గుంటూరు : అసైన్డ్ భూములను ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న బడా బాబుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా నగరం మండలం ఊరమాదిగపల్లి గ్రామంలో 23 ఎకరాల అసైండ్ భూమిని మాజీ ఎంపీపీ చందోలు దేవదాసు చాలా ఏళ్గుగా సాగు చేసుకుంటున్నారు.
దీనిపై సాక్షి దిన పత్రిక వరుసగా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దాంతో ఉన్నతాధికారులు స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఈ భూమిని స్వాధీనం చేసుకోనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.