audience
-
అలరించిన నృత్యం.. మురిపించిన మువ్వలు (ఫోటోలు)
-
అడవి బాట... బాక్సాఫీస్ వేట
బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసం తెలుగు హీరోలు కొందరు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంతో కూడిన కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ అడవి కథలపై కథనం. అడవిలో ఈగల్ ‘ఎక్కడుంటాడు? అని రవితేజను ఉద్దేశిస్తూ అవసరాల శ్రీనివాస్‌ను అనుపమా పరమేశ్వరన్ అడగ్గానే అడవిలో ఉంటాడు అని సమాధానం చెబుతారు. ఈ సంభాషణ ఇటీవల విడుదలైన ‘ఈగల్’ సినిమా టీజర్లోనిది. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కథ రీత్యా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అడవి నేపథ్యంలో ఉంటాయని టీజర్ స్పష్టం చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఆఫ్రికన్ అడ్వెంచర్ ఆఫ్రికన్ అడవుల్లో వేటకు సిద్ధమౌతున్నారు మహేశ్‌బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రచయిత–దర్శకుడు కె. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని, సహజమైన లొకేషన్స్‌లోనే చిత్రీకరించేలా రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్‌కు మరింత పదును పెడుతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారట. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. అడవుల్లో దేవర ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుంది. అయితే కథ రీత్యా ‘దేవర’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సీన్స్ ఉన్నాయని, ఈ సన్నివేశాల చిత్రీకరణ అడవుల్లో జరుగుతుందని, ఇవి ‘దేవర పార్ట్ 2’లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. పుష్పరాజ్ రూల్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ అల్లుకున్న ఊహాత్మక కథ ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఇప్పటికే విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’ కోసం ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని కీలక సన్నివేశాలు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల మాదిరిగానే ‘పుష్ప: ది రూల్’లోనూ ప్రధాన సన్నివేశాలు అడవుల నేపథ్యంలోనే సాగుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. న్యూజిల్యాండ్‌లో కన్నప్ప శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరుగుతుంది.ప్రస్తుతం అక్కడి లొకేషన్స్‌లోనే ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. కథ రీత్యా ‘కన్నప్ప’ సినిమాలోని చాలా సన్నివేశాలు అడవి నేపథ్యంలోనే ఉంటాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలా అడవి నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్న రీ రిలీజ్ మూవీస్ ధ్వంసం అవుతున్న ధీయేటర్లు
-
గూగుల్ పే 88 వేల క్యాష్ బ్యాక్...
-
రామ్ చరణ్ చుట్టూ ఎగబడ్డ జనం.. వీడియో వైరల్
RRR: Ram Charan Mobbed By Mumbai Fans At Bandra: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతరామారాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌లు అద్భుత నటనతో సంచలన హిట్‌గా దూసుకుపోతోంది. ఈ సినిమాతో రామ్ చరణ్‌కు, ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను రామ్ చరణ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చాడాలన్న ఉద్దేశంతో ఆదివారం సాయంత్రం ముంబై బాంద్రాలోని గెయిటీ గెలాక్సీకి వెళ్లాడు రామ్ చరణ్. అక్కడి ప్రేక్షకులకు రామ్ చరణ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అక్కడ రామ్ చరణ్‌ను చూసిన అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ముంబై ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు చెర్రీ ఎంతో సంతోషించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రామ్ చరణ్ నలుపు రంగు దుస్తులు ధరించి అయ్యప్ప స్వామి మాల దీక్షలో కనిపించాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇదివరకు బాలీవుడ్లో 'జంజీర్' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీకి చాలా మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతరామరాజుగా చెర్రీ పలికించిన హావభావాలు, నటనకు ముంబై ఆడియెన్స్ ఫిదా అయినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఆర్ఆర్ఆర్ వారం రోజుల్లోనే రూ. 700 కోట్లను కొల్లగొట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు మార్కుకు చేరువలో ఉందని అంచనా. ఈ సినిమాలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, అలియా భట్, సముద్ర ఖని, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ కీలక పాత్రల్లో మెప్పించారు. -
ఏపీలో పలు థియేటర్లు సీజ్.. కొనసాగుతున్న తనిఖీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను బుధవారం సీజ్ చేశారు. నూజివీడు, అవనిగడ్డ, గుడివాడలో తనిఖీలు చేపట్టారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ టిక్కెట్ల ధరలు, ఫుడ్ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కృష్ణాజిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేశామని తెలిపారు. లైసెన్సులు రెన్యూవల్ చేయని థియేటర్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. తనిఖీలు రెగ్యులర్‌గా కొనసాగుతాయన్నారు. బెనిఫిట్ షోలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేస్తారన్నారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లలో తిను బండరాలు, పార్కింగ్ విషయంలో దోపిడీ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జాయింట్ కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. -
ఈ సినిమా చూసి ‘వావ్’ అంటారు: దిల్ రాజు
‘‘మడ్డి’ సినిమా టీజర్ చూడగానే వావ్ అనిపించింది. ఆ తర్వాత నేను, హర్షిత్ కలసి చెన్నైలో ఈ సినిమా ప్రివ్యూ చూసినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. థియేటర్లలో ఈ సినిమాని చూసి, ప్రేక్షకులు కూడా వావ్ అంటారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రల్లో డాక్టర్ ప్రగభల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మడ్డి’. ప్రేమ కృష్ణదాస్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్పై ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మడ్ రేస్ నేపథ్యంలో ఈ సినిమా మేకింగ్ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంది. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజవుతున్న ఈ చిత్రం అన్ని భాషల్లో సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. డాక్టర్ ప్రగభల్ మాట్లాడుతూ.. ‘‘ఒక యూనిక్ మూవీని ప్రేక్షకులకు అందించాలని మా టీమ్ ఐదేళ్లు కష్టపడి ‘మడ్డి’ని తీశాం. ప్రీ ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్లకు చాలా కష్టపడ్డాం. ‘కేజీయఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం, ‘రాక్షసన్’ ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటింగ్, కేజీ రతీష్ సినిమాటోగ్రఫీ మా సినిమాకు అదనపు బలం’’ అన్నారు. -
మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన హరర్ చిత్రం
సాక్షి,చెన్నై(తమిళనాడు): మరోసారి భయపెట్టడానికి సీవీ–2 చిత్రం సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం విడుదలైన సీవీ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. దెయ్యం ఒక వ్యక్తి మెడపై కూర్చొని ప్రతీకారం తీర్చుకునే ఇతివృత్తంతో రూపొందిన ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా సీవీ–2ను తులసి సినీ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. కేఆర్ సెంథిల్నాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బీఎల్ సంజయ్ చాయాగ్రహణను, ఎస్పీ అహ్మద్ సంగీతాన్ని అందించారు. ఇందులో దివంగత నటుడు తేంగాయ్ శ్రీనివాసన్ మనవడు యోగి, చరణ్‌రాజ్ కొడుకు తేజ చరణ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. నటి స్వాతిషా, సంతోష్, క్రిస్టియన్, దాడి బాలాజీ, శ్యామ్స్, కోదండం, గాయత్రి కుమరన్ ముఖ్య పాత్రలు పోషించారు. జనవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
సినిమా పరివార్!
‘ఇండస్ట్రీ’ అంతా మా కుటుంబమే అని చెబుతుంటారు సినిమా వాళ్లు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఉద్ఘాటన చేస్తూనే ఉంటారు. అదొక సంఘీభావం. మంచిదే. ఈ సినిమా కుటుం బంలో సభ్యులెవరు? దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులు వగైరా వగైరా. వీళ్లు గాక సినీ నిర్మాణం కోసం ‘లైట్లెత్తే’ బాయ్స్ సహా చాలామంది శ్రమజీవులుంటారు. వీళ్లందర్నీ 24 క్రాఫ్టుల ‘బంగారం’గా గుర్తించి కుటుంబ సభ్యత్వం కల్పించిన వ్యక్తి దాసరి నారాయణరావు. సినిమా పరివారం ఎల్లలు ఇంతవరకేనా? ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు మొదలైన మైలురాళ్లను దాటి విస్తరించిన కుటుంబం ఇది. తెలుగు రాష్ట్రాలకు సంబంధిం చినంతవరకైతే తెలుగు ప్రేక్షకులందరూ సినిమా కుటుంబ సభ్యులే. ఎదుగుతున్న నాటక రంగాన్ని బలిపెట్టి మరీ సినిమా రంగాన్ని పోషించింది తెలుగు సమాజం. ఈ రాష్ట్రాల్లో ఉన్న సినిమా థియేటర్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఉత్తర భారత దేశమంతటా కలిపి ఎన్ని థియేటర్లున్నాయో ఈ రెండు రాష్ట్రా ల్లోనే అన్ని ఉన్నాయట. సినిమా అభిమానం బాగా ఎక్కువ నుకునే తమిళనాడుతో పోల్చినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు వెయ్యి సినిమా హాళ్లు ఎక్కువుండేవి. ఇతర రాష్ట్రాల్లో నాటక రంగం ఇంకా తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడో ఒకసారి చిన్న మూలుగు వినిపి స్తుంది, అంతే. తెలుగు ప్రజలకున్న అపార సినిమా అభిమానం అందుకు కారణం. కుటుంబ సభ్యులంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే కాదు గదా! పెంచి పోషించిన తల్లి దండ్రులు కూడా కుటుంబ సభ్యులే. అలాగే ప్రత్యేక శ్రద్ధతో తెలుగు సినిమాను పెంచి పోషించిన ప్రేక్షకులంతా సినిమా పరివారమే. మన సినిమా ఒక విస్తారమైన కుటుంబమని గుర్తిస్తే, సభ్యులైన ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు గణించుకోవాలి. కొన్ని వేలమందికి అన్నం పెట్టే ‘పరిశ్రమ’ కనుక, సినిమాను ఒక వ్యాపారం అనుకుందామా? అయితే ఈ వ్యాపారంలో మేజర్ స్టేక్హోల్డర్లు ప్రేక్షకులు. వారిపై ఏకపక్షంగా రుద్దజూసే నిర్ణయాలు చెల్లవు. సినిమాను ఒక కళగా మాత్రమే భావిద్దామా? కళ కళ కోసమే తప్ప కాసుకోసం కాదని చాలామంది కళాస్రష్టలు భావిస్తారు. జగత్ ప్రసిద్ధ ఫిలిమ్ మేకర్ వాల్డ్డిస్నీ ఒక మాటన్నారు. ‘నేను డబ్బులు సంపాదించడం కోసం సినిమా తీయను. సినిమా తీయడం కోసం డబ్బులు సంపాదిస్తా’. సినిమాను కళగా భావించే వారికి ఇదొక సందేశం. సినిమాపై డిస్నీ సంతకం ఇంకెన్నాళ్లకయినా చెరిగి పోతుందా? కాసుల పొడ సోకనీయని శుద్ధ సృజనాత్మక ఆలోచనలు మన వాళ్లలోనూ ఉండేవి. కటిక దరిద్రాన్ని అనుభవిస్తూనే బమ్మెర పోతన కవి ‘ఆంధ్ర మహాభాగవత’ కావ్యాన్ని పూర్తి చేశారు. రాజులకు అంకితం ఇస్తే దరిద్రం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అనుభవించవచ్చని సన్నిహితులు సలహా ఇస్తారు. కానీ, పోతన ససేమిరా అంటాడు. ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజిం చుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల కౌ / ద్దాలికులైననేమి? నిజ దార సుతోదర పోషణా ర్థమై’ అని ఈసడించుకుంటాడు. కోమలమైన మహాభాగవత కావ్యాన్ని దుర్మార్గులైన రాజులకు అంకితం చేయడం కంటే వ్యవసాయం చేసుకుని భార్యాబిడ్డల్ని పోషించడం మేలంటాడు పోతన. ఇదీ విశుద్ధ కళా ప్రకటన, భక్తి భావన. ఆనాటికి తెలుగు ప్రాంతాల్లో ఉన్న నాటక సమాజాలన్నీ వరసకట్టి మరీ నటీనటులనూ, రచయితలనూ, దర్శకులనూ, గాయకులను సినీరంగ ప్రవేశం చేయించాయి. వాటిలో ప్రముఖ మైనది ‘ప్రజానాట్యమండలి’. ‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం’ అనేది ఈ సంస్థ సిద్ధాంతం. ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు డాక్టర్ గరికపాటి రాజారావు స్వీయ దర్శకత్వంలో ‘పుట్టిల్లు’ సినిమా నిర్మించి జమునను వెండితెరకు పరిచయం చేశారు. ఎన్టీరామారావు కూడా సినిమాల్లోకి రాకముందు ‘నేషనల్ ఆర్ట్ థియేటర్’ అనే పేరుతో నాటకాలు వేసేవారు. సంస్థ పేరులోనే జాతీయ భావం ఇమిడి వున్నది. సినిమా నిర్మాణాన్ని కూడా ఆయన ఇదే పేరుతో ప్రారంభించారు. అభ్యుదయ భావాలతో నాటకాలు వేసి, సినీరంగంలో ప్రవేశించిన వారి ప్రభావం ఫలితంగా తొలి రోజుల్లో అనేక సందేశాత్మక, కళాత్మక విలువలున్న తెలుగు సినిమాలు తయారయ్యాయి. ఇవి వాణిజ్యపరంగా కూడా ఘన విజయాలను నమోదు చేశాయి. 1950వ, 60వ దశకాలను తెలుగు సినిమాకు స్వర్ణయుగంగా చాలామంది భావిస్తుంటారు. ఆర్థికంగా నష్టపోయే సినిమాల శాతం ఇప్పటికంటే చాలా తక్కువ. నిర్మాణ వ్యయం అదుపులో ఉండేది. సినిమా తారాగణం, కథాబలం, దర్శకుడు, బ్యానర్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ మేరకు వసూలు చేయగలదో అంచనా వేసుకునేవారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ వ్యయం ఉండేది. అప్పట్లో సూపర్‌స్టార్స్‌గా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ల పారితోషికాలు కూడా నిర్మాణ వ్యయంలో ఐదు నుంచి పది శాతంలోపే ఉండేవని చెబుతారు. ఈ తరహా పొదుపు బడ్జె ట్లతోనే నాటి సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద కమర్షియల్ హిట్ తెలుగు సినిమా ఏది? అప్పటికీ, ఇప్పటికీ మార్కెట్‌నూ, డబ్బు విలు వనూ బేరీజు వేసుకొని చూస్తే ‘లవకుశ’ను మించిన పెద్ద హిట్ లేదట. ఆ సినిమా విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాల జనాభా ఇప్పటి జనాభాలో సుమారు 40 శాతం లోపే. రవాణా సౌకర్యాలు లేవు. రహదారులు చాలా తక్కువ. దూరంగా ఉండే టౌన్లకే సినిమా హాళ్లు పరిమితం. అయినా కూడా అప్పటి జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఈ సినిమాను చూశారని అంచనాలున్నాయి. పావలా నేల టికెట్ దగ్గర్నుంచి రూపాయి సోఫా టికెట్ దాకా అన్ని తరగతుల చిల్లర శ్రీమహాలక్ష్మి కనకవర్షం కురిపించింది. ఎక్కువ శాతం సినిమాలు ఘనవిజయం సాధించడం ఈ స్వర్ణయుగం ప్రత్యేకత. 1963లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 13 సినిమాలు విడుదలైతే అందులో 7 శతదినోత్సవాలు జరుపుకొన్నాయి. శతదినోత్సవం జరుపుకోవడం అంటే సినిమా సూపర్ హిట్ అయినట్టు! ఇదే ట్రెండ్ కొన్నేళ్ళు కొనసాగింది. ఎంత పెద్ద హీరోలైనా, ఎంత దిగ్గజ దర్శకులైనా, వారు ఎంత గొప్ప విజయాలను సాధించినా కూడా అడ్డగోలు పారి తోషికాలను డిమాండ్ చేయలేదు. ఫలితంగా నిర్మాణ వ్యయం అదుపులో ఉండి లాభాలు గడించిన కారణంగా తెలుగు సినిమా వేలాదిమందికి ఆశ్రయం కల్పించి ‘ఇండస్ట్రీగా’ గుర్తింపు పొందింది. ఇక్కడొక ఉదాహరణ చెప్పుకోవాలి. టాప్ ఫైవ్ తెలుగు సినిమాల పేర్లు చెప్పమని ఏ తెలుగువాణ్ణి అడిగినా అందులో కచ్చితంగా చెప్పే పేరు – ‘మాయాబజార్’. ఆ జనరంజక చిత్ర దర్శకుడు కేవీ రెడ్డి తెలుగు సినిమా స్వర్ణయుగ వైతాళికుల్లో ఒకరు. ఈ సినిమా కంటే ముందే అతిపెద్ద కమర్షియల్ హిట్‌గా ‘పాతాళభైరవి’ని ఆయన మలిచారు. దాదాపు ఒక డజన్ అపురూప దృశ్యకావ్యాలు ఆయన అందిం చారు. సినిమాలు తీయడం ఆపేసిన తర్వాత తన కొడుకును ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించవలసిన సందర్భం వచ్చింది. అందుకయ్యే ఖర్చు కోసం ఆయన ఇబ్బంది పడ్డారట. విషయం తెలుసుకున్న ఎన్టీ రామారావు తాను సర్దుబాటు చేయడానికి ముందుకొచ్చారు. ‘నీకు తెలుసు కదా రామారావ్, నేను ఎవరి దగ్గరా ఊరికే తీసుకోను’ అని కేవీ రెడ్డి తిరస్క రించారు. ‘ఊరికే వద్దు నాకో సినిమా తీసిపెట్టండ’ని ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చారు. అలా వచ్చింది ‘శ్రీకృష్ణ సత్య’. దర్శకుడిగా కేవీ రెడ్డి కమిట్మెంట్నూ, ఫోకస్‌ను చెప్ప డానికి, సినిమా బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండే ఆనాటి పారితోషికాలను గురించి చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ. నటులైనా, దర్శకులైనా డబ్బులు సంపాదించకుండా ఇబ్బం దులు పడాలని కాదు. అయితే నిర్మాణ వ్యయం అదుపు తప్పని విధంగా ఏదో రకమైన బ్యాలెన్స్‌ను పాటించడం తప్పనిసరి.ఆ బ్యాలెన్స్ లేనప్పుడే ప్రేక్షకుల మీద అదనపు భారం మోప డమనే అవాంఛనీయ ఆలోచనలు ముందుకొస్తాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి వంటి నటులకూ, కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి, కేఎస్ ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, ‘విక్టరీ’ మధుసూదనరావు, కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి దర్శకులకు జనంలో ఎంతో ఇమేజ్ వుండేది. ఆ ఇమేజ్‌ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు అప్పట్లో చేయలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా టికెట్ల వసూళ్ళపై వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. కలెక్షన్లపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారనే అనుమానంతో ఈ పద్ధతిని తీసు కొచ్చారు. ఈ పద్ధతి సినిమా వ్యాపారాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఓపెనింగ్స్ బాగా వుంటేనే సినిమా బతికి బట్టకట్టే పరిస్థితి వచ్చింది. ఓపెనింగ్స్ లేకపోయినా కథాబలంతో నోటి మాట ద్వారా పుంజుకునే అవకాశం ఉండే సినిమాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ ‘శంకరాభరణం’ సినిమాయే శ్లాబ్ పద్ధతి తర్వాత విడుదలై ఉంటే ఏమయ్యేదో! శ్లాబ్ పద్ధతి చిరంజీవికి బాగా కలిసొచ్చింది. అప్పుడప్పుడే యువ ప్రేక్షకుల అభిమా నాన్ని చూరగొంటున్న చిరంజీవి బంపర్ ఓపెనింగ్స్‌తో దూసుకొని పోయాడు. ‘మెగాస్టార్’ అని పిలిచేంత వరకూ వెనక్కు చూడలేదు. ఇప్పటికీ అడపాదడపా చిరంజీవి నటిస్తూనే ఉన్నప్పటికీ గడిచిన పదిహేనేళ్ల కాలాన్ని పోస్ట్ చిరంజీవి దశగానే పరిగ ణించాలి. ఈ దశలోనే నిర్మాణ వ్యయం అదుపు తప్పింది. ఐదారు మంది దర్శకులు ఫిలిమ్ మేకింగ్‌లో కొత్త పుంతలు తొక్కారు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, వినాయక్, కొరటాల శివ తదితరులకు నాగ్ అశ్విన్ లాంటి ప్రతిభావంతులు తోడవుతున్నారు. మార్కెట్ విస్తరణకు తెలుగు సినిమా నడుం కట్టింది. ఇంత వరకూ స్వాగతిద్దాం. కానీ నిర్మాణవ్యయం పట్టాలు తప్పింది. ఆర్థికంగా విజయాలు సాధిస్తున్న సినిమాలు ఏటా పది శాతం కూడా ఉండడం లేదు. ఇది కూడా ప్రీ–కోవిడ్ లెక్క. సినిమా రంగం సంక్షోభంలో కూరుకుపోవడాన్ని ఇప్పుడు చూస్తున్నాము. ఒక అరడజను మంది స్టార్ హీరోలున్నారు మనకు. మరో అరడజను మంది పెద్ద డైరెక్టర్లున్నారు. వీళ్ల సినిమాలన్నీ తెలుగు మార్కెట్ తట్టుకోలేనంత భారీ బడ్జెట్ సినిమాలే. ఈ బడ్జెట్లో యాభై శాతానికిపైగా హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషనే! మిగతా బడ్జెట్లో ఒక పావలా ఇతరుల రెమ్యునరేషన్.ఒక పావలా నిర్మాణవ్యయం. షూటింగ్ జరిగే ప్రదేశంలో ఆరేడు క్యారవాన్ బస్సులుండటం పరిపాటి. హీరో హీరోయిన్లతో పాటు ఇతర ముఖ్యులం దరికీ ఈ సౌకర్యం ఉండాలి. ఇదొక స్టేటస్ సింబల్. షూటింగ్ విరామంలో స్టార్లు ఈ ఏసీ బస్సుల్లో విశ్రాంతి తీసుకుంటారు. షూటింగ్ జరిగే భవంతుల్లో ఏసీ గదులున్నాసరే ఈ క్యారవాన్లు ఉండి తీరాల్సిందే. పెద్ద నటీనటుల వెంట వారి బంధుమిత్ర పరివారం కూడా ఉంటుంది. వారందరికీ అతి«థి సేవలు తప్పనిసరి. ఈ పరివారానికి స్టార్ హోటళ్ల నుంచి క్యారియర్లు తెప్పించాలి. షూటింగ్ జరిగినన్నాళ్లూ ఈ తంతు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా హీరో ఇమేజ్ను పెంచడం కోసం, దర్శకుని ప్రతిభను చాటడం కోసం తీసే కొన్ని సీన్లుంటాయి. ఇవి లేకున్నా కథనంలో ఏ లోపం ఉండదు. కానీ ఉంటాయి. ఈ దుబారా ఖర్చునంతా వసూలు చేసుకోవడానికి నిర్మాతలు రెండు పద్ధతులు అనుసరిస్తారు. అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలోనూ ఈ సినిమాయే విడుదలవడం మొద టిది. చిన్న సినిమాలు విడుదలవడానికి అవకాశం ఉండదు. ఇక రెండవది– జనం మీద అడ్డగోలు బాదుడు! మొదటి వారం రోజులపాటు అదనపు షోలు నడిపించి ప్రేక్షకుల దగ్గర ఐదింతల నుంచి పదింతల వరకు వసూలు చేయడం! ఒకప్పుడు థియేటర్ల బైట బ్లాక్టికెట్లమ్మే వ్యవస్థ, పోలీసు అరెస్టులుండేవి. కానీ, ఇప్పుడు అనధికారిక అడ్డగోలు టికెట్ రేట్ల పెంపు అంటే, ఏకంగా థియేటర్లలో బుకింగ్‌లోనే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నట్టు లెక్క! చూడదలుచుకున్న ప్రేక్షకులంతా వారం లోపే చూసెయ్యాలి. లేదంటే సదరు సినిమా ఎన్నాళ్లు ఆడు తుందో గ్యారంటీ లేదు. థియేటర్లన్నీ కొద్దిమంది గుత్తాధి పత్యంలో ఉన్నందువల్ల స్టార్ హీరోల సినిమాలకే వాటిని అంకితం చేస్తున్నారు. చిన్న సినిమాలు తీసినవారు ఆ సినిమాల విడుదల కోసం పడుతున్న బాధలు దేవుడెరుగు. స్టార్ పరివారాల క్యారవాన్ల కోసం, భోజనం క్యారియర్ల కోసం, సినిమా ప్రొడక్షన్ దుబారా కోసం, హీరోల భారీ పారి తోషికం కోసం సామాన్య ప్రజలు చందాలివ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మీద ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది. ఒక లాజికల్ ముగింపునకు చేరుకునేంత వరకు ఈ చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్లలో పారదర్శకత కోసం ప్రభుత్వ నియంత్రణలో ‘ఆన్లైన్ టికెటింగ్’ అనే అంశం ముందుకొచ్చింది. అట్లాగే ప్రేక్షకులపై అదనపు భారం పడకుండా టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. పాత విధానాల ద్వారా లబ్ధి పొందుతున్నవారికి ఈ సంస్కరణలు సహజంగానే ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. పవన్ కల్యాణ్‌కు కూడా అందుకే కోపం వచ్చింది. ఒక సినిమా ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయనకు ఆ ప్రభుత్వంలోని మంత్రులు కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. అది వేరే కథ. స్టార్ అంటే నక్షత్రం. అది వెలుగునివ్వాలి. నక్షత్రకుడంటే వెంటపడేవారు, వేధించేవాడు. స్టార్స్ వెలుగులు వెదజల్లు తుంటే నవీన్ పొలిశెట్టి లాంటి నటులు పదుల సంఖ్యలో వస్తారు. ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, కేరాఫ్ కంచరపాలెం, పలాస, పెళ్లిచూపులు’ వంటి సినిమాలు ప్రవాహంలో వచ్చి పడి తెలుగు సినిమాను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాయి. ఒకవేళ స్టార్లు నక్షత్రకులుగా మారితే... ‘స్టార్స్’ను వెలిగించిన ప్రేక్షకులే నక్షత్రకులను వదిలించుకుంటారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వైరల్: అంతా మ్యాచ్‌లో లీనం.. ఒక్కసారిగా స్టేడియంలో..
ఇటీవల పలు చోట్ల జంతువులను కాపాడిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడమే గాక నెటిజన్ల మనసును కూడా దోచుకుంటున్నాయి. అలాంటి ఘటనలోనే ఓ పిల్లిని కాపాడినందుకు కొందరు పెద్ద మొత్తంలో రివార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే. స్టేడియంలో ఆటగాళ్లు తమ ఆటతో హైలెట్‌గా నిలవడం మామూలే కానీ అక్కడ ఓ పిల్లి టాక్ ఆఫ్ ది మ్యాచ్‌లా మారింది. ఎలా అంటారా! వివరాల్లోకి వెళితే.. మయామి హరికేన్స్ యూనివర్శిటీ, అప్పలాచియన్ స్టేట్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు శనివారం హార్డ్ రాక్ స్టేడియంలో ఓ నాటకీయ సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులంతా మ్యాచ్‌ని వీక్షిస్తున్నారు. అంతలో స్టేడియం ఎగువ డెక్ నుంచి ఓ పిల్లి వేలాడుతున్నట్లు వారికి కనిపించింది. ఇక అంతవరకు ఉత్సాహంగా మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ దృష్టి ఒక్కసారిగా పిల్లి వైపు మారింది. అంతలో మ్యాచ్‌ని చూడటానికి వచ్చిన క్రెయిగ్ క్రోమర్, అతని భార్య కింబర్లీ సరైన సమయంలో స్పందించారు. ఆ జంట పిల్లి తన పట్టును కోల్పోతుందని గ్రహించి, సరిగ్గా అది కింద పడే ప్రాంతలో వారి వెంట తెచ్చుకున్న జెండాను పట్టుకున్నారు. దాన్ని కాపాడటానికి అక్కడ జంటతో పాటు కొందరు ఓ రెస్క్యూ టీమ్‌లా ఏర్పడి పిల్లిని కింద పడకుండా పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక ఒకే పంజాతో గోడ అంచున పట్టుకున్న ఆ పిల్లి తన పట్టును తిరిగి పొందడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే, కొంత సేపటి అనంతరం అది ఎగువ డెక్ నుంచి పడిపోయింది. అదృష్టవశాత్తూ, ఆ పిల్లికి ఎటువంటి గాయాలు కాకుండా వారు పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో దూసుకుపోతోంది. పిల్లిని కాపాడిన వారిని నెటిజన్లు అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. Well this may be the craziest thing I’ve seen at a college football game #HardRockCat pic.twitter.com/qfQgma23Xm — Hollywood (@DannyWQAM) September 11, 2021 చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ -
హౌస్ ఫుల్లా ? నిల్లా ?
-
అందగత్తెపై కెమెరామెన్ జూమ్.. కామెంటేటర్ పాట
సాధారణంగా కెమెరామెన్ల కన్ను మైదానంలోనే ఆట, ఆటగాళ్ల మీదే కాదు.. చుట్టుపక్కల జరిగే వాటి మీద కూడా పడుతుంది. వెరైటీగా అనిపించేవాటితో పాటు అందంగా కనిపించే ఆడవాళ్లను కూడా బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తుంటారు. ఆ టైంలో స్క్రీన్ మీద కనిపించే వాళ్ల రూపాల్ని చూసి మురిసిపోతుంటారు కూడా. అయితే అలాంటి ఘటనే ఒకటి వీడియో ఇప్పడు వైరల్ అవుతుండగా.. రకరకాల రియాక్షన్లు వ్యక్తం అవుతున్నాయి. ఆడియెన్స్ గ్యాలరీలో కాళ్లు ముడుచుకుని కూర్చున్న ఓ అమ్మాయిని, ఆమె అందాల్ని పదే పదే జూమ్ చేస్తూ ఉండిపోయాడు కెమెరామెన్. అది గమనించిన కామెంటేటర్.. ఆ కెమెరామెన్ టైమింగ్‌కు తగ్గట్లే ఓ పాట పాడాడు. అలా ఒక్కసారి కాదు.. జూమ్ వేస్తూ చాలాసార్లు ఫోకస్ చేశాడు. ఇక ఆ చేష్టల్ని చూయింగ్ గమ్ నములుతూ ఆ అమ్మాయి కూడా అంతే లైట్ తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ ద్వారా వైరల్ అయ్యింది. ఈ వీడియో ఏ మ్యాచ్ సందర్భంగా జరిగిందో తెలియదు. పాతదో కొత్తదో లేదంటే ఎడిట్ చేసిందో క్లారిటీ లేదు. కానీ, @hfussbaIl అనే ట్విటర్ అకౌంట్ నుంచి విపరీతంగా వైరల్ అవుతోంది. కొందరు ఆ కెమెరామెన్‌ను, మరికొందరు పాటపాడిన ఆ కామెంటేటర్ తీరును తప్పుబడుతూ తిట్లు తిడుతున్నారు. నైతిక విలువలు లేకుండా వ్యవహరించిన వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంకొందరి బాధేంటంటే.. ఆ వ్యక్తి పాడిన పాటకి అర్థం తెలుసుకోవాలనే ప్రయత్నం. దీంతో ఓ వ్యక్తి అది అరబ్ పాట అని చెబుతూ.. ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేశాడు. ఆ అందానికి గుండెలో ముళ్లు గుచ్చుకున్నట్లు అయ్యిందని, జీవితాంతం ఆమె పాదాల దగ్గర పడి ఉండాలని ఉంద’ని ఆ పాట సారాంశం అని సదరు వ్యక్తి బదులిచ్చాడు. చదవండి: హిల్లరీ క్లింటన్‌ను ఉరి తీశారా? -
చార్లీ చాప్లిన్ తొలి సినిమాకు వందేళ్ళు!
చార్లీ చాప్లిన్‌ను సొంతం చేసుకోవడానికి ప్రాంతాలు, భాషతో పనిలేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారైనా ఆయన ప్రపంచంలోకి వెళ్లి హాయిగా నవ్వుకోవచ్చు. చాప్లిన్ నటించి, దర్శకత్వం వహించిన ‘ది కిడ్’ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసిద్ధ ఫ్రెంచ్ ఫిల్మ్ కంపెనీ ఎంకే2 ‘ది కిడ్’తో సహా ప్రపంచ ప్రసిద్ధి పొందిన చాప్లిన్ చిత్రాల రిస్టోరేషన్ ప్రక్రియ చేపట్టింది. ‘ది గోల్డ్ రష్’ ‘సిటీ లైట్స్’ ‘ది సర్కస్’ ‘మోడ్రన్ టైమ్స్’ ‘ది గ్రేట్ డిక్టేటర్’ చిత్రాలను 4కె రిస్టోరేషన్ చేస్తున్నారు. ‘చార్లి చాప్లిన్ స్టార్డమ్, అద్భుత నటనకు అద్దం పట్టే చిత్రం ది కిడ్. ఈతరం ప్రేక్షకులు కూడా ఆనాటి భావాలు, భావోద్వేగాలతో మమేకం అవుతారు’ అంటున్నాడు ఎంకే 2 సీయివో కర్మిడ్జ్. ఆధునీకరించిన చాప్లిన్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పోస్టర్లు. ట్రైలర్లు రెడీ చేస్తున్నారు. -
ఇప్పుడే చెప్పలేం
న్యూఢిల్లీ: స్టేడియాల్లోకి ప్రేక్షకులను ఎప్పుడు అనుమతిస్తామనేది ఇప్పుడే చెప్పలేమని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూల్‌కు చెందిన అప్లికేషన్‌ను శుక్రవారం ఆన్లైన్లో ప్రారంభించిన ఆయన కరోనా వ్యాప్తి ఉన్నంత కాలం ఈ విషయంపై స్పష్టతనివ్వలేమని పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించే అంశంపై ఇప్పుడే మాట్లాడలేను. వీలైనంత తొందరగా ప్రేక్షకులతో స్టేడియాలు కళకళలాడాలని నేనూ కోరుకుంటున్నా. దానికన్నా ప్రజల ఆరోగ్య భద్రతే అందరికీ ప్రధానం. దీనికి స్థానిక అధికార యంత్రాంగాలు ఒప్పుకోవాలి. వారి నిర్ణయానికే మేం కూడా కట్టుబడతాం. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో పరిస్థితి గురించి వారికే అవగాహన ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2028 ఒలింపిక్స్ నాటికి భారత్ పతకాల జాబితాలో టాప్–10లో ఉండాలన్న లక్ష్యంపై కొందరు విమర్శలు చేస్తున్నారని రిజుజు వెల్లడించారు. ‘టాప్–10లో ఎలా ఉంటామని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు పంచుకోవచ్చు. వారి మాటల్ని నేను పట్టించుకోను. మనం మన లక్ష్యంపైనే దృష్టి సారించాలి. వరల్డ్ చాంపియన్‌ను తయారు చేసేందుకు కనీసం 8 ఏళ్లు అవసరం. మేం అదే పనిలో ఉన్నాం’ అని అన్నారు. -
ప్రేక్షకుల్ని అనుమతిస్తాం!
దుబాయ్: తమ దేశంలో జరిగే ఐపీఎల్–13 మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతిస్తామని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే... సీటింగ్ సామర్థ్యంలో 30 నుంచి 50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉందని ఈసీబీ కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని చెప్పారు. ఐపీఎల్ తుది షెడ్యూల్ ఖరారు చేశాక లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ మాట్లాడుతూ... ప్రేక్షకులను అనుమతించే విషయం పూర్తిగా యూఏఈ ప్రభుత్వం, ఈసీబీ పరిధిలోనే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం బీసీసీఐ... భారత ప్రభుత్వ అమోదం కోసం ఎదురుచూస్తోంది. భారత్ నుంచి అధికారిక ఆమోదం లభించిన వెంటనే యూఏఈ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ముబాషిర్ తెలిపారు. తమ దేశంలో పూర్తిస్థాయిలో జరిగే ఐపీఎల్లో కచ్చితంగా ప్రేక్షకులు ఉండాలనే కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే పూర్తి సామర్థ్యం ఉండదని 30 నుంచి 50 శాతం మేర అనుమతిస్తామని, దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని ఆయన వెల్లడించారు. యూఏఈ లో కరోనా నియంత్రణలోనే ఉంది. ప్రస్తుతం 6000 కేసులే ఉన్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు జరుగుతాయి. -
25 శాతం ప్రేక్షకులకు ఓకే
మెల్బోర్న్: ప్రపంచ దేశాల్లో ఒక్కొక్కటిగా క్రీడా సంబంధిత కార్యకలాపాలకు కరోనా నిబంధనల నుంచి మినహాయింపులు లభిస్తున్నాయి. తాజాగా 25 శాతం ప్రేక్షకుల్ని మైదానాల్లో అనుమతించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమైంది. ఆసీస్ ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేశారు. జాతీయ మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చేనెల నుంచి 40,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న క్రీడా మైదానాల్లోకి 10,000 మంది ప్రేక్షకుల్ని అనుమతిస్తాం అని పేర్కొన్నారు. ‘మ్యాచ్‌లు, పండుగలు, కచేరీలకు ప్రేక్షకులు వెళ్లవచ్చు. కానీ ఆతిథ్య వేదిక విశాలంగా ఉండాలి. సీట్ల మధ్య తగిన దూరం ఏర్పాటు చేయాలి. ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానులకు టిక్కెట్లను కేటాయించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ స్టేడియం సామర్థ్యాన్ని బట్టి 25 శాతం ప్రేక్షకుల్ని మాత్రమే ఆహ్వానించాలి. ఆరోగ్య అధికారుల సహాయంతో వేదికల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను రూపొందిస్తున్నాం’ అని ఆయన వివరించారు. -
ప్రేక్షకులొచ్చారు...
హో చి మిన్ సిటీ (వియత్నాం): కరోనాతో ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఆటగాళ్లు కనీసం ప్రాక్టీస్ చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ చిన్నా చితకా ఈవెంట్లు జరుగుతున్నప్పటికీ ప్రేక్షకుల్ని అనుమతించేంత ధైర్యం ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. అయితే దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్‌కు అభిమానులను ఆహ్వానించి వియత్నాం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వి–లీగ్‌లో భాగంగా అక్కడ శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్‌లను దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. మైదానానికి తరలి వచ్చిన అభిమానులకు ముందు జాగ్రత్తగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. అయితే వారు మాస్కులు ధరించకపోవడం విశేషం. ప్రేక్షకుల సమక్షంలో ఆడటం సంతోషంగా ఉందని, వారే ఆటకు ప్రత్యేకమని ‘హో చి మిన్’ జట్టు కోచ్ జంగ్ హు– సంగ్ అన్నారు. చైనాతో పొడవైన సరిహద్దు కలిగి ఉన్నప్పటికీ వియత్నాం కరోనాను సమర్థంగా నియంత్రించింది. 10 కోట్ల జనాభా కలిగిన వియత్నాంలో కేవలం 328 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా ఒక్క మరణం కూడా సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. శుక్రవారం మొత్తం మూడు మ్యాచ్‌లు జరగ్గా... రెండు ‘డ్రా’గా ముగిశాయి. మరో మ్యాచ్‌లో ఫలితం వచ్చింది. -
ప్రేక్షకుల్లేకుండా టోర్నీలు ఆడలేను
ప్రాగ్: ఖాళీ స్టేడియాల్లో ఆటకు తాను వ్యతిరేకమని చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా చెప్పింది. కరోనా మహమ్మారి విలయంతో ఇప్పుడంతా గేట్లు మూసే ఆటలపైనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. చెక్ రిపబ్లిక్లో మళ్లీ టెన్నిస్ పునరుద్ధరణ సందర్భంగా రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన క్విటోవా మాట్లాడుతూ ‘నాకు మరో గ్రాండ్‌స్లామ్ ఆడాలనే ఉంటుంది. కానీ ప్రేక్షకుల్లేకుండా ఆడే పరిస్థితి వస్తే... ఆటను రద్దు చేసుకోవడమే మేలని భావిస్తాను. అభిమానులే మా చోదకశక్తి. ఆ శక్తిలేని చోటును చూడాలనుకోను. అది అసలు గ్రాండ్‌స్లామ్ అనిపించుకోదు’ అని తెలిపింది. తాను మళ్లీ టెన్నిస్ క్రీడను ఒక్క చెక్ రిపబ్లిక్లోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పింది. వైరస్ విస్తరిస్తుండటంతో ఈ సీజన్లో వింబుల్డన్‌ను రద్దు చేయగా... ఫ్రెంచ్ ఓపెన్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. -
స్త్రీలోక సంచారం
ఆడవాళ్లలా మగవాళ్లు మళ్లీ మళ్లీ కలిసి కబుర్లు చెప్పుకోడానికి ఎందుకనో పెద్దగా ఆసక్తి చూపించరని 49 ఏళ్ల హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ అన్నారు. ‘లేట్ నైట్ షో విత్ జేమ్ కార్డన్’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన జెన్నిఫర్.. ‘‘మీరంతా ఎందుకు మళ్లీ కలిసి నటించరు?’’ అని ఆడియన్స్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నవ్వుతూ ‘‘బాయ్స్‌కి పెద్దగా ఫీలింగ్స్ ఉండవనుకుంటాను’’ అని అన్నారు. 1994 నుండి 2004 వరకు పదేళ్ల పాటు అమెరికన్ టెలివిజన్ చానల్ ఎన్.బి.సి.లో ‘ఫ్రెండ్స్’ అనే సిట్కామ్ (సిట్యుయేషన్ కామెడీ)లో జెన్నిఫర్‌తో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు నటించారు. ఆ ఆరుగురూ ఫ్రెండ్స్. న్యూయార్క్ సిటీలో ఉంటారు. నిత్యజీవితం వాళ్లని ఎన్నివిధాలుగా దోపిడీ చేస్తుంటుందో ఆ సిట్‌కామ్‌లో హాస్యభరితంగా చూపించారు. పదేళ్ల పాటు సాగిన ఆ హిట్ ధారావాహికతో జెన్నిఫర్, మిగతా ఇద్దరు అమ్మాయిలు కోర్టెనీ, లీసా.. అమెరికన్ టీవీ సీరియళ్ల చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణులుగా రికార్డు సాధించారు. అప్పట్లో వీళ్లతో కలిసి ఆ సీరియల్ నటించిన ముగ్గురు అబ్బాయిలు డేవిడ్, మాట్, మేథ్యూ.. ఇప్పుడు ‘రీయూనియన్’ అంటే.. ‘నో ఇంట్రెస్ట్’ అంటున్నారట. అదే విషయాన్ని జెన్నిఫర్ ‘లేట్ నైట్ షో’లో ఇంకోలా చెప్పారు.. బాయ్స్, పూర్వ స్నేహాల పట్ల పెద్ద ఎగై్టట్మెంట్తో ఉండరని. -
ప్రేక్షకులు మెచ్చుకునే సినిమాలు తీస్తా..
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ప్రేక్షకులు మెచ్చుకునే సినిమాలు తీయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తెలిపారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఆరు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామన్నారు. ప్రేక్షకులు వాటిని ఆదరించారు. కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యాయని అన్నారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. ఈ ఏడాది కూడా నాలుగు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయన్నారు. మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా ప్రారంభించామని ఆయన తెలిపారు. అలాగే నితిన్ హీరోగా శ్రీనివాస కల్యాణం, రామ్ హీరోగా ఒక సినిమా, మరో సినిమా కూడా తీస్తున్నామన్నామని చెప్పారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈసందర్భంగా ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ఉత్తరరాజగోపురంలో జరిగిన శ్రీనృసింహ దీక్షల విరమణ కార్యక్రమాన్ని తిలకించి స్వామిని దర్శించుకున్నారు. శ్రీనృసింహ దీక్షల విరమణ కార్యక్రమంలో రావడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. చిరంజీవి సేవాసమితి అధ్యక్షుడు లంక సూరిబాబు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
జీవితాంతం గుర్తుంచుకుంటా : రాజమౌళి
ఐదేళ్లుగా రాజమౌళి చేస్తున్న యజ్ఞం పూర్తయి బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఎదురైన ఇబ్బందులపై రాజమౌళి స్పందించాడు. ఆదివారానికి రిలీజ్ హడావిడి కాస్త తగ్గటంతో తన సోషల్ మీడియా పేజ్ లో తనకు అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. 'బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ కు రిలీజ్ సమయంలో ఇబ్బందులు ఎదురవ్వటం సహజం. బాహుబలి అభిమానుల ప్రేమ, సపోర్ట్ మూలంగానే ఆ ఇబ్బందులన్నింటినీ యూనిట్ దాటగలిగింది. గత ఐదేళ్లుగా మాతో ఉండి, ప్రతీ సందర్భంలో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అందరికీ థ్యాంక్స్. మీరు మా మిగతా జీవితమంతా గుర్తుండి పోయే ఘనవిజయాన్ని అందించారు' అంటూ ప్రేక్షకులకు ట్వీట్ల రూపంలో కృతజ్ఞతలు తెలిపాడు రాజమౌళి. Its only natural that a big project like Baahubali faces hurdles during release. I must say that the enormous love and support that was — rajamouli ss (@ssrajamouli) 30 April 2017 given by Baahubali Fans made us cruise through the obstacles. Thank you everyone who have been with us for the past 5 years encouraging us — rajamouli ss (@ssrajamouli) 30 April 2017 at every turn. You have given us such a big success that we can keep it in our hearts for the rest of our lives. 🙏🙏🙏🙏 — rajamouli ss (@ssrajamouli) 30 April 2017 -
ఊహలకు రూపం.. నటనకు ప్రాణం
- సామాజిక సమస్యలకు దర్పణం పట్టిన నాటికలు - ఏడో రోజు అలరించిన నంది నాటకోత్సవాలు కర్నూలు(హాస్పిటల్): నందినాటకోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రదర్శించిన సాంఘిక నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి రెండు, మూడు రోజుల కంటే ఏడోరోజు ప్రేక్షకుల సంఖ్య బాగా పెరిగింది. స్త్రీల సమస్యలకు అద్దం పట్టే ‘విముక్త’, త్యాగానికి నిర్వచనం చెప్పే ‘నిష్క్రమణ’, సినిమాలు తీయాలని సర్వం పోగొట్టుకునే ఓ వ్యక్తి కథ ‘ఊహాజీవులు’, నిజాయితీకి విలువ జెప్పే రచ్చబండ నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. వీటితోపాటు శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ వారి ‘ఇంకెంత దూరం’, ఆర్ట్స్ ఫామ్ క్రియేషన్స్ వారి ‘ఓ కాశీ వాసి రావయ్యా.. సాంఘిక నాటికలు అలరించాయి. గుంటూరు శాస్త్రీయం వారి ‘రసరాజ్యం’ నాటిక గురువారానికి వాయిదా పడింది. స్త్రీల వేదనకు అద్దం పట్టే ‘విముక్త’ అనాటి రామాయణ కాలం నుంచి ఈనాటి ఆధునిక సమాజంలోని స్త్రీలు ఎన్నో అవమానాలకు, హింసలకు గురవుతున్నారు. వాటిని అధిగమించే స్త్రీల గురించి తెలుపుతుందీ నాటిక. ఇందులో పాత్రదారులు జ్యోత్స్న, నిర్మల, డాక్టర్ మస్తానమ్మ, డాక్టర్ రోజారమణి, సాయిలక్ష్మి, ధనలక్ష్మి నటించారు. శ్రీ వాసవీ డ్రెమటిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ నాటికను ప్రదర్శించారు. త్యాగానికి నిదర్శనం ‘నిష్క్రమణ’ కర్నూలులోని లలిత కళాసమితి వారి సమర్పణలో ‘నిష్క్రమణ’ సాంఘిక నాటకం కొనసాగింది.రోడ్డు ప్రమాదంలో తనను కాపాడి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి అండగా నిలవడమే ఇందులోని ఇతివృత్తం. ఈ నాటికను పీవీ భవానీప్రసాద్ రచించగా, పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు. పాత్రదారులు సూరపురాజు శ్రీనివాసరావు, బీఎస్ సింగ్, వన్నెం బలరామ్, ఎన్డి. క్రిష్టఫర్, మోహన్‌నాయక్, జి. రేణుక నటించారు. సినీమాయాలోకానికి నిదర్శనం ‘ఊహాజీవులు’ ఉయ్యూరుకు చెందిన కళావర్షిణి వారి ‘ఊహాజీవులు’ ప్రేక్షకులను ఆలోచింపజేసింది. సినిమా రంగంలో మోసాలు ఎలా జరుగుతాయనేది ఇందులోని ఇతి వృత్తం. ఈ నాటికను రత్నగిరి జగన్నాథం రచించగా, జెట్టి హరిబాబు దర్శకత్వం వహించారు. జీఎస్ చలపతి, ఆర్. శివకుమార్, ఆర్పీ కార్తీక్, ఎన్.స్వాములు, జె. హరిబాబులు నటించారు. నిజాయితీ విలువ చెప్పే ‘రచ్చబండ’ బాగా బతికిన ఊళ్లోనే బర్రెలు కాసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలాంగుంటదనే ఇతివృత్తంతో ప్రదర్శించిన నాటకమే ‘రచ్చబండ’. బాగా తెలిసిన మనుషులతోనే బర్లమల్లయ్య అని ఆయన పిలిపించుకోవాల్సి వచ్చింది. కుటుంబభారంతో ఆర్థికంగా చితికిన మనిషి గ్రామీణ రాజకీయ చట్రంలో చేయని నేరానికి తీర్పును ఆశ్రయించాడు. అన్యాయంగా న్యాయాన్ని కొనుక్కోవాలని తెలిసిన క్షణం అతని నిజాయితీ కట్టలు తెంచుకుని కన్నీరైంది. అతన్ని తీర్పుకు దగ్గర చేసిందా..?, అతన్ని న్యాయానికి చేరువ చేసిందా..?, బర్లమల్లయ్య తిరిగి పిల్లల మర్రి పెద్ద మల్లయ్య అయ్యాడా..? అనే వృత్తాంతంతో ఆద్యంతం హృద్యంగా ప్రదర్శించారు. గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్ వారి ‘రచ్చబండ’ సాంఘిక నాటకాన్ని రావుల పుల్లాచారి రచించగా, వెంకటగోవాడ దర్శకత్వం వహించారు. నేటి నాటికలు ఉదయం 9.30 గంటలకు నంద్యాల కళారాధన వారి సైకత శిల్పం, ఉదయం 11 గంటలకు ప్రొద్దుటూరు కళాభారతి వారి ఒయాసిస్, సిరిమువ్వ కల్చలర్ అసోసియేషన్స్ వారి రేలపూలు, మధ్యాహ్నం 3.30 గంటలకు ఉయ్యూరు కళావర్షిణి వారి తర్జని, సాయంత్రం 6 గంటలకు గుంటూరు శాస్త్రీయం వారి రసరాజ్యం, రాత్రి 8.30 గంటలకు అక్కల ఆర్ట్స్ అసోసియేషన్ వాకరి పుట్టలోని చెదలు నాటికలు ప్రదర్శిస్తారు. -
నాసిరకం సినిమాలతో ప్రేక్షకులకు బాలీవుడ్ దూరం
అవలోకనం ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటిగా ఉన్న బాలీవుడ్ సినిమాలు చూసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఆశ్చర్యకరం. మౌలిక వసతుల సమస్య ప్రధాన కారణం కాగా కొత్తగా పుట్టుకొస్తున్న మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ల ధర మధ్యతరగతి కుటుంబాలు భరించలేనంత అధికంగా ఉంటోంది. స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా తీయడానికే పరిమితమవడంతో మన ప్రేక్షకులకు చూడటానికి సినిమాలే లేకుండా పోతున్నాయి. ప్రముఖ స్టార్లు పరిమిత సంఖ్యలో ఉండటమే బాలీవుడ్ ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తోంది. తాను నిర్మిస్తున్న సినిమాలకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా బాలీవుడ్ కొన్ని సంవత్సరాల క్రితం కోరింది. ఆ సమయంలో సినీ నిర్మాతలకు రుణ సహాయం చేయడానికి బ్యాంకులను అనుమతించేవారు కాదు. సినీ కథలు, నటుల తేదీలు వంటివి పరస్పర సంబంధంతో కూడినవిగా గుర్తించకపోవడమే దీనికి కారణం కావచ్చు. అంటే సినీ నిర్మాతలు తరచుగా ఇతర వనరుల నుంచి డబ్బును సేకరించేవారు, కొన్ని సందర్భాల్లో మాఫియాతో కూడా వీరు సంబం ధాలు పెట్టుకునేవారు. 20 ఏళ్ల క్రితం సినీ నటులు, నిర్మాతలు నేరస్థులతో సన్ని హితంగా ఉంటున్నారని వచ్చే వార్తలను చదవటం సర్వసాధారణ విషయంగా ఉండేది. ఇటీవలికాలంలో ఇది నిలిచిపోయినట్లుంది. పైగా ఈ రోజుల్లో ధన సేక రణకు సంబంధించి సినీనిర్మాతలకు ఇతర మార్గాలెన్నో ఉన్నాయి. బాలీవుడ్ ఇప్పుడు కీలక పరిశ్రమగా మారిందని, ఇదివరకటికంటే వేగంగా అది ఎదుగు తోందని ఇది సూచిస్తోంది. కానీ వాస్తవం మాత్రం భిన్నంగానే ఉంది. కొన్ని వారాల క్రితం, సినిమా వ్యాపారంపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ని ఇంటర్వ్యూ చేశారు. భారత్‌లో సినిమాలు చూసే వారి సంఖ్య వాస్తవానికి ప్రతి సంవత్సరం తగ్గుముఖం పడుతోందని చాలాకాలం నుంచి సినీపరిశ్రమలో ఇన్ సైడర్లకు తెలుసని కరణ్ తెలిపారు. ఇందుకు కారణాలలో మౌలిక వసతుల సమస్య ఒకటి. భారత్‌లో నేటికీ లక్షమంది జనాభాకి ఒక హాల్ మాత్రమే ఉంటోంది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పరిశ్రమ అయిన అమెరికాలో 12 థియే టర్లు, హాంకాంగ్‌తో కలసి ప్రపంచంలో రెండో అతిపెద్ద పరిశ్రమ అయిన చైనాలో లక్షమందికి 2.5 థియేటర్లు ఉన్నాయి. భారతీయ నగరాలు పాత సినిమాహాళ్లను కూల్చివేసి, మాల్స్‌ను నిర్మించడం ప్రారంభించడంతో దేశంలో థియేటర్ల సంఖ్య మరింత పడిపోనుంది. మరొక సమస్య ఏమిటంటే, కొత్త మాల్స్‌లోని మల్టీప్లెక్స్ తెరలు చాలామంది మధ్య తరగతి కుటుంబాలకు భరించలేనివిగా ఉన్నాయి. వీటిలో ఒక్క టిక్కెట్ ధర రూ. 250ల వరకు ఉంటోంది. కుటుంబం మొత్తాన్ని సినిమాకు తీసుకెళ్లాలంటే అది కుటుంబ ఆదాయాన్నే మింగేస్తుంది. దీనికితోడు సేవా పన్ను, వినోద పన్ను రేట్లు అధికంగా ఉంటున్నాయి. ఈ స్థితిలో టిక్కెట్ల ధరలు తగ్గించడానికి పెద్దగా అవ కాశం లేదు. అలా అని సినీ నిర్మాతలు, స్టూడియోలు మరీ దురాశాపరులు కావ టంవల్లే ఇలా జరుగుతోందని చెప్పలేం. వాస్తవానికి, భారీ నష్టాలను ఎదుర్కొం టున్నందువల్ల, బాలీవుడ్ సినీ నిర్మాణ వ్యాపారం నుంచి వైదొలుగుతాయని ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్‌డిస్నీ ఇటీవల ఒక ప్రకటన చేసింది. సినీ ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి గల కారణాలలో సినీ పరిశ్రమ కూడా ఒక భాగమై ఉంది. బాలీవుడ్ బడా స్టార్ హీరోలు తగినన్ని సినిమాలను నిర్మించ కపోవడం వల్ల ప్రేక్షకులకు చూడటానికి సినిమాలు లేకుండా పోయాయని నా మిత్రుడొకరు చెప్పారు. అమీర్, షారుఖ్, సల్మాన్‌లు ఇప్పుడు ఏటా ఒక సిని మాలో మాత్రమే నటిస్తున్నారు. ప్రకటనలు, టీవీల ద్వారా వీరు ఆర్జిస్తున్నారు. కాగా, సినిమా కోసం వెచ్చించగలిగినంత డబ్బు ఉండి సినిమాకు వెళ్లాలనుకుని పలువురు భావిస్తున్నప్పటికీ తరచుగా వీరికి చూడటానికి సినిమాలే లేకుండా పోతున్నాయి. హలీవుడ్, హాంకాంగ్‌తోపాటు ప్రపంచంలోని మూడు అతిపెద్ద సినీ పరిశ్రమల్లో బాలీవుడ్ ఒకటి. వీటిలో ప్రతి దానికీ స్టార్ వ్యవస్థ ఉంది. జనంలో గుర్తింపు పొందిన ప్రముఖ నటులు సినిమాకు గ్యారంటీ విజయాన్ని కల్పించగల రని, వీరు తగిన సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించగలరని దీనర్థం. సమస్య ఎక్కడుందంటే బాలీవుడ్ ప్రతి ఏటా చాలా సినిమాలను నిర్మిస్తున్న ప్పటికీ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో తీస్తున్న సినిమాలను కూడా కలుపుకున్నట్లయితే) పరిమిత సంఖ్యలోనే ప్రముఖ స్టార్లను కలిగి ఉండటమే. అదే హాలీవుడ్లో అయితే ఒక పెద్ద సినిమాలో నటిం చేందుకు అనేకమంది స్టార్లు అందుబాటులో ఉంటున్నారు. మరొక సమస్య ఏమి టంటే.. హాంకాంగ్ సినిమాల్లాగా, బాలీవుడ్ సినిమాలు సార్వత్రికమైనవి కావు. నేనెందుకిలా చెబుతున్నానంటే.. హాంకాంగ్ చిత్రపరిశ్రమ తీస్తున్న మార్షల్ ఆర్ట్స్ సినిమాలు వస్తుగతమైనవి. బ్రూస్లీ, జాకీచాన్ వంటి హాంకాంగ్ స్టార్లు అమె రికాలోనూ, ఇండియాలో కూడా ప్రముఖ హీరోలుగా మారారు. హాంకాంగ్ సిని మాలు యాక్షన్ స్వభావంతో కూడుకున్నవి కావడంతో డబ్బింగ్ చేసేటప్పుడు కూడా వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. భారతీయ సినిమాలు యాక్షన్‌తో కూడినవి కాదు. పైగా హాంకాంగ్ సినిమా ల్లాగ బాలీవుడ్ సినిమాల యాక్షన్ నాణ్యత అంత ఉన్నతంగా ఉండదు. బాలీవుడ్ సినిమాల్లో సంగీతం, నాట్యం ఉంటున్నందున వీటిని డబ్బింగ్ చేయడం అంత సులభం కాదు, నాణ్యత కోల్పోవడం కాస్త అధికంగానే ఉంటుంది. దీనివల్లే హాలీవుడ్, హాంకాంగ్ సినిమాలతో పోలిస్తే భారతీయ సినిమాల విదేశీ ఆదా యాలు చాలా తక్కువ. విదేశాల్లో మన సినిమాలను చూసేది చాలావరకు దక్షిణా సియా సంతతి ప్రజలే కావడం విశేషం. దీంట్లో కూడా ప్రేక్షకుల సంఖ్య తక్కువే. పాకిస్తాన్‌లోని మల్టీప్లెక్స్‌లలో భార తీయ సినిమాలకు అధిక మార్కెట్ ఉంది. అయితే పైరసీ కారణంగా దశాబ్దాలుగా ఇక్కడి ఆదాయాన్ని బాలీవుడ్ కోల్పోయింది. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ హయాంలో అధికారికంగానే బాలీవుడ్ సినిమాల ప్రదర్శనను అనుమతించారు. దీంతో ఇరు దేశాలూ లబ్ధిపొందాయి. ఈ రోజు బాలీవుడ్లో నిర్మిస్తున్న అన్ని సిని మాలను పాకిస్తాన్లో ప్రదర్శిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఇరుదేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు క్షీణిస్తున్నందున ముషారఫ్ గతంలో తీసుకున్న తెలివైన నిర్ణయాన్ని కూడా వెనక్కు మళ్లిస్తే మనం ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఈ అన్ని కారణాల వ ల్లే, బాలీవుడ్‌కు అధిక సామర్థ్యం ఉన్నప్పటికీ అది ఎదగలేకపోతోంది. వాగ్దానాలను గుప్పించడమే తప్ప, వాటిని అమలు చేయడంలో విఫలమౌతున్న భారతీయ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగానే బాలీవుడ్ ప్రయాణిస్తున్నట్లుంది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
హీరోగా.. నిర్మాతగా... అదే నా లక్ష్యం!
‘‘నా మొదటి సినిమా ‘ఏ మాయ చేశావె’ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కనబరుస్తున్న ఆదరాభిమా నాలకు ఆనందంగా ఉంది. ఓ హీరోగా వారిని మెప్పించేలా వైవిధ్యమైన చిత్రాలు చేయాలన్నది నా లక్ష్యం. ఇప్పటివరకూ చేసినవాటిలో ‘మనం’ నాకు ప్రత్యేకం. తాతగారు, నాన్నతో కలిసి నటించిన ఆ చిత్రం తీపి గుర్తుగా నిలిచిపోతుంది’’ అని నాగచైతన్య అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. భవిష్యత్ ప్రణాళికల గురించి నాగచైతన్య చెబుతూ- ‘‘నాకు మొదట్నుంచీ నిర్మాణ రంగంపై ఆసక్తి ఉంది. మా అన్నపూర్ణ స్టూడియో బేనర్లో రూపొందిన ‘ఒక లైలా కోసం’ సినిమా నిర్మాణ బాధ్యతలు చూసుకున్నాను. ఓ నిర్మాతగా అందరికీ నచ్చే సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం’’ అన్నారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ పూర్తయ్యిందనీ, రోడ్ ట్రిప్‌లో జరిగే లవ్‌స్టోరీ ఇదని చెప్పారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ‘కార్తికేయ’ నచ్చడంతో తనతో ఓ సినిమా చేయాల నుకున్నాననీ, కథ కూడా అనుకున్న నేపథ్యంలో మలయాళ ‘ప్రేమమ్’ నచ్చడంతో ఆ సినిమా రీమేక్ చేద్దామని చందూతో చెప్పానని నాగచైతన్య తెలిపారు. -
మళ్లీ మళ్లీ మల్లీశ్యరి
రాయలవారి ముందు... ‘నా ప్రాణం తీసుకోండి... బావని వదిలేయండి’ ‘లేదూ నా ప్రాణం తీసుకోండి, మల్లిని వదిలేయండి’ అని ప్రాధేయపడుతుంటే మన గుండె తరుక్కుపోతుంది. ‘నా ప్రాణం తీసుకోండి’ అని ఇద్దరూ అంటున్నారంటే... నిజానికి ఒకరి ప్రాణం ఒకరిలో ఉందని. ఈ ప్రమాదం జరుగుతుందని ప్రేక్షకుడిగా మనకి ముందే అనిపిస్తుంది. అప్పుడే అనుకుంటాం... ‘అయ్యో తప్పు చేస్తున్నావు... నీ మల్లికి కావాల్సింది రాణివాసం కాదు... నీ హృదయ సామ్రాజ్యానికి రాణి అవడం’ అని అరిచి చెప్పాలని! ఈ సినిమా మనకి చెప్పే గొప్ప గుణపాఠమే అది. గమ్మత్తు కోసమైనా... పరాచికాలాడకూడదని. భానుమతికి పల్లకి పంపించమని ఎన్టీఆర్ పరాచికం ఆడితేనే... ఈ అరాచకం జరిగింది. అంత అందంగా ప్రేమించుకునే చిలకాగోరింకలు ఒంటరులై, ఎవరికి వారై, తెలిసీతెలియక కోరితెచ్చుకున్న ఎడబాటుతో కుమిలిపోయారు. గుండెను పిండే అందమైన ప్రేమకథ. ఎన్టీవోడు, భానుమతి ఇంకా అందంగా ఉంటారు. పాటలు మీగడతరకల్లా... మాటలు తేనెల ఊటల్లా... సన్నివేశాలు కవ్వించి, నవ్వించి, ఏడిపించేలా... మళ్లీ... మళ్లీ... మల్లీశ్వరిలా.... మళ్లీ చూడండి ‘‘ఏక చక్రీ మహాభోగీ! మహారాణివౌతావు. మహాభోగం పొందుతావు తల్లీ. బ్రహ్మ మాటకైనా తిరుగుంది కానీ ఈ బసవయ్య మాటకు తిరుగులేదు తల్లీ! జై శంకర మహాదేవ్’’ భానుమతి చెయ్యి చూసి ఫ్యూచర్ చెప్పాడు తిరణాల జోస్యుడు. టీన్స్‌లో ఉన్న ప్రతి పిల్లా క్వీనే కానీ... జోతిష్యుడు చెప్పాడని మహారాణి అయి కూర్చుంటుందా? ‘‘వెళ్దాం పద’’ అన్నాడు ఆ పిల్ల బావ ఎన్టీఆర్. ‘‘బావా! నీ చెయ్యి కూడా చూపించు’’ అంది భానుమతి. ‘‘ఆ.. నా చెయ్యి ఎందుకూ - నువ్వు మహారాణివైతే, నేను మహారాజునైనట్టే’’. భానుమతి బిడియంతో ముడుచుకుంది. చిరునవ్వు నవ్వింది. బావంటే భానుమతికి ప్రాణం. ఎన్టీఆర్‌కీ అంతే. కానీ ఎక్స్‌ప్రెస్ చెయ్యడు. శిల్పాలు చెక్కుతూ ఉంటాడు. ఒక్కరోజైనా ఇద్దరూ చూసుకోకుండా, మాట్లాడుకోకుండా, పోట్లాడుకోకుండా ఉండలేదు. ఆ రోజూ అంతే. బావామరదళ్లిద్దరూ కలిసి ఎడ్లబండిలో తిరణాలకని వీరాపురం నుండి వచ్చారు. వీరాపురం... వెరీ నియర్ టు విజయనగరం. తిరిగి వెళ్లే సమయానికి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి! ఈ పడుచు జంటపై పన్నీటి జల్లులు కురవబోతున్నాయా? వారి ప్రేమను కన్నీటి జడులు ముంచెత్తబోతున్నాయా? ఆ మేఘాలు దేనికి సంకేతం? పైన ఉరుముతోంది. పాడుబడిన సత్రంలోకి పరుగెత్తారు ఎన్టీఆర్, భానుమతి. వాన మొదలైంది. అది ఆగేవరకు వీళ్లూ ఆగాలి. వేరే దారి లేదు. వాతావరణం చల్లగా ఉంది. భానుమతి మనసు పులకించింది. ఆడింది. ‘పిలిచిన బిగువటరా ఔరౌరా...’ అని పాడింది. రాజా అంటే నాగరాజు. మన ఎన్టీఆర్. వీళ్లిక్కడికి ఎలాగైతే వర్షానికి తలదాచుకోవాలని వచ్చారో... అలాగే మరో ఇద్దరు అక్కడి చేరుకున్నారు. భానుమతి నాట్యాన్ని, పాటనీ... చూసీ, వినీ ఆ ఇద్దరూ పులకించి పోయారు. వాళ్లల్లో ఒకరు మారువేషంలో ఉన్న విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. ఇంకొకరు ఆయన ఆస్థాన పండితుడు. హోరు ఎంతకూ తగ్గడం లేదు. వాళ్లూ వీళ్లూ మాటలు కలుపుకున్నారు. ఊర్లూ పేర్లూ చెప్పుకున్నారు. ‘‘ఈ పిల్ల మా నారప్ప మామ కూతురు... మల్లీశ్వరి’’ అని చెప్పాడు ఎన్టీఆర్. మల్లీశ్వరి అంటే మన భానుమతే. రాయలవారు వాత్సల్యంగా చూశారు. ‘‘అమ్మాయీ... ఈ విద్యలు ఈశ్వర ప్రసాదం. ఇదిగో! మా ఆనందానికి ఈ చిన్న పారితోషికం’ అని మెడలోంచి హారం తీసి ఇవ్వబోయాడు. ‘‘వద్దండీ’’ అంది భానుమతి వినయంగా. ‘‘అలా అనకూడదమ్మా. వీరు మనందరికీ తండ్రి వంటి వారు. ఈ హారం మహారాణి వారి ఇష్టసఖీ మర్యాదలతో గౌరవింపదగింది. నువ్వు చెప్పు నాయనా’’ అన్నాడు పండితుడు ఎన్టీఆర్ వైపు చూస్తూ. తీసుకోమన్నాడు బావ. ఆభరణాన్ని అందుకుంది మరదలు. వాన హోరు తగ్గింది. భానుమతి మాటల జోరు మాత్రం తగ్గడంలేదు. తన ముందున్నది రాయలవారని తెలియక, తన ధోరణిలో తను ఏదో మాట్లాడుతూనే ఉంది. రాయల వారు నవ్వుతూ వింటున్నారు. మరదల్ని ఆటపట్టిద్దామని ఎన్టీఆర్ అన్నాడు - ‘‘ఈమె ఆటాపాట మెచ్చుకున్నారు కదా. ఒక ఉపకారం చేస్తారా?’’ అని. అడగమన్నాడు పండితుడు. ‘‘మరేం లేదులెండి, ఇందాక ఏదో సెలవిచ్చారే... మహారాణి వారి ఇష్టసఖీ మర్యాదలని! అవేవో కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో, ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక పిల్లి... ఆ కాదులెండి, ఒక పిల్ల ఉందని మనవి చేయించి, పల్లకీ పంపేట్టు మాత్రం చూడండేం’’ అన్నాడు భానుమతిని ఏడిపించడానికి. రాయల వారు ముచ్చటగా నవ్వారు. అక్కడి నుంచి ప్రయాణమయ్యారు. ‘‘పో బావా నీతో మాట్లాడను. ఎందుకు చెప్పు... వాళ్లతో పల్లకి పంపమని చెప్పడం’’ అంది భానుమతి ఎన్టీఆర్ వైపు చిరుకోపంతో చూస్తూ. ఎన్టీఆర్ నవ్వాడు. ‘‘ఓస్ పిచ్చిపిల్లా! వీళ్లేనా పల్లకీలు, పట్టపుటేనుగులూ పంపేది! వీళ్లకసలు రాయలవారి దర్శనమే కాదు’’అని తేల్చేశాడు. కానీ తను చేసిందే పిచ్చి పని అని అప్పుడు అతడికి తెలీదు. ఎన్టీఆర్, భానుమతి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ జంటను చూసి చెట్టూపుట్టా కూడా మురిసిపోతున్నాయి. కానీ భానుమతి తల్లే. ఆమెకు మాత్రం ఎన్టీఆర్‌ని చూస్తే చిర్రెత్తుకొచ్చేస్తోంది. శిల్పాలు చెక్కడం తప్ప వేరే పని చేతకాని అప్రయోజకుడికి పిల్లనిచ్చి చెయ్యడం ఆమెకు ఇష్టం లేదు. మేనల్లుడు ఉండగా వేరెవరికో ఇచ్చి చెయ్యడం భానుమతి తండ్రికి ఇష్టం లేదు. ఓ రోజు భానుమతి తల్లి ఎన్టీఆర్ తల్లిని పట్టుకుని కడిగేసింది. ‘‘నీ కొడుకు అప్రయోజకుడు. వాణ్ణి నా కూతురితో కలవన్వికు’ అని తిట్టేసింది. అది తెలిసి నాగరాజు పంతం పట్టాడు. నాగమ్మ (భానుమతి తల్లి) కోరినంత ధనం తీసుకొచ్చి ఆమె ఇంటి ముందు పడేసి, తనూ ధనవంతుడినే అనిపించుకుని భానుమతిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తన చేతిలో శిల్పకళ ఉంది. కష్టపడి పనిచేస్తే ఏ ఆస్థానంలోనైనా ఉద్యోగం రాకపోదని అతడి నమ్మకం. భానుమతి అడ్డుచెప్పినా వినకుండా, ‘నేను వచ్చేంత వరకు మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటావుగా’ అని మాట తీసుకుని మరీ వెళ్లిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. బావ కోసం ఎదురు చూస్తోంది భానుమతి. ఎంతకూ రాడు. ‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు / దేశదేశాలన్ని తిరిగి చూసేవు / ఏడ తానున్నాడో బావ / జాడ తెలిసిన పోయి రావ ’ అని తన బాధను మేఘాలతో మొరపెట్టుకుంది. బావ రాలేదు. బంగారు పల్లకీ వచ్చింది! రాణీవాసం రమ్మంది. భానుమతికి తల తిరిగిపోయింది. భానుమతి తల్లి గాల్లో తేలిపోయింది. భానుమతి తండ్రి విచారంలో మునిగిపోయాడు. తన ప్రమేయం లేకుండా, తనకు ఇష్టం లేకుండా, బావకు ఒక్కమాటైనా చెప్పే అవకాశం లేకుండా... పెద్దల ప్రోద్బలంతో రాణివాసానికి వెళ్లిపోయింది భానుమతి. డబ్బు సంపాదించుకొచ్చాడు ఎన్టీఆర్. మరదలు కనిపించలేదు! ‘‘మల్లమ్మని మర్చిపో తండ్రీ’’అని తల్లి నిట్టూర్చింది. విషయం చెప్పింది. మరదలు రాణివాసం వెళ్లిపోయిందని తెలిసి పిచ్చివాడయ్యాడు ఎన్టీఆర్. మళ్లీ ఊరొదిలి వెళ్లిపోయాడు. అక్కడ అంతఃపురంలో భానుమతిదీ ఇదే పరిస్థితి. అంతఃపురం వదిలి బయటికి రాలేదు. బావనే తలచుకుంటూ బంగారు పంజరంలో కృశించిపోతోంది. ఓరోజు - రాయలవారి ఆస్థాన శిల్పులు, రాళ్ల కోసం ఓ గుహలోకి వచ్చి, అక్కడ పిచ్చివాడిలా ఉన్న ఎన్టీఆర్‌నీ, అతడు చెక్కిన శిల్పాలను చూసి ఆశ్చర్యపోయారు. రాచనగరులో నిర్మిస్తున్న నర్తనశాలకు అవసరం అని చెప్పి, ఒప్పించి మరీ తీసుకెళ్లారు. అలా నర్తనశాల పనిలో పడ్డాడు ఎన్టీఆర్. కానీ బాధ నుండి బయటపడలేదు. ఒకనాడు అంతఃపుర స్త్రీలు నర్తనశాల నిర్మాణం చూడ్డానికి వచ్చారు. వారితో పాటు భానుమతీ వచ్చింది. ఆ శిల్పం ఈ శిల్పం చూస్తూ, అక్కడి శిల్పిగా పనిచేస్తున్న బావను చూసి ఆశ్చర్యపోయింది. అతడిని రహస్యంగా కలుసుకుని ‘బావా... బావా’ అని పరవశించిపోయింది. మరదల్ని చూడగానే ఎన్టీఆర్ కళ్లలోకి ఆనందం, అతడి కళకు ఒక పరిపూర్ణత వచ్చాయి. రెండోసారీ కలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఎన్టీఆర్‌తో పాటు భానుమతీ రాజభటులకు దొరికి పోయింది. తర్వాతేమిటి? ఇంకేముంటుంది ఉరి! అపరాధానికి శిక్ష ఉరి. కానీ ఎవరు అపరాధి? బావా? మరదలా? లేక ఇద్దరూనా? ఆనాడు తను వేళాకోళంగా అన్న మాట వల్లనే తన మరదలికి రాణివాసం సంప్రాప్తించిందని రాయలవారి మాటల్లో గ్రహించాడు ఎన్టీఆర్. ‘‘అపరాధమంతా నాదే ప్రభూ... నన్ను శిక్షించి నా మల్లిని రక్షించండి’’ అని వేడుకున్నాడు. ‘‘ప్రభూ అపరాధమంతా నాదే’’ అంటూ ఏకధాటిగా రోదించింది భానుమతి. ‘‘కాదు, అపరాధమంతా నాగరాజుదే. మల్లీశ్వరిని క్షమిస్తున్నాం’’ అన్నాడు రాయలవారు. ‘‘కాదు ప్రభూ. అపరాధమంతా నాదే. నేను రమ్మంటేనే నా బావ అంతఃపురంలోకి వచ్చాడు. నన్ను ఉరి తీయించి, నా బావను రక్షించండి’’ అంది భానుమతి తప్పును తన మీద వేసుకుని. ‘‘సార్వభౌముల వారికి గట్టి చిక్కే వచ్చింది. ఈ ధర్మసూక్ష్మం ఎలా విడదీస్తారో’’ అన్నాడు పండితుడు. రాయలవారు చిరునవ్వుతో చూశారు. ‘‘ఆనాడు సత్రంలో మనోహరమైన నృత్యం చేసి మాకు ఆనందం కలిగించిన మల్లీశ్వరిని, మా నర్తనశాలలో అపూర్వ శిల్పాలు సృష్టించి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించిన నాగరాజునీ ఇద్దర్నీ క్షమించేస్తున్నాం అని తీర్పు ఇచ్చారు కరుణాసముద్రుడైన శ్రీకృష్ణ దేవరాయలు. అందరి ముఖాలూ వికసించాయి. బావా మరదళ్ల గురించి చెప్పాలా? కథ... సుఖాంతం. హిట్ సాంగ్స్ - కోతీబావకు పెళ్లంట కోవెల తోట విడిదంట - పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి - పిలిచిన బిగువటరా ఔరౌర - ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు - ఔనా నిజమేనా మమతలన్ని కలలేనా? - మనసున మల్లెల మాలలూగెనె వివరాలు-విశేషాలు - వాహినీ స్టూడియోస్ బ్యానర్ 1951 డిసెంబర్ 20న విడుదలైంది. దర్శకత్వం, నిర్మాణం బి.ఎన్.రెడ్డి. - కథాకాలం 13వ శతాబ్దం. పాటలు : దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం : సాలూరి రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు. నేపథ్యగానం : ఘంటసాల, భానుమతి, మాధవపెద్ది సత్యం, శకుంతల. సంభాషణలు : దేవులపల్లి కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు. - మల్లీశ్వరి తీయాలని బి.ఎన్.రెడ్డి 1939లో అనుకుంటే, పదేళ్లకు గానీ ఆయన ఆలోచన రూపుదాల్చలేదు! - మొదట మల్లీశ్వరి పాత్రకు ఒక కొత్త అమ్మాయిని అనుకున్నారు. కానీ మల్లీశ్వరి వంటి విలక్షణమైన పాత్రకు అనుభవం ఉన్న వారైతే బాగుంటుందని భానుమతిని తీసుకున్నారు. - కళా దర్శకుడు ఎ.కె.శేఖర్ పెన్సిల్ స్కెచ్ వేస్తే వాటిని చూసి సెట్స్ తయారు చేశారు. అలా మల్లీశ్వరికి కావలసిన సెట్లన్నిటికీ ఆయన స్కెచ్‌లు గీసిచ్చారు.