benifit
-
నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు!
చెట్లు అందించే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే పట్టణాల్లోని చెట్లు ఆ ప్రాంతానికి మరింత ప్రయోజనాన్ని కల్పిస్తాయి. అవేమిటో 12 పాయింట్లలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉష్ణోగ్రత నియంత్రణ ఒక పెద్ద వృక్షం 10 ఎయిర్ కండిషనింగ్ యూనిట్లకు సమానం. అది అందిచే నీడ ఆ ప్రాంత ఉష్ణోగ్రతను 30 శాతానికి మించి తగ్గిస్తుంది. 2. శబ్ద కాలుష్యానికి చెక్ చెట్లు 50 శాతం మేరకు శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వాహనాలు, నిర్మాణ పనులు, సైరన్లు ఇతరత్రా శబ్దాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో చెట్లు ఆ శబ్దాన్ని నిరోధించడానికి ఉపకరిస్తాయి. ఇళ్లు, కార్యాలయాలను నిశ్శబ్దంగా ఉంచడానికి వృక్షాలు దోహదపడగాయి. 3. స్వచ్ఛమైన గాలి చెట్ల నుంచి విడుదలయ్యే గాలి.. హానికరమైన కాలుష్య కారకాలను, టాక్సిన్లను భారీ మొత్తంలో తొలగిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చెట్లు మనకు పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి. 4. ఆక్సిజన్ అందిస్తూ.. కాలుష్యాలను తరిమికొట్టే చెట్లు మరింత ఆక్సిజన్‌ను కూడా అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉంటాయి. చెట్లు ఈ సమస్యను పరిష్కరించడానికి దోహదపడతాయి. 5. నీటి నిర్వహణ చెట్లు మనకు భవనాలకు మించిన ఆశ్రయం కల్పిస్తాయి. వర్షాలు కురిసే సమయంలో చెట్లు భారీ మొత్తంలో నీటిని గ్రహిస్తాయి. వరదల తీవ్రతను నియంత్రిస్తాయి. వరదలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. చెట్లు కాలుష్య కారకాలను గ్రహిస్తాయని, నీటి వనరులను కాపాడుతాయనే విషయాన్ని మనం మరచిపోకూడదు. 6. మానసిక ఆరోగ్యం పరిశుభ్రమైన పట్టణ పరిసరాల కంటే ప్రకృతి మధ్యలో మెలిగే మనుషులు సంతోషంగా ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది. మన భావోద్వేగాలు, ప్రవర్తన, ఆలోచనలు మనం ఉంటున్న ప్రదేశాలపై ఆధారపడివుంటాయి. చెట్లు మన మనస్తత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మనిషి శాంతియుతంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు అపారం. 7. శారీరక ఆరోగ్యం చెట్లు గాలి నాణ్యతను మెరుగు పరుస్తాయి. పట్టణంలోని చెట్లతో కూడిన వాతావరణం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చెట్లు విరివిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్, రన్నింగ్, నడక మొదలైనవి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. 8. గోప్యత చెట్లు గోప్యతను అందిస్తాయి. ఇంటివాతావరణాన్ని కల్పిస్తాయి. 9. ఆర్థికపరంగా.. పట్టణంలోని చెట్లు అందించే ఆర్థిక ప్రయోజనాలను లెక్కించడం కష్టం. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల మరమ్మతులకు చెట్లు ఉపకరిస్తాయి. చెట్లను పెంచే ఖర్చు కంటే అవి అందించే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. చెట్లు నగరాలను సంపన్నం చేస్తాయి. 10. వన్యప్రాణులకు ఆవాసం పక్షులు,క్షీరదాలు, కీటకాలతో సహా వందలాది విభిన్న జాతులకు ఆవాసంగా చెట్లు ఉపకరిస్తాయి. 11. కాంతి కాలుష్యం చెట్లు కాంతి కాలుష్యాన్ని అడ్డుకోవడమే కాకుండా, మనల్ని, మన నగరాలను చల్లగా ఉంచుతాయి. చెట్లు ఉన్న నగరాల్లో ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 12. ఆహ్లాదాన్ని అందిస్తూ.. చెట్లు అందంగా ఉంటాయి. గ్రేస్కేల్ రోడ్లు, భవనాలు, అంతులేని ట్రాఫిక్ మధ్య చెట్లు ఉపశమనాన్ని కల్పిస్తాయనడంలో సందేహం లేదు. 12 Reasons Why Cities Need More Trees: 1. Temperature Control One large tree is equivalent to 10 air conditioning units, and the shade they provide can reduce street temperature by more than 30%. 2. Noise Reduction Trees can reduce loudness by up to 50%. In urban areas… pic.twitter.com/KRfskttfxx — The Cultural Tutor (@culturaltutor) August 28, 2023 -
China Pak cpec Corridor: నాడు దోస్తీ కోసం.. నేడు ఉద్రిక్తతలకు నిలయం
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2013లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)కి కూడా ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ కింద చైనా.. పాకిస్తాన్లో పది బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టింది. దీనిలో భాగంగా భారీ రవాణా, ఇంధనం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసింది. మిశ్రమ ఫలితాలు రాజకీయ తిరుగుబాట్లు, ఉగ్రవాద దాడుల భయం సీపెక్‌కు ఎల్లప్పుడూ సవాలుగా నిలిచింది. ఈ దశాబ్దంలో సీపెక్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా ప్రాథమిక లక్ష్యం అరేబియా సముద్రానికి ప్రత్యక్ష అనుసంధానం. ఇది ఇప్పటికీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. అయితే కారిడార్ కారణంగా పాకిస్తాన్ తన స్వల్పకాలిక లక్ష్యాలను చేరుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. పాక్‌కు చైనా ఉపశమనం ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌కు అత్యంత విశ్వసనీయ విదేశీ భాగస్వాములలో చైనా ఒకటిగా నిలిచింది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్‌కు చైనా ఎంతగానో సహాయం చేసింది. తాజాగా పాకిస్తాన్‌కు చైనా $ 2.4 బిలియన్ల రుణాన్ని అందించింది. ఇది దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌కు పెద్ద ఉపశమనంలా మారింది. గత ఏడాది ఐఎంఎఫ్ అందించిన నివేదిక ప్రకారం పాకిస్తాన్‌కు ఉన్న మొత్తం అప్పులో 30 శాతం చైనా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుండి వచ్చింది. పాక్-చైనాల బంధం ఇలా.. భారత పొరుగుదేశాలైన పాక్- చైనాలు 596 కిలో మీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటాయి. ఇది సియాచిన్ నుండి కారాకోరం వరకు విస్తరించి ఉంది. పాకిస్తాన్ రాజకీయ నేతలు చైనాతో తమ సంబంధాలను ప్రస్తావించినప్పుడు అవి హిమాలయాల కంటే ఎత్తుగా, సముద్రం కంటే లోతుగా, తేనె కంటే తియ్యగా' ఉండాలని అభివర్ణిస్తారు. అయితే సీపెక్ కొన్నేళ్లుగా ఉద్రిక్తతలకు నిలయంగా ఉంది. సీపెక్ మార్గంలో చైనా నేరుగా హిందూ మహాసముద్రం వరకూ చేరుకుంటుంది. పాక్ ప్రజల నిరసన అయితే సీపెక్‌లో పనిచేస్తున్న పౌరుల భద్రత ఇరు దేశాలకు పెద్ద సమస్యగా మారింది. ప్రాజెక్ట్ చుట్టూ తీవ్రవాద దాడులు జరిగాయి. వీటిలో పెద్ద సంఖ్యలో చైనా పౌరులు కూడా మరణించారు. తాజాగా సీపెక్ పరిధిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. సీపెక్ కారిడార్ చైనాకు పశ్చిమ ప్రాంతంలోని జిన్జియాంగ్ను పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లోగల గ్వాదర్ ఓడరేవుకు కలుపుతుంది. కాగా ఈ ప్రాజెక్టుల వల్ల తమకు ప్రయోజనం కలగడం లేదని వాయువ్య పాకిస్తాన్‌లోని ప్రజలు నిరసరన వ్యక్తం చేస్తున్నారు. చైనా ప్రయోజనాలను కాపాడేందుకు తమపై వేలాది మంది పాక్ సైనికులను మోహరించినట్లు బలూచ్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. పాక్ వాదనకు చైనా ఖండన 2021లో క్వెట్టాలోని ఒక విలాసవంతమైన హోటల్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు మరణించారు. అలాగే దాసు డ్యామ్ వైపు వెళ్తున్న చైనా ఉద్యోగులతో నిండిన బస్సులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చైనీయులతో సహా మొత్తం 12 మంది మరణించారు. గ్యాస్ లీకేజీ వల్లే ఈ పేలుడు సంభవించిందని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ చైనా మాత్రం దీనిని ఉగ్రవాద దాడిగా పరిగణిస్తోంది. ఇది కూడా చదవండి: నాటి షబ్నం.. నేటి మీరా.. కృష్ణ ప్రేమలో మునిగితేలుతున్న లేడీ బౌన్సర్ -
25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు శుభవార్త
రాజస్థాన్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలో 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు పూర్తి పెన్షన్ అందించనున్నట్లు వెల్లడించింది. జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అధ్యక్షత జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్యాబినెట్ సమావేశంలో రాజస్థాన్ సివిల్ సర్వీస్ (పెన్షన్) నిబంధన 1996 సవరణ ప్రతిపాదనకు అనుమతి లభించింది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగంలో 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం పూర్తి పెన్షన్ అందుకోనున్నారు. అయితే విధమైన లబ్ధి పొందాలంటే ప్రభుత్వ ఉద్యోగి 28 ఏళ్ల సర్వీసు పూర్తి చేయడం తప్పనిసరి. దీనితో పాటు 75 ఏళ్ల పింఛనుదారుడు లేదా అతని ఫ్యామిలీ 10 శాతం అదనపు పెన్షన్ భత్యం అందుకుంటారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నూతన నిర్ణయం ప్రకారం పింఛనుదారు మరణించిన తరువాత రూ. 12,500 వరకూ ప్రతీనెలా ఆదాయం అందుకునే అతని వివాహిత కుమారుడు లేదా కుమార్తె కూడా ఫ్యామిలీ పెన్షన్ అందుకునేందుకు అర్హులవుతారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ కొత్త సవరణ నోటిఫికేషన్ 2023 ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుంది. చదవండి: చిత్రాలు గీసేందుకు చేతులెందుకు? -
ఆక్వాకు ఉజ్వల భవిత
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆక్వా రంగం మరింత పురోభివృద్ధి సాధించేలా, రైతులకు మేలు కలిగేలా స్టేక్ హోల్డర్స్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులు, ఫీడ్ ఉత్పత్తిదారులు, హేచరీల నిర్వాహకులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ఫీడ్ ధర కిలో రూ.2.50 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రొయ్య పిల్లను 36 పైసలకు విక్రయిస్తుండగా, ఆరు పైసలు తగ్గించి 30 పైసలు చేశారు. రైతులు నష్టపోకుండా నాణ్యమైన రొయ్య సీడ్ ఉత్పత్తికి అత్యంత ఆధునిక లేబొరేటరీలు నిర్వహించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ లేబొరేటరీల ద్వారా రొయ్య సీడ్లో యాంటీబయాటిక్స్ లేకుండా చూడాలని నిర్ణయించారు. ప్రతి నెలా 1, 11, 21 తేదీల్లో ధరలపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. రొయ్యల చెరువుల వద్ద పట్టుబడి జరిగిన తరువాత సాధ్యమైనంత త్వరగా రొయ్యలను ఐస్‌లో వేసి తాజాదనం కోల్పోకుండా చూడాలని, ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఆక్వా రంగంలోని అన్ని వర్గాల వారితో వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయాలు అమలయ్యేటట్టు చూడాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. తక్కువ సాంద్రత కలిగి 25 నుంచి 60 మధ్య కౌంట్ సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. మెరుగైన ఉత్పాదకత, నాణ్యత కోసం రైతులకు పూర్తి స్థాయిలో సేవలందించే బాధ్యతను మేత తయారీదారులు తీసుకోవాలని సూచించారు. పెట్టుబడి ధరలను సమీక్షించిన అనంతరమే ఫీడ్ ధర ఖరారు చేసేందుకు ఫీడ్ తయారీదారులు ఆమోదం తెలిపారు. విధిగా నెలకోసారి ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులు, ఫీడ్ ఉత్పత్తిదారులు, హేచరీల నిర్వాహకులు అనుకూలమైన ప్రాంతంలో సమావేశమై, సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. ఆక్వా సాగు, రవాణా, కొత్త ట్రెండ్లు, నోటిఫికేషన్లు, ముందస్తు హెచ్చరికలు, దేశీయ మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్, ఎగుమతిదారులు సమన్వయంతో ముందుకు సాగాలని తీర్మానించారు. ల్యాబ్‌లు ఏర్పాటు, నిర్వహణ విషయంలో హేచరీ యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: మా ‘విడాకులు’ తెగుతున్నాయి) -
ఏపీలో పలు థియేటర్లు సీజ్.. కొనసాగుతున్న తనిఖీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను బుధవారం సీజ్ చేశారు. నూజివీడు, అవనిగడ్డ, గుడివాడలో తనిఖీలు చేపట్టారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ టిక్కెట్ల ధరలు, ఫుడ్ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కృష్ణాజిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేశామని తెలిపారు. లైసెన్సులు రెన్యూవల్ చేయని థియేటర్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. తనిఖీలు రెగ్యులర్‌గా కొనసాగుతాయన్నారు. బెనిఫిట్ షోలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేస్తారన్నారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లలో తిను బండరాలు, పార్కింగ్ విషయంలో దోపిడీ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జాయింట్ కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. -
రిటైర్మెంట్ వయసు పెంపుతో 43,811మందికి లబ్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పొడిగించడంతో 43,811 మందికి (2025 వరకు లెక్కిస్తే) ఉద్యోగంలో కొనసాగే అవకాశం దక్కింది. వివిధ శాఖల్లో జనవరిలో 440 మంది, ఫిబ్రవరిలో 444 మంది పదవీ విరమణ పొందారు. ఈ నెలలో మరో 563 మంది రిటైర్ కావాల్సి ఉండగా సీఎం ప్రకటనతో వారు సర్వీసులో కొనసాగే అవకాశం దక్కింది. వారితో సహా ఈ ఏడాది పదవీ విరమణ పొందే వారు 7,954 మంది మరో మూడేళ్లు కొలువులో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది రిటైరయ్యే వారు, ఆ తరువాత ఏళ్లలో రిటైరయ్యే వారికి రిటైర్మెంట్ వయసు పెంపు ప్రయోజనం లభించనుంది. 2025 వరకు తీసుకుంటే మొత్తంగా 43,811 మందికి అదనంగా మూడేళ్లు ఉద్యోగంలో కొనసాగే అవకాశం దక్కనుంది. మరోవైపు ఉద్యోగులు రిటైరయ్యాక లభించే రూ. 12 లక్షల గ్రాట్యుటీని రూ. 16 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో ఆ ప్రయోజనాలు సర్వీసులో ఉన్న అందరికీ లభించనున్నాయి. పీఆర్సీని 12 నెలల ముందు నుంచే అమలు చేస్తామని సీఎం పేర్కొనడంతో 2020 ఏప్రిల్ 1 నుంచి మార్చి 21 వరకు రిటైరైన 7,080 మంది పెన్షనర్లకు కూడా గ్రాట్యుటీ ప్రయోజనాలు అందనున్నాయి. వారికి అదనంగా రూ. 4 లక్షల చొప్పున ప్రయోజనం చేకూరనుంది. వాస్తవానికి పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. అయితే కటాఫ్‌గా దానినే తీసుకున్నా.. 2020 ఏప్రిల్ 1 నుంచే అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. అంటే అప్పటి నుంచి 2021 మార్చి 31 వరకు బకాయిలను పెన్షన్‌లో జమ చేయనున్నారు. దీంతో పీఆర్సీ అమలు చేయాల్సిన 2018 జూలై 1 నుంచి 2020 మార్చి 31లోగా రిటైర్ అయిన దాదాపు 12,500 మందికి గ్రాట్యుటీ పెంపు రూపంలో అందాల్సిన రూ. 4 లక్షల అదనపు నగదు ప్రయోజనాలు అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. -
ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ విలీనమైతే ఎవరికి లాభం?
న్యూఢిల్లీ: ఈ కామర్స్‌లో పోటీ పోటీగా దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు ఒకదానిలో ఒకటి విలీనం అవుతాయా? అదే జరిగితే ఎవరికి ఎక్కువ లాభం ? ఎవరికి తక్కువ లాభం ? రెండింటికి లాభమేనా? ఇప్పటికే భారత్‌లో ‘ఈ బే’ను కొనేసిన ఫ్లిప్‌కార్ట్ తనకంటె వెనకబడిన స్నాప్‌డీల్‌ను కొనేందుకు ముందుకు వస్తుందా? గత కొన్ని రోజులుగా ఈ రెండు సంస్థలు కలసిపోతున్నాయన్న వార్తలు వినిపిస్తుండడంతో మార్కెట్ వర్గాల్లో ఇలాంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ఈ మార్కెట్ రంగంలో అమెరికా దిగ్గజ సంస్థ అమెజాన్ దూసుకుపోతున్న నేపథ్యంలో మార్కెట్లో సుస్థిర స్థానాన్ని సాధించుకోవాలంటే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు విలీనం కావాల్సిన అవసరం ఉంది. అమెజాన్‌ను ఎదుర్కోవాలంటే స్నాప్‌డీల్ మాతృసంస్థయిన జోసఫ్ ఇన్ఫోటెక్లో 35 శాతం వాటా కలిగిన జపాన్ సాఫ్ట్ బ్యాంక్ సహాయం ఫ్లిప్‌కార్ట్‌కు అవసరం. అధిక రెవెన్యూ కలిగిన ఫ్లిప్‌కార్ట్‌కు మార్కెట్లో స్నాప్‌డీల్ ప్రదర్శిస్తున్న దూకుడుతత్వం కూడా అవసరమేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొనడం వల్ల అనేక సంస్థలు ఎంత చమటోడ్చినా ఆశించిన లాభాలను అందుకోలేక పోతున్నాయి. పదేళ్ల క్రితం రంగప్రవేశం చేసిన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు ఇప్పటి వరకు లాభాలు చూపించలేకపోయాయి. ఈ రెండు సంస్థలు కలసిపోవడం వల్ల ఈ మార్కెట్లో వేడెక్కిన పోటీ వాతావరణం కొంత చల్లబడుతుందని అట్లాంటాలోని పెట్టుబడుల బ్యాంకైన ‘సన్‌ట్రస్ట్ రాబిన్సన్ హంప్రే’ విశ్లేషకులు చెబుతున్నారు. తమ అమ్మకాల మొత్తం విలువ (జీఎంవీ) 400 కోట్ల డాలర ్లకు (25,858 కోట్ల రూపాయలు) చేరుకుందని 2014–15 సంవత్సరంలోనే ఫ్లిప్‌కార్ట్ ప్రకటించగా, ఆ తర్వాత కొంతకాలానికి స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బహల్ ప్రకటించారు. అమ్మకాల మొత్తం వెలువ ఎక్కువగా ఉన్నంత మాత్రాన మార్కెట్లో సుస్థిరంగా నిలవగల పరిస్థితి ఉండదని, నిర్వహణ రెవెన్యూ ఎక్కువ ఉండడం వల్లనే నిలిదెక్కుకోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరానికి ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 1400 కోట్ల డాలర్ల పెట్టుబడులను సేకరించగా, బొత్తిగా పెట్టుబడులులేక స్నాప్‌డీల్ సంస్థ సతమతమవుతున్నది. ప్రజాదరణలోనూ, అంటే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్యలోనూ ప్లిప్‌కార్ట్ ఎంతో ముందుండగా, స్నాప్‌డీల్ వెనకబడి పోయింది. 2016 లెక్కల ప్రకారం అనుబంధ సంస్థలైన మింత్ర, జబాంగ్‌లను కలుపుకొని ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను దాదాపు నాలుగున్నర కోట్ల మంది ఖాతాదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ విషయంలో కూడా స్నాప్‌డీల్ వెనకబడే ఉన్నది. రెండు సంస్థల విలీనం వల్ల ఎక్కువ ప్రయోజనం స్నాప్డీల్కే ఉన్నప్పటికీ మార్కెట్ పోటీ పరిస్థితుల దృష్ట్యా రెండు సంస్థలు విలీనం అవడమే ఉత్తమమార్గమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
క్యాన్సర్ చికిత్సలో సంగీతం!
వాషింగ్టన్: క్యాన్సర్ చికిత్సలో సింగీతం మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. సంగీతం ద్వారా క్యాన్సర్ పేషంట్లలో మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా సానుకూల మార్పులు గుర్తించినట్లు ఫిలడెల్ఫియాలోని డ్రెక్సెల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. సంగీతం ద్వారా ఆందోళన, అలసట, నొప్పి తగ్గడంతో పాటు జీవన నాణ్యత పెరుగుతుందని వారు తెలిపారు. సుమారు నాలుగువేల మంది క్యాన్సర్ పేషంట్లను పరిశీలించి వారిలో కొందరికి మ్యూజిక్ థెరపీ ద్వారా చికిత్స అందించారు. అయితే, మ్యూజిక్ థెరపీ ద్వారా చికిత్స అందించిన క్యాన్సర్ పేషంట్లలో ఓవరాల్‌గా మంచి ఫలితాలను గుర్తించినట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ జోక్ బ్రాట్ వెల్లడించారు. నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందుల వాడకాన్ని మ్యూజిక్ థెరపీ ద్వారా తగ్గించొచ్చని ఆయన తెలిపారు. హృదయ స్పందన, శ్వాసక్రియా రేటుపై కూడా మ్యాజిక్ ప్రభావాన్ని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.