ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ అధికారులను బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గియ బెదిరిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. బీజేపీ శుక్రవారం నిర్వహిస్తున ర్యాలీ సందర్భంగా కైలాశ్ అధికారులను ఉద్దేశించి.. ‘మా సంఘ్(ఆరెస్సెస్) నేతలు ఉన్నారు కాబట్టి ఊరుకున్నాం. లేదంటే ఈ రోజు ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం’ అని బెదిరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. సంస్థ అంతర్గత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఇతర నేతలు ఇండోర్‌కు వచ్చారు. పార్టీ కార్యకర్తలపై అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి సీనియర్ ప్రభుత్వ అధికారులను ఆహ్వానిస్తే.. జూనియర్ అధికారు లు రావడంపై కైలాశ్ ఆగ్రహం చెందారు.
Comments
Please login to add a commentAdd a comment