మిల్కీ బ్యూటీ బిగ్‌ డీల్‌.. ఏకంగా నెలకు రూ.18 లక్షలు! | Tamannaah Bhatia Rents Office Space For 18 Lakh Per Month In Mumbai | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: తమన్నా ఆస్తుల తనఖా.. ఎన్ని కోట్లకు అంటే?

Jul 2 2024 7:38 PM | Updated on Jul 2 2024 8:50 PM

Tamannaah Bhatia Rents Office Space For 18 Lakh Per Month In Mumbai

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించింది. గతేడాది రజినీకాంత్‌ మూవీ జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ లస్ట్ స్టోరీస్‌-2 వెబ్ సిరీస్‌లో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించింది. హిందీ సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా.. ముంబయిలో ఖరీదైన ప్రాంతంలో కార్యాలయాన్ని రెంట్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.

తాజాగా తమన్నా భాటియా ముంబయిలోని ఓ వాణిజ్య కార్యాలయం అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. నెలకు దాదాపు రూ. 18 లక్షలు చెల్లించనుంది. ఖరీదైన జుహు తార ప్రాంతంలో ఈ వాణిజ్య కార్యాలయం ఉంది. ఈ ఆఫీస్‌ దాదాపు 6,065 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. నానావతి కన్‌స్ట్రక్షన్ నుంచి ఐదేళ్ల కాలానికి లీజు ఒప్పందం చేసుకుంది. ఈ బిగ్‌ డీల్ జూన్ 27న జరగ్గా.. దీనికోసం తమన్నా రూ.72 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అంతే కాదు ఆమెకు చెందిన అపార్ట్‌మెంట్లను కూడా భారీ మొత్తానికి బ్యాంకులో తనఖా పెట్టినట్లు సమాచారం. 

అంతే కాకుండా తమన్నా అంధేరీలోని వీర దేశాయ్ రోడ్ ప్రాంతంలో ఉన్న తన మూడు ఫ్లాట్‌లను ఇండియన్ బ్యాంక్‌లో రూ.7.84 కోట్లకు రుణం కోసం తనఖా పెట్టినట్లు సమాచారం. జూన్ 14న ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నటి రూ.4.70 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించింది. ఇక సినిమాల విషయానికొస్తే తదుపరి చిత్రం వేదాలో కనిపించనుంది. ఇందులో జాన్ అబ్రహం, శర్వరీ వాగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు15న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు నటిస్తోన్న స్ట్రీ- 2లో ప్రత్యేక పాత్రలో పోషించనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement