
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీకి గుడ్ బై చెప్పి ఆర్జేడితో జత కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నితీష్ పై కైలాష్ విజయ వర్గీయ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టారు.
ఈ మేరకు కైలాష్ విజయవర్గీయ మాట్లాడుతూ..."తాను కొన్నాళ్లు విదేశాల్లో ఉన్నానని అక్కడ మహిళలు చాలా ఈజీగా బాయ్‌ప్రెండ్‌ని మార్చేస్తుంటారని, అచ్చం అలాగే నితీష్ కుమార్ కూడా పార్టీలు మార్చేస్తుంటాడు. ఎప్పుడూ ఎవరి చేయి పట్టుకుంటాడో, ఎవరి చేయి వదిలేస్తాడో ఎవరికి తెలియదు." అని మండిపడ్డారు.
ఐతే కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా.. బీజేపీ కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ చేసిన సంచలన వ్యాఖ్యల వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ...ఆయనకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో చెప్పకనే చెప్పారు అంటూ విమర్శించారు.
भाजपा के राष्ट्रीय महासचिव द्वारा नारी सम्मान का नया नमूना 👇 pic.twitter.com/DEGr5ojM5r
— Randeep Singh Surjewala (@rssurjewala) August 18, 2022
(చదవండి: బీజేపీ నాయకులకు సరైన సమయంలో బదులిస్తా)