DA Case: ACB Raids 18 Government Officials Across Karnataka Details Inside - Sakshi
Sakshi News home page

Karnataka: చెత్తబుట్టలో నోట్ల కట్టలు, నగలు.. అధికారి ఇంట్లో బాగోతం  

Published Thu, Mar 17 2022 2:03 PM | Last Updated on Thu, Mar 17 2022 3:27 PM

ACB Raids 18 Government Officials Across Karnataka In DA Case - Sakshi

సాక్షి, బెంగళూరు: అవినీతి అక్రమాలు, ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై బుధవారం ఏసీబీ పంజా విసిరింది. రాష్ట్ర వ్యాప్తంగా 75కు పైగా చోట్ల సోదాలు జరిగాయి. సుమారు 18 మంది అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు చేశారు. కోట్లాది రూపాయల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. 

బెంగళూరులో ముగ్గురు అధికారుల ఇళ్లపై ఏసీబీ తనిఖీలు జరిపింది.  రాయచూరు ఏఈఈ అశోక్‌ రెడ్డి పాటిల్‌ ఇంటి చెత్త బుట్టలో రూ. 7 లక్షల నగదు, 600 గ్రాముల వెండి, 418 గ్రాముల బంగారు ఆభరణాలు దొరకడం గమనార్హం. దొంగలు, ఏసీబీ చూపు పడకుండా ఏఈఈ ఇలా చెత్తబుట్టలో దాచుకున్నట్లు తెలిపింది. బాగలకోటె రేంజ్‌ ఫారెస్ట్‌ అధికారి ఇంట్లో 3 కేజీల శ్రీగంధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొందరి ఇళ్లలో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు, వెండి పట్టుబడ్డాయి. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
చదవండి: మూడు పాములతో యువకుడి స్టంట్‌.. చివరకు ఏమైందో చూడండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement