కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు | BJP Leader Dr Laxman Slams CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు

Published Thu, Jan 4 2018 3:50 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

BJP Leader Dr Laxman Slams CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు నిరంతర విద్యుత్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేంద్రం చొరవ వల్లనే ఇది సాధ్య మైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అదనంగా ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ కూడా ఉత్పత్తి చేయలేక పోయిన రాష్ట్ర ప్రభుత్వం అబద్ధపు ప్రకటన లతో మోసం చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌ లోటు ను అధిగమించేందుకు ప్రధాని మోదీ లక్ష్యం విధించుకుని కృషి చేసిన ఫలితంగా ఏకంగా 19 రాష్ట్రాల్లో మిగులు కరెంటు ఉండేలా చేశా రని, అందులో తెలంగాణ కూడా భాగమ న్నారు. బుధవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌ వర్గీయతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

రామ గుండంలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్ప త్తికి ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేశారని, దీన్ని కూడా తమ ఘనతగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పుకోవటం విడ్డూ రంగా ఉందన్నారు. కేంద్రం చొరవతో రాష్ట్రంలో 3,500 మెగావాట్ల ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడిందని, విద్యుదు త్పత్తి కోసం రాష్ట్రానికి రుణ సాయం పెంచటం, నార్త్‌–సౌత్‌ గ్రిడ్‌ అనుసంధానం, ఉదయ్‌ పథకంలో రాష్ట్రం చేరేలా చేయటం తదితర చర్యల వల్లనే ఇది సాధ్యమైందని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. ఈ వాస్తవాలను పక్కన పెట్టి కేవలం తన ఘనత వల్లనే నిరంతర విద్యుత్‌ సాధ్యమైంద న్నట్టుగా కేసీఆర్‌ చెప్పుకుంటున్నారని, ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కూ  ఇవే అవాస్తవాలు వివరించారన్నారు. ఎస్సీల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

తెలంగాణలోనూ అధికారం: కైలాశ్‌
మోదీ హవాతో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధి కారంలోకి వచ్చినట్టుగానే తెలంగాణలోనూ అధికారం సాధిస్తామని ౖMðలాశ్‌ పేర్కొన్నారు. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తు న్నామన్నారు. తాను కరీంనగర్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కార్యకర్తలు సంతోషంగా ఉన్న విషయాన్ని గుర్తించానన్నారు.  విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, మనోహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement