ఇండోర్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేత వివాదంలో చిక్కుకున్నారు. అసభ్యకరమైన బట్టలు(డర్టీ క్లాత్స్) ధరించే అమ్మాయిలు రామాయణంలో శూర్పణఖ మాదిరి కనిపిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది.
మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో మహవీర్ జయంతి సందర్భంగా జైన సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను ఆయన తప్పుపట్టారు. రాత్రిపూట బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్న యువతీ యువకులు కనిపిస్తుంటారని.. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను.. వారిని చూస్తుంటే గట్టిగా చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘మహిళలను మనం దేవతలా ఆరాధిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అసభ్యకరంగా దుస్తులు ధరించిన కొంతమంది ఆడవాళ్లను చూస్తుంటే శూర్పణఖలా కనిపిస్తారు. దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చాడు. మంచి దుస్తులు వేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్దులు నేర్పాలి’ అని సూచించారు.
అయితే విజయ్‌వర్గియా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళల పట్ల ద్వేషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలతో పురుషాధిక్యత, పితృస్వామ్య భావజాలన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ నేతలు ఇలా మాట్లాడటం సరికాదని.. బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కైలాష్ విజయవర్గియా ఇంలాటి వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదంలో ఇరుకున్నారు.
చదవండి: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో తప్పిన ప్రమాదం..
BJP Leader @KailashOnline says girls dress badly & look like ‘Shurpanakha’. This is a reprehensible & demeaning insult to every woman of this country
— Dr. Shama Mohamed (@drshamamohd) April 8, 2023
Where is @smritiirani now? Does she condone this disgusting statement? Or does she only find her voice to attack @RahulGandhi! pic.twitter.com/hzoxrnZpl1
Comments
Please login to add a commentAdd a comment