‘‘మడ్డి’ సినిమా టీజర్ చూడగానే వావ్ అనిపించింది. ఆ తర్వాత నేను, హర్షిత్ కలసి చెన్నైలో ఈ సినిమా ప్రివ్యూ చూసినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. థియేటర్లలో ఈ సినిమాని చూసి, ప్రేక్షకులు కూడా వావ్ అంటారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రల్లో డాక్టర్ ప్రగభల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మడ్డి’. ప్రేమ కృష్ణదాస్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది.
శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్‌పై ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మడ్ రేస్ నేపథ్యంలో ఈ సినిమా మేకింగ్ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంది. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజవుతున్న ఈ చిత్రం అన్ని భాషల్లో సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
డాక్టర్ ప్రగభల్ మాట్లాడుతూ.. ‘‘ఒక యూనిక్ మూవీని ప్రేక్షకులకు అందించాలని మా టీమ్ ఐదేళ్లు కష్టపడి ‘మడ్డి’ని తీశాం. ప్రీ ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌లకు చాలా కష్టపడ్డాం. ‘కేజీయఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం, ‘రాక్షసన్’ ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటింగ్, కేజీ రతీష్ సినిమాటోగ్రఫీ మా సినిమాకు అదనపు బలం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment