డెహ్రాడూన్: దేశం మొత్తం తాను క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కంచుకోట ఆమేథీ నుంచి పోటీచేస్తారని గత కొన్నిరోజులుగా ఉహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
తాజాగా రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దేశం మొత్తం నుంచి ఒకటే అభిప్రాయం వినిపిస్తోంది. దేశ ప్రజలంతా తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు తనను వారి ప్రాంతాల్లో ఉండాలని ఆశిస్తున్నారు. నేను 1999లోనే ఆమెథి ప్రచారంలో పాల్గొన్నాను. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. గడిచిన రెండు విడతల్లోను కాంగ్రెస్ పార్టీ ముందజలోనే కొనాసాగుతోందని పేర్కొన్నారు.
‘దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ శ్రమను దేశ ప్రజలు చూస్తున్నారు. గాంధీ కుటుంబం వెంటే దేశ ప్రజల ఉన్నారు’ అని రాబర్ట్ వాద్రా అన్నారు. ఆయన తనకు రాజకీయాల్లోకి రావాలని, ఎంపీగా పోటీ చేయాలన్న కోరికను ఉన్నట్లు ఇలా పరోక్షంగా వెల్లడిస్తున్నారని పార్టీ శ్రేణులో తీవ్ర చర్చ జరుగుతోంది.
అమెథిలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాహుల్ గాంధీని ఓడించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈసారి కూడా బీజేపీ అమెథి సెగ్మెంట్ నుంచి స్మృతి ఇరానీకి టికెట్ కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment