Fathima
-
నాలుగు రోజులుగా సుధారాణికి చిలకలూరిపేట సిఐ చిత్రహింసలు..
-
నాపై బుల్లెట్ల వర్షం కురిపించండి కాలేజీని కూల్చొద్దు - అక్బరుద్దీన్
-
2024 ఎన్నికల్లో ఫ్యాన్ సునామే..వై నాట్ 175..
-
దేశం మొత్తం చెప్పుకునేలా సీఎం జగన్ సిద్ధం సభ
-
హైదరాబాద్ లో ఇంటీరియర్ డిజైనర్ పై భర్త హత్యాయత్నం
-
Savitribai Phule: మహిళా విద్యకు తొలి వెలుతురు
‘సావిత్రిబాయి ఫూలే ప్రతిరోజూ సంచిలో అదనంగా చీర పెట్టుకుని స్కూల్‌కు వెళ్లేవారు. దారిలో ఎవరో ఒకరు ఆమె మీద పేడ విసిరితే కడుక్కుని కట్టుకోవడానికి’ అని రాస్తుంది రీతా రామస్వామి గుప్తా. నిమ్న వర్గాల ఆడపిల్లల విద్యకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలేమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కాని రచయిత్రి రీతా రామస్వామి మరిన్ని జీవిత చిత్రాలను సేకరించి తెచ్చిన పుస్తకం ‘సావిత్రిబాయి పూలే’ తాజాగా విడుదలైంది. రీతా రామస్వామి గురించి, పుస్తకంలో ఉన్న విశేషాల గురించి... ‘ఇవాళ బాలికల విద్య అనగానే ప్రపంచానికి మలాలా పేరు గుర్తుకొస్తుంది. కాని బాలికల విద్య కోసం జీవితాన్ని అర్పించిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. మన దేశంలో ఆమె తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆడపిల్లల చదువును ప్రచారం చేయడానికి ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు’ అంటుంది రీతా రామస్వామి గుప్తా. గతంలో నటుడు సంజీవ్ కుమార్‌పై రాసిన బయోగ్రఫీతో పాఠకులకు తెలిసిన రీతా రామస్వామి ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి అతని జీవిత సంగ్రహం రాసింది. ‘ఇలా ఇంకొన్ని పుస్తకాలు రాయాలనుకుంటుండగా నా 18 ఏళ్ల కుమార్తె– అమ్మా... ఎందుకు నువ్వు ఎప్పుడూ మగవాళ్ల గురించే రాస్తావు. నువ్వు రాయదగ్గ స్త్రీలు లేరా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. దానికి జవాబే నా కొత్త పుస్తకం– సావిత్రిబాయి పూలే.. హర్ లైఫ్.. హర్ రిలేషన్షిప్స్.. హర్ లెగసీ’ అంది రీతా రామస్వామి. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి ఈ పుస్తకం తాజాగా విడుదలైంది. బలహీనులకు అందని విద్య ‘బ్రిటిష్ వారు 1813లో క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశంలో పాశ్చాత్య విద్యకు అంకురార్పణ చేశారు. అయితే వారి ఉద్దేశాలు వేరే. తమ వ్యవహారాల కోసం ఇంగ్లిష్ తెలిసిన కొంతమంది ఉద్యోగులు అవసరం కనుక పై వర్గాల వారికి చదువు నేర్పిస్తే వారి నుంచి కింది వర్గాల వారికి చదువు అందుతుంది అని భావించారు. కాని పై వర్గాలకు మొదలైన చదువు కింది వర్గాల వరకూ చేరలేదు. కింది వర్గాల వారికి పాఠశాలల్లో అనుమతి లేని పరిస్థితి. అంటరానితనం విస్తృతంగా ఉండేది. ఇక చదువుకు ఆడపిల్లలు నిషిద్ధం చేయబడ్డారు. ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న నియమం కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. వీటన్నింటినీ దాటి సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యింది. జ్యోతిబా పూలేతో కలిసి 1848లో బ్రిటిష్‌వారితో సంబంధం లేని, మిషనరీలతో సంబంధం లేని బాలికల తొలి పాఠశాలను మొదలెట్టింది. దిగువ వర్గాల బాలికల విద్య కోసం పోరాడింది’ అంటుంది రీతా రామస్వామి. ఆ ఇద్దరు ‘సావిత్రిబాయి పూలే హర్ లైఫ్, హర్ రిలేషన్షిప్స్, హర్ లెగసీ’... పుస్తకంలో రీతా రామస్వామి కేవలం సావిత్రిబాయి పూలే గురించే రాయలేదు. ఆమెను ఆదర్శంగా తీసుకుని బాలికల విద్య కోసం తోడైన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ గురించీ... సావిత్రి, ఫాతిమా కలిసి మహరాష్ట్రలో బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించి నిర్వహించడానికి పడిన ఆరాటం గురించి కూడా రాసింది. ‘ఫాతిమ షేక్ తొలి క్వాలిఫైడ్ ముస్లిం ఉమెన్ టీచర్ మన దేశంలో. ఆమె సావిత్రిబాయి పూలేకి బాసటగా నిలిచింది. ఒక దశలో సావిత్రిబాయి సుదీర్ఘకాలం జబ్బు పడితే స్కూళ్ల నిర్వహణభారం మోసింది. ఆ వివరాలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి’ అని తెలిపింది రీతా రామస్వామి. ఎన్నెన్నో అవమానాలు ‘దిగువ వర్గాల వారిలో ఆడపిల్లలకు చదువెందుకు అనే భావన విపరీతంగా ఉండేది. వాళ్లకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసేవారు. కాని వారి ఇళ్లకు వెళ్లి బడికి పంపమని కోరేది సావిత్రి. వారు శాపనార్థాలు పెట్టేవారు. దారిన పోతూ ఉంటే రాళ్లు విసిరేవారు. దానికి తోడు పేద వర్గాల వారిని చదివిస్తున్నందుకు అగ్రవర్ణాలు కక్ష కట్టి సావిత్రిబాయి మీద పేడనీళ్లు చల్లేవారు. అందుకని ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు తన సంచిలో చీర అదనంగా పెట్టుకునేది. ఎవరైనా పేడ నీళ్లు చల్లినా వెరవకుండా స్కూలుకు వెళ్లి చీర మార్చుకుని పాఠాలు చెప్పేది. ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగడం వల్ల మన దేశంలో బాలికల విద్య గణనీయంగా పెరిగింది. చదువులో ఉద్యోగాల్లో అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. వారంతా తప్పక తెలుసుకోవాల్సిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే’ అంది రీతా రామస్వామి. -
అమెరికా నుంచి హైదరాబాద్‌కు అలీ కూతురు.. పెళ్లి తర్వాత తొలిసారి! (ఫొటోలు)
-
అమెరికా వెళ్తున్న కూతురికి అలీ దంపతుల వీడ్కోలు (ఫొటోలు)
-
కూతురి పెళ్లికి మలీదా చేసిన అలీ భార్య జుబేదా (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత కూతుర్ని కలిసిన అలీ దంపతులు..ఫోటోలు వైరల్
-
కమెడియన్ అలీ కూతురి అప్పగింతల (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా అలీ కూతురు పెళ్లి.. వైరల్‌గా ఫొటోలు
-
అలీ కూతురి పెళ్లి వీడియో వచ్చేసింది.. ఎంత గ్రాండ్‌గా జరిగిందో..
ప్రముఖ కమెడియన్, నటుడు అలీ కూతురు ఫాతిమా ఇటీవలె పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వివాహానికి చిరంజీవీ, నాగార్జున సహా పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటికే ఫాతిమా పెళ్లికి సంబంధించన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అలీ సినిమాలు ,టీవీ షోల ద్వారా అలరిస్తుండా, ఆయన భార్య జుబేదా అలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈమె యూట్యూబ్ ఛానల్‌కు ఇప్పడు సుమారు 6లక్షల 91వేల సబ్స్రైబర్లు ఉన్నారు. కూతురి పెళ్లి షాపింగ్ దగ్గరి నుంచి హల్దీ, పెళ్లి కూతుర్ని చేయడం సహా ప్రతి వీడియోను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇక జుబేదా అలీ యూట్యూబ్ వీడియోలకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ వీడియో పోస్ట్ చేసినా లక్షల్లో వ్యూస్ వస్తాయి. తాజాగా కూతురు ఫాతిమా పెళ్లి ఎలా జరిగింది? మండపం దగ్గరికి తీసుకొచ్చిన్నప్పటి నుంచి పెళ్లి తంతులో కూతురు ఎమోషనల్ అయిన క్షణాల వరకు.. వీడియో రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. మరి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసిన అలీ కూతురి పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో వీడియోలో చూసేయండి. -
అలీ కుమార్తె వివాహం.. మరి అల్లుడి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం షహయాజ్‌లతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెక్షన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ గురించి పలు వార్తలు వినిపించాయి. సాధారణంగా నటీనటులు పెళ్లిళ్లు జరిగితే వధువు, వరుడు వివరాలపై ఆరా తీస్తుంటారు. తాజాగా అలీ అల్లుడు ఎవరా అని కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. (చదవండి: నా కూతురిని ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు: అలీ) అలీ పెద్ద కూతురు ఫాతిమా ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అలీ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్‌గా నిలిచింది ఫాతిమా. ఇక అల్లుడు షెహయాజ్ కూడా డాక్టరే కావడం విశేషం. జమీలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహయాజ్. అతనికి అన్న, సోదరి ఉన్నారు. వీళ్లిద్దరితో పాటు వరుడి వదిన కూడా డాక్టరే కావడం మరో విశేషం. వీరంతా గుంటూరుకు చెందిన వారు కాగా.. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. అతని కుటుంబ సభ్యులు అందరూ ఉన్నత విద్యావంతులే. ఇక అలీ కూతురు డాక్టర్ చదివేసరికి.. అల్లుడు కూడా డాక్టరే కావాలని.. షెహయాజ్ను ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా.. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాల నటుడిగా పరిచయమైన అతడు.. ప్రస్తుతం హాస్యనటుడిగా మాత్రమే కాకుండా హీరోగా, నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నారు. టీవీ షోకు హోస్ట్ గానూ నిరూపించుకున్నారు. -
నా కూతురిని ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు: అలీ
ప్రముఖ కమెడియన్ అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం షహయాజ్‌లతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెక్షన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి–సురేఖ, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్, బ్రహ్మానందం, జయసుధ, నాగార్జున–అమల, వెంకటేశ్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, రాజశేఖర్–జీవిత, నిర్మాతలు అల్లు అరవింద్, కె.యల్ నారాయణ, ఎస్ గోపాల్‌రెడ్డి, చోటా.కె.నాయుడు, తనికెళ్ల భరణి, మంచు విష్ణు, లక్ష్మీ, తొట్టెంపూడి వేణు, ఆది సాయికుమార్, బ్రహ్మానందం, ఊహ, రోషన్, ‘అల్లరి’ నరేశ్, రాజేశ్, ప్రియదర్శి, పూరి జగన్నాథ్ సతీమణి లావణ్య, ఆకాశ్ పూరి, పవిత్రా పూరి తదితరులు హాజరై నూతన వధూవరులను దీవించారు. రాజకీయ రంగం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రోజా, అవంతి శ్రీనివాస్, మార్గాని భరత్, ప్రత్తిపాటి పుల్లారావు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రపంచ చాంపియన్ పి.వి సింధు తల్లితండ్రులతో సహా పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించిన అతిరథ మహారధులందరికి కృతజ్ఞతలు తెలుపుతూ అలీ ఓ ప్రకటన విడుదల చేశారు. చదవండి: నోరు జారకు.. రేవంత్‌పై చెలరేగిపోయిన ఫైమా నా పనిమనిషి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు: నటి -
బాయ్‌ఫ్రెండ్‌తో ఆమిర్ ఖాన్ కూతురు ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ నిశ్చితార్థ వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఇరాఖాన్ ఇటీవలె తన రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ముంబైలో ఎంగేజ్మెంట్ వేడకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమీర్‌ఖాన్ సహా బంధుమిత్రులంతా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుకలో ఇరాఖాన్ రెడ్గౌనులో మెరిసిపోగా, నుపుర్ బ్లాక్ సూట్లో కనిపించాడు. అయితే ఈ ఎంగేజ్మెంట్ పార్టీలో నటి ఫాతిమా సనాషేక్ హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. `థగ్స్ ఆఫ్ హిందూస్థాన్` నుంచి అమీర్ ఖాన్, ఫాతిమా ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ వినిపించాయి. ఆమిర్ తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకోవడానికి కూడా ఫాతిమానే కారణం అంటూ టాక్ వినిపించింది. ఇప్పుడు మరోసారి వీరి రిలేషన్షిప్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. -
బ్రైడల్ షవర్ కోసం ముస్తాబైన అలీ కూతురు (ఫొటోలు)
-
కూతురి శుభలేఖ సెలక్ట్ చేసేందుకు పోటీపడుతున్న అలీ దంపతులు (ఫొటోలు)
-
ఘనంగా కమెడియన్ అలీ కూతురు హల్దీ ఫంక్షన్..ఫొటోలు వైరల్
-
విడాకులు తీసుకోబోతున్న బిచ్చగాడు హీరో? మూడో వ్యక్తే కారణమా?
ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పటికే చై-సామ్, ధనుష్-ఐశ్వర్యల విడాకుల అంశం హాట్‌టాపిక్‌గానే ఉంది. తాజాగా మరో కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్ర్కొంన్నట్లు కోలీవుడ్ టాక్. తన భార్య ఫాతిమాతో ఆయనకు విభేదాలు వచ్చాయని, ఈ కారణంగా విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా విజయ్ చేసిన ఓ ట్వీట్ ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. 'కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి అంతేకానీ మధ్యలోకి మూడో వ్యక్తిని రానీయకండి. వారు వచ్చి మీ నాశనాన్ని చూసి ఆనందిస్తారు' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. సాధారణంగా తన సినిమాల గురించి తప్పా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని విజయ్ ఇలాంటి కామెంట్స్ చేయడంపై తమిళనాట పెద్ద చర్చ నడుస్తుంది. ఫాతిమాతో విభేదాల కారణంగానే విజయ్ ఈ పోస్ట్ చేశాడా? త్వరలోనే వీరు కూడా విడాకుల ప్రకటన చేస్తారేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ ఫాతిమాతోనే విజయ్ ప్రేమలో పడ్డాడు. 2006లో వీరికి వివాహం జరిగింది. -
రైల్ టికెట్’తో చిక్కిన హంతకులు
-
‘రైల్ టికెట్’తో చిక్కిన హంతకులు: సంచలనం రేపిన ‘ఫాతిమా’ కేసు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ‘మానసికంగా కుంగిపోయిన యువతిని తిరిగి ఆరోగ్యవంతురాలిని చేస్తానని ఓ భూత వైద్యుడు నమ్మించి ఢిల్లీ రప్పించుకున్నాడు. తన వద్దకు చేరిన యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి సన్నిహితంగా మెలిగాడు. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు మొదటి భార్య అడ్డు చెప్పడంతో వదిలించుకునేందుకు స్నేహితుడి సాయంతో నదిలోకి తోసి హత్యచేశాడు. అయితే తన కుమార్తె అదృశ్యమైందని యువతి తండ్రి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, రైలు టికెట్ ఆధారంగా కేసును ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వెస్ట్ జోన్ ఇన్చార్జి డీసీపీ కె.బాబూరావు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చిట్టినగర్‌కు చెందిన నజీర్ అహ్మద్ తన కుమార్తె ఫాతిమా అనారోగ్యానికి గురవడంతో ఉత్తరప్రదేశ్ లోని షహరానాపూర్‌కు చెందిన భూతవైద్యుడు మహ్మద్ వాసిఫ్‌ను విజయవాడకు పిలిపించాడు. అతను పది రోజులు నగరంలో ఉండి ఫాతిమాకు భూతవైద్యం చేశాడు. అనంతరం అతను స్వస్థలానికి వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొద్ది కాలం తరువాత ఫాతిమా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో నజీర్ అహ్మద్ తన కుమార్తె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుక్ చేసిన రైల్ టికెట్టే పట్టించింది.. ఫాతిమా అదృశ్యం కేసు పూర్వాపరాలను పరిశీలించిన కొత్తపేట సీఐ మోహన్‌రెడ్డి యువతి వినియోగించిన సెల్‌ఫోన్‌ను చివరి సారి ఎక్కడ వాడోరో గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఫోన్ కాల్‌డేటా, మెసేజ్‌లను పరిశీలించారు. యువతి సెల్‌ఫోన్‌కు ఢిల్లీకి వెళ్లేందుకు రైల్వే టికెట్‌ను బుక్ చేసినట్లు మెసెజ్‌ను గుర్తించారు. ఆ టికెట్‌ను భూతవైద్యుడు మహ్మద్ వాసిఫ్ బుక్‌చేశాడని తేల్చారు. దీంతో ఫాతిమా కేసులో పురోగతి వచ్చింది. ఢిల్లీకి వెళ్లిన ఫాతిమాను మహ్మద్ వాసిఫ్, అతని స్నేహితుడు మహ్మద్ తయ్యద్ తమ స్వగ్రామైన షహరానాపూ ర్కు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వాసిఫ్ కొద్ది రోజుల పాటు ఫాతిమాతో సన్నిహితంగా ఉండటంతోపాటు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ విషయం వాసిఫ్ భార్యకు తెలియడంతో ఆమె గొడవ చేసింది. దీంతో పెళ్లి కుదరదని వెంటనే ఢిల్లీ వెళ్లిపోవాలని వాసిఫ్ ఫాతిమాకు చెప్పాడు. ఆమె మాట వినకపోవడంతో బైక్‌పై మీర్జాపూర్ సమీపంలోని హత్నికుండ్ డ్యామ్ వద్దకు తీసుకెళ్లాడు. స్నేహితుడు తయ్యద్ సాయంతో నదిలోకి తోసేశాడు. ఆమె మృతదేహం ఇటీవల బయటపడింది. రైల్ టికెట్ ఆధారంగా కేసు దర్యాప్తు కోసం షహరానాపూర్‌కు వెళ్లిన కొత్తపేట పోలీసులు కొద్ది రోజుల్లోనే కేసును ఛేదించారు. హత్య కేసులో ప్రధాన నిందితులు మహ్మద్ వాసీఫ్(30), మహ్మద్ తయ్యద్(29) అరెస్టు చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మీడియా సమావేశంలో వెస్ట్ ఏసీపీ హనుమంతరావు, కొత్తపేట సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. -
వీడిన ఫాతిమా హత్య కేసు మిస్టరీ.. మొదటి భార్య గొడవ చేయడంతో..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఫాతిమా మిస్సింగ్ కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు. తయ్యబ్ సాయంతో ఫాతిమాను వాసిమ్ హత్య చేశాడని ఏడీసీపీ బాబురావు మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన కేసు వివరాలను వెల్లడిస్తూ.. గత నెల 11న తేదిన చిట్టినగర్ పీఎస్ పరిధిలో నజీర్ అనే వ్యక్తి తన కుమారై కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఫాతిమా మానసిక రోగంతో బాధపడేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె వ్యాధి నయం చేయించడానికి యూపీకి చెందిన వాసిఫ్ అనే భూత వైద్యుడి దగ్గర చికిత్స కోసం తీసుకెళ్లినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో తమ స్వస్థలానికి వచ్చిన వాసిఫ్ ఆమెకు మాయమాటలు చెప్పి.. ఢిల్లీకి తీసుకుపోయాడు. అక్కడి నుంచి సహారంగ్ పూర్లోని తన ఇంటికి తీసుకెళ్లి కాపురం పెట్టాడు. దీంతో వాసిఫ్ మొదటి భార్య గొడవకు దిగింది. ఈ క్రమంలో వాసిఫ్ .. ఫాతిమాను వదలించుకోవాలనుకున్నాడు. దీనికోసం తన స్నేహితుడు తయ్యబ్ సహకారం తీసుకున్నాడు. ఇద్దరు కలసి ఫాతిమాకు మాయమాటలు చెప్పి సహరంగ్పూర్లోని హత్నికుండ్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి జలశయంలో తోసేశారు. కాగా, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆమె మృత దేహం పోలీసులకు దొరికింది. కాగా, సహరంగ్ పోలీసులు సహకరంతో.. మృత దేహన్ని స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు.. నిందితులిద్దరినీ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విజయవాడకు రప్పించారు. కాగా, నిందితులను అదుపులోకి తీసుకుని విజయవాడ కోర్టులో హజరుపర్చారు. నిందితులిద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిని మచిలీపట్నం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, వాసిఫ్ వద్ద 60 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మాయగాళ్లను నమ్మవద్దని విజయవాడ పోలీసు అధికారి బాబూరావు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఙప్తి చేశారు. -
ఫాతిమా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విజయవాడ: ఇటీవల సంచలనం రేపిన ఫాతిమా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సహరంపూర్ కోర్టు అనుమతితో ఏపీ పోలీసులు ఇద్దరు నిందితులు వాసిమ్, తయ్యబ్‌లను విజయవాడకు తీసుకొచ్చారు. జూలై 10వ తేదీన విజయవాడలోని ఇంటి నుంచి వెళ్లిన ఫాతిమా అదృశ్యమైంది. కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో నిందితులు ఫాతిమాను ఉత్తరప్రదేశ్‌కు రప్పించుకుని డబ్బు, బంగారం కాజేసి హత్య చేసినట్లు గుర్తించారు. అయితే ఫాతిమాను వాసిమ్, తయ్యబ్‌లే హత్య చేశారా?.. ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసుల విచారణ చేపడుతున్నారు. నిందితులను పూర్తి స్థాయిలో విచారించనున్నారు. -
ఆమె ముస్లిం కాదు : ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నాంపల్లి నియోజకవర్గం విజయనగర్ కాలనీ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఫాతిమా ముస్లిం కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆమె హిందువు అని, రాజకీయం కోసం తండ్రి పేరును మార్చారని విమర్శించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో నామినేషన్ వేసినందుకు ఆమెపై ముషిరాబాద్ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైందని ఒవైసీ ఆరోపించారు. (చదవండి : ‘అసదుద్దీన్‌కి ఆ బిర్యానీ తినిపించాలి’) రేణు సోనీ బీసీ కాదు ఝాన్సీ బజార్ బీజేపీ అభ్యర్థి రేణు సోనిపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె బీసీ కాదని, తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో నామినేషన్ వేశారని ఆరోపించారు. రేణు సోనీకి ముగ్గురు పిల్లలుంటే.. ఇద్దరే అని తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని విమర్శించారు. కాగా, ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఒవైసీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
సీబీఐకి ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసు
సాక్షి, చెన్నై : ఐఐటీ మద్రాస్ విద్యార్ధిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసును తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. తమ కుమార్తె ఆత్మహత్య కేసును సీబీఐకి నివేదించాలని ఫాతిమా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తు సంస్థకు కేసును బదలాయించింది. నవంబర్ 8న ఐఐటీ మద్రాస్‌లో హ్యుమనిటీస్ విద్యార్ధిని ఫాతిమా (19) ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతోనే కేరళకు చెందిన ఫాతిమా ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆశించిన మార్కులు రాకపోవడంతోనే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ నిత్యం వేధిస్తుండటంతోనే తమ కుమార్తె మరణించిందని ఆమె తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ నోట్లోనూ ఇదే విషయం ఫాతిమా ప్రస్తావించిందని చెబుతున్నారు. ఫ్యాకల్టీ మెంబర్ ఒకరు తమ కుమార్తెను మతపరమైన వివక్షకు గురిచేశారని ఆమె తండ్రి ఆరోపించారు. -
ఫాతిమా కేసులో మలుపు
సాక్షి, చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా మృతి కేసులో ప్రొఫెసర్ల మెడకు ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి లతీఫ్‌కు ఫాతిమా పంపిన సమాచారాన్ని పరిశోధకులు ధ్రువీకరించారు. అలాగే తన కుమార్తె మరణంలో సహచర విద్యార్థుల ప్రమేయం కూడా ఉన్నట్టు లతీఫ్ ఆరోపణలు చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు ఆయన ఢిల్లీ బయలుదేరారు.మద్రాసు ఐఐటీలో చదువుకుంటున్న కేరళకు చెందిన ఫాతిమా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె మరణం వెనుక వేధింపులు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ముగ్గురు ప్రొఫెసర్ల వేధింపులు తాళలేక ఫాతిమా బలవన్మరణానికి పాల్పడినట్టుగా సంకేతాలు రావడంతో విద్యార్థుల్లో ఆగ్రహంతో ఉన్నారు. అలాగే వేధింపుల సమాచారం మెయిల్‌ను చెన్నై పోలీసుల దృష్టికి ఫాతిమా తండ్రి లతీఫ్ తీసుకురావడంతో ప్రొఫెసర్ల చుట్టూ విచారణ సాగింది. న్యాయం కోసం సీఎం పళనిస్వామిని సైతం ఫాతిమా కుటుంబం కలిసి విజ్ఞప్తి చేసుకుంది. అయితే కేసును పక్కదారి పట్టించే రీతిలో విచారణ సాగుతున్నట్టు, ప్రొఫెసర్లను రక్షించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో ఇక ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించే పనిలో లతీఫ్ నిమగ్నమయ్యారు. సహచర విద్యార్థులపై ఆరోపణలు.. తన కుమార్తె మరణానికి న్యాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు లతీఫ్ ఢిల్లీ వెళ్లారు. వెళ్తూ తిరువనంతపురం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె వేధింపుల్లో ప్రొఫెసర్లతో పాటుగా సహచర విద్యార్థులు కూడా కొందరు ఉన్నట్టుగా తెలుస్తోందని, అందుకు తగ్గ ఆధారాలను సేకరించి ఉన్నట్టు వివరించారు. వీటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోరుతామన్నారు. అప్పటికీ తమకు న్యాయం లభించకుంటే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా లతీఫ్ సమర్పించిన సమాచారం, మెయిల్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలోని వివరాలను పరిశోధకులు పరిశీలించి నిర్ధారించి ఉన్నారు. అవన్నీ ఫాతిమా పంపినట్టుగా పరిశోధనలో తేలి ఉన్నట్టు, ఇందుకు తగ్గ నివేదిక కోర్టుకు చేరి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే సెంట్రల్ క్రైం బ్రాంచ్ అస్టిసెంట్ కమిషనర్ మూర్తి, సహాయ కమిషనర్ మెక్లినా నేతృత్వంలోని బృందం ఈ సంకేతాల్ని ధ్రువీకరించడం లేదు. ఇదిలా ఉండా ఐఐటీలో వరసుగా విద్యార్థుల ఆత్మహత్యల ఘటనల్ని సీబై చేత విచారించాలని, కోర్టులో దాఖలైన పిటిషన్ వాదనలు ముగిశాయి. అయితే, తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. -
న్యాయ పోరాటం కన్నతండ్రి కన్నీరు
టీనేజ్ దాటాక తల్లిదండ్రులు స్నేహితులైపోవాలని నియమం. మరి అధ్యాపకులు ఎంత ఆత్మీయులైపోవాలి? పిల్లలు ఇల్లు వదిలి వచ్చేది విద్యాలయాలను ఇల్లుగా భావించడం వల్లే. అక్కడ ఎంత ఆదరణ ఉండాలి. చాలా కష్టపడితే తప్ప, ప్రతిభ చూపితే తప్ప ఐ.ఐ.టి వంటి చోటుకు విద్యార్థులు చేరలేరు. అలాంటి విద్యార్థుల కోసం ఎంత స్నేహశీలత ఉండాలి? కాని ఆశిస్తున్నది వేరు. జరుగుతున్నది వేరు. పాతిమా లతీఫ్ ఆత్మహత్య చేస్తున్న హెచ్చరిక వేరు. ‘ఓ మనిషిని మారణాయుధాలతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపితేనే హత్యకాదు. బలవన్మరణానికి పాల్పడే స్థాయిలో మానసికంగా వేధింపులకు గురిచేసినా హత్యగా పరిగణించాలి. అందుకే చెబుతున్నా... నా కుమార్తె ఫాతిమా లతీఫ్ది ఆత్మహత్య కాదు, హత్య’ అంటూ ఆవేదన చెందుతున్నారు ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్.ఆయన ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఫాతిమా ఆత్మహత్య చేసుకుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఫాతిమా మరణానికి ముందు దిగాలు పడి ప్రాణాలు తీసుకుంది. దీనికి కారణం ఆమె మీద వత్తిడి తీసుకు వచ్చిన ఒక ప్రొఫెసర్ అని అబ్దుల్ లతీఫ్ ఆరోపిస్తున్నారు. ‘నా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. ముందు నిందితులను పట్టుకోండి’ అని అతడు తమిళనాడు ప్రభుత్వాన్ని కన్నీళ్లతో కోరుతున్నాడు.తమ పిల్లలు ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో చదువుకుని ఉన్నతోద్యోగులు కావాలని చాలామంది తల్లిదండ్రులు ఆశించినట్టే అబ్దుల్ లతీఫ్, సబితా కూడా ఆశించారు. కాని ఆ కలలు చెదిరిపోయాయి. చెన్నై ఐఐటీలో పెద్ద కూతురు ఫాతిమా చేరిన ఐదు నెలల్లోనే ఫాతిమా హాస్టల్ గదిలో ఉరి వేసుకుని తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. కేరళ రాష్ట్రం కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్ (19) ఈ ఏడాది మేలో చెన్నై ఐఐటీలో చేరింది. చురుకైన విద్యార్థినిగా కొద్ది రోజుల్లోనే అందరి అభిమానం పొందారు. ఐఐటీ ప్రాంగణంలోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రతిరోజూ రాత్రి తల్లికి ఫోన్ చేసి నిద్రపోవడం ఫాతిమాకు అలవాటు. అయితే నవంబరు 9వ తేదీన ఎంతకూ కుమార్తె నుంచి ఫోన్ రాకపోవడంతో తల్లే చేసింది. ఎంతకూ ఫోన్ తీయకపోవడంతో స్నేహితురాళ్లకు ఫోన్ చేసింది. లోన గడియ వేసి ఉన్న స్థితిలో తలుపులు ఎంతగా బాదినా తీయక పోవడంతో హాస్టల్ సిబ్బంది వచ్చి పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఫాతిమా నిర్జీవంగా వేలాడుతూ ఉంది. అక్టోబరులో జరిగిన పరీక్షలో తక్కువ మార్కులు రావడం వల్ల ఫాతిమా ప్రాణాలు తీసుకుందని కేసు దర్యాప్తు చేస్తున్న చెన్నై కొట్టూరుపురం పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. హడావిడిగా పోస్టుమార్టం పూరి ్తచేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే ఫాతిమా సోదరి ఆయేషా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి స్విచ్ ఆఫ్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ను ఆన్ చేసి పరిశీలించగా సుదర్శన్ పద్మనాభన్ అనే ప్రొఫెసర్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా సౌదీలో పనిచేస్తున్న తండ్రికి పంపిన ఎస్.ఎం.ఎస్ బయటపడింది. కేరళ రాష్ట్రంలో కొల్లం మేయర్‌గా ఉన్న తన తండ్రి స్నేహితుడు రాజేంద్రబాబు సహకారంతో కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఆయేషా తన అనుమానాలతో వినతిపత్రం సమర్పించింది. వెంటనే కేరళ సీఎం తమిళనాడు సీఎం ఎడపాడికి ఉత్తరం రాయడంతో ఫాతిమా కేసు తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య వ్యవహారంగా మారి విశ్వరూపం దాల్చింది. మాజీ సీబీఐ అధికారిని విచారణాధికారిగా నియమించినట్లు ప్రకటించిన చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్.. ప్రొఫెసర్ సుదర్శన్ పద్మనాభన్తోపాటూ ముగ్గురు ప్రొఫెసర్లకు సమన్లు పంపారు. మరోవైపు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసనలు, ఆందోళనలు సాగిస్తున్నాయి. పదకొండుమంది చెన్నై ఐఐటీ విద్యార్థులు ప్రాంగణం లోపల సోమవారం దీక్ష చేపట్టారు. కేంద్ర ఉన్నతవిద్యాశాఖ ప్రతినిధుల బృందం ఆదివారం విచారణ జరిపి వెళ్లింది. నెల రోజుల వేదన ‘మా అక్క ఫాతిమా దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అప్పటికే ఆమె డల్‌గా అయిపోయింది. మేమంతా హోమ్‌సిక్‌నెస్ అనుకున్నాం. చనిపోయే రెండు రోజుల ముందు సెమినార్ ఉందని చెప్పింది. అది సుదర్శన్ పద్మనాభన్ సెమినార్. అందులో ఆయన అందరు విద్యార్థుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడని నాతో చెప్పింది. మేము ఎక్కడ బాధ పడతామోనని ఆమె లోలోపల కుమిలిపోయింది. చివరకు ప్రాణాలు తీసుకుంది’ అని ఆయేషా పత్రికల వారితో చెప్పింది. ఫాతిమా తండ్రి మాత్రం కేవలం సుదర్శన్ పద్మనాభన్ వల్లే తన కుమార్తె మరణించినట్టు పత్రికల వారి వద్ద ఆరోపించాడు. ‘అతనొక్కడే కాదు.. ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు ఈ కేసులో పట్టుబడాల్సి ఉంది’ అని అతడు అన్నాడు. మరోవైపు విద్యార్థి సంఘాలు ఫాతిమా ఒక మైనారిటీ స్టూడెంట్ కాబట్టే ఈ వివక్ష చోటు చేసుకొని ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటుందని ఆరోపిస్తున్నాయి. దేశమంతా ఫాతిమా తరఫున వారు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇది తొమ్మిదో ఆత్మహత్య చెన్నై ఐఐటీలో 2016 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఫాతిమా లతీఫ్ ఆగష్టులో చేరి మూడునెలల్లోనే మానసిక క్షోభకు గురై ఈనెల 9వ తేదీన ప్రాణాలు తీసుకోవడం రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసింది. చెన్నై ఐఐటీలో ఇప్పటికి 8 ఆత్మహత్య సంఘటనలు చోటుచేసుకోగా ఫాతిమా ఉదంతం తొమ్మిదవది, ఇలా వరుసగా ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నా ఐఐటీ యాజమాన్యం చేష్టలుడిగి చూస్తుండటం పట్ల తల్లిదండ్రులు ఆవేదనం చెందుతున్నారు. ఇటీవలి కాలంలో కొత్తగా రిక్రూట్ అయిన ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువ అసిస్టెంట్ ప్రొఫెసర్లు దక్షిణాది విద్యార్థులపట్ల చిన్నచూపు చూస్తు న్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాది విద్యార్థులను చేరదీయడం, దక్షిణాది విద్యార్థుల పట్ల పరుషంగా ప్రవర్తించడం యువ ప్రొఫెసర్లకు పరిపాటిగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి. చెట్టులా నీడనివ్వాల్సిన అధ్యాపకుల మీద ఇలాంటి ఆరోపణలు రావడం కచ్చితంగా అప్రమత్తం కావాల్సిన విషయం. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
చదువు చావుకొస్తోంది!
సాక్షి, చెన్నై: ఉన్నత విద్యకు నెలవుగా మారాల్సిన చెన్నై ఐఐటీ ఆత్మహత్యలకు కొలువుగా మారింది. 2016 నుంచి ఇప్పటి వరకు ఒక మహిళా ప్రొఫెసర్ సహా తొమ్మిది మంది విదారి్థనీ, విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అందర్నీ కలవరపాటుకు గురిచేస్తోంది. కేరళ రాష్ట్రం కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్ (19) ఈ ఏడాది ఆగస్టులో చెన్నై ఐఐటీలో చేరింది. మూడు నెలల్లోనే మానసిక క్షోభకు గురై ఈనెల 9వ తేదీన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం రాష్ట్రంలో సంచలనానికి దారితీసింది. చెన్నై ఐఐటీలో విదార్థిని, విద్యార్థులు ఆత్మహత్యకు దిగడం ఇది తొలిసారి కాదు. ఇప్పటికే ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫాతిమా ఉదంతం తొమ్మిదోది. 2016లో పీహెచ్డీ విద్యార్థి, ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. (చదవండి: అది ఆత్మహత్యే) కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన సాహుల్గోర్నాథ్ 2018 సెపె్టంబర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ రిజిస్టర్లో హాజరీ దినాలు తక్కువయ్యాయనే ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. 2018 డిసెంబర్లో ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అథితి సింహ విషం సేవించి ప్రాణాలుతీసుకుంది. కుటుంబ సమస్యలే ఆమె ఆత్మహత్యకు కారణమని భావించారు. ఈ ఏడాది జనవరిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రంజనాకుమారీ అనే విద్యారి్థని, గోపాల్‌బాబు అనే విద్యార్థి వెంట వెంటనే బలవన్మరణానికి దిగారు. వేధింపుల వల్లనే రంజనాకుమారీ ఆత్మహత్య చేసుకుందని పేరుచెప్పేందుకు ఇష్టపడని సహ విద్యార్థులు తెలిపారు. ఈ కేసు విచారణలో ఇంత వరకు ఎలాంటి పురోగతీలేదు. ఇప్పటికీ ఆమె మరణం మర్మంగానే మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంటెక్ విద్యార్థి గోపాల్‌బాబు మనోవేదనతోనే తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా వరుసగా ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నా ఐఐటీ యాజమాన్యం చేష్టలుడిగి చూస్తున్నట్లు దుయ్యబడుతున్నారు. ఇటీవలి కాలంలో కొత్త రిక్రూట్ అయిన ఉత్తర రాష్ట్రాలకు చెందిన యువ అసిస్టెంట్ ప్రొఫెసర్లు దక్షిణాది విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాది విద్యార్థులను చేరదీయడం, దక్షిణాది విద్యార్థుల పట్ల పరుషంగా ప్రవర్తించడం యువ ప్రొఫెసర్లకు పరిపాటిగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి. ఐఐటీ యాజమాన్యం మాత్రం ఇదంతా క్రమశిక్షణలో భాగమేనని తేలిగ్గా తీసిపారేస్తోంది. దీంతో ఆత్మహత్యల సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కాగా ఫాతిమా ఆత్మహత్య కేసుకు సంబంధించి విద్యార్థులు, ప్రొఫెసర్లు కలుపుకుని ఇప్పటి వరకు 24 మందిని పోలీసులు విచారించారు. సీఎం, డీజీపీలను కలిసిన ఫాతిమా తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఐఐటీ విదార్థిని ఫాతిమా తండ్రి అబ్దుల్ లతీఫ్ శుక్రవారం ఉదయం కేరళ నుంచి చెన్నైకి చేరుకున్నారు. తన కుమార్తె మరణానికి ముగ్గురు ప్రొఫెసర్లు కారణమని ఫాతిమా తన సెల్ఫోన్లో నమోదు చేసినట్లు విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులకు ఆయన చెప్పారు. కుమార్తె ఆరోపించిన ముగ్గురు ప్రొఫెసర్లపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం సీఎం ఎడపాడి పళనిస్వామి, డీజీపీ త్రిపాఠీలను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. కుమార్తె మర్మమరణంపై తగిన విచారణ జరిపించాలని వారిని కోరాడు. -
అది ఆత్మహత్యే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైన తమ కుమార్తె ఫాతిమా లతీఫ్‌కు తక్కువ మార్కులు రావడం ఏమిటి, కలత చెంది ఆత్మహత్యకు పాల్పడడం ఏమిటి...అంతా అబద్ధం. మానసికంగా వేధింపులతో తమ కుమార్తెను హత్యచేశారు...’ అంటూ ఫాతిమా లతీఫ్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమార్తె చావుకు కారణమైన ప్రొఫెసర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, కేరళ సీఎంల జోక్యంతో విషయం విశ్వరూపం దాల్చింది. ఇదిలా ఉండగా మాజీ సీబీఐ అధికారిని విచారణాధికారిగా నియమించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ గురువారం ప్రకటించారు. చెన్నై ఐఐటీలో చదువుతున్న కేరళకు చెందిన ఫాతిమా లతీఫ్ (18) ఈనెల 9న తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తొలుత ఒక సాధారణ సంఘటనగా పరిగణించారు. గతనెల జరిగిన పరీక్షలో తక్కువమార్కులు రావడంతో ప్రాణాలుతీసుకుందని కేసు దర్యాప్తు చేస్తున్న చెన్నై కొట్టూరుపురం పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. హడావుడిగా పోస్టుమార్టం పూర్తిచేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఫాతిమా సోదరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి స్విచ్ ఆఫ్ స్థితిలో ఉన్న సెల్‌ఫోన్‌ను ఆన్ చేసి పరిశీలించగా సుదర్శన్ పద్మనాభన్ అనే ప్రొఫెసర్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా ఆమె నమోదు చేసిన ఎస్ఎంఎస్ బయటపడింది. దీంతో మృతురాలి తండ్రి అబ్దుల్ లతీఫ్ స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలిసుకుని ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం, కేరళ సీఎం తమిళనాడు సీఎంకు ఉత్తరం రాయడంతో రెండురాష్ట్రాల వ్యవహారంగా మారింది. దీంతో ఐదురోజుల తరువాత ఆత్మహత్య ఘటన విశ్వరూపం దాల్చింది. ఫాతిమా ఆత్మహత్యపై సవివరమైన నివేదికను ఇవ్వాల్సిందిగా చెన్నై పోలీస్ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ప్రొఫెసర్ సుదర్శన్ పద్మనాభన్‌కు కమిషనర్ సమన్లు పంపారు. సెలవుపై వెళ్లి ఉండిన ప్రొఫెసర్ గురువారం విధులకు హాజరుకాగా కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఉదయం 11 గంటలకు స్వయంగా ఐఐటీకి వెళ్లి ఆయనను, సహ విద్యార్థులను విచారించారు. ఫాతిమా రాసిన ఆత్మహత్య ఉత్తరాన్ని దగ్గర ఉంచుకుని కమిషన్ వేసిన ప్రశ్నలకు సుదర్శన్ ఇచ్చిన సమాధానాన్ని వాంగ్మూలంగా నమోదు చేశారు. మాజీ సీబీఐ అధికారి ఈశ్వరమూర్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందం కేసును విచారిస్తుందని కమిషనర్ తెలిపారు. అలాగే ఐదుగురు ప్రొఫెసర్లు బృందంగా ఏర్పడి 15 మంది స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మానసికంగా వేధించారు: తల్లిదండ్రుల ఆరోపణ తమ కుమార్తె ఎంతో ధైర్యవంతురాలు, ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది, తక్కువ మార్కుల వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పడం సరికాదని ఫాతిమా తండ్రి అబ్దుల్ లతీఫ్, తల్లి సుజిత అన్నారు. కాలేజీలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తమకు పదేపదే ఫోన్ చేసి చెప్పేదనితెలిపారు. మానసికంగా వేధించి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. తన చావుకు ప్రొఫెసర్ సుదర్శన్ పద్మనాభనే కారణమని తన సెల్ఫోన్లో నమోదు చేసిందని తెలిపారు. ప్రొఫెసర్తోపాటూ ఫాతిమా బలవన్మరణానికి కారణమైన వారందరినీ విచారించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళన ఫాతిమా ఆత్మహత్య ఉదంతంతో విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోతున్నందున ఐఐటీ మెయిన్ గేటు ముందు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా లెక్కచేయకుండా గురువారం ఉదయం పెద్ద ఎత్తున కదలి వచ్చిన విద్యార్థి సంఘాలు ఊరేగింపుగా ఐఐటీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఐఐటీలో తరచూ విద్యార్థుల ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నందున ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనతో గిండి పరిసరాల్లో ట్రాఫిక్ స్తాంభించిపోయింది. ఐఐటీ విద్యార్థిని ఫాతిమా మరణంపై హేతుబద్ధమైన విచారణ జరగాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. -
ప్రొఫెసర్ల వేధింపులతో బలవన్మరణం
సాక్షి, చెన్నై : ఐఐటీ – మద్రాసులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధిని ఫాతిమా లతీఫ్ మరణం కేసు మలుపు తిరిగింది. ముగ్గురు ప్రొఫెసర్ల వేధింపులతో ఆ యువతి బలన్మరణానికి పాల్పడినట్టుగా వెలుగు చూసింది. దీంతో ఫాతిమా మరణానికి న్యాయం కోరుతూ విద్యార్థులు చెన్నైలో ఆందోళన బాట పట్టారు. అడయార్‌లో ఐఐటీ –మద్రాసు క్యాంపస్ ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ విద్యా సంస్థలు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యషిస్తూ వస్తున్నారు. అయితే, ఇటీవల కాలంగా ఇక్కడ విద్యార్థులు బలన్మరణాలకు పాల్పడడంపెరుగుతోంది. అయితే, పరీక్షల్లో తప్పడం, ఎంపిక చేసుకున్న కోర్సుల మీద ఆసక్తిలేక పోవడం, మానసిక ఒత్తిడి అంటూ విద్యార్థులు బలన్మరణాలకు పాల్పడుతున్నట్టుగా అక్కడి నిర్వాహకులు పేర్కొంటున్నా, ఒత్తిళ్ల ఆరోపణలు గుప్పించే వాళ్లు ఎక్కువే. ఈనేపథ్యంలో కేరళ రాష్ట్రం కొల్లం కిలికొళ్లురు గ్రామానికి చెందిన ఫాతిమా లతీఫ్(19) తొలి సంవత్సరం ఎంఏ చదువుతున్నది. ప్రతి రోజూ ఇంటికి తప్పని సరిగా ఫోన్ చేసినానంతరం నిద్ర పోవడం ఫాతిమాకు అలవాటు. శనివారం రాత్రి ఆమె తల్లి సజిత లతీఫ్ కుమార్తెకు ఫోన్ చేసినా సమాధానం లేదు. దీంతో ఆమె స్నేహితురాలికి ఫోన్ చేశారు. ఆమె గదికి స్నేహితురాలు వెళ్లి చూడగా, తలుపులు తెరచుకోలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది తలుపు పగల కొట్టి లోనికి వెళ్లగా,అ క్కడ ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఫాతిమా వేళాడుతుండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న కోట్టూరు పురం పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కేసును ఆత్మహత్యగా నమోదు చేసినా అసలు ట్విస్టు అన్నది తాజాగా బయట పడింది. తండ్రికి సమాచారం... ఫాతిమా తండ్రి అబ్దుల్ లతీఫ్ విదేశాల్లో ఉన్నారు. ఆయనకు ఫాతిమా ఓ సమాచారాన్ని పంపించి ఉన్నది. అందులో ముగ్గురు ప్రొఫెసర్లు తీవ్రంగా వేదిస్తున్నారని, వారి వేధింపులు తాళ లేక బలన్మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి ఉన్నట్టు వివరించి ఉండటం వెలుగు చూసింది. ఈ విషయాన్ని కోట్టూరు పురం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. దీంతో కొల్లం మేయర్‌గా ఉన్న అబ్దుల్ లతీఫ్ స్నేహితుడు రాజేంద్ర బాబుతో కలిసి ఫాతిమా సోదరి అయ్యేషా కేరళ సిఎం పినరాయ్‌విజయన్ కలిశారు. దీంతో వ్యవహారం ముదిరింది. అక్కడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి కార్యాలయానికి, డీజీపికి సమాచారం రావడంతో కోట్టూరు పురం పోలీసులకు ముచ్చమటలు తప్పలేదు. బుధవారం తమ విచారణను వేగవంతం చేశారు. దీంతో ఫాతిమా మరణం వెనుక ప్రొఫెసర్ల వేదింపులు ఉన్నట్టుగా తేలి ఉన్నది. ఇప్పటి వరకు 11 మంది ప్రొఫెసర్ల వద్ద కోట్టూరు పురం పోలీసులు విచారించినట్టు సమాచారం. అయితే, ఆ ముగ్గురు ప్రొఫెసర్లను సస్పెండ్ చేయాలని , వారి మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ, క్యాంప్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఐఐటీని ముట్టడించేందుఉ ఆ ఫ్రంట్ వర్గాలు బుధవారం సాయంత్రం ప్రయత్నించారు. ప్రొఫెసర్ల వేదింపులతో గత కొన్ని నెలల్లో ఐదు మంది విద్యార్థులు బలన్మరణానికి పాల్పడి ఉన్నారని, ఈ కేసుల మీద కూడా విచారణ జరగాలని, విద్యార్థుల మరణాలకు న్యాయంజరగాలని పట్టుబడుతూ వారు ఆందోళనను ఉధృతంచేశారు. దీంతో వారిని బుజ్జగించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. దీంతో ఐఐటీ పరిసర మార్గాల్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. -
ఫాతిమా వేదన
-
నలుగురు విద్యార్థులు అదృశ్యం
కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఫాతిమాపూర్లోని ఫాతిమా స్కూలు విద్యార్థులు నలుగురు అదృశ్యమయ్యారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న డి.ఇమ్ములనర్వకు చెందిన అజీజ్, నందిగామ మండలం నర్సప్పగూడకు చెందిన ప్రవీణ్, హైదరాబాద్ జియాగూడకు చెందిన దేవీశ్రీ ప్రసాద్, కొత్తూరు మండలం సెరిగూడ భద్రాయిపల్లికి చెందిన మధుసూదన్‌గౌడ్‌లు అదృశ్యమయ్యారు. మంగళవారం టీచర్ కొట్టాడని వీరంతా పారిపోయారు. కొత్తూరు పోలీసు స్టేషన్లో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మధుసూదన్ గౌడ్ తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పాఠశాల యాజమాన్యం, వ్యాయామ ఉపాధ్యాయుడు శేఖర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
వహ్వా సల్వా
ప్రగతికి పరదా ప్రతిబంధకం కాదని నిరూపించింది ఆ యువతి. కృషి, పట్టుదల ఉంటే ఆర్థిక సమస్యలు అడ్డొచ్చినా అనుకున్న లక్ష్యం సాధిస్తామని చాటి చెప్పింది. పేదింట పుట్టి పైలట్‌గా ఎదిగి పది మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆమే పాతబస్తీకి చెందిన సల్వా ఫాతిమా. 2007లో పైలట్ శిక్షణలో చేరిన ఫాతిమా... 2013లో దానిని దిగ్విజయంగా పూర్తి చేసింది. 2016లో మల్టీ ఇంజిన్ టైప్ రేటింగ్ పూర్తి చేసిన సల్వా... తాజాగా ఎయిర్‌బస్ 320 టైప్ రేటింగ్ పూర్తి చేసి కమర్షియల్ పైలట్‌గా లైసెన్స్ సాధించింది. దేశంలోనే ఈ లైసెన్స్ సాధించిన నాలుగో ముస్లిం మహిళగా ఘనత సాధించింది. సాక్షి, సిటీబ్యూరో: సల్వా తండ్రి అష్వాక్ అహ్మద్ బేకరీలో ఉద్యోగి. చార్మినార్ సమీపంలో ఇరుకు గల్లీలోని అద్దింట్లో నివాసం. ముగ్గురు పిల్లల కడుపు నింపేందుకు తల్లిదండ్రులు పడిన కష్టం సల్వాను కదిలించింది. సవాలక్ష సమస్యలు ఎదురైనా ముందుకెళ్లి.. లక్ష్యాన్ని ముద్దాడింది. ‘కొద్దిపాటి ఆదాయంతో అమ్మానాన్నలు పడే అవస్థలు చూస్తే దు:ఖం వచ్చేది. టీవీలో పైలట్‌ను చూసి.. నేనూ పైలట్ కావాలని నిర్ణయించుకున్నాను. ఆ కోరిక నాలో బలంగా నాటుకుంద’ని చెప్పింది సల్వా. ఇక అప్పటి నుంచి పైలట్‌కు సంబంధించి పేపర్లో ఎలాంటి కథనాలు వచ్చినా చదివేది. పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్ మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాలలో పూర్తి చేసింది. కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయురాలు సంగీతారెడ్డి సహాయంతో తాను ఇంటర్ పూర్తి చేశానని చెప్పింది. అలా సాకారమైంది.. ప్రతి ఏడాది సియావత్ పత్రిక ఆధ్వర్యంలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు హాజరైన సల్వా... పత్రిక ఎడిటర్ జాహెద్ అలీఖాన్‌తో తన ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పుకుంది. ఆయన సల్వాకు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 2007లో సికింద్రాబాద్‌లోని ఏవియేషన్ అకాడమీలో చేరి శిక్షణ పూర్తి చేసుకుంది. సవాళ్లను అధిగమించి.. అంతర్జాతీయ ఏవియేషన్ షోలో విన్యాసాలు చేసి అందరినీ అబ్బురపరిచింది సల్వా. ఆమె ప్రతిభను చూసి అంతర్జాతీయ పైలట్లు మెచ్చుకున్నారు. ‘నా జీవితాశయం సాధించేందుకు ఎన్నో సవాళ్లను అధిగమించాను. ఒక పేదింటి పైలట్‌గా ఎదగడం మామూలు విషయం కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అసమానతలు ఎదుర్కొన్నాను. హిజాబ్ (తలపై ధరించే వస్త్రం) కారణంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. విదేశాల్లో శిక్షణ తీసుకున్న సమయంలోనూ నేను ధరించాను. ఎవరూ అడ్డంకి చెప్పలేదు. హిజాబ్ వృత్తికి అడ్డు కాద’ని ఆమె పేర్కొన్నారు. ఇలా సాధించింది... సల్వా 2013లో సెస్నా 152 విమానాన్ని 200 గంటల పాటు, సోలో ఫ్లైట్‌ను 123 గంటల పాటు నడిపించి పైలట్ శిక్షణ పూర్తి చేసుకుంది. 2016లో బహుళ ఇంజిన్ ట్రైనింగ్‌కు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.36 లక్షలు అందజేసింది. ఈ సమయంలో ఆమె గర్భిణిగా ఉన్నారు. అయినా వెనకడుగు వేయకుండా న్యూజిలాండ్‌లో 15 గంటల పాటు బహుళ ఇంజిన్ విమానాన్ని నడిపి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2017లో నవంబర్‌లో బహ్రెయిన్‌లో ఎయిర్‌బస్ 320 విమానాన్ని 60 గంటల పాటు నడిపి, కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది. ఇక జాబే.. నేను ఢిల్లీ వెళ్లి ఏవియేషన్ టైప్ రేటింగ్ సర్టిఫికెట్, కమర్షియల్ పైలట్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంది. వాటితో ఇక నేను ఏ ఎయిర్లైన్స్లోనైనా ఉద్యోగం చేయొచ్చు. నా లక్ష్య సాధనకు సహకరించిన తెలంగాణ సీఎం కేసీఆర్, జాహెద్ అలీఖాన్, కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు. -
అప్పుడు మదర్.. ఇప్పుడు బ్రదర్
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ మార్క్ సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. వైవిధ్యమైన సినిమాలతో వరుస కమర్షియల్ సక్సెస్‌లు అందుకుంటున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘ఇంద్రసేన’. జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ సినిమాలో మదర్ సెంటిమెంట్‌కు తన నటనతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షాన్ని కురిపించారు విజయ్. ‘ఇంద్రసేన’ చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్‌తో ఆకట్టుకోనున్నారు. బ్రదర్ సెంటిమెంటే కాదు.. హై ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు–సాహిత్యం: భాష్యశ్రీ, సంగీతం–కూర్పు: విజయ్ ఆంటోని, కెమెరా: కె.దిల్‌రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్. -
29 ఏళ్ల తరువాత... అమ్మ దొరికింది!
-
28 ఏళ్ల తరువాత... అమ్మ దొరికింది!
- పేగుబంధం కోసం యూఏఈ నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు - పోలీసుల సాయంతో ఒక్కటైన వైనం హైదరాబాద్: ‘‘మీకు తల్లి ఉంది. ఆమె పేరు నాజియా. 35 ఏళ్ల కింద హైదరాబాద్ బార్కాస్‌లో ఆమెను వివాహం చేసుకున్నా. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు మనస్పర్థల కారణంగా విడాకులిచ్చి పంపాను..’’ చనిపోతున్న సమయంలో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు చెప్పిన మాటలివీ! చిన్నప్పట్నుంచీ కన్నతల్లి ప్రేమకు దూరంగా బతికిన ఆ అక్కాచెల్లెళ్లు ఈ మాటలతో తల్లి అన్వేషణలో పడ్డారు. చివరికి హైదరాబాద్ పోలీసుల చొరవతో 28 ఏళ్ల తర్వాత యూఏఈ(యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్)కు చెందిన ఆ అక్కాచెల్లెళ్లకు వారి తల్లి ఆచూకీ దొరికింది. యూఏఈలో నివాసం ఉంటున్న ఆయేషా, ఫాతిమాల తండ్రి రాషెద్ ఆరు మాసాల క్రితం చనిపోయారు. కన్నుమూసే ముందు తన బిడ్డలకు హైదరాబాద్‌లో ఉంటున్న తల్లి జాడ చెప్పాడు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు యూఏఈ నుంచి ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వచ్చి దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణను కలిశారు. తమ తల్లిని వెతికి పెట్టాలని కోరారు. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి నాజియా బేగానికి సంబంధించిన ఫోటోలతో కరప్రతాలు పంపిణీ చేశారు. పెళ్లిళ్లు జరిపించే కాజీలు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులతో సమావేశమవగా చిన్నపాటి క్లూ దొరికింది. దాని ఆధారంగా ఎట్టకేలకు గురువారం నాజియాను గుర్తించారు. విడాకులిచ్చి భర్త వదిలేసిన అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన నాజియాకు రెండేళ్ల తర్వాత ఆమె తల్లిదండ్రులు కర్ణాటకలోని బీదర్‌కు చెందిన పండ్ల వ్యాపారితో పెళ్లి చేశారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఆయేషా, ఫాతిమాను, తల్లి నాజియాను డీసీపీ కార్యాలయానికి పిలిపించి కలిపారు. చిన్నప్పటి జ్ఞాపకాలను పోలీసులు అడగ్గా.. నాజియా తన చిన్న కూతురు ఫాతిమా చేతికి ఆరు వేళ్లు ఉన్నాయని చెప్పింది. ఆమె చెప్పినట్లే ఫాతిమాకు ఆరు వేళ్లున్నాయి. దీంతో తల్లి కూతుళ్లను ఒకే దగ్గరికి తీసుకురావడంతో ఒక్కసారిగా వారు భావోద్వేగానికి గురై ఆనందభాష్పాలు రాల్చారు. ఈ జన్మలో తల్లిని చూస్తామనుకోలేదంటూ సంబరపడ్డారు. తల్లి అంగీకరిస్తే తమతోపాటు యూఏఈకి తీసుకెళ్తామని అక్కాచెల్లెళ్లు తెలిపారు. -
'నా కూతురికి అబార్షన్ చేయించాడు'
తిరువనంతపురం: మాజీ ప్రేమికుడు బలవంతం చేయడంతోనే తన కుమార్తె మతం మారిందని ఫాతిమా అలియాస్ నిమిషా తల్లి బిందు ఆరోపించారు. సయిద్ రెహ్మాన్ తన కూతుర్ని బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని పేర్కొన్నారు. కేరళ నుంచి ఐసిస్ చేరడానికి వెళ్లారని భావిస్తున్న వారిలో ఫాతిమా కూడా ఉంది. తన భర్త ఎజా అలియాస్ బెక్స్టన్ తో కలిసి ఆమె కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఫాతిమా తల్లి బిందు బుధవారం మీడియా ముందుకు వచ్చారు. పుదుచ్చేరి మెడికల్ కాలేజీ విద్యార్థి అయిన రెహ్మాన్... నిమిషాను ప్రేమలోకి దించాడని బిందు తెలిపారు. 2013లో నిమిషాను బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని, ఆమెకు గర్భస్రావం చేయించాడని ఆరోపించారు. రెహ్మాన్ తో విడిపోయిన తర్వాత కూడా ఆమె ముస్లింగానే కొనసాగిందని వెల్లడించారు. రెహ్మాన్ తో సంబంధం గురించి తమకు ఎప్పుడు చెప్పలేదని, అతడి ద్వారానే ఈ విషయాలు తెలిశాయన్నారు. తమ దగ్గరకు వచ్చినప్పుడు హిందువుగానే ఉండేదన్నారు. నిమిషాను కలవడానికి పలుమార్లు కలవడానికి రెహ్మాన్ ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదన్నారు. 'నా కుమార్తె కనిపించకుండా పోవడానికి కారణం అతడే. ఆమె ఎక్కడ ఉందో తెలియడం లేదు. నిమిషా అదృశ్యమైన విషయం తెలిసి రెహ్మాన్ నన్ను సంప్రదించాడు. తనను క్షమించాలని కోరాడు. నిమిషా లాగే ఇద్దరుముగ్గురు యువతులు కనిపించకుండా పోయారని చెప్పాడ'ని బిందు తెలిపారు. -
అడవిలో మహిళను చెట్టుకు కట్టేసి...
సుండుపల్లి: గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను అడవిలో నిర్బంధించిన ఘటన వైఎస్సార్ జిల్లాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సుండుపల్లి మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో 60 ఏళ్ల ఓ మహిళను తాళ్లతో చెట్టుకు కట్టేశారు. ఆదివారం మధ్యాహ్నం కొందరు మహిళలు కట్టెల కోసం అడవికి వెళ్లగా చెట్టుకు కట్టేసున్న మహిళను గుర్తించారు. ఆమెకు కట్లు విప్పి సమీపంలోని కమ్మగుట్టపల్లి గ్రామానికి తీసుకెళ్లారు. పూర్తిగా నీరసించిపోయిన స్థితిలో ఉన్నఆమె తన పేరు ఫాతిమా అని చెబుతోంది. ఆమెను అడవిలో ఎవరూ కట్టేశారన్న విషయం తెలియరాలేదు. కిడ్నాప్ చేసి తీసుకువచ్చి అడవిలో కట్టేసినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. ఊరు, మిగతా వివరాలు సరిగ్గా చెప్పలేకపోతుంది. అదే సమయంలో అటువైపు వస్తున్న ఐపీఎస్ అధికారి అమిత్ బర్గర్ చొరవ తీసుకుని ఆమెను సుండుపల్లి ప్రభుత్వాస్పుత్రికి తరలించారు. అక్కడ నుంచి రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
గుంటూరు ఛానల్ లో దూకి ముగ్గురి ఆత్మహత్య
పెదకాకాని(గుంటూరు): గుంటూరు ఛానల్లో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. పెదకాకానిలోని పాతూరుకు చెందిన ఫాతిమాకు(28) నాగూర్వలి(35)తో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కొడుకు (అల్తాఫ్) ఉన్నాడు. కాగా.. గత కొన్ని రోజులుగా భార్యా భర్త మధ్య పొరపొచ్చులు రావడంతో ఇరువురు వేరుగా ఉంటున్నారు. వీరికి కౌన్సిలింగ్ నిర్వహించిన లాభం లేకపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఫాతిమా, తన తల్లి అనిఫా(45), కొడుకు అల్తాఫ్తో సహా గుంటూరు ఛానల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. అల్తాఫ్ మృతదేహం నీటితో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరో రెండు మృత దేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
సరూర్‌నగర్‌లో చైన్‌స్నాచింగ్
సరూర్‌నగర్ : గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ సంఘటన ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీబీ కాలనీలో జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన అక్బర్ అనే వ్యక్తి భార్య ఫాతిమా(30) శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను బచ్పన్ స్కూల్ నుంచి బైక్‌పై తీసుకొని వస్తుంది. సరిగా ఇదే సమయంలో ఆమెను అనుసరిస్తున్న ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసు లాక్కొని వెళ్లారు. నిందితులు నేరుగా జాతీయరహాదారి - 65 పై పరారయ్యారని బాధితురాలు తెలిపారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా, నిందితులు వేసుకున్న టీషర్ట్ మాత్రమే తను గుర్తించినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఫాతిమాకు కాంస్యం
జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ పుణే: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ షూటర్ ఫాతిమా దిసావాలా కాంస్య పతకం గెలుచుకుంది. గురువారం జరిగిన 10 మీటర్ల పిస్టల్ యూత్ మహిళల ఈవెంట్ లో ఫాతిమా 372 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో హరియాణాకు చెందిన యశస్విని (384), నయని భరద్వాజ్ (374) వరుసగా స్వర్ణం, రజతం సాధించారు. మరోవైపు కర్ణాటక షూటర్ ప్రకాశ్ నంజప్ప... ‘చాంపియన్స్ ఆఫ్ చాంపియన్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. అతనికి రూ. 50 వేల నగదు పురస్కారాన్ని భారత రైఫిల్ సంఘం అందజేసింది. -
మామ బారినుంచి రక్షించండి
అనంతపురం రూరల్, న్యూస్‌లైన్: లైంగికంగా వేధించడమే కాకుండా, చంపుతానని బెదిరిస్తున్న మామ బారి నుంచి కాపాడాలంటూ ఫాతిమా అనే మహిళ విలేకరులను కోరింది. సోమవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో తన కూతురు నజియా పర్వీన్‌తో కలసి ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రామచంద్రనగర్‌కు చెందిన జలీల్‌సాబ్ కుమారుడు మహబూబ్ బాషాతో 1987లో ఫాతిమాకు వివాహం జరుగగా, రెండేళ్లకే భర్త మరణించాడు. అప్పటి నుంచి ఆమె అత్తవారింట్లోనే నివాసముంటోంది. కాగా, ఎనిమిది నెలల క్రితం ఆమె అత్త ఖాజాద్దీనా చనిపోయింది. అప్పటి నుంచి మామ ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ విషయం తన ఆడపడుచులకు తెలియజేయగా, వారు ఆమెనే తప్పుపట్టడంతోపాటు బయటకు గెంటి వేశారు. దీంతో సమస్య పరిష్కరించాలంటూ ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వినతిత్రం సమర్పించగా, దర్యాప్తు చేయాలంటూ ఆయన త్రీటౌన్ సీఐ దేవానంద్‌ను ఆదేశించారు. అయితే, నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా నిందితునిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. -
అత్యాచారయత్నానికి గురైన ఫాతిమా మృతి
-
అత్యాచారయత్నానికి గురైన ఫాతిమా మృతి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో సామూహిక అత్యాచార యత్నానికి గురైన బాధితురాలు ఫాతిమా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మృత్యువుతో పోరాడుతూ ఈరోజ ఉదయం కన్నుముసింది. సీతాఫల్మండి చిలకలగూడకు చెందిన ఫాతిమాను గత నెల 29న నలుగురు యువకులు కిరోసిన్ పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. -
ప్రపంచమే ‘మాయా’ బజారు?!
విశ్లేషణ: ‘తల్లుల రొమ్ముల నుంచి తస్కరణకు గురైన పసి కందులం మేం, ఏం చేయాలి? ఎవరిని అడగాలి?’ అని ప్రశ్నించే పాలబుగ్గల కన్నీళ్లతో ‘కాక్ టెయిల్ పార్టీ’ చేసుకుంటున్న ఉన్మత్త గ్లోబల్ కుగ్రామంలో నాగమణులు, ఫాతీమాలు బిడ్డల కోసం ఎదురు చూస్తూనే కాటికి చేరుతారు. కూటికి లేని పేదల దగ్గర కూడా ఉండే అమూల్య సంపద బిడ్డలు. ఆ బిడ్డలనూ దోచుకునే దొంగలు భారత్ నుంచి ఇథియోపియా వరకు వర్ధమాన ప్రపంచమంతా విస్తరించారు. 2012లో మన దేశంలో 65 వేల మంది పిల్లలు ‘కనబడుట లేద’ని ఏలినవారి కాకి లెక్కల కథనం. అందులో దాదాపు సగం మంది ఎప్పటికీ ‘కనబడనివారే’నట. 30 శాతానికి మించి కేసులు నమోదు కావని అంచనా. అంటే 2 లక్షలకు పైగా కనబడకుండా పోగా, అందులో లక్ష మంది పిల్లలు కనబడకుండానే మిగిలిపోతున్నారు. మరి గల్లంతయి పోతున్న పిల్లలు ఏమైపోతున్నారు? బడికి వెళ్లే కిలకిల నవ్వులు, మురికివాడల్లోని సొమ్మసిల్లిన గాజుకళ్లు, ప్రభుత్వం చొరబడలేని మహారణ్యాల ఆదివాసి కడుపు పంట లు ఎలా మాయమైపోతున్నాయి? ఏమైపోతున్నాయి? చెన్నై శివార్లలోని ఓ మురికివాడలో నివసించే నీళ్లింకిన కళ్ల నాగరాణిని కదిపితే... మన మురికివాడల నుంచి అమెరికా వరకు విస్తరించిన పిల్లల మాయా బజారు డొంక కదులుతుంది. పద్నాలుగేళ్ల క్రితం కూలిపని చేసి వచ్చి, రాత్రి ఆదమరచి నిద్రిస్తున్న తల్లి పక్కలో నుంచి నెలల బిడ్డడు అలిగి వెళ్లి ... ‘అమ్మలగన్న అమ్మ’ లాంటి ఓ ఎన్జీవో ఒడి చేరి అనాథనని చెప్పుకున్నాడనిపించే కాకమ్మ కథను నమ్మలేక కుములుతున్న కన్న పేగు వ్యథ ఆమెది. నాలుగేళ్ల క్రితం ఓ విదేశీ పరిశోధనాత్మక పత్రికా రచయిత వెలుగులోకి తెచ్చిన నాగరాణి కొడుకు సతీష్ కథ పాతదే. దొంగిలించిన బిడ్డలను కొని, అంతర్జాతీయ పిల్లల దత్తత సంస్థలకు ఇచ్చే ఆ ‘అనాధాశ్రమం’ నిర్వాకం అప్పట్లోనే రచ్చకెక్కింది. ఇప్పుడు మళ్లీ ఆ గోల ఎందుకు? అప్పోసప్పో చేసి నాగరాణి రెండు సార్లు కొడుకు దత్తత పోయిన నెదర్లాండ్స్‌కు వెళ్లివచ్చింది. దత్తత చట్ట ప్రకారమే జరిగిందని తేల్చిన నెదర్లాండ్ కోర్టులు డిఎన్ఏ పరీక్షలకు నిరాకరించగా కన్నకొడుకు కంటి చూపుకైనా నోచుకోక తిరిగి వచ్చింది. ఇలాంటి మరో అభాగ్యురాలు జబీన్ కూడా ఇలాగే ఆస్ట్రేలియాకు వెళ్లి నిరాశతో తిరిగి వచ్చింది. నాగమణులు, ఫాతీమాలు ‘అదృష్టవంతులు.’ మనుషుల అక్రమ తరలింపు కార్యకలాపాల వ్యతిరేక అంతర్జాతీయ సంస్థలు వారి కోసం పోరాడుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో నాగమణి కేసు యూరోపియన్ మానవ హక్కుల న్యాయ స్థానం ముందు దాఖలైంది. దత్తత వలసవాదం తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు దేశవ్యాప్తంగా 1.15 కోట్ల మంది ఉన్నారని అంచనా. అలాంటి వారిని విదేశీ యులకు దత్తత ఇవ్వడానికి వందల కొలదీ సంస్థలు న్నాయి. అవి దొంగిలించిన పిల్లలని తెలిసి కూడా వారిని విదేశీయులకు దత్తత ఇస్తాయి. వేలల్లో పిల్లలు వారి వద్ద దత్తతకు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర దత్తత వనరుల కేంద్రం (సిఏఆర్ఏ) నిర్దేశన ప్రకారం దత్తత తీసుకునే విదే శీ తల్లిదండ్రులు 3,500 డాలర్లకు మించి సదరు దత్తత సంస్థకు చెల్లించడానికి వీల్లేదు. కాగా నాగరాణి కొడుకు దత్తత కోసం నెదర్లాండ్స్ తల్లిదండ్రులు చెల్లించినది అంతకు పది రెట్లు... 35,000 డాలర్లు. ఆఫ్రికా, ఆసియా దేశాల పిల్లల దత్తతకు పాశ్చా త్య దేశాల శ్వేతజాతి తల్లిదండ్రులు ఎక్కువగా మక్కువ చూపుతారు. చాలా సందర్భాల్లో అక్రమంగానే దత్తత జరుగుతుందని వారికి తెలుసు. ఇథియోపియా, కంబోడియా లు అంతర్జాతీయ దత్తత వ్యాపారానికి ప్రధాన కేంద్రాలు. చాలా ఆఫ్రికా దేశాల్లో పశువుల సంతలో లాగా పిల్లల్ని ఎంచుకుని మరీ కొనుక్కోవచ్చు. ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ... ‘జహారా’ దత్తత కోసం 25,000 డాల ర్లు చెల్లించగా ఇథియోపియాకు చెందిన కన్నతండ్రికి చేరిం ది 300 డాలర్లే. ఆమె కంబోడియా నుంచి దత్తత తీసుకున్న మరో బిడ్డ విషయంలోనూ అదే జరిగింది. మన దేశంలో సైతం పేదరికంతో, ఆడపిల్లల పట్ల సాంఘిక వివక్షతో పిల్లల్ని అమ్మే తల్లిదండ్రులకు గాలం వేసే ‘అనాధాశ్రమాలు’ చాలానే ఉన్నాయి. విదేశీ దత్తతదార్లు మెచ్చే గుణాలు ఉండాలేగానీ బిడ్డ దొంగలించినదైనా, కొన్నదైనా ‘బంగారమే’. బడుగుదేశాల పేద పిల్లలపై పాశ్చాత్యులకు ఎందుకింత వల్లమాలిన ప్రేమ? సంపన్న దేశాల్లో దత్తత తల్లిదండ్రులకు, కన్న తల్లిదండ్రులకు స్పష్టమైన నిబంధనావళి ఉంటుంది. ‘దత్తత తీసుకున్నవారు బిడ్డకు కన్న తల్లిదండ్రుల గురించి తెలియజేయాలి, కలుసుకునే అవకాశం కల్పించాలి’ అనేది వాటిలో ఒకటి. వెనుకబడిన దేశాల నుంచి దత్తతలో ఇలాంటి బాదరబందీలు ఏమీ ఉండవు. దత్తత తతంగం లేకుండా పూర్తి అక్రమంగా రవాణా అయ్యే పిల్లలు గల్ఫ్ దేశాలకు చేరి బానిస చాకిరీ చేస్తున్నారు, సెక్స్ బానిసలుగా బతుకుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు, చట్టాలు ఏమి చేస్తున్నాయని అడగకండి. తిండికి బట్టకులేని పేద తల్లిదండ్రులు పిల్లలపై ఒలకబోస్తున్న ప్రేమంతా దత్తతదార్ల నుంచి డబ్బు గుంజ డానికేననే సమాధానం సదా సిద్ధంగా ఉంటుంది. అధిక ఆదాయ, సంపన్న వర్గాల పిల్లలకు ఉండే భద్రతా ఎక్కు వే. కానీ వారు సురక్షితమనడానికి వీల్లేదు. సొంత దేశం, జాతి, వర్ణం, భాష, సంస్కృతులకు దూరంగా దత్తత పేరిట పిల్లల్ని విసిరేయడం అమానుషమని వాదించే వారిని ఎవరు పట్టించుకుంటారు. ‘లేత మాంసం’ మార్కెట్లు దత్తత వ్యాపారం ‘మర్యాదస్తులు’ చేసేది. అలా ఎగుమతి అయ్యే ‘భాగ్యం’ కొందరికే. మిగతావారు ఏమౌతారు? ఆడపిల్లలు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతారు. అన్ని నగరాలను ముంచెత్తి, చిన్న పట్టణాలకు విస్తరిస్తున్న ఆధునిక సెక్స్ పరిశ్రమకు ముడి సరుకులవుతారు. దేశంలో అధికారికంగా వ్యభిచార వృత్తిలో ఉన్నవారు 30 లక్షల మంది. వారిలో 40 శాతం 18 ఏళ్లలోపు బాలికలే. హెచ్ఐవీ, తది తర వ్యాధులు, ‘వృత్తిపరమైన ప్రమాదాల’ కారణంగా సెక్స్ వర్కర్ల వృత్తి కాలం బాగా పడిపోతోంది. దీంతో సెక్స్ పరిశ్రమ మైనర్ ఆడపిల్లల కోసం ఆవురావురుమంటోంది. క్షామ పీడిత ప్రాంతాల నుంచి, అంతర్గత తిరుగుబాట్లు సాగుతున్న ప్రాంతాల నుంచి ఆడపిల్లల సరఫరా జోరుగా సాగుతోంది. కోల్‌కతా ఈ వ్యాపారానికి జాతీయ రాజధాని, ఎగుమతుల కేంద్రం. ఆ నగర శివార్ల నుంచి బడికి వెళ్లివస్తున్న పన్నెండేళ్ల దీపను మూడేళ్ల క్రితం మత్తు మందిచ్చి ఎత్తుకుపోయారు. రోజుకు 12 నుంచి 14 మం ది మగాళ్ల మృగవాంఛను తీరుస్తూ క్షణం క్షణం తాను మరణించిన వైనాన్ని ఆ బాలిక ఇటీవల కళ్లకు కట్టింది. ఒక్కొక్క ఆడపిల్ల అమ్మకంపైనా వెయ్యి డాలర్ల లాభమని కోల్‌కతాకు చెందిన ఒక ఆడపిల్లల వ్యాపారి జనవరిలో బీబీసీ వార్తాసంస్థకు తెలిపాడు. తాను కోల్‌కతా, ఢిల్లీ, హర్యానాలకు ఆడపిల్లలను సరఫరా చేస్తాననీ, ఆ విష యం పోలీసులకు కూడా తెలుసని వెల్లడించాడు. బెంగాల్‌కే చెందిన మరో మైనరు ఆడపిల్ల రుక్సానా కథ కాస్త వేరు. ఆమెను హర్యానాలోని ఒక కుటుంబానికి అమ్మేసారు. ఆమెను గదిలో పెట్టి తాళం వేసి, ఇంట్లోని ముగ్గురు మగాళ్లూ నిత్యమూ రేప్ చేసేవారు. ఆడపిల్లలను హతమార్చిన ‘పాపానికి’ మగాళ్లు సెక్స్ దాహంతో అల్లాడిపోతున్న ప్రాంతాలు దేశంలో పెరుగుతున్నాయి. ‘లేత ఆడ మాంసా నికి’ అవి సరికొత్త మార్కెట్లు. ‘మర్యాదస్తుల’ బానిసలు అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణా కార్యకలాపాలు 127 నుంచి 137 దేశాలకు విస్తరించాయని, ఇది ఏటా 1,000 కోట్ల డాలర్ల విలువైన వ్యాపారమని అంతర్జాతీయ మాననహక్కుల సంఘం అంచనా. అయితే మనుషుల అక్రమ తరలింపు 90 శాతం వరకు స్వదేశంలోనే జరుగుతుంది. అంటే ఏటా పిల్లల ప్రపంచ మార్కెట్ లావాదేవీల విలువ 10,000 కోట్ల డాలర్లకు పైనే. సెక్స్ పరిశ్రమకు చేరని పిల్లలు ఏమవుతున్నారు? రాజధాని ఢిల్లీసహా అన్ని పెద్ద నగరాల్లోనూ ఇప్పుడు సరికొత్త బానిసలు తయారయ్యారు. పిల్లల దొంగల మాఫియా వారిని ఇంటిపని బానిసలుగా అమ్మేస్తుంది. ఆడపిల్లలైతే ఇంటిపని చేయడంతో పాటూ, మగ దాహర్తిని తీర్చే సాధనాలుగా కూడా పనికొస్తారు. అస్సాం నుంచి పన్నెండేళ్ల ప్రాయంలో రాజ ధానికి చేరిన ఎలైనా కుజార్... యజమాని తన ముందే బూతు చిత్రాలను చూస్తూ తనను రేప్ చేసేవాడని చెప్పిం ది. ఆమె ఒక ఎన్జీవో పుణ్యమాని విముక్తిని సాధించింది. పారిపోయిన ‘బానిసలను’ కట్టి, కొట్టి యజమానికి అప్పగించే బాధ్యత కూడా మాఫియా గ్యాంగులదే. అలాంటి ఆడామగా పిల్లలు ఎన్నివేల మంది నగరాల్లో విద్యావంతులు, గౌరవనీయులైన పెద్దమనుషుల ఇళ్లల్లో బానిసలుగా పడి ఉన్నారో లెక్కల్లేవు. గత మూడేళ్లల్లో కనిపించకుండా పోయే పిల్లల సంఖ్య ఆందోళనకరంగా పెరిగిపోతోంది. పాలకులకు అది పట్టించుకునే తీరుబడి లేదు. ‘తల్లుల రొమ్ముల నుంచి తస్కరణకు గురైన పసి కందులం మేం, ఏం చేయాలి? ఎవరిని అడగాలి?’ అని ప్రశ్నించే పాల బుగ్గల కన్నీళ్లతో ‘కాక్ టెయిల్ పార్టీ’ చేసుకుంటున్న ఉన్మత్త గ్లోబల్ కుగ్రామంలో నాగమణులు, ఫాతీమాలు బిడ్డల కోసం ఎదురుచూస్తూనే కాటికి చేరుతారు. - పిళ్లా వెంకటేశ్వరరావు