
శత్రుఘ్నసిన్హాను కుక్కతో పోల్చిన బీజేపీ నేత
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గియా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హాను కుక్కతో పోల్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శత్రుఘ్న సిన్హా దూరంగా ఉండి, సోమవారం బిహార్ సీఎం నితీష్ కుమార్ను కలిసి అభినందించిన నేపథ్యంలో విజయ్ వర్గియా ఈ వ్యాఖ్యలు చేశారు.
కైలాశ్ విజయ్ వర్గియా ఇదివరకే షారుక్ ఖాన్ భారత్లో ఉంటున్నా ఆయన మనసంతా పాకిస్తాన్ మీదే ఉందని అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న శత్రుఘ్న సిన్హాపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమా భారతి పార్టీ పెద్దలను కోరారు.