బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ నిశ్చితార్థ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ప్రియుడు, ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఇరాఖాన్ ఇటీవలె తన రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ముంబైలో ఎంగేజ్‌మెంట్ వేడకను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆమీర్‌ఖాన్ సహా బంధుమిత్రులంతా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుకలో ఇరాఖాన్ రెడ్‌గౌనులో మెరిసిపోగా, నుపుర్ బ్లాక్ సూట్‌లో కనిపించాడు. అయితే ఈ ఎంగేజ్‌మెంట్ పార్టీలో నటి ఫాతిమా సనాషేక్ హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
`థగ్స్ ఆఫ్ హిందూస్థాన్` నుంచి అమీర్ ఖాన్, ఫాతిమా ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ వినిపించాయి. ఆమిర్ తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకోవడానికి కూడా ఫాతిమానే కారణం అంటూ టాక్ వినిపించింది. ఇప్పుడు మరోసారి వీరి రిలేషన్‌షిప్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment