ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. గురువారం ముంబయిలో జరిగిన ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ సినీతారలు మెరిశారు. ఈ ఫంక్షన్‌లో ఖుషీ కపూర్, సుహానా ఖాన్, పాలక్ తివారీ, ఇబ్రహీం అలీ ఖాన్‌తో సహా పలువురు స్టార్ కిడ్స్ హాజరయ్యారు. ఎంగేజ్‌మెంట్‍కు సంబంధించిన ఫోటోలను ఆలియా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. పలువురు ఈ జంటకు అభినందనలు తెలిపారు.
( ఇది చదవండి: చేసింది కొన్ని సినిమాలే.. భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!)
కాగా.. ఆలియా కశ్యప్.. తన ప్రియుడైన షేన్ గ్రెగోయిర్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ప్రస్తుతం ఆలియా యూట్యూబర్‌గా రాణిస్తోంది. పలు వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అనురాగ్ కశ్యప్ మొదటి భార్య ఆర్తి బజాజ్ కూతురే ఆలియా. ఇంతకుముందే ప్రియుడు షేన్ గ్రెగోయిర్ ప్రపోజ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమెకు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేసినట్లు ఆలియా వెల్లడించింది. ఈ వేడుకలో అనురాగ్ మాజీ భార్య కల్కి కోచ్లిన్ తన బేబీ, భర్తతో సహా హాజరైంది.
( ఇది చదవండి: షారుఖ్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!)
Comments
Please login to add a commentAdd a comment