
ఇది అఖండ విజయం
‘‘విడుదలకు నాలుగు రోజుల ముందే మా సినిమాలో సగభాగం అనుకోని విధంగా పైరసీకి గురయ్యింది. అయినా కూడా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మా సినిమాకు అఖండ విజయాన్ని చేకూర్చారు. అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాల్లో వసూళ్లపరంగా మూడో స్థానంలో నిలిచింది.
బాలీ వుడ్ పరిశ్రమ అంతా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు’’ అని నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ చెప్పారు. పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఆయన నిర్మించిన ‘అత్తారింటికి దారేది’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాతో పవన్‌కల్యాణ్ ఒక సూపర్‌స్టార్ మాత్రమే కాదు, మహా నటుడని నిరూపించుకున్నాడు. అలాగే శ్రీశ్రీ, జంధ్యాల వంటి మహోన్నత రచయితల జాబితాలో త్రివిక్రమ్ కూడా చేరిపోయాడు’’ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇంకా అలీ, రఘుబాబు, శివన్నారాయణ, అమిత్, కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల మాట్లాడారు.