
RRR: Ram Charan Mobbed By Mumbai Fans At Bandra: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతరామారాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌లు అద్భుత నటనతో సంచలన హిట్‌గా దూసుకుపోతోంది. ఈ సినిమాతో రామ్ చరణ్‌కు, ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది.
ప్రస్తుతం ఈ సక్సెస్‌ను రామ్ చరణ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చాడాలన్న ఉద్దేశంతో ఆదివారం సాయంత్రం ముంబై బాంద్రాలోని గెయిటీ గెలాక్సీకి వెళ్లాడు రామ్ చరణ్. అక్కడి ప్రేక్షకులకు రామ్ చరణ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
అక్కడ రామ్ చరణ్‌ను చూసిన అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ముంబై ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు చెర్రీ ఎంతో సంతోషించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రామ్ చరణ్ నలుపు రంగు దుస్తులు ధరించి అయ్యప్ప స్వామి మాల దీక్షలో కనిపించాడు.
ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇదివరకు బాలీవుడ్‌లో 'జంజీర్' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీకి చాలా మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి సీతరామరాజుగా చెర్రీ పలికించిన హావభావాలు, నటనకు ముంబై ఆడియెన్స్ ఫిదా అయినట్లు తెలుస్తోంది.
మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఆర్ఆర్ఆర్ వారం రోజుల్లోనే రూ. 700 కోట్లను కొల్లగొట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు మార్కుకు చేరువలో ఉందని అంచనా. ఈ సినిమాలో బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, అలియా భట్, సముద్ర ఖని, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ కీలక పాత్రల్లో మెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment