సెల్ఫీలకు పనికొస్తాం కానీ, ఇళ్లు మాత్రం అద్దెకు ఇవ్వరు: కల్కి | Kalki Koechlin Says Nobody Gave Her House For Rent After Divorce | Sakshi
Sakshi News home page

నాతో సెల్ఫీలు తీసుకుంటారు కానీ, ఇళ్లు మాత్రం అద్దెకు ఇవ్వరు: కల్కి

Nov 29 2024 3:33 PM | Updated on Nov 29 2024 3:47 PM

Kalki Koechlin Says Nobody Gave Her House For Rent After Divorce

బాలీవుడ్‌ నటి కల్కి కొచ్లిన్‌ విడాకులు తీసుకున్న తర్వాత తనకు ఎదురైన ఇబ్బందులను ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.  బాలీవుడ్‌ డైరెక్టర్‌, నటుడు అనురాగ్‌ కశ్యప్‌తో  సుమారు రెండేళ్ల పాటు డేటింగ్‌ చేసి 2011లో పెళ్లి చేసుకుంది. అయితే, ఇద్దరి మధ్య పలు విభేదాలు రావడంతో 2015లో విడిపోయారు.

పదేళ్ల తర్వాత తాను విడాకులు తీసుకున్నప్పుడు జరిగిన పలు సంఘటనలను కల్కి కొచ్లిన్‌ గుర్తుచేసుకుంది. అనురాగ్ కశ్యప్‌తో వివాహం ముగిసిన వెంటనే తన జీవితం అకస్మాత్తుగా ఎలా కష్టతరంగా మారిందో ఆమె తెలిపింది.  ఒంటరి మహిళనని ముంబైలో  తనకు అద్దెకు ఇళ్లు  ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదని పేర్కొంది. ఆ సంఘటనను నేను జీవితంలో మరిచిపోలేను. అంతకుమించిన ఇబ్బంది తన జీవితంలో మరోకటి లేదని కూడా చెప్పవచ్చని గుర్తు చేసుకుంది.

'నేను, అనురాగ్ విడాకులు తీసుకున్నప్పుడు కూడా నాకు మంచి గుర్తింపే ఉంది. చాలా సినిమాలతో నేను ఫుల్‌ బిజీగానే ఉన్నాను. అనురాగ్‌తో విడిపోయిన తర్వాత నాకు నివసించడానికి ఇళ్ల దొరకలేదు. ఒంటరి మహిళగా ఉన్న నాకు ముంబైలో అద్దెకు ఎవరూ ఇల్లు ఇవ్వలేదు. నేను పాపులర్‌ నటి కావడంతో అందరూ నాతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగపడటం చూశాను. కానీ, నాకు ఉండేందుకు ఇల్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.' అని ఆమె గుర్తుచేసుకుంది.

కల్కి కొచ్లిన్‌ 2008లో అనురాగ్ దర్శకత్వం వహించిన దేవ్.డితో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుంచే వారు డేటింగ్‌ ప్రారంభించారు. ఆయనతో విడిపోయిన తర్వాత  ఇజ్రాయెల్‌ మ్యుజీషీయన్‌ గయ్‌ హెర్ష్‌బర్గ్‌తో కల్కి లవ్‌లో పడింది. వీరి ప్రేమకు గుర్తుగా 2020లో కూతురు జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. దేవ్‌ డి, షైతాన్‌, జిందగీనా మిలేగి దొబారా, యే జవానీ హై దీవాని, వెయిటింగ్‌, మార్గరిట విత్‌ ఎ స్ట్రా, గల్లీ బాయ్‌, గోల్డ్‌ ఫిష్‌ ఇలా తదితర చిత్రాల్లో నటించింది. కల్కిస్‌ గ్రేట్‌ ఎస్కేప్‌ షోతో హోస్ట్‌గానూ మారింది. కల్కి చివరిగా 2023 నెట్‌ఫ్లిక్స్ చిత్రం ఖో గయే హమ్ కహాన్‌లో మెరిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement