The Most Expensive RRR Movie Tickets In Mumbai, Price Details Inside - Sakshi
Sakshi News home page

RRR Movie Tickets: అధిక ధరకు 'ఆర్ఆర్ఆర్‌' టికెట్ల విక్రయం.. ఎక్కడంటే ?

Published Thu, Mar 24 2022 6:41 PM | Last Updated on Thu, Mar 24 2022 7:54 PM

The Most Expensive RRR Movie Tickets In Mumbai - Sakshi

The Most Expensive RRR Movie Tickets In Mumbai: రౌద్రం.. రణం.. రుధిరం.. యావత్‌ భారతదేశం వేయి కళ్లతో ఎదురుచూసిన చూసిన చిత్రమిది. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్‌ చిత్రం వీక్షించేందుకు సమయం సమీపించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, యంగ్‌ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ నటనను చూసేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలింది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ శుక్రవారం అంటే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా విడుదలకు సుమారు నాలుగేళ్లు కష్టపడింది చిత్రబృందం. అయితే ఇప్పుడు ఈ సినిమా వీక్షించడానికి అధిక ధర పెట్టి టికెట్ కొనాల్సిందే. 

చదవండి: 'ఆర్ఆర్ఆర్‌'లో అలరించే కీలక పాత్రధారులు వీరే..

ఇప్పటికీ ఈ సినిమా బుకింగ్‌లో ప్రారంభమయ్యాయి. అనేక థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లలో హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టేశారు. ముంబైలో టికెట్ల ధర చాలా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని వర్లీలోని ఒక థియేటర్‌లో అత్యంత ఖరీదైన 3డీ టికెట్‌ ధర రూ. 2000గా ఉంది. నగరంలోని ఇతర మల్టీఫ్లెక్స్‌లలో కూడా టికెట్లను రూ. వెయ్యి నుంచి 1500 వరకు విక్రయిస్తున్నారు.



అలాగే 2డీలో అత్యంత ఖరీదైన టికెట్‌ ధర రూ. 1900కు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఈ 3డీ ధర రూ. 2100కుపైగా ఉండగా.. హైదరాబాద్‌లో సుమారు అన్ని థియేటర్లలు, మల్టీఫ్లెక్సులలో టికెట్లను డిస్ట్రిబ్యూటర్లే బ్లాక్‌ చేసి ఒక్కో టికెట్‌ను రూ. 3 వేలకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ 'ఆర్ఆర్ఆర్‌' సినిమాను 2డీ, 3డీ ఫార్మాట్‌లతో పాటు డాల్బీ అట్మాస్‌, డాల్బీ విజన్‌ ఫార్మాట్‌లలోనూ విడుదల చేస్తున్నారు. ఈ ఫార్మాట్‌లలో మొట్టమొదటిసారిగా విడుదలైన తొలి భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' గుర్తింపు పొందింది. 



చదవండి: వారణాసిలో 'ఆర్ఆర్ఆర్' త్రయం.. వీడియో వైరల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement