Pratap Simha
-
బరిలోకి మైసూరు మహారాజు.. సిట్టింగ్ ఎంపీకి బీజేపీ షాక్
బెంగళూరు: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు 72 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. తొలి జాబితాలో దేవ్యాప్తంగా 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా.. నేటి జాబితాలో పలువురు ప్రముఖులకు స్థానం కలిపించింది. ఇక ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండు లిస్ట్‌లు కలిపి ఇప్పటి వరకు మొత్తం 267 స్థానాలకు అభ్యర్థులను కాషాయ పార్టీ ప్రకటించింది. ఇక తాజా లిస్ట్‌లో కర్ణాటకలోని మైసూర్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాకు బీజేపీ షాక్ ఇచ్చింది. మైసూరు రాజ వంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజను బరిలోకి దింపింది. గతేడాది పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యం వివాదంలో మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా కేంద్రబిందువుగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. డిసెంబర్లో శీతాకాల సమావేశాలు జరుగుతుండగా లోక్‌సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు సభలోకి దూకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు వాళ్లు. అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ కేసులో నిందితులిద్దరూ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా ద్వారానే విజిటర్స్ పాస్‌లు పొందినట్లు అధికారులు గుర్తించారు. చదవండి: బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు వీళ్లే పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని, ప్రతాప్ సింహాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలోనే బీజేపీ ప్రతాప్ సింహాకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం. ఇక లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తనకు టికెట్ ఇవ్వకుంటే తన మద్దతుదారులు, అభిమానులు ఎలాంటి నిరసనలు చేపట్టరాదని ఈ రోజు ఉదయమే మైసూర్ ఎంపీ కోరారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రధాని మోదీనే కారణమని.. ఆయనకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మోదీ కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతేగాక బీజేపీ రెండో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వెంటనే మైసూర్ రాజ వంశాన్ని సింహా అభినందించారు. మహారాజా యదువీర్‌కి అభినందనలు తెలిపారు. -
బీజేపీ ఎంపీ సొదరుడి అరెస్ట్.. కొత్త చిక్కుల్లో ప్రతాప్ సింహ!
బెంగళూరు: పార్లమెంట్ అలజడి విషయంలో వార్తల్లో నిలిచిన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ సోదరుడు విక్రమ్ సింహను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. కోట్ల విలువ చేసే 126 చోట్లను నరికివేసినట్లు అభియోగాలు ఉన్న ఓ కేసులో అతన్ని కర్ణాటకలోని హసన్ జిల్లా అటవీశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెట్ల నరికివేత నేరానికి విక్రమ్ సింహ పాల్పడినట్లు అటవీ అధికారులు వద్ద ఆధారాలు ఉండటంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్నించారు. అయితే అప్పటికే విక్రమ్ సింహ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు, అటవీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో విక్రమ్ సింహ పట్టుబడ్డారు. అటవీ శాఖ పోలీసులు విక్రమ్ సింహను హసన్ జిల్లా తీసుకువచ్చి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికే పార్లమెంట్ అలజడి విషయంలో సతమతమవుతున్న బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహకు తన సోదరుడి అరెస్ట్.. మరో కొత్త చిక్కు తెచ్చిపెట్టినట్లు అయింది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి పార్లమెంట్ సందర్శన పాసులు పొందిన ఆగంతకులు పార్లమెంట్లో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. పార్లమెంట్ భదత్ర వైఫల్యంపై ఎంపీ ప్రతాప్ సింహను సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టారు. అదేవిధంగా ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని ఆందోళనకు దిగిన 146 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. చదవండి: మన్మోహన్ సింగ్‌పై పవార్ కీలక వ్యాఖ్యలు -
security breach: ‘దేశద్రోహిని కాదో.. అవునో.. వాళ్లే చెబుతారు’
మైసూర్: పార్లమెంట్లో చోటు చేసుకున్న అలజడి ఘటనలోని నిందితులు మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి పార్లమెంట్ సందర్శన పాసులు పొందిన విషయం తెలిసిదే. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా ప్రతిపక్షాలు.. బీజేపీ ఎంపీ ప్రతాప్‌ను సస్పెండ్ చేయాలని నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు కర్ణాటకలో ఏకంగా అతనిపై దేశద్రోహి ముద్రవేసి పోస్టర్లు కూడా అంటించారు. అయితే ఆ పోస్టర్లపై మొదటిసారి ఎంపీ ప్రతాప్ సింహ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను ఏంటో నా నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలుసు. దాన్ని బట్టి ప్రజలు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు ఇస్తారు’ అని అన్నారు. ‘దేవతా చాముండేశ్వరీ, కావేరీ మాత, 20 ఏళ్ల నుంచి నా వ్యాసాలు చదివే ప్రజలకు తాను ఏంటో తెలుసు. గత 20 ఏళ్ల నుంచి సేవ చేస్తున్న మైసూరు, కొడుగు ప్రాంత ప్రజలు.. నేను దోశద్రోహినో లేదా దేశభక్తుడినో తేల్చుతారు. అదే విషయాన్ని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం స్పష్టంగా చూపిస్తారు. నేను దోశద్రోహినో.. దేశ భక్తుడనో ప్రజలు తీర్పు ఇస్తారు’ అని ఎంపీ ప్రతాప్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై నిరసనగా ఏర్పాటు చేసిన పోస్టర్లను మైసూరు పోలీసులు తొలిగించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఘటన అనంతరం ప్రతాప్ సింహ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి నిందితులల్లో ఒకరైన సాగర్ శర్ తండ్రిది తన నియోజవర్గమైన మైసూర్ అని తెలియజేశారు. కొత్త పార్లమెంట్ సందర్శించడానికి పాస్ ఇవ్వాల్సిందిగా తన కార్యాలయంలో సాగర్ శర్మ తండ్రి విజ్ఞప్తి చేశారని పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: 2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరించిన టాప్-10 జడ్జ్మెంట్స్ -
నిందితుల ఎంట్రీ పాస్‌లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో నిందితులు కర్ణాటక ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి విజిటర్ పాస్‌లను పొందారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాను ప్రతాప్ సింహ నేడు కలిశారు. నిందితులకు పాస్‌లను ఇవ్వడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. పార్లమెంట్ విజిటర్ పాస్ కోసం నిందితుల్లో ఒకరి తండ్రి తన కార్యాలయానికి వచ్చారని స్పీకర్‌కు తెలిపారు. పాస్‌ల కోసం నిందితుడు సాగర్ శర్మ నిరంతరం తన పీఏకి టచ్‌లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతకు మించిన సమాచారం తన వద్ద లేదని స్పీకర్‌కు వివరించినట్లు సమాచారం. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా లలిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పార్లమెంట్లో బుధవారం గందరగోళం నెలకొంది. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా? -
Parliament: లోక్‌సభకు పొగ
కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవా’లని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చి న పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు. చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు తేల్చారు. సరిగ్గా 22 ఏళ్ల కింద పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి ప్రయతి్నంచిన రోజే జరిగిన ఈ ఉదంతం సంచలనం రేపింది. దీనిపై పార్టీలకతీతంగా ఎంపీలు, నేతలు ఆందోళన వెలిబుచ్చారు. సభలోకి దూకిన వారు మైసూరు ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహ సిఫార్సుతో విజిటర్స్ గ్యాలరీ పాస్ సంపాదించినట్టు తేలింది. సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం మధ్యాహ్నం. ఒంటి గంట సమయం. లోక్‌సభలో జీరో అవర్ ముగింపుకు వచ్చింది. బీజేపీ సభ్యుడు ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం! ఏమైందో అర్థం కాక లోక్‌సభ సభ్యులంతా ఒక్కసారిగా అయోమయానికి లోనయ్యారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఎవరో సభలోకి పడిపోయారని తొలుత భావించారు. అదేమీ కాదని, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే సభలోకి దూకాడని అర్థమై బిత్తరపోయారు. ఆలోపే మరో వ్యక్తి కూడా సభలోకి దూకి మరింత కలకలం రేపాడు. ఇద్దరూ బెంచీలపై గెంతుతూ స్పీకర్‌ను చేరుకునేందుకు వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. బూట్లలోంచి పొగ గొట్టాలు తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పొగ హాలంతటా కమ్ముకుంది. ఈ పరిణామాలతో ఎంపీలు తీవ్ర ఆందోళనకు లోనై అటూ ఇటూ పరుగులు తీశారు. చివరికి ఎంపీలు, భద్రతా సిబ్బంది వారిని నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ప్రాంగణం బయట కూడా పొగ గొట్టాలు విసిరి కలకలం రేపిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 2001లో సరిగ్గా డిసెంబర్ 13వ తేదీనే పాకిస్తాన్‌లోని లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంపై దాడికి తెగబడి విచ్చలవిడి కాల్పులతో తొమ్మిది మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. తాజా ఉదంతంపై కేంద్ర హోం శాఖ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. తీవ్ర భద్రతా లోపం: ఎంపీలు ఘటన అనంతరం మధ్యాహ్నం రెండింటికి లోక్‌సభ తిరిగి సమావేశమయ్యాక సభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. 2001 దాడి అనంతరం ఇది అతి తీవ్రమైన భద్రతా లోపమంటూ మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 13లోగా పార్లమెంటుపై దాడికి పాల్పడతానంటూ ఖలీస్థానీ వేర్పాటువాది గురుపర్వత్ సింగ్ పన్ను హెచ్చరించిన విషయాన్ని కొందరు సభ్యులు గుర్తు చేశారు. మొదటి వ్యక్తి తన సమీపంలోనే సభలోకి దూకాడని జేడీ(యూ) ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ చెప్పారు. తామంతా తీవ్ర ఆందోళనతో అటూ ఇటూ పరుగులు తీశామన్నారు. వాళ్ల దగ్గర బాంబు, మారణాయుధాలుంటే పరిస్థితేమిటని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభను వాయిదా వేసి ఈ ఉదంతంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. కేంద్రం తక్షణం క్షమాపణ చెప్పాలని, పార్లామెంటు భద్రతను తక్షణం మరింత కట్టుదిట్టం చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దుండగులకు పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ సింహాను విచారించాలన్నారు. ఆయన్ను తక్షణం సభ నుంచి బహిష్కరించాలని తృణమూల్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇలా జరిగింది... సభలోకి దూకి కలకలం రేపిన వారిని కర్ణాటకలోని మైసూరుకు చెందిన డి.మనోరంజన్ (34), యూపీలోని లక్నోకు చెందిన సాగర్ శర్మ (26)గా గుర్తించారు. జీరో అవర్ కాసేపట్లో ముగుస్తుందనగా ముందుగా సాగర్ ఒక్కసారిగా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. దాంతో ఎంపీలు షాక్‌కు గురై అటూ ఇటూ పరుగులు తీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆరెల్పీ ఎంపీ హనుమాన్ బెనీవాల్ అతన్ని పట్టుకునేందుకు ప్రయతి్నస్తుండగానే మరో వ్యక్తి కూడా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. ఇద్దరూ వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి వ్యక్తిని బెనీవాల్ తదితర ఎంపీలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నియంతృత్వం చెల్లదని అతను నినాదాలు చేశాడు. ‘‘దగ్గరికి రావద్దు. మేం దేశభక్తులం. నిరంకుశత్వంపై నిరసన తెలపడానికే వచ్చాం’’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఇద్దరూ తమ బూట్ల నుంచి పొగ గొట్టం వంటివాటిని తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పసుపు రంగు పొగ సభ అంతటా వ్యాపించడంతో ఎంపీలంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. తర్వాత ఎంపీలంతా కలిసి వారిని నిర్బంధించారు. బాగా దేహశుద్ధి చేసి పార్లమెంటు సిబ్బందికి అప్పగించారు. వెంటనే సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గంటపాటు వాయిదా వేశారు. సభలో లేని మోదీ, అమిత్ షా ఘటన జరిగినప్పుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అర్జున్‌రామ్ మేఘ్వాల్తో పాటు కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాందీ, అదీర్ రంజన్ చౌధరి సహా మొత్తం 100 మందికి పైగా ఎంపీలు సభలో ఉన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేరు. ఆరుగురూ ఒకే ఇంట్లో... పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్ (42), మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్లకు లలిత్, విశాల్ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విశాల్‌ను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో లలిత్ ఇంట్లో నే ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు 3 నెలలుగా పార్లమెంటు పాస్‌ల కోసం ప్రయతి్నస్తున్నట్టు విచారణలో తేలింది. ఎవరీ సింహా? దుండగులకు విజిటర్స్ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మాజీ జర్నలిస్టు. కర్ణాటకలోని మైసూరు నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ జీవిత చరిత్ర రాశారు. పార్లమెంటు కార్యకలాపాలు చూస్తామంటూ మనోరంజన్ పాస్‌లు తీసుకున్నట్టు ఎంపీ కార్యాలయం తెలిపింది. ఇలా నియోజకవర్గాల ప్రజలకు ఎంపీలు పాస్‌లు జారీ చేయడం మామూలేనంది. తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంటులోకి సందర్శకులకు పాస్‌ల జారీని నిలిపేశారు. -
'అది నాకు మోదీ దయతో వేసిన భిక్ష'
సాక్షి, బెంగళూరు : తనకు ఎంపీ పదవి ప్రధాని నరేంద్రమోదీ వేసిన పెద్ద భిక్ష అని మైసూరు-కొడగు ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు. తాను ఈరోజు ఇలా ఉన్నానంటే అంతా మోదీ దయే అని వ్యాఖ్యానించారు. మోదీ ఎవరికీ ఏంకావాలని అడిగినా దయతో ఇచ్చే ప్రధాన సేవకుడని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కర్ణాటక పర్యటనలో భాగంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతాప్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడం తప్ప మరొకటి కాదని కర్ణాటక ప్రభుత్వ న్యాయ సలహాదారు, అధికారిక ప్రతినిధి బ్రిజేష్ కలప్ప అన్నారు. 'ఈ మాటలు ఒక వ్యక్తి భజన చేయడం మాత్రమే కాదు.. ముమ్మాటికీ మేధావులైన, నాగరికులైన మైసూరు-కొడగు ప్రాంత పౌరులను అవమానించమే. ఆయన ఎవరికైనా ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటే అది ఒక్క ప్రజలకు మాత్రమే చెప్పాలని, వారు మాత్రమే ఓట్లు వేశారు తప్ప మోదీ కాదు' అని మండిపడ్డారు. -
ట్విట్టర్లో తాడోపేడో
మైసూరు ఫైర్‌బ్రాండ్ ప్రతాపసింహా మరోసారి ట్విట్టర్వార్కు తెరతీశారు. గతంలో డీఐజీ రూప, ఇటీవల ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌లతో ఆయన ట్విట్టర్లో ఘాటైన వ్యాఖ్యలతో తలపడడం తెలిసిందే. మైసూరు జిల్లా ఎస్పీ రవి చెన్నణ్ణవర్తో హనుమజ్జయంతి ఘటనలపై తనదైన ట్వీట్లు చేయగా, ఎస్పీ కూడా దీటుగా బదులిచ్చారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైసూరు: జిల్లాలోని హుణుసూరులో ఆదివారం హనుమజ్జయంతి ఊరేగింపులో చోటు చేసుకున్న పరిణామాలపై ఎంపీ ప్రతాపసింహా, జిల్లా ఎస్పీ రవి డీ.చెన్నణ్ణవర్ల మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం మొదలైంది. ‘పాలించే వారి ఆజ్ఞలు మీరడం సాధ్యం కావట్లేదు కదా’ అంటూ ట్విటర్లో ఎంపీ ప్రతాపసింహా ఎస్పీ రవి డీ.చెన్నణ్ణవర్పై మొదటగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ‘నిజాయితీ కల అధికారి అనే ముసుగు తీసేసి అధికార పార్టీ బంటునని ఒప్పుకోండి. దత్త జయంతికి అన్ని ఏర్పాట్లు చేసిన చిక్కమగళూరు ఎస్పీ అణ్ణామలైని, ప్రభుత్వాన్నే ఎదిరించిన డీఐజీ రూపాను, మెడికల్ సీట్ల బ్లాకింగ్ బాగోతాన్ని బట్టబయలు చేసిన ఐఏఎస్ రశ్మిను చూసి నేర్చుకోండి, ఇకనైనా మాటలు చాలించండి’ అంటూ ఎంపీ సింహా ట్వీట్లతో విమర్శనాస్త్రాలు సంధించారు. తమకు తమ రాజకీయ భవిష్యత్తు కంటే తమ మతం సంప్రదాయాలను రక్షించుకోవడమే ముఖ్యమని స్పష్టంచేశారు. రాజ్యాంగ రక్షణే మా విధి: ఎస్పీ ట్వీట్ ఎంపీ ట్వీట్లపై ఎస్పీ రవి చెన్నణ్ణవర్ కూడా తమదైన శైలిలోనే బదులిచ్చారు.‘మేము ఎవరికీ అనుకూలం కాదు, ఎవరికీ వ్యతిరేకులం కాదు, రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారమే విధులు నిర్వర్తిస్తున్నాం. మాకు రాజ్యాంగ రక్షణ ముఖ్యం, భారతదేశమే మా మతం. ఎస్పీ అణ్ణామలై నుంచే కాదు కానిస్టేబుల్‌ను చూసి కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో బదులిచ్చారు. సాంకేతికతను, సామాజిక మాధ్యమాలను వివేకంతో వినియోగించాలని, సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో శాంతి భధ్రతలకు ముప్పు వాటిల్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో, కార్యకర్తల్లో మిమ్మల్ని అనుసరించే, అభిమానించే యువకులు మీ వ్యాఖ్యల ద్వారా మరింత ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఎంపీ X పోలీస్
మైసూరు: హనుమజ్జయంతి వేడుకలు మైసూరు జిల్లా హుణుసూరు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆదివారం హనుమజ్జయంతి మహోత్సవ సమితి ఆధ్వర్యంలో ఆరంభమైన ఊరేగింపు తోపులాట, లాఠీ చార్జ్, రాళ్లదాడులు, అరెస్టులతో భీతావహ వాతావరణం నెలకొంది. వివరాలు.. హనుమజయంతి సందర్భంగా ఊరేగింపునకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. దీంతో ఆదివారం పట్టణంలోని మునేశ్వర కావల్ మైదానం నుంచి హనుమ జయంతి సమితి సభ్యులు, హిందూ సంఘాల కార్యకర్తలు ఊరేగింపును ప్రారంభించారు. అనుమతి ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ఊరేగింపును చేయనున్నట్లు తెలిసి జిల్లా ఎస్పీ రవి చెన్నణ్ణవర్ సిబ్బందితో కలసి సమితి సభ్యులను, హిందూ సంఘాల కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి కే.ఆర్.నగర వాల్మీకి సముదాయ భవనానికి తరలించారు. ఎంపీ వస్తేనే ఊరేగింపు అని దీక్ష : ఇదే సమయంలో హనుమాన్ ఊరేగింపులో పాల్గొనడానికి మైసూరు నుంచి వస్తున్న బీజేపీ ఎంపీ ప్రతాప సింహాను పట్టణంలోని డీ.దేవరాజు అరసు విగ్రహం వద్ద అరెస్ట్ చేసి హెచ్.డీ.కోట తాలూకాలోని అంతరసంతకు తరలించారు. విషయం తెలుసుకున్న గురుజంగమ మఠాధీశుడు నటరాజస్వామి నేతృత్వంలో వందలాది మంది హనుమ భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు, మాజీ మంత్రి విశ్వనాథ్, ముడా మాజీ అధ్యక్షుడు నాగేంద్ర తదితరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగారు. వారు లేకుండా ఊరేగింపు సాగదని తేల్చిచెప్పి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఊరేగింపును రద్దు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో హిందూ సంఘాల కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు చేయడం ప్రారంభించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు హఠాత్తుగా లాఠీఛార్జ్ చేశారు. దీనికి ప్రతిగా నిరసనకారులు పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు బలగాలను రప్పించగా, హుణుసూరులో పరిస్థితి ఉద్విగ్నంగా మారాయి. పోలీసుల లాఠీచార్జ్, నిరసనకారుల రాళ్ల దాడిలో ఇరువర్గాలకూ గాయాలయ్యాయి. నేడు సోమవారం హుణుసూరు బంద్ హుణుసూరులో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మిర్లే శ్రీనివాస్‌గౌడ మాట్లాడుతూ..సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకంగా విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇతర మతాలకు ఊరేగింపు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చి హిందువుల పండుగలకు మాత్రం ఊరేగింపులకు అనుమతులు ఇవ్వకుండా పోలీసులతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా సోమవారం హుణుసూరు పట్టణం బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ ప్రతాపసింహా వీరావేశం ఊరేగింపులో పాల్గొనడానికి హనుమ మాలను ధరించి మైసూరు నుంచి వస్తున్న ఎంపీ ప్రతాపసింహాను అడ్డుకోవడానికి పోలీసులు బిళికెరె గ్రామం వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆవేశం చెందిన ఎంపీ ప్రతాపసింహా తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా వెనక్కి తగ్గకపోవడంతో మరింత ఆక్రోశం చెందిన ఎంపీ ప్రతాపసింహా ఎలా ఆపుతారో చూస్తానంటూ కారును వేగంగా నడుపుతూ బ్యారికేడ్లను గుద్దుకుంటూ దూసుకెళ్లారు. అక్కడే ఉన్న మహిళా పోలీసు అధికారి అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఎంపీ అదే వేగంతో దూసుకు రాగా, ఆమె పక్కకు దూకేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హుణుసూరు డీఎస్పీ మరో 50 మంది సిబ్బందితో కలసి హుణుసూరు పట్టణ శివార్లలో ఎంపీ ప్రతాపసింహాను అడ్డుకొని అంతరసంతకు తరలించారు. బారికేడ్లను ఢీకొట్టడం, మహిళా పోలీసు అధికారి గాయమవడానికి కారణమయ్యారంటూ ఎంపీపై బిళికెరె పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. -
అభిప్రాయం చెప్పటం కూడా తప్పేనా?
శివాజీనగర (బెంగళూరు): ఏదైనా విషయంపై అభిప్రాయం చెప్పడం కూడా తప్పేనా? అని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని చెప్పారు. అయితే ట్రాల్ పేరుతో ఈ హక్కును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, దీనికి సంబంధించి మైసూరు ఎంపీ ప్రతాప్ సింహకు కోర్టు నోటీసులు పంపించినట్లు తెలిపారు. సమాధానం ఇవ్వకపోతే క్రిమినల్ కేసు వేస్తానని హెచ్చరించారు. కాగా, ‘ట్రాల్ గూండాయిజం’పై ‘జస్ట్ ఆస్క్’ అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఒక వ్యవస్థ గురించి మాట్లాడితే.. మీ ముక్కు కత్తిరిస్తామంటూ ట్రాల్ చేసి చంకలు గుద్దుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతాప్ సింహ వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయ నాయకులు దేశానికి అవసరమా అని ప్రశ్నించారు. -
బీజేపీ ఎంపీకి ప్రకాశ్ రాజ్ లీగల్ నోటీసు
భారతీయ జనతా పార్టీకి చెందిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహాకు నటుడు ప్రకాశ్ రాజు గురువారం లీగల్ నోటీసులు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీపై తాను చేసిన వ్యాఖ్యలపై, బీజేపీ ఎంపీ మండిపడుతూ ప్రతి కామెంట్లు చేయడంతో ప్రకాశ్ రాజు ఈ నోటీసులు పంపారు. ఒకవేళ ఎంపీ లీగల్‌గా స్పందించకపోతే, క్రిమిషనల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రకాశ్ రాజు హెచ్చరించారు. ''మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు లీగల్ నోటీసు పంపాను. దేశ ఒక పౌరుడిగా ఆయన అలా నాపై కామెంట్లు చేయడం, నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లేలా చేసింది. లీగల్‌గా ఆయన నాకు సమాధానం చెప్పాలి. ఒకవేళ అలా చేయని పక్షంలో ఎంపీకి వ్యతిరేకంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటా'' అని ప్రకాశ్ రాజు తెలిపారు. అక్టోబర్ 3న బెంగళూరులో ఓ ఈవెంట్లో పాల్గొన్న ప్రకాశ్ రాజు గౌరి లంకేష్ హత్యపై స్పందించారు. హత్య చేసిన వారిని పట్టుకోకపోగా, ఆమె హత్యను సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ మౌనం వహించారని, ఆయన అనుచరులు ఆమె హత్య జరిగితే సంబరాలు చేసుకున్నారని తెలిపారు. ప్రకాశ్ రాజు చేసిన ఈ కామెంట్లపై బీజేపీం ఎంపీ స్పందించారు. ప్రకాశ్ రాజు ఈ కామెంట్లు చేస్తారు ఎందుకంటే గౌరి ఆయనకి స్నేహితురాలన్నారు. ప్రో-హిందూ ఆర్గనైజేషన్స్‌కు చెందిన 12 మందిని పైగా హత్య చేసినప్పుడు ప్రకాశ్ రాజు ఎక్కడున్నారంటూ బీజేపీ ఎంపీ మండిపడ్డారు. -
ప్రకాష్ రాజ్ ఇంకోసారి ప్రధానిని విమర్శించారో..
మైసూరు: పత్రికా సంపాదకురాలు గౌరి లంకేశ్ హత్య విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ప్రతాప్ సింహ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హిందూ సంఘాలకు చెందిన 12మంది కార్యకర్తలు హత్యకు గురైనప్పుడు ప్రకాశ్‌రాజ్ ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో భ్రష్టుపట్టిన న్యాయవ్యవస్థ కారణంగానే గౌరీ లంకేశ్ హత్య జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి ప్రధాని నరేంద్రమోదీని విమర్శించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకపై ప్రకాశ్‌రాజ్‌కు అంత ప్రేమ ఉంటే కావేరి నదీ జలాల పంపిణీ వివాదంపై ఎందుకు స్పందించలేదన్నారు. తమిళనాడులో ప్రకాశ్‌రాజ్‌గా కర్ణాటకలో ప్రకాశ్‌రైగా చలామణి అవుతున్న ఆయనకు ప్రధానిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు, విమర్శలు చేస్తే అదే వేదికపైకి వచ్చి ఆయనకు అన్ని విషయాలు వివరించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
'ఆమెపై నా మాటలు తప్పే'
మైసూరు: గుండ్లుపేట నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గీతా మహాదేవప్రసాద్‌పై తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలను మైసూరు ఎంపీ ప్రతాపసింహ ఆదివారం వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమెను క్షమాపణ కూడా కోరడం జరిగింది. శనివారం బన్నితాళపురలో బీజేపీ అభ్యర్థి నిరంజన్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ప్రతాపసింహ మాట్లాడుతూ భర్త చనియిన మూడు రోజులకే గీతా మహాదేవ ప్రసాద్ తానే అభ్యర్థిని అని ప్రకటించుకున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆదివారం ప్రతాపసింహ మైసూరులో మీడియా సమావేశం పెట్టి తన మాటలు గీత మహాదేవప్రసాద్‌కు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని అన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఆ స్థానం ఇవ్వడం జరుగుతుందని, ఇలా అన్ని పార్టీలు చేస్తున్నాయని అన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని, ఆమెను బాధపెట్టి ఉంటే క్షమించాలని, తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. -
'కౌర్ ను దావూద్ తో పోల్చిన ఎంపీ'
బెంగళూరు: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా గళం విప్పిన ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్మెహర్ కౌర్ ను మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చారు. కౌర్ కంటే దావూదే నయమని వ్యాఖ్యానించారు. జాతి వ్యతిరేక విధానాన్ని ప్రకటించుకోవడానికి దావూద్ ఇబ్రహీం తన తండ్రి పేరును వాడుకోలేదని ప్రతాప్ సింహా అన్నారు. గుర్మెహర్ కౌర్ వ్యవహార శైలిని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే కశ్మీర్, బస్తర్ కు స్వాతంత్ర్యం కావాలని నినాదాలు చేయమేనా అంటూ మండి పడ్డారు. గుర్మెహర్ కౌర్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాసటగా నిలిచారు. దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని, వారి గూండాయిజంకు వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి: బెదిరింపులపై డీయూ విద్యార్థిని ఫిర్యాదు నన్ను రేప్ చేస్తామని బెదిరించారు ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! -
13వేల అడుగుల ఎత్తు నుంచి దూకిన ఎంపీ
మైసూరు: కర్ణాటకలో తొలిసారి ప్రతాప్ సింహా అనే ఎంపీ రికార్డు సృష్టించాడు. ఏకంగా 13,000 అడుగుల ఎత్తునుంచి స్కై డైవింగ్ చేసి అబ్బుర పరిచారు. ఆయన ఈ సాహసం చేసే సమయంలో తోడుగా ఓ అమెరికన్ మెంటర్ కూడా ఉన్నారు. సోమవారం ఈ ఎడ్వంచర్ ఫీట్‌కు ఆయన తెర తీశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి అధికారికంగా స్కై డైవింగ్ చేసే కార్యక్రమాన్ని మైసూరులో ప్రారంభించిన విషయం తెలిసిందే. మైసూరు, కొడగు జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే ఆయన ఈ పనిచేశారు. ప్రతాప్ సింహా(38) మైసూరు కొడగు జిల్లాల నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. స్కై డైవ్ చేసిన తర్వాత సురక్షితంగా మైసూరు విమానాశ్రయంలో దిగిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ' నాలుగు సీట్లు మాత్రమే ఉండే సెస్నా విమానంలో కూర్చున్న నేను నా మనసులో నిర్ణయించుకున్నట్లుగా 13,000 అడుగుల ఎత్తుకు వెళ్లాను. జంప్ చేయడానికి కొద్ది సమయం ముందు కొంత భయం వేసింది. కానీ చివరికి జంప్ చేశాను. దాంతో ఈ సాహసం నా జీవితంలోనే ఒక గొప్ప అనుభవంగా మిగిలిపోయింది. డైవింగ్ చేస్తున్న సమయంలో నేను ఎంత థ్రిల్‌గా ఫీలయ్యానో వర్ణించలేను. మైసూరులో స్కై డైవింగ్ కార్యక్రమాన్ని సుకాకిని అనే ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తోంది. దేశంలో ఇలాంటి సాహస కృత్యాలు అతి కొద్ది మంది నాయకులు మాత్రమే చేశారు.