పట్నా : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన బొమ్మ మాత్రమేనని, ఆమెకు రాజకీయంగా ఎలాంటి నైపుణ్యం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రియాకం అందమైన ముఖం చూసి జనం ఓట్లెయరు. మరో ముఖ్య విషయమేంటంటే.. ఆమె భూ కబ్జాలు, అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా భార్య. ఆమె చాలా అందంగా ఉంటుంది. అంతకుమించి రాజకీయంగా ఆమెకు ఎలాంటి అనుభవం, టాలెంట్ లేదు’ అని ఝా వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ)
ఇదిలాఉండగా.. ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ కూడా ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేశారు. అవినీతి, కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజీపీకి లాభిస్తుందని చెప్పారు. ప్రియాంకను ఇందిరా గాంధీతో పోల్చడం నవ్వు తెప్పిస్తోందని అన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రియాంక గాంధీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీప్రచార ఇన్‌ఛార్జ్ బాధ్యతలను కూడా అప్పగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment