతో గిరిజన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాసాగర్, రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఎం.పద్మ, అదనపు సంచాలకుడు వీసీహెచ్ వీరభద్రుడు, గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ఎ.రవిప్రకాష్, 13 జిల్లాలకు చెందిన డీటీడబ్ల్యూవోలు, ఐటీడీఏ ప్రాజెక్టు డెరైక్టర్లు, గిరిజన శాఖ ఇంజినీర్లు, అసిస్టెంట్ డెరైక్టర్లు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీపీ చెరలోని అసైన్ భూమి స్వాధీనం !
గుంటూరు : అసైన్డ్ భూములను ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న బడా బాబుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా నగరం మండలం ఊరమాదిగపల్లి గ్రామంలో 23 ఎకరాల అసైండ్ భూమిని మాజీ ఎంపీపీ చందోలు దేవదాసు చాలా ఏళ్గుగా సాగు చేసుకుంటున్నారు. దీనిపై సాక్షి దిన పత్రిక వరుసగా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దాంతో ఉన్నతాధికారులు స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఈ భూమిని స్వాధీనం చేసుకోనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
పక్షపాత వైఖరి విడనాడాలి : కళావతి
వీరఘట్టం (వండువ) : అర్హులైన ప్రతి ఒక్కరికీ బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం చెబుతుంటే అందుకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి మండిపడ్డారు. సోమవారం స్వగ్రామం వండువలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వారు సూచించిన వారికే రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తుండడం సిగ్గు చేటన్నారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారంటూ రుణాలకు దరఖాస్తు చేసుకున్న కొంతమంది దరఖాస్తులను బుట్టదాఖలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించి అర్హులైన వారికి బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలను అందజేయాలని ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాసే అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. -
అధికారులపై చంద్రబాబు అసంతృప్తి
విశాఖపట్నం: హుదూద్ తుపాన్ సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ అధికారులపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్బంగా వివిధ శాఖల ఉన్నతాధికారుల పనితీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. నగర వాసులు నాలుగు రోజులుగా త్రాగు నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వియషం తెలిసిందే. అయితే ప్రజలకు తాగునీరు ఎందుకు సరఫరా చేయలేదంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రజలకు బియ్యం పంపిణీ కూడా సజావుగా సాగడం లేదని... అందుకు సంబంధించిన చర్యలు ఎంతవరకు వచ్చాయని సదరు శాఖ ఉన్నతాధికారులను బాబు ప్రశ్నించారు. అదికాక 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం వాసులకు సరఫరా చేయాల్సి ఉండగా పక్క జల్లాల నుంచి ఇంకా నగరానికి బియ్యం ఎందుకు చేరుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కరెంట్ లేక ప్రజలు గత మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు... సాధ్యమైనంత త్వరగా విద్యుత్ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. తుపాన్ బీభత్సానికి చెట్లు విరిగిపోయాయి, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ పడి పోయాయి... వాటిని ఎంతవరకు తొలిగించారని అధికారులను చంద్రాబాబు ప్రశ్నించారు. దీనిపై అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు.