తమ పట్ల వివక్ష చూపుతున్నారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం సెక్రటేరియట్లో ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ : తమ పట్ల వివక్ష చూపుతున్నారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం సెక్రటేరియట్లో ఆందోళనకు దిగారు. తమ పట్ల వివక్ష చూపుతున్నారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం సెక్రటేరియట్లో ఆందోళనకు దిగారు. మంగళవారం ప్రజా సమస్యలపై సీఎంతో మాట్లాడేందుకు సచివాలయంకు వచ్చారు. కాగా, సమయం 11 గంటలైనా సీఎం సచివాలయానికి రాకపోవడంతో కాసేపు నిరిక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు. అనంతరం సచివాలయంలోని సీ-బ్లాక్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దాంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు.