భారతీయ జనతా పార్టీకి చెందిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహాకు నటుడు ప్రకాశ్ రాజు గురువారం లీగల్ నోటీసులు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీపై తాను చేసిన వ్యాఖ్యలపై, బీజేపీ ఎంపీ మండిపడుతూ ప్రతి కామెంట్లు చేయడంతో ప్రకాశ్ రాజు ఈ నోటీసులు పంపారు. ఒకవేళ ఎంపీ లీగల్‌గా స్పందించకపోతే, క్రిమిషనల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రకాశ్ రాజు హెచ్చరించారు. ''మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు లీగల్ నోటీసు పంపాను. దేశ ఒక పౌరుడిగా ఆయన అలా నాపై కామెంట్లు చేయడం, నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లేలా చేసింది. లీగల్‌గా ఆయన నాకు సమాధానం చెప్పాలి. ఒకవేళ అలా చేయని పక్షంలో ఎంపీకి వ్యతిరేకంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటా'' అని ప్రకాశ్ రాజు తెలిపారు.
అక్టోబర్ 3న బెంగళూరులో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రకాశ్ రాజు గౌరి లంకేష్ హత్యపై స్పందించారు. హత్య చేసిన వారిని పట్టుకోకపోగా, ఆమె హత్యను సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ మౌనం వహించారని, ఆయన అనుచరులు ఆమె హత్య జరిగితే సంబరాలు చేసుకున్నారని తెలిపారు. ప్రకాశ్ రాజు చేసిన ఈ కామెంట్లపై బీజేపీం ఎంపీ స్పందించారు. ప్రకాశ్ రాజు ఈ కామెంట్లు చేస్తారు ఎందుకంటే గౌరి ఆయనకి స్నేహితురాలన్నారు. ప్రో-హిందూ ఆర్గనైజేషన్స్‌కు చెందిన 12 మందిని పైగా హత్య చేసినప్పుడు ప్రకాశ్ రాజు ఎక్కడున్నారంటూ బీజేపీ ఎంపీ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment