బెంగళూరు: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా గళం విప్పిన ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్‌మెహర్ కౌర్ ను మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చారు. కౌర్ కంటే దావూదే నయమని వ్యాఖ్యానించారు. జాతి వ్యతిరేక విధానాన్ని ప్రకటించుకోవడానికి దావూద్ ఇబ్రహీం తన తండ్రి పేరును వాడుకోలేదని ప్రతాప్ సింహా అన్నారు.
గుర్‌మెహర్ కౌర్ వ్యవహార శైలిని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే కశ్మీర్, బస్తర్ కు స్వాతంత్ర్యం కావాలని నినాదాలు చేయమేనా అంటూ మండి పడ్డారు.
గుర్‌మెహర్ కౌర్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాసటగా నిలిచారు. దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని, వారి గూండాయిజంకు వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి:
బెదిరింపులపై డీయూ విద్యార్థిని ఫిర్యాదు
నన్ను రేప్ చేస్తామని బెదిరించారు