muddy
-
ఈ సినిమా చూసి ‘వావ్’ అంటారు: దిల్ రాజు
‘‘మడ్డి’ సినిమా టీజర్ చూడగానే వావ్ అనిపించింది. ఆ తర్వాత నేను, హర్షిత్ కలసి చెన్నైలో ఈ సినిమా ప్రివ్యూ చూసినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. థియేటర్లలో ఈ సినిమాని చూసి, ప్రేక్షకులు కూడా వావ్ అంటారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రల్లో డాక్టర్ ప్రగభల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మడ్డి’. ప్రేమ కృష్ణదాస్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్పై ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మడ్ రేస్ నేపథ్యంలో ఈ సినిమా మేకింగ్ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంది. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజవుతున్న ఈ చిత్రం అన్ని భాషల్లో సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. డాక్టర్ ప్రగభల్ మాట్లాడుతూ.. ‘‘ఒక యూనిక్ మూవీని ప్రేక్షకులకు అందించాలని మా టీమ్ ఐదేళ్లు కష్టపడి ‘మడ్డి’ని తీశాం. ప్రీ ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్లకు చాలా కష్టపడ్డాం. ‘కేజీయఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం, ‘రాక్షసన్’ ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటింగ్, కేజీ రతీష్ సినిమాటోగ్రఫీ మా సినిమాకు అదనపు బలం’’ అన్నారు. -
ఈ వారం అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు..
Upcoming Movies And Web Series In December Second Week: నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం విజయంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఇక్కడి నుంచి సంక్రాంతి వరకు వరుస సినిమాలు అలరించనున్నాయి. అంతకుముందు దీపావళి కానుకగా వచ్చిన బాలీవుడ్ మూవీ 'సూర్యవంశీ' మంచి వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో డిసెంబర్ రెండో వారంలో థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం. 1. లక్ష్య యంగ్ హీరో నాగశౌర్య నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘లక్ష్య’. నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ కీలక పాత్రలు పోషించగా కేతిక శర్మ హీరోయిన్. ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. విలువిద్య నేపథ్య కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా కోసం విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు నాగశౌర్య. కాల భైరవ స్వరాలు సమకూరుస్తున్నారు. 2. గమనం శ్రియ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘గమనం’. ఈ చిత్రాన్ని సుజనారావు తెరకెక్కించారు. రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. భావోద్వేగభరితమైన మూడు కథలతో రూపొందిన చిత్రమిది. ఇందులో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో కనిపించనుంది. 3. నయీం డైరీస్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కిన ‘నయీం డైరీస్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వశిష్ఠ సింహ ప్రధాన పాత్ర పోషించారు. సీఏ వరదరాజు నిర్మాత. 'రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయనే విషయాన్ని ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం. నయీం ఎన్కౌంటర్ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యయనం చేశా. నయీం సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అతని డైరీలో పేర్కొన్న విషయాలు ఎలాంటివనేది తెరపైనే చూడాలి. వశిష్ఠ సింహ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.' అని చిత్ర బృందం చెబుతోంది. 4. మడ్డీ డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న పాన్ ఇండియా చిత్రం 'మడ్డీ'. ఈ సినిమాలో యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ కృష్ణదాస్ నిర్మాణంలో ప్రగభల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. 'మడ్ రేసింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఐదేళ్లు పరిశోధన చేసి దర్శకుడు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇందులో ఫ్యామిలీ డ్రామా, వినోదం, సాహసం.. ఇలా ప్రతి ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రధాన నటులకు రోడ్ రేసింగ్‌లో రెండేళ్లు శిక్షణ ఇచ్చారు.' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి రవి బస్రూర్ స్వరాలందిస్తున్నారు. ఇవే కాకుండా బుల్లెట్ సత్యం, ప్రియతమ, మనవూరి పాండవులు, కటారి కృష్ణ, సర్వం సిద్ధం చిత్రాలు కూడా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆహా * పుష్పక విమానం డిసెంబర్ 10 అమెజాన్ ప్రైమ్ * ద ఎక్స్పాన్స్ (వెబ్ సిరీస్ సీజన్-6) డిసెంబరు10 * ఎన్కౌంటర్ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు10 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ * ఆర్య (హిందీ వెబ్ సిరీస్ సీజన్-2) డిసెంబరు 10 నెట్‌ఫ్లిక్స్ * ద లైట్ హౌజ్ (హాలీవుడ్) డిసెంబరు 6 * వాయిర్ డిసెంబరు 6 * టైటాన్స్ (వెబ్‌సిరీస్ సీజన్-3) డిసెంబరు 8 *అరణ్యక్ (హిందీ సిరీస్) డిసెంబరు 10 * ద అన్ ఫర్‌గివబుల్ (హాలీవుడ్) డిసెంబరు 10 జీ5 కాతిల్ హసీనోంకే నామ్ (హిందీ సిరీస్) డిసెంబరు 10 -
ఎటు చూసినా కన్నీటి గాథలే
ఊహించని విలయం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నీటి ప్రవాహం ముంచెత్తడంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ప్రాణాలు దక్కించుకున్నారు. బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీశారు. ప్రకృతి ప్రకోపం చల్లారింది. వరద తగ్గుముఖం పట్టింది. దీంతో పునరావాస కేంద్రాల నుంచి కొంతమంది ఇప్పుడిప్పుడే ఇళ్లకు వస్తున్నారు. ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న సామాగ్రి.. ఎటు చూసిన బురద.. వారికి దర్శనమిచ్చాయి. ఆ ఇంట్లోని వస్తువులను తలచుకుంటూ, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కన్నీటి వరదలో ఇళ్లను పునర్నిర్మించుకునే పనిలో పడ్డారు. ఒక్క క్షణం ఆలస్యమైతే బతికేవాడ్ని కాదు ‘మా ఇంట్లోకి పది అడుగుల వరకు నీళ్లు వచ్చేశాయి. ఐదు రోజుల పాటు ఆ నీళ్లు అలానే ఉన్నాయి.. ప్రస్తుతం మా ఇల్లు యుద్ధభూమిని తలపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు. ఎర్నాకుళం జిల్లాలోని మంజలే గ్రామానికి చెందిన అబ్దుల్ సలాం. ‘ఆగస్టు 14వ తేదీ రాత్రి నీటి ప్రవాహం మా ఇంటివైపు రావడం గమనించాను. వెంటనే మా పక్కింటి వాళ్లను అప్రమత్తం చేసి మా మొదటి అంతస్తులోకి నేను, నా భార్య వెళ్లిపోయాం. సురక్షితంగా ఉన్నామని భావించా. అయితే నీటి ప్రవాహం అంతకంతకూ పెరిగింది. ట్రెరస్కు కొద్ది దూరం వరకు నీళ్లు వచ్చేశాయి. స్థానికులు ఓ పడవలో వచ్చి మమ్మల్ని రక్షించారు. మొదట నా భార్య పడవలోకి వెళ్లింది. నేను ఆమె చీరను పట్టుకుని పడవలోకి దూకేందుకు ప్రయత్నించాను. అయితే కాలు జారి నీళ్లలో పడిపోయాను. వెంటనే బోటులో ఉన్న వారు స్పందించి నన్ను పట్టుకుని పైకి తీశారు. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే నా ప్రాణాలు నీటిలో కలిసిపోయేవి’ అంటూ ఆనాటి భయానక సంఘటనను గుర్తు చేసుకున్నారు సలాం. ‘గోడకు ఉన్న అల్మారాలో నా ఇద్దరు పిల్లలు స్కూలు, కాలేజీ రోజుల్లో సాధించిన ట్రోఫీలు, మెడల్స్ భద్రంగా దాచాను. వరదలకు అవి కొట్టుకుపోయాయి. ఆ ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సర్టిఫికెట్లు మాత్రమే మిగిలాయి.. చాలకుడి ప్రాంతానికి చెందిన సురేష్ జాన్ కుటుంబం రెండంతస్తుల భవనంలో ఉంటున్నారు. పది అడుగుల వరకు నీళ్లు రావడంతో ఇంట్లో వారి కుక్కను వదిలిపెట్టి కట్టుబట్టలతో ఇంటి నుంచి పునరావాస కేంద్రానికి వెళ్లారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఇంటికి చేరారు. బురద, మరకలతో భయంకరంగా భయంకరంగా ఉన్న గోడలు వారికి దర్శనమిచ్చాయి. ఫర్నీచర్ అంతా ఓ చోట కూప్పగా పడి ఉంది. పుస్తకాలు అల్మారాలోనే నానిపోయి ఉన్నాయి. ప్రతీ గదిలోనూ బురద పేరుకుపోయింది. ‘ఇంటి పరిస్థితి చూస్తే నాకు మాటలు రావడం లేదు. నేను చాలా విచారంలో ఉన్నాను. సర్వం కోల్పోయాను, మా కుటుంబం మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. నా దగ్గర డబ్బులు కూడా లేవు’ అంటూ జాన్ కన్నీటి పర్యంతమయ్యారు. మొదటి అంతస్తులో ఉందామని మొదట అనుకున్నాం. అయితే నీటి ప్రవాహం అంతకంతకూ పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్యాంప్‌కు వెళ్లాం. నా బట్టలు, పాత, కొత్త పుస్తకాలు, ఫైల్స్, పేపర్లు అన్నీ పాడైపోయాయి. సర్టిఫికెట్లు జాగ్రత్తగా దాచుకోవడంతో అవి మాత్రమే మిగిలాయి’.అంటూ వాపోయారు ఎల్సా జాన్. అయితే, వారి కుక్క మాత్రం సురక్షితంగా తిరిగి వచ్చింది. మానసిక ఆందోళనలో ఉన్నారు ఓ పునరావాస కేంద్రంలో ఉన్న ఓ వృద్ధుడు ఛాతిలో నొప్పిగా ఉందని క్యాంప్‌లో సేవలందిస్తున్న వైద్యుడు రఫీక్‌ను కలిశాడు. అతన్ని పరీక్షించిన వైద్యుడు.. రోగం సంగతి ఎలా ఉన్నా ‘ముందు నువ్వు మీ ఇంటికి వెళ్లొద్దు.. మీ కొడుకు ఇల్లు మొత్తం శుభ్రం చేశాకే ఇంటికి వెళ్లు’ అని చెప్పాడు. దీన్ని బట్టి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ‘ఎంతో కష్టపడి చాలా మంది తమ ఇళ్లను నిర్మించుకున్నారు. ఆ ఇంటితో వారికి విడదీయరాని బంధం, అనుబంధం ఉంటుంది. ఇప్పుడున్న స్థితిలో ఆ ఇంటిని చూస్తే వారు తట్టుకోలేరు. వారంతా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. శారీరకంగా ధృడంగా ఉన్న వారు కూడా బోరున విలపిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు డాక్టర్ రఫీక్. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మురికి నీరే వారికి దిక్కు!
మహరాష్ట్రః మహరాష్ట్ర ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో భూమిలో నీరు కూడ ఎండిపోయి చుక్కనీటికోసం ప్రజలతోపాటు... మూగజీవాలూ కూడ నానా యాతనా పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లాతూర్ సహా కొన్ని ప్రాంతాలకు ట్రైన్ లో నీరు పంపే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ నాగపూర్ తదితర దూర ప్రాంతాల్లోని జనం బోర్లు కూడ ఎండిపోయి నీటికోసం అల్లాడుతున్నారు. ఎండిన బావులు, కుంటల్లో అట్టడుగున ఉన్న మడ్డి, మురికి నీటినే సేకరించి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగపూర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నీటికోసం తపించిపోతున్నారు. చుక్క నీరు దొరకాలన్నా కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాల్సి వస్తోందని, దిక్కు లేని పరిస్థితుల్లో అక్కడ దొరికిన మురికి నీటినే తాగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నీటిని తాగడంవల్ల అనేక అనారోగ్యాలు చోటు చేసుకుంటున్నాయని, కొందరి ప్రాణాలకే ప్రమాదంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. మహరాష్ట్రలోని నీటి ఇబ్బందులకు ప్రధాన కారణం అక్కడి ప్రముఖ ఆనకట్టల్లో సైతం నీరు ఇంకిపోవడమే. రాష్ట్రంలో మొత్తం చిన్నా పెద్దా కలిపి 1700 ఆనకట్టలు ఉన్నాయి. వాటిలో ఐదు వరకూ పెద్ద ఆనకట్టలు ఉన్నాయి. వీటిలో సతారా జిల్లాలోని కోయనా నదిపై ఉన్నకోయనా, ఔరంగాబాద్ జిల్లాలోని జాయ్ కబాడి, షోలాపూర్ జిల్లాలోని భీమానదిపై ఉన్న ఉజ్జయినీ, యవత్ మాలా జిల్లాలోని పెన్ గంగా నదిపై ఉన్న ఇసాపూర్, నాగపూర్ లోని తోతలాదోహ్ ఆనకట్టలు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవల వీటి పరిస్థితి కూడ పూర్తిగా మారిపోవడంతో రాష్ట్ర ప్రజలకు నీటిగండం ఎదురైంది. గత కొన్ని సంవత్సరాలుగా రుతుపవనాల ప్రభావం... ఈ ప్రముఖ ఆనకట్టల్లో కూడ నీటి పరిస్థితి దుర్భరంగా మారింది. దీంతో రాష్ట్రంలో నీటి కష్టాలు తీవ్రమైపోయాయి. ఆనకట్టల్లో నీరు తక్కువగా ఉండటం ఈసారి రైతులకు కూడ ఇక్కట్లు తప్పేట్టు కనిపించడం లేదు.