
ముంబైలో బాలీవుడ్ నటి ఉర్మిళా కొఠారే కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక కార్మికుడు మృతి చెందాడు. కాండీవిల్లోలో జరిగిన ఈ ప్రమాదంలో మరోకరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకుని ఆమె తిరిగి ఇంటికెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
మరాఠీ నటి ఉర్మిళా కొఠారే శుక్రవారం రాత్రి సినిమా సెట్స్ నుంచి ఇంటికి వెళ్తుండగా తన డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అదే దారిలో మెట్రో ప్రాజెక్ట్ నందు పనిచేస్తున్న ఇద్దరు కార్మికులపైకి కారు దూసుకుని పోవడంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరోకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు ప్రకటించారు.
ఈ ప్రమాదంలో ఉర్మిళా కొఠారేతో పాటు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. కారును చాలా వేగంగా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. సమయానికి ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాలతో వారిద్దరూ బయటపడ్డారని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంతో మరణానికి కారణమైన పలు సెక్షన్ల కింద డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment