హీరోను దావూద్‌తో పోల్చిన బీజేపీ నేత | BJP's Kailash Vijayvargiya compared Shah Rukh Khan with Dawood Ibrahim | Sakshi
Sakshi News home page

హీరోను దావూద్‌తో పోల్చిన బీజేపీ నేత

Jan 24 2017 5:06 PM | Updated on Mar 29 2019 9:31 PM

హీరోను దావూద్‌తో పోల్చిన బీజేపీ నేత - Sakshi

హీరోను దావూద్‌తో పోల్చిన బీజేపీ నేత

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్వార్గియా.. బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్వార్గియా.. బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. షారుక్ను ఆయన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చారు.

మంగళవారం గుజరాత్లోని వడోదర రైల్వే స్టేషన్లో షారుక్‌ను చూసేందుకు భారీ అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందగా, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. కైలాష్ ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. దావూద్‌ వీధుల్లోకి వచ్చినా అతణ్ని చూడటానికి జనం వస్తారని, వచ్చే జనాల సంఖ్యను బట్టి పాపులారిటీకి కొలమానంగా భావించరాదని అన్నారు. ఈ విషయం గురించి ఇంతకుమించి మాట్లాడబోనని, ప్రజలు పర్యవసానాల గురించి ఆలోచించాలని చెప్పారు.

కైలాష్‌ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంఘటనలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని వ్యాపం స్కాం గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఇది మీకు పెద్దది కావచ్చు కానీ తమకు చాలా చిన్న స్కాం అని అన్నారు. ఇక మహిళలపై జరుగుతున్న నేరాల గురించి ఆయన మాట్లాడుతూ.. రామాయణంలో సీత లక్ష్మణరేఖ దాటడం వల్లే రావణుడు అపహరించుకుని వెళ్లాడని అన్నారు. అలాగే మహిళల వస్త్రధారణపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement