క్యాన్సర్ చికిత్సలో సంగీతం! | Listening to music can be beneficial for cancer patients | Sakshi
Sakshi News home page

క్యాన్సర్ చికిత్సలో సంగీతం!

Published Thu, Aug 18 2016 4:48 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

క్యాన్సర్ చికిత్సలో సంగీతం!

క్యాన్సర్ చికిత్సలో సంగీతం!

వాషింగ్టన్: క్యాన్సర్ చికిత్సలో సింగీతం మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. సంగీతం ద్వారా క్యాన్సర్ పేషంట్లలో మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా సానుకూల మార్పులు గుర్తించినట్లు ఫిలడెల్ఫియాలోని డ్రెక్సెల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. సంగీతం ద్వారా ఆందోళన, అలసట, నొప్పి తగ్గడంతో పాటు జీవన నాణ్యత పెరుగుతుందని వారు తెలిపారు.

సుమారు నాలుగువేల మంది క్యాన్సర్ పేషంట్లను పరిశీలించి వారిలో కొందరికి మ్యూజిక్ థెరపీ ద్వారా చికిత్స అందించారు. అయితే, మ్యూజిక్ థెరపీ ద్వారా చికిత్స అందించిన క్యాన్సర్ పేషంట్లలో ఓవరాల్‌గా మంచి ఫలితాలను గుర్తించినట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ జోక్ బ్రాట్ వెల్లడించారు. నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందుల వాడకాన్ని మ్యూజిక్ థెరపీ ద్వారా తగ్గించొచ్చని ఆయన తెలిపారు. హృదయ స్పందన, శ్వాసక్రియా రేటుపై కూడా మ్యాజిక్ ప్రభావాన్ని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement