సాక్షి, విజయవాడ: ఇటీవల సంచలనం రేపిన ఫాతిమా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సహరంపూర్ కోర్టు అనుమతితో ఏపీ పోలీసులు ఇద్దరు నిందితులు వాసిమ్, తయ్యబ్‌లను విజయవాడకు తీసుకొచ్చారు. జూలై 10వ తేదీన విజయవాడలోని ఇంటి నుంచి వెళ్లిన ఫాతిమా అదృశ్యమైంది. కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో నిందితులు ఫాతిమాను ఉత్తరప్రదేశ్‌కు రప్పించుకుని డబ్బు, బంగారం కాజేసి హత్య చేసినట్లు గుర్తించారు. అయితే ఫాతిమాను వాసిమ్, తయ్యబ్‌లే హత్య చేశారా?.. ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసుల విచారణ చేపడుతున్నారు. నిందితులను పూర్తి స్థాయిలో విచారించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment