Kailash Vijayvargiya
-
'సీనియర్ నాయకున్ని.. చేతులు జోడించి ఓట్లు అడగాలా..?'
ఇండోర్: లిస్టులో పేరు లేకపోతే విచారం వ్యక్తం చేసిన అభ్యర్థులను చూశాం. కానీ లిస్టులో పేరు ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ. మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో నిలబడటానికి అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో జాతీయ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ పేరు ఉంది. ఇండోర్ అసెంబ్లీ సీటు-1 నుంచి ఆయన బరిలో దిగారు. లిస్టులో తనపేరును చూసి షాక్‌కు గురైనట్లు ఎన్నికల ర్యాలీలో విజయవర్గీయ తెలిపారు. పోటీ చేయాలని తనకు ఎలాంటి కోరిక లేదని చెప్పారు. "నాకు ఏమాత్రం సంతోషంగా లేదు. సీనియర్ లీడర్‌గా కేవలం మీటింగ్‌లలో మాత్రమే మాట్లాడి వెళ్లగలను. పోటీ చేయడానికి ఓ మైండ్‌సెట్ అవసరమవుతుంది. సీనియర్ లీడర్‌గా చేతులు జోడించి ఇప్పుడు మిమ్మల్ని ఓట్లు అడగాలా..?' అంటూ విజయవర్గీయ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. 'పబ్లిక్ మీటింగ్స్‌కు ప్రణాళికలు చేసుకున్నాను. ఐదు సమావేశాలకు హెలికాఫ్టర్‌లో వెళ్లాలి. మూడింటికి కారులో వెళ్లాలి. కానీ మనం అనుకున్నది కొన్నిసార్లు కాదు. దేవుడి నిర్ణయమే నడుస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నట్లుంది. నా శక్తి కొద్ది ఈ బాధ్యతకు న్యాయం చేస్తా' అని కైలాష్ విజయవర్గీయ అన్నారు. విజయవర్గీయ ఇండోర్ నగరానికి మేయర్‌గా పనిచేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీలో ఉన్నత పదవుల్లో కొనసాగారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన్ను ఇండోర్ అసెంబ్లీ-1 నుంచి పోటీకి నిలిపింది బీజేపీ. ఆయన కుమారుడు ఇండోర్-3 సీటు నుంచి పోటీలో నిలిచారు. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
అమ్మాయిల దుస్తులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఇండోర్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేత వివాదంలో చిక్కుకున్నారు. అసభ్యకరమైన బట్టలు(డర్టీ క్లాత్స్) ధరించే అమ్మాయిలు రామాయణంలో శూర్పణఖ మాదిరి కనిపిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో మహవీర్ జయంతి సందర్భంగా జైన సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను ఆయన తప్పుపట్టారు. రాత్రిపూట బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్న యువతీ యువకులు కనిపిస్తుంటారని.. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను.. వారిని చూస్తుంటే గట్టిగా చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలను మనం దేవతలా ఆరాధిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అసభ్యకరంగా దుస్తులు ధరించిన కొంతమంది ఆడవాళ్లను చూస్తుంటే శూర్పణఖలా కనిపిస్తారు. దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చాడు. మంచి దుస్తులు వేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్దులు నేర్పాలి’ అని సూచించారు. అయితే విజయ్‌వర్గియా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళల పట్ల ద్వేషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలతో పురుషాధిక్యత, పితృస్వామ్య భావజాలన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ నేతలు ఇలా మాట్లాడటం సరికాదని.. బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కైలాష్ విజయవర్గియా ఇంలాటి వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదంలో ఇరుకున్నారు. చదవండి: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో తప్పిన ప్రమాదం.. BJP Leader @KailashOnline says girls dress badly & look like ‘Shurpanakha’. This is a reprehensible & demeaning insult to every woman of this country Where is @smritiirani now? Does she condone this disgusting statement? Or does she only find her voice to attack @RahulGandhi! pic.twitter.com/hzoxrnZpl1 — Dr. Shama Mohamed (@drshamamohd) April 8, 2023 -
బాయ్‌ఫ్రెండ్‌ని మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు!
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీకి గుడ్ బై చెప్పి ఆర్జేడితో జత కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నితీష్ పై కైలాష్ విజయ వర్గీయ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు కైలాష్ విజయవర్గీయ మాట్లాడుతూ..."తాను కొన్నాళ్లు విదేశాల్లో ఉన్నానని అక్కడ మహిళలు చాలా ఈజీగా బాయ్ప్రెండ్ని మార్చేస్తుంటారని, అచ్చం అలాగే నితీష్ కుమార్ కూడా పార్టీలు మార్చేస్తుంటాడు. ఎప్పుడూ ఎవరి చేయి పట్టుకుంటాడో, ఎవరి చేయి వదిలేస్తాడో ఎవరికి తెలియదు." అని మండిపడ్డారు. ఐతే కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా.. బీజేపీ కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ చేసిన సంచలన వ్యాఖ్యల వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తూ...ఆయనకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో చెప్పకనే చెప్పారు అంటూ విమర్శించారు. भाजपा के राष्ट्रीय महासचिव द्वारा नारी सम्मान का नया नमूना 👇 pic.twitter.com/DEGr5ojM5r — Randeep Singh Surjewala (@rssurjewala) August 18, 2022 (చదవండి: బీజేపీ నాయకులకు సరైన సమయంలో బదులిస్తా) -
నిరసనల వేళ అగ్నివీర్లపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ.. అగ్నివీర్లపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. అగ్నిపథ్‌పై నిరసనల నేపథ్యంలో విజయవర్గీయ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక అగ్నివీర్ సైనిక శిక్షణ పొంది, నాలుగు సంవత్సరాల తర్వాత సేవ నుండి నిష్క్రమించినప్పుడు రూ.11 లక్షలు అందుకుంటాడు. అగ్నివీర్ బ్యాడ్జ్‌ని ధరిస్తాడు. బీజేపీ కార్యాలయానికి సెక్యూరిటీని నియమించాలనుకుంటే, నేను అగ్నివీర్‌కు ప్రాధాన్యత ఇస్తా’ అని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విపక్ష నేతలు.. కైలాష్ వర్గీయపై మండిపడ్డారు. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. కైలాష్ వర్గీయపై నిప్పులు చెరిగారు. దేశ యువత, భారత ఆర్మీని అగౌరవపర్చవద్దని హితవు పలికారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కైలాష్ విజయవర్గీయ మాటలతో అగ్నిపథ్ స్కీమ్‌పై ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోయాయని విమర్శలు చేసింది. ఇందుకోసమేనా అగ్నిపత్ స్కీమ్‌కు తీసుకువస్తున్నారంటూ ఎద్దేవా చేసింది. అగ్నివీరులు సెక్యూరిటీ గార్డులుగా ఉండేందుకు కూడా మన ఆర్మీ శిక్షణ ఇస్తున్నది అంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. देश के युवाओं और सेना के जवानों का इतना अपमान मत करो। हमारे देश के युवा दिन-रात मेहनत करके फ़िज़िकल पास करते हैं, टेस्ट पास करते हैं, क्योंकि वो फ़ौज में जाकर पूरा जीवन देश की सेवा करना चाहते हैं, इसलिए नहीं कि वो BJP के दफ़्तर के बाहर गार्ड लगना चाहते हैं। https://t.co/PQ8B30FYHz — Arvind Kejriwal (@ArvindKejriwal) June 19, 2022 -
మమతా మ్యాజిక్: బీజేపీ ప్రధాన కార్యదర్శి స్పందన
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా స్పందించారు. ఈ విజయం పూర్తిగా మమతా బెనర్జీ వల్లే సాధ్యమైందని అన్నారు. దీనిపై తాము ఆత్మ పరిశీలన చేసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు దీదీకే పట్టం కట్టారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆమెనే సీఎం కావాలని కోరుకున్నారన్నారు. బెంగాల్ ఎన్నికల్లోతమ పార్టీ వైఖరి, వైఫ్యల్యం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఫలితాల తీరుపై ఆరా తీసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి తనకు పిలుపు వచ్చిందని కైలాష్ తెలిపారు. అలాగే బీజీపీ ఎంపీలు బాబుల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ వెనుకంజలో ఉండటం చూసి తాను షాక్ అయ్యానని పేర్కొన్నారు. సంస్థాగత సమస్యలా, లేక ఇన్సైడర్, ఔట్‌సైడర్ చర్చ వల్లా అన్నది చూడాలి. కాగా రాష్ట్రంలోని 292 నియోజకవర్గాలలో 201 స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తూ బెంగాల్లో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. అటు బీజేపీ 82 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మరోవైపు తీవ్ర ఉత్కంఠను రాజేసీన నందీగ్రామ్‌లో చివరికి మమత 1200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం. చదవండి : మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్ వ్యూహకర్తగా తప్పుకుంటున్నా, విశ్రాంతి కావాలి: ప్రశాంత్ కిశోర్ -
చిక్కుల్లో బీజేపీ నేత
భోపాల్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా మరోసారి ఇరకాటంలో పడ్డారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో వారిని ఉత్సాహపరచడానికి చేసిన వ్యాఖ్యలతో ఆయన ట్రోల్‌కు గురవుతున్నారు. ఈ సమావేశంలో కైలాష్ మాట్లాడుతూ.. ‘ఓ రోజు రాత్రి 2 గంటలకు మన (బీజేపీ) కార్యకర్త నుంచి ఫోన్ వచ్చింది. పేకాట ఆడుతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు విడిపించండి అని విజ్ఞప్తి చేశాడు. దీంతో వెంటనే సదరు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి ఆ కార్యకర్తను విడిపించాను. కార్యకర్తల వెన్నంటే బీజేపీ ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కైలాష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్) ఈ వీడియోను కాంగ్రెస్ కమిటీ మీడియా సమన్వయకర్త నరేంద్ర సలుజా ట్విటర్లో పోస్ట్ చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఇదేనా బీజేపీ విధానం? ఇలాంటి ఆలోచనల తోనే మీరు నవభారత్ నిర్మించేది? బాధ్యతాయుతమైన మీ నాయకులు పేకాట ఆడి అరెస్టయిన కార్యకర్తను విడిపించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. సమాజానికి మీరు ఎలాంటి సందేశాన్ని ఇద్దామనుకుంటున్నారు? మీ కార్యకర్తలకు ఏం చెప్పదల్చుకున్నారు?’ అంటూ నరేంద్ర సలుజా ప్రశ్నించారు. ఇక కైలాష్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఇక నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. (టీడీపీ మత్తులో పవన్ కల్యాణ్) मोदीजी-शाहजी ये कैसी भाजपा,ये कैसा सिस्टम,ये कैसी सोच,ये कैसा नया भारत ? ज़िम्मेदार नेतृत्व, कार्यकर्ताओं को पत्ते खेलते हुए पुलिस द्वारा पकड़े जाने पर थाने फ़ोन कर छुड़ाते है,ख़ुद सच्चाई बया कर रहे है। समाज में क्या संदेश दे रहे है आप , कार्यकर्ता की क्या पहचान बता रहे है आप ? pic.twitter.com/1MVOvoquN0 — Narendra Saluja (@NarendraSaluja) June 27, 2020 -
పోహా తింటే బంగ్లాదేశీయులా!?
సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు తినే ఆహారం బట్టి వారు ఏ దేశస్థులో ఇట్టే చెప్పవచ్చట! ఈ విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శుక్రవారం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘మా ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు తింటున్న ఆహారం చూసి నాకు వారి జాతీయత మీద అనుమానం వచ్చింది. వారంతా పోహా (అటుకుల ఉప్మా) తింటున్నారు. అది చూసి వారు బంగ్లాదేశ్ వాసులని నాకు అనుమానం వచ్చింది. రెండు రోజుల తర్వాత అదే విషయాన్ని వారిని నేను అడిగా. అంతే అప్పటి నుంచి వారు మా ఇంటి పనికి రావడం మానేశారు’ అని కైలాష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వాటిపై ఇప్పుడు ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇండోర్‌లో ఇటీవలనే క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలసి జలేబీ, పోహా పసందుగా తింటూ కనిపించారు’ మొహమ్మద్ జుబేర్ వారి ఫొటోను షేర్ చేశారు. ‘మా పని మనిషి కేవలం న్యూఢిల్స్ మాత్రమే తింటుంది. బహూశ ఆమె చైనా దేశస్థురాలు కావచ్చు’ అని నిర్మలా థాయ్ హల్వే వాలి ట్వీట్ చేశారు. ‘మా చాకలి బర్గర్ తింటున్నాడు. వాడు అమెరికన్ కావచ్చు’ అని కాజోల్ శ్రీనివాసన్ స్పందించారు. ‘ఇటీవల మా ఇంటి నిర్మాణం పనుల కోసం వచ్చిన కూలీలు ఎవరు తిననిది తింటిన్నారు. వారు పేడ తింటున్నారు. వారు సంఘీస్ కావొచ్చు’ భక్త్స్ నైట్మేర్ ట్వీట్ చేశారు. ‘మొదట్లో ఆవు తినేవారంతా యాంటీ నేషనల్స్. ఇప్పుడు పోహా తినే వారంతా యాంటీ నేషనల్స్’ అని, ‘పోహా ఇప్పుడు యాంటీ నేషనల్’ అని అద్వైత్, ప్రవీణ్ శామ్యూల్‌లు స్పందించారు. పోహాను మధ్య భారత్‌లో, పశ్చిమ భారత్‌లో ఎక్కువగా తింటారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా తింటారు. -
తినే అలవాట్లు బట్టి ఏ దేశమో చెప్పొచ్చు..
భోపాల్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. బంగ్లాదేశీయలు ఎక్కడున్నా వెంటనే గుర్తించవచ్చని, వారి అలవాట్ల ఆధారంగా బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా నిర్ధారించవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే ఆ దేశానికి చెందిన కొందరు కేవలం అటుకులు మాత్రమే తింటారని, వారు తినే విధానం ద్వారా కూడా ఆ దేశ పౌరులను కనిపెట్టవచ్చని అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన సీఏఏ, ఎన్ఆర్సీ మద్దతు సభలో ఆయన ప్రసంగించారు. పొరుగు దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని.. ఆహారపు అలవాట్ల ఆధారంగా గుర్తించాలని పేర్కొన్నారు. దేశంలో అనేక మంది భవన నిర్మాణ కూలీలు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ సరిహద్దుల్లో ద్వారా దేశంలోకి చొరబడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనికి నివారించడానికే కేంద్ర ప్రభుత్వం చట్టాలను రూపొందించిందని వివరించారు. దీనికి దేశ పౌరులంతా మద్దతు తెలపాలని ఆయన కోరారు. -
కమిషనర్ ఇంటిముందు ధర్నా.. బీజేపీ నేతపై కేసు
ఇండోర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గియపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు ఇండోర్ ఎంపీ శంకర్ లాల్వానీ, పలువురు బీజేపీ నాయకులపై కూడా పోలీసులు కేసు పెట్టారు. 2019 డిసెంబర్ 10న ఇండోర్‌లో విధించిన నిషేధిత ఉత్తర్వులును ఉల్లఘించారని తహశీల్దార్ బిచోలి హప్సీ ఫిర్యాదు చేయటంతో పోలీసులు వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా వీరితోపాటు ఇండోర్-2 ఎమ్మెల్యే రమేష్ మెన్డోలా, ఇండోర్- 5 ఎమ్మెల్యే మహేంద్ర హార్డియా, నగర బీజేపీ అధ్యక్షుడు గోపీకృష్ణ నేమా పాటు మొత్తం 350 మందిపై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండోర్ నగర సమస్యలపై చర్చించడానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా జనవరి 3న సంబంధిత అధికారులను కలవాలనుకున్నారు. దీని కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో ఆ అధికారులకు లేఖ కూడా పంపించారు. కానీ సమావేశానికి అధికారులు ఎవరూ హాజరుకాకపోవడంతో విజయ్‌వర్గియ తీవ్ర అసహనానికి గురయ్యారు. విజయవర్గియా అధికారుల తీరును నిరసిస్తూ ఎంపీ శంకర్ లాల్వాని, ఇతర బీజేపీ నాయకులతో ఇండోర్ కమిషనర్ ఆకాష్ త్రిపాఠి నివాసం ముందు ధర్నా చేశారు. ఈ ర్యాలీలో అధికారులను కైలాశ్ విజయ్‌వర్గియ బెదిరిస్తునట్లు ఉన్న వీడియో బయటపడి వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆ ర్యాలీ సందర్భంగా కైలాశ్ అధికారులను ఉద్దేశించి ‘మా సంఘ్(ఆరెస్సెస్) నేతలు ఉన్నారు కాబట్టి ఊరుకున్నాం. లేదంటే ఈ రోజు ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం’ అని బెదిరిస్తున్నట్లు వీడియోలో తెలుస్తోంది. చదవండి: ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం! -
ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం!
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ అధికారులను బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గియ బెదిరిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. బీజేపీ శుక్రవారం నిర్వహిస్తున ర్యాలీ సందర్భంగా కైలాశ్ అధికారులను ఉద్దేశించి.. ‘మా సంఘ్(ఆరెస్సెస్) నేతలు ఉన్నారు కాబట్టి ఊరుకున్నాం. లేదంటే ఈ రోజు ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం’ అని బెదిరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. సంస్థ అంతర్గత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఇతర నేతలు ఇండోర్‌కు వచ్చారు. పార్టీ కార్యకర్తలపై అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి సీనియర్ ప్రభుత్వ అధికారులను ఆహ్వానిస్తే.. జూనియర్ అధికారు లు రావడంపై కైలాశ్ ఆగ్రహం చెందారు. -
ఆకాష్‌పై వేటుకు కాషాయదళం సన్నాహాలు
భోపాల్ : మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడిచేసిన పార్టీ ఇండోర్ ఎమ్మెల్యే, సీనియర నేత కైలాష్ విజయవర్గీయ కుమారుడు ఆకాష్ విజయవర్గీయకు బీజేపీ షోకాజ్ నోటీసు జారీ చేయవచ్చని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గత వారం జరిగిన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ కావడంతో ఎమ్మెల్యేపై చర్యలు తప్పవని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎవరి కొడుకైనా ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని ఆకాష్ చర్యపై ప్రధాని తీవ్రస్ధాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. దూకుడుగా వ్యవహరించిన ఆకాష్‌పై చర్యలకు సంబంధించి మధ్యప్రదేశ్ పార్టీ చీఫ్ రాకేష్ సింగ్‌తో ఢిల్లీ నుంచి ఓ పార్టీ సీనియర్ నేత ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీనియర్ బీజేపీ నేత రామ్‌లాల్ సైతం రాకేష్ సింగ్‌తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఆకాష్ ప్రవర్తనపై సీరియస్‌గా ఉన్న బీజేపీ అధిష్టానం ఆయనపై తీవ్ర చర్యలు తీసుకుంటుందని మీడియాలో సైతం ప్రచారం ఊపందుకుంది. ఆకాష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చని భావిస్తున్నారు. కాగా ప్రభుత్వ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన ఆకాష్‌ను ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు
సాక్షి, హైదరాబాద్: రైతులకు నిరంతర విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేంద్రం చొరవ వల్లనే ఇది సాధ్య మైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అదనంగా ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేక పోయిన రాష్ట్ర ప్రభుత్వం అబద్ధపు ప్రకటన లతో మోసం చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా విద్యుత్ లోటు ను అధిగమించేందుకు ప్రధాని మోదీ లక్ష్యం విధించుకుని కృషి చేసిన ఫలితంగా ఏకంగా 19 రాష్ట్రాల్లో మిగులు కరెంటు ఉండేలా చేశా రని, అందులో తెలంగాణ కూడా భాగమ న్నారు. బుధవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రామ గుండంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్ప త్తికి ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేశారని, దీన్ని కూడా తమ ఘనతగానే టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోవటం విడ్డూ రంగా ఉందన్నారు. కేంద్రం చొరవతో రాష్ట్రంలో 3,500 మెగావాట్ల ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడిందని, విద్యుదు త్పత్తి కోసం రాష్ట్రానికి రుణ సాయం పెంచటం, నార్త్–సౌత్ గ్రిడ్ అనుసంధానం, ఉదయ్ పథకంలో రాష్ట్రం చేరేలా చేయటం తదితర చర్యల వల్లనే ఇది సాధ్యమైందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ వాస్తవాలను పక్కన పెట్టి కేవలం తన ఘనత వల్లనే నిరంతర విద్యుత్ సాధ్యమైంద న్నట్టుగా కేసీఆర్ చెప్పుకుంటున్నారని, ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కూ ఇవే అవాస్తవాలు వివరించారన్నారు. ఎస్సీల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలోనూ అధికారం: కైలాశ్ మోదీ హవాతో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధి కారంలోకి వచ్చినట్టుగానే తెలంగాణలోనూ అధికారం సాధిస్తామని ౖMðలాశ్ పేర్కొన్నారు. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తు న్నామన్నారు. తాను కరీంనగర్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కార్యకర్తలు సంతోషంగా ఉన్న విషయాన్ని గుర్తించానన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ అగ్రనేతపై పోలీసు అధికారి దావా
కోల్ కతా: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వార్గియాపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు పరువు నష్టం దావా వేశారు. తనపై కైలాశ్ నిరాధార, అసత్య ఆరోపణలు చేశారనే కారణంతో కోల్ కతా నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులను కాపాడేందుకు రాజీవ్ కుమార్ ప్రయత్నించారని జనవరి 4న కైలాశ్ ఆరోపణలు చేశారు. ఈ కేసులో కీలక పత్రాలను కమిషనర్ నాశనం చేశారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నగర సెషన్స్ కోర్టులో కైలాశ్ పై రాజీవ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ సుభ్ర ఘోష్.. మార్చి 7న తమ ఎదుట హాజరు కావాలని కైలాశ్ విజయ్ వార్గియాను ఆదేశించారు. -
హీరోను దావూద్‌తో పోల్చిన బీజేపీ నేత
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వార్గియా.. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. షారుక్‌ను ఆయన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చారు. మంగళవారం గుజరాత్‌లోని వడోదర రైల్వే స్టేషన్లో షారుక్‌ను చూసేందుకు భారీ అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. కైలాష్ ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. దావూద్ వీధుల్లోకి వచ్చినా అతణ్ని చూడటానికి జనం వస్తారని, వచ్చే జనాల సంఖ్యను బట్టి పాపులారిటీకి కొలమానంగా భావించరాదని అన్నారు. ఈ విషయం గురించి ఇంతకుమించి మాట్లాడబోనని, ప్రజలు పర్యవసానాల గురించి ఆలోచించాలని చెప్పారు. కైలాష్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంఘటనలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని వ్యాపం స్కాం గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఇది మీకు పెద్దది కావచ్చు కానీ తమకు చాలా చిన్న స్కాం అని అన్నారు. ఇక మహిళలపై జరుగుతున్న నేరాల గురించి ఆయన మాట్లాడుతూ.. రామాయణంలో సీత లక్ష్మణరేఖ దాటడం వల్లే రావణుడు అపహరించుకుని వెళ్లాడని అన్నారు. అలాగే మహిళల వస్త్రధారణపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
ఏనుగులు వెళ్తుంటే.. కుక్కలే మొరుగుతాయి!
-
ఏనుగులు వెళ్తుంటే.. కుక్కలే మొరుగుతాయి!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్టీకి చెందిన ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గియా కుక్కతో పోలిస్తే.. దానికి షాట్‌గన్ తీవ్రంగా స్పందించారు. విజయ్ వర్గియా చేసిన వ్యాఖ్యలపై తన స్పందన ఏంటని చాలామంది అడుగుతున్నారని, ''ఏనుగు బిహార్ వెళ్తుంటే.. వేలాది కుక్కలు మొరుగుతాయి'' అన్నదే తన సమాధానమని ఆయన ట్వీట్ చేశారు. ''కారు వెనుక కుక్క పరిగెడుతూ, తనవల్లే కారు ముందుకు వెళ్తోందని అనుకుంటుంది. శత్రుఘ్న సిన్హాకు బీజేపీ వల్ల గుర్తింపు వచ్చింది తప్ప బీజేపీకి శత్రుఘ్న సిన్హా వల్ల కాదు'' అని విజయ్ వర్గియా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. శత్రుఘ్న సిన్హా పార్టీ క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకోవాలని, అంతేతప్ప ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం సరికాదని ఆయన చెప్పారు. అయితే, పార్టీ నేతలు ఇలాంటి భాష ఉపయోగించడం మానుకోవాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. విజయ్ వర్గియా వ్యాఖ్యలను ఖండించారు. People want my reaction to Vijayvargiya's remark. My reaction to small or big flies in any party is "Haathi chale Bihar,....bhaunken hazaar" — Shatrughan Sinha (@ShatruganSinha) November 9, 2015 -
శత్రుఘ్నసిన్హాను కుక్కతో పోల్చిన బీజేపీ నేత
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గియా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హాను కుక్కతో పోల్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శత్రుఘ్న సిన్హా దూరంగా ఉండి, సోమవారం బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను కలిసి అభినందించిన నేపథ్యంలో విజయ్ వర్గియా ఈ వ్యాఖ్యలు చేశారు. కైలాశ్ విజయ్ వర్గియా ఇదివరకే షారుక్ ఖాన్ భారత్‌లో ఉంటున్నా ఆయన మనసంతా పాకిస్తాన్ మీదే ఉందని అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న శత్రుఘ్న సిన్హాపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమా భారతి పార్టీ పెద్దలను కోరారు. -
'షారుఖ్‌పై నా ట్వీట్లను అపార్థం చేసుకున్నారు'
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు అపార్థం చేసుకున్నారని, అందుకే ఆ ట్వీట్లను తొలగిస్తున్నానని బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్వార్గియా తెలిపారు. దేశంలో తీవ్ర అసహనం నెలకొందని షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విజయవార్గియా తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. షారుఖ్ మనసంతా పాకిస్థాన్‌లోనే ఉందని, ఆయన దేశద్రోహి అని విమర్శించారు. విజయ్వార్గియా టిట్టర్‌లో చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దంటూ ఇటీవల పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చిన బీజేపీ అధినాయకత్వం ఆయన వ్యాఖ్యలకు దూరం జరిగింది. ఈ నేపథ్యంలో షారుఖ్‌పై తన ట్వీట్లను వెనుకకు తీసుకుంటున్నట్టు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వార్గియా తెలిపారు. ఎవరినీ గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
'బాద్షా ఇక్కడున్నా మనసంతా పాక్ పైనే'
ఇండోర్: ప్రముఖ హీరో, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పై బీజేపీ నేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షారుక్ ఖాన్ భారత్‌లో ఉంటున్నా ఆయన మనసంతా పాకిస్తాన్ మీదే ఉందని మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కైలాశ్ విజయ్ వర్గియా వ్యాఖ్యానించారు. ఇప్పటికే విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ మహిళా నాయకురాలు సాద్వీ ప్రాచీ, షారూక్ ఖాన్ దేశం నుంచి వెళ్లిపోవచ్చంటూ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. దేశంలో ప్రజ్వరిల్లుతున్న మత ఘర్షణలను షారూక్ ఖండించిన నేపథ్యంలో సాద్వీ ప్రాచీ ...షారుక్‌పై మండిపడ్డారు. కాగా సృజన, మతాలపై అసహనం దేశానికి హానికరమని షారుక్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. సోమవారం తన 50వ పుట్టినరోజు సందర్భంగా కింగ్‌ఖాన్.. ప్రస్తుతం దేశంలో తీవ్ర అసహనం నెలకొందన్నారు. సినీరంగానికి చెందిన వారు, శాస్త్రవేత్తలు, రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని సమర్థించారు. వెనక్కి ఇవ్వడానికి తనకు జాతీయ ఫిల్మ్ అవార్డు ఏమీ లేనప్పటికీ, అలా చేసిన సినీ ప్రముఖులు దివాకర్ బెనర్జీ, ఆనంద్ పట్వర్ధన్‌ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. సృజన పట్ల, మతం పట్ల అసహనం ప్రదర్శిస్తున్నామంటే దేశం వేసిన ప్రతి ముందడుగు మనం వెనక్కి లాగుతున్నట్లేనన్నారు. దీంతో షారుక్ వ్యాఖ్యలను విజయ్ వర్గియా తీవ్రంగా ఖండించారు. -
నేనేదో జోక్ చేశాను అంతే..
భోపాల్: వ్యాపమ్ స్కామ్‌పై తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కైలాస్ విజయ్ వార్గీయ సమర్థించుకున్నారు. పైపెచ్చు మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందంటూ ఎదురుదాడి చేశారు. 'నేనేమీ వివాదాస్పదగా మాట్లాడలేదు. నేనేదో జోక్ చేశాను అంతే అంటూ కైలాస్ విజయ్ వార్గీయ తనను తాను వెనకేసుకొచ్చుకున్నారు. మీడియా తన వ్యాఖ్యాలను అనవసరంగా రాద్ధాంతం చేసిందని మండిపడ్డారు. వరుస అనుమానాస్పద మరణాలతో మరణ మృదంగాన్ని మోగిస్తున్న వ్యాపమ్ కేసులో మంత్రుల అనుచిత వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. 48 వరుస అనుమానాస్పద మరణాలతో కిల్లింగ్ స్కాంగా పేరుగాంచిన ఈ కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మంత్రులు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలతో వివాదాన్ని రగిలిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ మరణంపై మంత్రి కైలాస్ విజయ్ వార్గీయ స్పందనను మీడియా కోరినపుడు ... చచ్చిపోయిన ఆ జర్నలిస్టు గురించి మర్చిపోండి... అతను నాకంటే గొప్పవాడా ఏంటి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జర్నలిస్టు మరణాన్ని చాలా తేలిగ్గా తీసి పారేస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయిన దృశ్యాలు మీడియాలో ప్రసారం కావటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. దీంతో మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. కాగా స్కాంలో రిపోర్టింగ్‌లో ఉన్న జర్నలిస్టు అక్షయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అలాగే ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్‌కు సహకరిస్తున్న జబల్ పూర్ యూనివర్శిటీ డీన్ అరుణ్ శర్మ కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయారు. తన విచారణ నివేదికను సమర్పించిన రెండురోజుల తర్వాత ఢిల్లీలోని ఒక హెటల గదిలో ఆయన చనిపోయారు. మరోవైపు ఈ కేసులో ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ అనామిక కుస్వాహ సోమవారం ఉదయం స్థానిక చెరువులో శవమై తేలారు.