
ఏనుగులు వెళ్తుంటే.. కుక్కలే మొరుగుతాయి!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్టీకి చెందిన ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గియా కుక్కతో పోలిస్తే.. దానికి షాట్‌గన్ తీవ్రంగా స్పందించారు. విజయ్ వర్గియా చేసిన వ్యాఖ్యలపై తన స్పందన ఏంటని చాలామంది అడుగుతున్నారని, ''ఏనుగు బిహార్ వెళ్తుంటే.. వేలాది కుక్కలు మొరుగుతాయి'' అన్నదే తన సమాధానమని ఆయన ట్వీట్ చేశారు.
''కారు వెనుక కుక్క పరిగెడుతూ, తనవల్లే కారు ముందుకు వెళ్తోందని అనుకుంటుంది. శత్రుఘ్న సిన్హాకు బీజేపీ వల్ల గుర్తింపు వచ్చింది తప్ప బీజేపీకి శత్రుఘ్న సిన్హా వల్ల కాదు'' అని విజయ్ వర్గియా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. శత్రుఘ్న సిన్హా పార్టీ క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకోవాలని, అంతేతప్ప ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం సరికాదని ఆయన చెప్పారు.
అయితే, పార్టీ నేతలు ఇలాంటి భాష ఉపయోగించడం మానుకోవాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. విజయ్ వర్గియా వ్యాఖ్యలను ఖండించారు.
People want my reaction to Vijayvargiya's remark. My reaction to small or big flies in any party is "Haathi chale Bihar,....bhaunken hazaar"
— Shatrughan Sinha (@ShatruganSinha) November 9, 2015